Nuclear
-
బాంబు షెల్టర్లకు గిరాకీ వరల్డ్ వార్-3కి సంకేతమా?
-
‘ఇరాన్లో అడ్డగోలుగా అణుస్థావరాలు.. దాడులు చేయాల్సిందే!’
ఇరాన్లో గతంలో కంటే అధికంగా అణుస్థావరాలు బయటపడ్డాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా నియమించబడిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరాన్లో గతంలో కంటే ఎక్కువ అణు స్థావరాలు వెలుగు చూశాయి. ఆ దేశంపై దాడులు చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్ అస్థిత్వానికి కలిగే ముప్పును తొలగించడం, అడ్డుకోవడానికి ఇదో అవకాశంగా భావిస్తున్నాం.ఇక.. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయాలని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఏళ్లుగా ఆరోపణలు చేస్తోంది. అయితే ఆ ఆరోపణలను ఇరాన్ ఖండింస్తూ వస్తున్న విషయం తెలిసిందే.2018లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా.. ఇరాన్ అణుసామర్థ్య ఆశయాలను పరిమితం చేసేందుకు 2015 అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఇక.. ప్రస్తుతం అమెరికా మళ్లీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక.. టెహ్రాన్ వద్ద యురేనియంను 60 శాతం వరకు ఉండగా.. 30 శాతం తక్కువ అణు ఆయుధాల గ్రేడ్ ఉంది.In my first meeting today with the @IDF General Staff Forum, I emphasized: Iran is more exposed than ever to strikes on its nuclear facilities. We have the opportunity to achieve our most important goal – to thwart and eliminate the existential threat to the State of Israel. pic.twitter.com/HX4Z6IO8iQ— ישראל כ”ץ Israel Katz (@Israel_katz) November 11, 2024 ఇజ్రాయెల్, ఇరాన్ చెసుకుంటున్న క్షిపణి దాడుల కారణం మధ్యప్రాచ్యంలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. మరోవైపు.. ఇప్పటికే ఈ దాడిలో ఇరాన్ రెండుసార్లు ఇజ్రాయెల్ భూభాగంపై నేరుగా మిసైల్స్ దాడికి దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు చేసింది. ఇటీవల అక్టోబర్ 26న ఇరాన్ సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. అదీ కాక.. గత నెలలో జరిగిన దాడికి ప్రతిస్పందించవద్దని ఇరాన్‌ను ఇజ్రాయెల్ హెచ్చరించింది. -
అణు క్షిపణుల పరీక్షకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశం
మాస్కో: ఉక్రెయిన్ విషయంలో పశ్చిమ దేశాలపై పెరుగుతున్న ఒత్తిడి మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ న్యూక్లియర్ ఫోర్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షిపణి ప్రయోగాలకు కసరత్తు వెంటనే ప్రారంభించాలని సూచించారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని సైనిక అధికారులతో జరిగిన వీడియో సమావేశంలో పుతిన్ ఆదేశించారు. పుతిన్ ఆదేశాల మేరకు రష్యా అణు దళం అణు క్షిపణులను పరీక్షించడం మొదలుపెట్టింది. ఉక్రెయిన్‌కు పెరుగుతున్న పాశ్చాత్య దేశాల మద్దతు నేపథ్యంలో అణుశక్తి సామర్థ్యాన్ని ప్రస్తావించిన పుతిన్.. రష్యాలోని అణు ఆయుధాగారం దేశ సార్వభౌమాధికారం, భద్రతకు నమ్మదగిన హామీ అని పేర్కొన్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొత్త హెచ్చరికలు, ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుంటే, యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యమని పుతిన్ పునరుద్ఘాటించారు.కాగా కమ్చట్కా ద్వీపకల్పంలోని కురా టెస్టింగ్ రేంజ్‌లోని ప్లెసెట్స్క్ లాంచ్ ప్యాడ్ నుంచి యార్స్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ను సైన్యం పరీక్షించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని క్షిపణులు తమ లక్ష్యాలను ధ్వంసం చేశాయని పేర్కొంది. గత నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా, నాటో మిత్రదేశాలను హెచ్చరించారు. రష్యా పై దాడులు చేసేందుకు పాశ్చాత్య దేశాలు ఇచ్చిన లాంగ్ రేంజ్ ఆయుధాలను ఉక్రెయిన్ ఉపయోగిస్తే, రష్యాపై నాటో యుద్ధం ప్రారంభించినట్లుగా భావించాల్సి వస్తుందని పుతిన్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి -
ఇరాన్ అణు విభాగం చీఫ్‌గా ఎస్లామీ
టెహ్రాన్: ఇరాన్ అణు విభాగం అధిపతిగా మహ్మద్ ఎస్లామీ(67)ని అధ్యక్షుడు పెజెష్కియాన్ మరోసారి నియమించారు. 2021లో అప్పటి అధ్యక్షుడు ఎబ్రహీం రైసీ ఈయన్ను మొదటిసారిగా అణు విభాగానికి అధిపతిగా నియమించారు. ఎస్లామీ అంతకుముందు 2018లో అధ్యక్షుడు రౌహానీ హయాంలో రవాణా, పట్టణాభివృద్ధి శాఖమంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. అమెరికాలోని డెట్రాయిట్, టొలెడో యూనివర్సిటీల నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టాలు అందుకున్న ఎస్లామీకి దేశ సైనిక పరిశ్రమలకు సంబంధించి విస్తారమైన అనుభవముంది. ఇరాన్ అణు విధానానికి ప్రత్యక్షంగా తోడ్పాటునందిస్తున్నారంటూ 2008లో ఇరాన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్‌గా ఉన్న ఎస్లామీపై ఐరాస ఆంక్షలు విధించింది. -
న్యూక్లియర్ డ్రిల్స్‌కు ఆదేశించిన పుతిన్
ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న తరుణంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు సమీపంలో రష్యన్ మిలటరీ, నేవి ఆధ్వర్యంలో అణ్వాయుధాల డ్రిల్స్ నిర్వహించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించినట్లు ఆ దేశ రక్షణ శాఖ సోమవారం ప్రకటించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అణుయుద్ధానికి సంబంధించి పుతిన్ పలుసార్లు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.న్యూక్లియర్ డ్రిల్స్ చేస్తున్న సమయంలో నాన్ స్ట్రాటజిక్ న్యూక్లియర్ ఆయుధాలను ఉపయోగించటంపై శిక్షణ తీసుకోనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. నాన్ స్ట్రాటిజిక్ న్యూక్లియర్ ఆయుధాలను టెక్నికల్ వెపన్స్ అంటారు. యుద్ధ క్షేత్రాల్లో ఉపయోగించే మిసైల్స్ గుండా వీటిని ప్రయోగిస్తారు.కొన్ని పశ్చాత్య దేశాల నుంచి తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని సమీప భవిష్యత్తులో న్యూక్లియర్ డ్రిల్స్ చేపడతామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. అక్రమిత ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక బలగాలతో పాటు.. వైమానిక, నౌకా దళాలు న్యూక్లియర్ డ్రిల్స్ పాల్గొంటాయని పేర్కొంది. అమెరికాతో గతంలో చేసుకున్న ‘న్యూ స్టార్ట్ ఒప్పందం’నుంచి తాత్కాలికంగా తప్పుకొంటున్నామని గతేడాది రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. -
చైనా-పాక్ మధ్య అణు సరుకు రవాణా! వయా భారత్?
ముంబై: భారత సరిహద్దులో ‘అణు’ కలకలం రేగింది. చైనా నుంచి కరాచీ(పాకిస్థాన్) వెళ్తున్న ఓ నౌకను ముంబయి పోర్టులో భారత భద్రతా సిబ్బంది అడ్డుకుంది. అణు కార్యక్రమంలో వినియోగించే సరకును అందులో తరలిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకే నౌకను నిలిపివేసినట్లు సమాచారం. జనవరిలోనే ఈ ఘటన జరిగినప్పటికీ.. ఈ వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు కస్టమ్స్ అధికారులు. నౌకను నిలిపివేసిన తర్వాత.. డీఆర్డీవో(Defence Research and Development Organisation) క్షుణ్ణంగా పరిశీలించింది. అందులో ఇటలీలో తయారైన కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మెషిన్(CNC)ని గుర్తించారు. పొరుగుదేశం తన అణు కార్యక్రమంలో దీనిని వినియోగించే అవకాశాలను తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా డీఆర్డీవో వెల్లడించింది. సీఎన్‌సీని కంప్యూటర్ ద్వారా నియంత్రించొచ్చు. అది అత్యంత కచ్చితత్వంతో ఫలితాన్ని ఇస్తుంది. దానిని ద్వంద్వ ప్రయోజనాలకు వినియోగిస్తారు అంటూ డీఆర్డీవో ప్రకటిచింది. గతంలో ఉత్తర కొరియా కూడా తన అణు కార్యక్రమంలో సీఎన్‌సీని ఉపయోగించిందని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇక చైనా నుంచి పాక్‌కు రవాణా అవుతున్న ఇలాంటి మిలిటరీ గ్రేడ్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2022లోను ఈతరహా సీజ్ చోటుచేసుకుంది. -
స్మార్ట్‌ఫోన్ కోసం న్యూక్లియర్ బ్యాటరీ.. ఛార్జింగ్ లేకుండా 50 ఏళ్లు పని చేస్తోంది!
సాధారణంగా బ్యాటరీలు ఎక్కువకాలం మన్నవు. ఇటీవలికాలంలో బాగా వాడుకలోకి వచ్చిన లీథియం అయాన్ బ్యాటరీల మన్నిక సైతం రెండు మూడేళ్లకు మించి ఉండదు. పైగా వాటిని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లీథియం అయాన్ బ్యాటరీలను మూడువందల నుంచి ఐదువందల సార్లు రీచార్జ్ చేసుకుంటే, అక్కడితో వాటి ఆయుష్షు తీరిపోతుంది. బ్యాటరీల మన్నికను గణనీయంగా పెంచే దిశగా చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు సాగించి, మొత్తానికి విజయం సాధించారు. ఏకంగా 50 ఏళ్లు మన్నికను ఇవ్వగల న్యూక్లియర్ బ్యాటరీని రూపొందించారు. ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యాటరీని చైనా కంపెనీ ‘బీటావోల్ట్’ శాస్త్రవేత్తలు తయారు చేశారు. రక్షణ అవసరాల కోసం దీర్ఘకాలిక మన్నిక గల బ్యాటరీల రూపకల్పన కోసం ‘బీటావోల్ట్’ చేపట్టిన ప్రయోగాలకు రెండేళ్ల కిందట ఆస్ట్రేలియన్ కంపెనీ ‘ఫోస్ ఎనర్జీ’ 2.3 మిలియన్ డాలర్ల (రూ.19.15 కోట్లు) ఆర్థిక సాయం అందించింది. ప్రస్తుతం నమూనాగా ఈ బ్యాటరీని రూపొందించిన చైనా శాస్త్రవేత్తలు భవిష్యత్తులో స్మార్ట్ఫోన్లు, లాప్టాప్ల కోసం కూడా ఉపయోగపడే దీర్ఘకాలిక న్యూక్లియర్ బ్యాటరీలను తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
న్యూక్లియర్ బ్యాటరీ.. దీని మన్నిక 50 ఏళ్లు
సాధారణంగా బ్యాటరీలు ఎక్కువకాలం మన్నవు. ఇటీవలికాలంలో బాగా వాడుకలోకి వచ్చిన లీథియం అయాన్ బ్యాటరీల మన్నిక సైతం రెండు మూడేళ్లకు మించి ఉండదు. పైగా వాటిని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లీథియం అయాన్ బ్యాటరీలను మూడువందల నుంచి ఐదువందల సార్లు రీచార్జ్ చేసుకుంటే, అక్కడితో వాటి ఆయుష్షు తీరిపోతుంది. బ్యాటరీల మన్నికను గణనీయంగా పెంచే దిశగా చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు సాగించి, మొత్తానికి విజయం సాధించారు. ఏకంగా 50 ఏళ్లు మన్నికను ఇవ్వగల న్యూక్లియర్ బ్యాటరీని రూపొందించారు. ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యాటరీని చైనా కంపెనీ ‘బీటావోల్ట్’ శాస్త్రవేత్తలు తయారు చేశారు. రక్షణ అవసరాల కోసం దీర్ఘకాలిక మన్నిక గల బ్యాటరీల రూపకల్పన కోసం ‘బీటావోల్ట్’ చేపట్టిన ప్రయోగాలకు రెండేళ్ల కిందట ఆస్ట్రేలియన్ కంపెనీ ‘ఫోస్ ఎనర్జీ’ 2.3 మిలియన్ డాలర్ల (రూ.19.15 కోట్లు) ఆర్థిక సాయం అందించింది. ప్రస్తుతం నమూనాగా ఈ బ్యాటరీని రూపొందించిన చైనా శాస్త్రవేత్తలు భవిష్యత్తులో స్మార్ట్ఫోన్లు, లాప్టాప్ల కోసం కూడా ఉపయోగపడే దీర్ఘకాలిక న్యూక్లియర్ బ్యాటరీలను తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
పాక్ ఆ బంకర్లలో ఏమి దాస్తోంది? అమెరికా రిపోర్టులో హడలెత్తించే వివరాలు?
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలింది. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోలు ధర లీటరు రూ.300కి చేరింది. ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ మాత్రం అణ్వాయుధాలపై మోజు పెంచుకుంటూపోతోంది. అణ్వాయుధాల తయారీలో పూర్తి స్వింగ్‌లో ఉంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఏఎస్) తాజా నివేదిక ప్రకారం పాకిస్తాన్ దగ్గర ప్రస్తుతం దాదాపు 170 అణ్వాయుధాలు ఉన్నాయి. అమెరికా ఏం కనుగొంది? పాకిస్తాన్ అణ్వాయుధాలను గుర్తించడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు ఓపెన్ సోర్స్ మెటీరియల్స్‌ను అంటే ఇప్పటికే పబ్లిక్‌గా ఉన్న మెటీరియల్స్‌ను ఉపయోగించారు. ఉదాహరణకు.. వర్గీకరించిన పత్రాలు, రక్షణ బడ్జెట్ కేటాయింపు, సైనిక కవాతు, సైనిక అధికారుల ప్రకటనలు. ఇదేకాకుండా పాక్ మిలటరీ గార్రిసన్, ఎయిర్ ఫోర్స్ బేస్‌కు సంబంధించిన తాజా ఉపగ్రహ చిత్రాలను కూడా విశ్లేషించారు. వివిధ సైనిక దళాలు, వైమానిక దళ స్థావరాలకు సంబంధించిన తాజా ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన తరువాత పాకిస్తాన్ అణ్వాయుధాల కోసం కొత్త లాంచర్ సౌకర్యాలను నిర్మించినట్లు అమెరికా కనుగొంది. 5 నుంచి 10 అణ్వాయుధాలు.. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ నివేదికలోని వివరాల ప్రకారం పాకిస్తాన్ ఒకవైపు అణ్వాయుధాల సంఖ్యను పెంచుకుంటూనే మరోవైపు కొత్త ఆయుధాల కోసం ముడిసరుకును కూడా వేగంగా సేకరిస్తోంది. పాకిస్తాన్ ప్రతి సంవత్సరం 14-27 ఆయుధాలకు సరిపడా ముడిసరుకును సేకరిస్తోంది. కనీసంగా 5 నుండి 10 న్యూక్లియర్ వార్హెడ్లను ఉత్పత్తి చేస్తోందని నివేదిక అంచనా వేసింది. అణ్వాయుధాలను ఎక్కడ దాస్తోంది? నివేదికలోని వివరాల ప్రకారం పాకిస్తాన్ తన అణ్వాయుధాలను నిల్వ చేసేందుకు కనీసం 5 సైనిక, వైమానిక స్థావరాలను వినియోగిస్తోంది. ఇందులో అక్రో, గుజ్రాన్వాలా, ఖుజ్దార్, పనో అకిల్ మరియు సర్గోధా గారిసన్ ఉన్నాయి. కాగా పాకిస్తాన్ 4 కొత్త ప్లూటోనియం ఉత్పత్తి రియాక్టర్ల కోసం కూడా పని చేస్తోంది. అలాగే యురేనియం రియాక్టర్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటోంది. ఇందుకోసం కొత్త మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటోంది. ఇది పాక్ అణు సామర్థ్యాన్ని మరింతగా పెంచుతోంది. 2025 నాటికి పాకిస్తాన్ అణ్వాయుధాల సంఖ్య 200కి చేరుకుంటుందని అంచనా. పెరిగిపోతున్న పాక్ రహస్య కార్యకలాపాలు ఈ నివేదికలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బంకర్ ప్రస్తావన కూడా ఉంది. పాకిస్తాన్ తన అణ్వాయుధాలకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. అయితే ఇస్లామాబాద్‌కు సమీపంలోని వా కంటోన్మెంట్ పరిధిలోగల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఇందులో కీలక పాత్ర ఉందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా శాస్త్రవేత్తలు ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరుగుతున్న కార్యకలాపాలను చాలా కాలంగా గమనిస్తున్నారు. 2020 నాటికే 60 నుండి 80 అణ్వాయుధాలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లోపల 6 ఇగ్లూ ఆకారపు బంకర్లు ఉన్నాయి. వీటిని చాలా నీట్‌గా కవర్ చేశారు. ఈ బంకర్ల చుట్టూ ఎల్లప్పుడూ బహుళస్థాయి భద్రత ఉంటుంది. ఈ బంకర్లలో అణ్వాయుధాలను దాచి ఉంచినట్లు అమెరికా అనుమానిస్తోంది. 2020 నాటికే పాకిస్తాన్ వద్ద 60 నుండి 80 అణ్వాయుధాలు ఉండవచ్చని అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గతంలోనే అంచనా వేసింది. ఇప్పుడు ఈ తాజా నివేదిక అమెరికన్ ఏజెన్సీలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇది కూడా చదవండి: లాహోర్ భారత్‌లో భాగం.. అయినా పాకిస్తాన్‌కు ఎందుకు అప్పగించారు? -
ఎంత ప్రమాదమో తెలిసొచ్చింది.. వెలుగులు అణువంతే!
అణు బాంబు సృష్టికర్త ఒప్పెన్హీమర్ జీవిత గాథ హాలీవుడ్ తెరపైకెక్కడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి అణు శక్తిపై చర్చ మొదలైంది. అణు పరిజ్ఞానం ఇప్పటిదాకా ఎన్నోసార్లు చర్చల్లో నానుతూనే ఉంది. ఇటీవలి కాలంలో పర్యావరణాన్ని పరిరక్షించే పునరుద్పాతక ఇంధన శక్తుల వినియోగంపై అవగాహన పెరగడంతో అణుశక్తి ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దాని స్థానాన్ని సౌర విద్యుత్ ఆక్రమిస్తోంది... అణు శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఒప్పెన్హీమర్ 1940లో తొలిసారి అణు బాంబును సృష్టించారు. తర్వాత పదేళ్లకు 1950లో తొలి అణు విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో దాన్ని ఇంధన రంగంలో గేమ్ చేంజర్‌గా భావించారు. కానీ అణు విద్యుత్కేంద్రాలు ఎంత ప్రమాదకరమో అనుభవపూర్వకంగా తెలిసొచ్చాక వాటికి ఆదరణ క్రమంగా తగ్గుతూ వస్తోంది. జపాన్, అమెరికా, ఫ్రాన్స్ తప్ప మిగతా దేశాల్లో అణు ఇంధనానికి ప్రాధాన్యమూ తగ్గుతూ వస్తోంది. జర్మనీ ప్రభుత్వం 3 అణు విద్యుత్ కేంద్రాలను మూసివేయడం గమనార్హం. అణు వర్సెస్ సౌర విద్యుత్ 1970 దశకంలో అణు విద్యుత్ ఒక వెలుగు వెలిగింది. అణు శక్తికి అది స్వర్ణయుగమని చెప్పొచ్చు. చాలా దేశాల్లో భారీగా అణు ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలా ప్రపంచ విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్ వాటా 1985 కల్లా ఏకంగా 15.1% దాకా పెరిగింది. కానీ 2022 నాటికి అది 9.1 శాతానికి పడిపోయింది. సౌరవిద్యుత్ వినియోగంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం. ‘‘2021లో ప్రపంచ దేశాల్లో సౌర విద్యుత్ 1.04 టెరావాట్స్ కాగా, ప్రపంచ అణు విద్యుత్ సామర్థ్యం 463 గిగావాట్లు. అంటే అణు విద్యుత్ కంటే సౌర విద్యుత్ రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది’’ అని ఇస్రోలో సోలార్ ప్యానెల్ డివిజన్ మాజీ శాస్త్రవేత్త మనీశ్ పురోహిత్ చెప్పారు. సౌర విద్యుత్‌తో లాభాలు... ► సౌర విద్యుత్‌కు ముడి సరుకు సూర్యుడే గనుక దానికి కొరత ఉంటుందన్న భయం లేదు. ► సోలార్ ప్యానెల్స్, యూనిట్ల ధర బాగా తగ్గింది. సోలార్ ప్లాంట్ నిర్మాణ వ్యయం మెగావాట్‌కు 10 లక్షల డాలర్లే. సౌర విద్యుత్ వ్యర్థాలను నిర్మూలించే క్రమంలో ఎలాంటి ప్రమాదానికీ ఆస్కారం లేదు. ► అణు విద్యుత్కేంద్రం ఏర్పాటే అత్యంత ఖరీదైన వ్యవహారం. కొత్తగా అణు ప్లాంట్ నిర్మాణానికయ్యే వ్యయం కనీసం 1,000 కోట్ల డాలర్లు. ► అణు విద్యుదుత్పత్తి వల్ల వెలువడే అణు ధారి్మక వ్యర్థాల నిర్మూలన అత్యంత ప్రమాదంతో కూడిన వ్యవహారం. ► ఒక్కో అణు విద్యుత్కేంద్రం నుంచి ఏటా కనీసం 20 మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలు వెలువడతాయి. ► ప్రస్తుతం అన్ని దేశాల వద్దా కలిపి 90 వేల మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలున్నాయి. వీటిని అత్యంత సురక్షిత పద్ధతిలో నిర్మూలించకపోతే ఎన్నో రకాలుగా తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ► పైగా అణు విద్యుత్కేంద్రాలతో ప్రమాదాలు కూడా ఎక్కువే. అందుకే కొత్త ప్లాంట్ల ఏర్పాటును అడ్డుకుంటూ ఎన్నో పోరాటాలు జరిగాయి, జరుగుతున్నాయి. ► దాంతో చాలా ఏళ్లుగా కొత్త అణు విద్యుత్కేంద్రాలేవీ రాలేదు. ► అమెరికా, జపాన్, ఫ్రాన్స్ మినహా మరే దేశాలు అణు విద్యుత్‌పై మొగ్గు చూపించకపోవడంతో అంతర్జాతీయంగా ఒప్పందాలు, పరస్పర సాంకేతిక సహకారం తగ్గిపోయాయి. ఫలితంగా అణు విద్యుత్ చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. అణ్వాయుధాలు తగ్గిపోతున్నాయ్! ► అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో కొన్నేళ్లు పాటు అణ్వాయుధాల పోటీయే ప్రధానంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల దగ్గర 1986 నాటికి ఏకంగా 64,452 అణ్వాయుధాలు పోగుపడ్డాయి. ► ఇప్పుడు వాటి సంఖ్య 12,510కి తగ్గింది. వీటిలో 89% రష్యా, అమెరికా దగ్గరే ఉన్నాయి. ► అణు వినాశనం ఎంత భయానకంగా ఉంటుందో హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణు బాంబు దాడులతో అందరికీ తెలిసొచి్చంది. ► ఏళ్లు గడిచే కొద్దీ అణ్వాయుధాల తయారీని తగ్గించడంపై దేశాలన్నీ దృష్టి సారించాయి. అణు విద్యుత్ రియాక్టర్ల సగటు జీవిత కాలం 60 ఏళ్లు. ఇప్పుడున్న వాటిలో చాలావరకు ఇక పనికి రాని స్థితికి వచ్చేశాయి. కొత్తవి ఏర్పాటు కావడం లేదు. దాంతో అణు విద్యుదుత్పత్తి తగ్గుతూ వస్తోంది – డాక్టర్ నితేంద్ర సింగ్, ఇండియన్ యూత్ న్యూక్లియర్ సొసైటీ వ్యవస్థాపకుడు -1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కుదిరిన తర్వాత అణు శక్తిని ప్రజాప్రయోజనాలకే తప్ప, వినాశనానికి వాడొద్దని దేశాలన్నీ నెమ్మదిగా గ్రహించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అన్నంత పని చేస్తున్న కిమ్! 'ఆయుధాలను పెంచాలని పిలుపు'
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి బెదిరింపులకు తెగబడ్డాడు. ఈ మేరకు కిమ్ మరిన్ని అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచాలని, శక్తిమంతమైన ఆయుధాలను తయారు చేయాలని పిలుపునిచ్చాడు. గతంలో ఆయన మరిన్నీ ఆయుధాలు పెంచుతానంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడూ దాన్నే నిజం చేస్తూ.. కిమ్ ఇలా అణ్వాయుధా సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే తన అణ్వాయుధాలను ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించడాని రెడీగా ఉండాలని చెప్పారు. మరింత ముందుచూపుతో అణు ఆయుధాలను తయారు చేసేలా అణు పదార్థాల ఉత్పత్తిని పెంచాలాని ఆదేశించారు. మనం ఆయుధాలను దోషరహితంగా ముందుచూపుతో సిద్ధం చేస్తే.. శత్రువు మనకు భయపడతాడని అన్నారు. తద్వారా దేశ సార్వభౌమాధికారాన్ని, వ్యవస్థను, ప్రజలను రెచ్చగొట్టే సాహసం చేయలేడని చెప్పారు. గతేడాదే ఉత్తరకొరియా తిరుగులేని శక్తిగా ప్రకటించుకుంది. ప్రస్తుతం మరిన్ని అణ్వాయుధాల ఉత్పత్తికి పిలుపునిచ్చి తన మాటను నిజం చేసుకుంది. అమెరికా, దక్షిణ కొరియా మంగళవారమే ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాలని షెడ్యూల్ ఖరారు చేసుకున్న నేపథ్యంలోనే ఉత్తర కొరియా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. కాగా, ఇటీవలే ఉత్తరకొరియా తన అణ్వాయుధాలను వైవిధ్యపరిచేలా సరికొత్తగా నీటి అడుగున అణుదాడి చేసే డ్రోన్ సంబంధిత పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఇది సముద్రంలో సునామీ సృష్టించి తీర ప్రాంతాలను తుడిచిపెట్టేలా చేయడం లేదా నౌక స్థావరాలను ముంచేయడం వంటి విధ్వంసాలను సృష్టిస్తుంది. (చదవండి: ఇదొక జబ్బులా ఉంది! స్కూల్ ఘటనపై జోబైడెన్ ఫైర్) -
ప్రకంపనలు రేపుతున్న ఉత్తర కొరియా ప్రకటన.. సునామీని పుట్టించే..
సునామీని పుట్టించే అణు సామర్థ్యమున్న అండర్ వాటర్ డ్రోన్ ‘హెయిల్’ను విజయవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా చేసిన ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. దీని సాయంతో భారీ సునామీలు పుట్టించి తీరంలో నౌకాశ్రయాలనూ, సముద్ర మధ్యంలో శత్రు నౌకలను నాశనం చేయగల సామర్థ్యం తమకు సమకూరిందని అది చెబుతోంది. అదే నిజమైతే రష్యా తర్వాత ఈ సామర్థ్యమున్న రెండో దేశమవుతుంది. ఇలాంటి డ్రోన్లను ప్రయోగిస్తే సముద్ర మట్టం అనూహ్యంగా పెరిగి పరిసర ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తుతుంది. దీనితో సముద్ర మధ్యంలో అయితే శత్రు నౌకలను నీట ముంచవచ్చు. అదే తీర ప్రాంతంలో ప్రయోగిస్తే సమీప నౌకాశ్రయాలతో పాటు నగరాలు, జనావాసాలు కూడా నామరూపాల్లేకుండా పోయే ప్రమాదముంది! కాకపోతే హెయిల్ను రష్యా అండర్ వాటర్ డ్రోన్ పొసెయ్డాన్తో ఏ మాత్రమూ పోల్చలేం. ఎందుకంటే అత్యాధునిక హంగులతో కూడిన పొసెయ్డాన్ను జలాంతర్గాముల నుంచీ ప్రయోగించవచ్చు. స్వయంచాలిత న్యూక్లియర్ ప్రొపెల్షన్ వ్యవస్థ సాయంతో ఎంతకాలమైనా ప్రయాణం చేయగల సత్తా దాని సొంతం. హెయిల్కు అంత సీన్ లేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్న దక్షిణ కొరియాను బెదిరించేందుకే ఇలాంటి ప్రకటన చేసి ఉండఉండవచ్చన్నది వారి విశ్లేషణ. అణు డ్రోన్‌ను పరీక్షించాం: ఉత్తర కొరియా భారీ రేడియో ధార్మిక సునామీని పుట్టించగల అణుసామర్థ్యంతో కూడిన అండర్ వాటర్ డ్రోన్ ‘హెయిల్’ను విజ యవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది! ఈ ఆందోళనకర పరిణామం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ‘‘ఈ డ్రోన్‌ను తీరం వద్ద మోహరించవచ్చు. నౌకలపై సముద్రం లోపలికి తీసుకెళ్లీ ప్రయోగించవచ్చు. నీటి లోపల ఇది సృష్టించే పేలుడు దెబ్బకు పుట్టుకొచ్చే రేడియో ధార్మిక సునామీ నౌకాశ్రయాలతో పాటు నడి సముద్రంలో శత్రు యుద్ధ నౌకలను కూడా తుత్తునియలు చేయగలదు’’అని ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ చెప్పుకొచ్చింది. ‘‘ఈ దిశగా మూడు రోజులుగా సాగుతున్న ప్రయోగాలను అధ్యక్షుడు కిమ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు’’అని తెలిపింది. టోర్పెడో వంటి పరికరం పక్కన కిమ్ నవ్వుతున్న ఫొటోను ఉత్తరకొరియా పత్రిక రొండొంగ్ సిన్మున్ ప్రచురించింది. ఆ పరికరమేమిటనేది వివరించలేదు. సముద్ర జలాలు ఉవ్వెత్తున లేచి పడుతున్న ఫొటోలను కూడా ముద్రించింది. ‘‘ఈ అలలు డ్రోన్ మోసుకెళ్లిన అణ్వాయుధం పేలుడు ఫలితం. మంగళవారం ప్రయోగించిన ఈ డ్రోన్ నీటి అడుగున 60 గంటల పాటు ప్రయాణించి, 150మీటర్ల లోతులో లక్ష్యాన్ని ఛేదించింది’’అని పేర్కొంది. 