
ఐదు రాష్ట్రాల్లో రూ.64 కోట్లు స్వాధీనం
న్యూఢిల్లీ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం నియమించిన అధికారులు జరిపిన దాడుల్లో జనవరి 17 వరకు రూ.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంలో రూ. 56.04 కోట్లు యూపీలో, మిగతా నాలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్లను పట్టుకున్నారు.
పంజాబ్‌లో రూ.1.78 కోట్లు విలువైన మత్తు పదార్థాలను, గోవాలో రూ.16.72 లక్షల నగదును, మణిపూర్‌లో రూ.7 లక్షల సొమ్ముని ఎన్నికల సంఘం అధికారులు సీజ్ చేసినట్లు ఎన్నికలసంఘం తెలిపింది. పంజాబ్‌లోని మొహలీలో ముగ్గురి వద్ద రూ.22 కోట్లు విలువైన 160 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.