ఇక్కడ తెలంగాణలో టిఆర్ఎస్ అభ్యర్థిపైన, అక్కడ ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ అభ్యర్థి కాన్వాయ్‌పైన జనం తిరగబడ్డారు.
హైదరాబాద్: ఇక్కడ తెలంగాణలో టిఆర్ఎస్ అభ్యర్థిపైన, అక్కడ ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ అభ్యర్థి కాన్వాయ్‌పైన జనం తిరగబడ్డారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్‌లో ప్రచారానికి వెళ్లిన టిఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేంద్రపై గ్రామస్తులు తిరగబడ్డారు. మాజీ ఎంపీటీసీ బాలరాజు హత్య కేసులో నిందితులను కాపాడుతున్నారంటూ గ్రామస్తులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల కారు అద్దాలు ధ్వంసం చేశారు.
విశాఖ జిల్లా అరకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిశోర్‌చంద్రదేవ్ కాన్వాయ్‌పై కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గంగాధర్ వర్గీయులు దాడి చేశారు. కిశోర్‌చంద్రదేవ్ నామినేషన్ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేశారు. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 144 సెక్షన్ విధించారు.