![NIA Searches Retired Headmaster Abdul's House In Rayadurgam](/styles/webp/s3/article_images/2024/05/21/Nia-Searches-In-Rayadurgam.jpg.webp?itok=m6OyEh4H)
సాక్షి, అనంతపురం: రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. సోహైల్ అనే ప్రైవేట్ ఉద్యోగిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాగుల బావి వీధిలో రిటైర్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.
అబ్దుల్ తనయుడు సోహైల్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ.. ఉగ్రవాదులతో లింకులపై ఆరా తీస్తోంది. అబ్దుల్ ఇద్దరు కుమారులు బెంగళూరులో నివాసముంటున్నారు. గత కొంతకాలంగా వారిద్దరూ కనిపించకపోవడంతో ఎన్‌ఐఎ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment