5 లోక్‌సభ, 13 అసెంబ్లీ సీట్లకు న్యూడెమోక్రసీ పోటీ | New democracy to contest for 5 lok sabha, 13 assembly seats | Sakshi
Sakshi News home page

5 లోక్‌సభ, 13 అసెంబ్లీ సీట్లకు న్యూడెమోక్రసీ పోటీ

Published Fri, Mar 21 2014 2:18 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

New democracy to contest for 5 lok sabha, 13 assembly seats

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు వేర్వేరు కమిటీలను ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లోనూ 5 లోక్‌సభ, 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేయనున్నట్టు వివరించారు. తెలంగాణ కమిటీకి రాయల సుభాష్ చంద్రబోసును, ఆంధ్రప్రదేశ్ కమిటికీ గాదె దివాకర్‌ను కార్యదర్శులుగా నియమించింది. అయితే వీరిద్దరూ తెలంగాణ ప్రాంత నాయకులే కావడం గమనార్హం. పార్టీ కేంద్రకమిటీ సభ్యులు వై.సాంబశివరావు, వేములపల్లి వెంకట్రామయ్య, డీవీ కృష్ణ గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ, రెండు రాష్ట్ర కమిటీలు ఆయా ప్రాంత ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయన్నారు. తమ వాణిని ప్రజలకు వినిపించేందుకే ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement