
నెల్లూరు(క్రైమ్): మావోయిస్టులకు నిధులు సమకూరుస్తున్న కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు శనివారం నెల్లూరు నగరంలో తనిఖీలు నిర్వహించారు. మావోలకు నిధులు సమకూరుస్తున్నారంటూ బిహార్‌లో ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం ఏకకాలంలో బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఏపీలో సోదాలు చేపట్టింది.
అందులో భాగంగా శనివారం రాంజీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న కాంట్రాక్టర్ పెంచలయ్యనాయుడి ఇంటికి శనివారం ఎన్‌ఐఏ అధికారులు చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేసి మూడు గంటల పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ సోదాల విషయాలు బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. గతేడాదీ నెల్లూరు అరవిందానగర్‌లోనూ ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment