ప్రకాష్ జవదేకర్
హైదరాబాద్: ప్రధాన మంత్రిని రబ్బర్ స్టాప్ చేసిన యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రజలకు జవాబు చెప్పాలని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ డిమాండ్ చేశారు. దేశంలో సహజవనరులను యుపిఏ లూటీ చేసిందన్నారు. అందుకు ఉదాహరణ బొగ్గుగనులు కుంభకోణమేనని చెప్పారు. బొగ్గు శాఖ కార్యదర్శి నివేదికను అప్పటి కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు ఎందుకు తోచిపుచ్చారని ఆయన అడిగారు. ఇటీవల విడుదలైన రెండు పుస్తకాలు బొగ్గుగనుల కుంభకోణాలకు కారణాలు స్పష్టంగా చూపించినట్లు తెలిపారు.
వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసిందన్నారు. కాంగ్రెస్ చేసినతప్పులను సిబిఐ కాపాడుతోందని చెప్పారు. 10 జనపథ్ సూచనల మేరకే బొగ్గుగనులు కేటాయించారని జవదేవకర్ ఆరోపించారు.