సోనియా గాంధీ
న్యూఢిల్లీ: టిఆర్ఎస్తో పొత్తు విషయమై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రెండు రోజుల తరువాతే వెలువడే అవకాశం ఉంది. ఈ లోపు టిఆర్ఎస్తో పొత్తుపై ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. రేపు జరుగవలసిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశా వాయిదాపడింది. కాంగ్రెస్-టిఆర్ఎస్ మధ్య పొత్తు కుదరకపోతే రెండు పార్టీలు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటాయని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్తో పొత్తుకు టిఆర్ఎస్ శ్రేణులు సుముఖంగాలేవు. ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు కూడా పొత్తుపట్ల ఆసక్తి చూపడంలేదు. తెలంగాణలో ఒంటరిగా పోటీచేసినా మెజారిటీ స్థానాలు గెలుచుకుంటామనే థీమాతో టిఆర్ఎస్ ఉంది. టిఆర్ఎస్తో పొత్తులేకుండా గెలవడం కష్టమని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ పరిస్థితులలో సోనియా స్థాయిలో జోక్యం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.