తెలంగాణ ప్రకటన తరువాత సోనియా గాంధీ... | Sonia Gandhi reached Hyderabad | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రకటన తరువాత సోనియా గాంధీ...

Published Wed, Apr 16 2014 3:50 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

సోనియా గాంధీ - Sakshi

సోనియా గాంధీ

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటన తరువాత యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఈ రోజు మొదటిసారిగా హైదరాబాద్ వచ్చారు. ఈ మధ్యాహ్నం ఆమె ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆమె  కరీంనగర్‌ వెళతారు.

ఈ సాయంత్రం 4 గంటలకు కరీంనగర్‌లో జరిగే బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు.  ఈసారి కరీంనగర్ స్టేడియంలో రెండు వేదికలు నిర్మించారు. ఒక వేదిక పైనుంచి సోనియా గాంధీ ప్రసంగిస్తారు.మరో వేదికపైన  తెలంగాణలోని 119 శాసనసభ, 17 లోక్‌సభ స్థానాల అభ్యర్థులు ఆశీనులవుతారు.

సాయంత్రం 5 గంటలకు సోనియా గాంధీ బేగంపేట చేరుకుని ఢిల్లీ వెళతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement