అణ్వస్త్రాలపై ఇస్లామిక్ స్టేట్ కన్ను
లండన్: ఇరాక్, సిరియాల్లో పేట్రేగుతున్న ఇస్లామిక్‌స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు అణ్వస్త్రాలపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించాలని కలలుకంటున్న ఐఎస్ ఉగ్రవాదులు ఇరాన్‌కు చెందిన అణ్వస్త్రాల రహస్యాలను చేజిక్కించుకోవడానికి పథకం వేసినట్టు వారి స్థావరాలనుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలద్వారా వెల్లడైంది. ఇరాన్‌పై దాడిచేసి ఆ దేశానికి చెందిన అణ్వస్త్ర రహస్యాలను హస్తగతం చేసుకోవాల్సిందిగా ఐఎస్ తమసభ్యులకు పిలుపునిచ్చిందని, ఈ సంస్థకు దిశానిర్దేశం చేస్తున్న ఆరుగురు సభ్యుల రహస్య వార్‌కేబినెట్‌కు చెందిన అబ్దుల్లా మెషేదాని ఈమేరకు తమ సభ్యులకు లేఖలు రాశాడని వెల్లడైంది. ఈ లేఖలు కూడా రహస్యసంకేత భాషలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఐఎస్‌కు చెందిన ఓ కమాండర్ నివాసంపై ఇరాక్ ప్రత్యేక దళాలు గత మార్చిలో దాడి చేసిన సందర్భంగా ఈ పత్రాలు వెలుగుచూశాయుని సండేటైమ్స్ కథనం వెల్లడించింది. రష్యా సహకారంతో ఇరాన్ అణ్వస్త్రాలను సంపాదించి, అందుకు ప్రతిగా ఆ దేశానికి ఇరాక్‌లోని అన్బర్ ప్రావిన్స్‌లో చమురు క్షేత్రాలను అప్పగించాలన్నది ఐఎస్ పథకమని తెలుస్తోంది. పాశ్చాత్యదేశాల నిపుణులు ఈ పత్రాలను పరిశీలించి అవి ఐఎస్ రహస్య పత్రాలుగా ధ్రువీకరించారని పేర్కొంది. 70 విధ్వంసకర పథకాల వివరాలు ఆ పత్రాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఖలీఫా సామ్రాజ్యస్థాపనలో భాగంగా నాజీల తరహా పద్ధతులు అవలంబించాలని అందులో పేర్కొన్నారు. కాగా సిద్ధాంతాల విషయుంలో కట్టుతప్పితే స్వంత నాయుకులను కూడా వుట్టుపెట్టడానికి వెనుకాడవద్దని ఆ పత్రాల్లో మెషేదాని సూచించినట్టు వెల్లడైంది. యెమెన్, కేమరూన్ దేశాలనుంచి కొన్ని దీవులను కొని వాటిలో మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేయుడానికీ ఐఎస్ ప్రయుత్నించినట్టు వెల్లడైంది.
ఐఎస్‌తో పాక్ తాలిబన్ల దోస్తీ...
ఇప్పటివరకూ ఒంటరిగానే చెలరేగిపోతున్న ఐఎస్ ఉగ్రవాదులకు ఇప్పుడు పాక్‌తాలిబన్లు తోడవనున్నారు. ఇరాక్, సిరియూల్లో పట్టు సంపాదించుకున్న ఐస్లామిక్‌స్టేట్ ఉగ్రవాద సంస్థతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నట్టు పాక్‌లోని తాలిబన్ సంస్థ తెహ్రీకే తాలిబన్ (టీటీపీ)ప్రకటించింది. ఐఎస్‌కు అండగా తమ మనుషులను పంపుతామని పాక్ తాలిబన్ అధినేత ముల్లా ఫజలుల్లా తెలిపారు.