2012 నుంచి అభివృద్ధి చేస్తున్న ఈ డ్రోన్‌ను గత రెండేళ్లలో 50 సార్లకు పైగా పరీక్షించి చూసినట్లు తెలి పింది. అయితే ఉత్తర కొరియా ప్రకటనలో విశ్వసనీయ తపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హెయిల్ అంటే కొరియా భాషలో సునామీ. ఈ డ్రోన్ గురించి ఉత్తర కొరియా అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి! ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు మూల్యం తప్పదంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ పరీక్ష గురించిన ప్రకటన వెలువడింది! కొరియా సముద్ర జలాల్లో విమానవాహక నౌకలను మోహరిస్తామని అమెరికా ప్రకటించడం తెలిసిందే. పొసెయ్‌డాన్.. రష్యా డ్రోన్.. ► ఇది అణు సామర్థ్యమున్న సూపర్ టోర్పెడో. చరిత్రలో అతిపెద్ద టోర్పెడో కూడా ఇదే! నాటో దళాలు దీన్ని కాన్యాన్గా పిలిచే పొసెయ్డాన్ను టోర్పెడో, డ్రోన్ రెండింటి క్రాస్ బ్రీడ్‌గా చెప్పవచ్చు. తొలి జత పొసెయ్‌డాన్ టోర్పెడోలను విజయవంతంగా ఉత్పత్తి చేసినట్టు గత జనవరిలో రష్యా స్వయంగా ప్రకటించింది. వీటిని బెల్ గొరోడ్ అణు జలాంతర్గామిలో మోహరిస్తామని పేర్కొంది. అయి తే పొసెయ్‌డాన్ తయారీ గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ 2018లోనే ప్రకటన చేశారు. ‘‘దీని రేంజ్ అపరిమితం. అంతేగాక సముద్రాల్లో అత్యంత అట్టడుగుల్లోకీ వెళ్లి దాడులు చేయ గల సత్తా దీని సొంతం. పైగా ప్రస్తుతమున్న అన్ని టోర్పెడోల కంటే కొన్ని రెట్లు ఎక్కువ వేగంతో, అదే సమయంలో ఏమా త్రం శబ్దం చేయకుండా దూసుకెళ్తుంది. తనంతతానుగా ప్రమాదాన్ని గుర్తించి ప్రయాణ మార్గాన్ని మార్చేసుకోగ లేదు. కనుక దీన్ని శత్రువు నాశనం చేయడం దాదాపుగా అసాధ్యం. సముద్రంలో దీన్ని ఎదుర్కోగల ఆయుధమే లేదు’’అని ధీమాగా పేర్కొన్నారు. రష్యాతో పాటు చైనా కూడా ఇలాంటివి తయారు చేసే పనిలో ఉందని అమెరికా అనుమానిస్తోంది. అయితే అమెరికా వద్ద ఇలాంటివి ఎప్పటినుంచో ఉన్నట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు! ► స్టేటస్–6 ఓషియానిక్ మల్టీపర్పస్ సిస్టంగా కూడా పిలిచే పొసెయ్‌డాన్ గురించి తెలిసింది చాలా తక్కువ. ► దాదాపు ఆరడుగుల వ్యాసార్థ్యం, 24 మీటర్ల పొడవు, 2 లక్షల పౌండ్ల బరువుండే దీన్ని అణు జలాంతర్గామి నుంచి ప్రయోగించవచ్చు. ► ఈ డ్రోన్లు ఎంత పెద్దవంటే అంతటి జలాంతర్గామిలో కేవలం ఆరంటే ఆరు మాత్రమే పడతాయట! ► ఇది అణు, సంప్రదాయ ఆయుధాలు రెండింటినీ మోసుకెళ్లగలదు. ► ఇందులో ఏకంగా ఓ అణు రియాక్టరే ఉంటుంది. దాని సాయంతో ఇది స్వయం చాలితంగా పని చేస్తుంది. ► పొసెయ్‌డాన్ శత్రు యుద్ధ నౌకలను, తీర ప్రాంతాల్లోని లక్ష్యాలను నాశనం చేస్తున్నట్టున్న దృశ్యాలతో కూడిన వీడియోలను రష్యా రక్షణ శాఖ విడుదల చేసింది. ► అమెరికాలోని దాదాపు అన్ని తీర ప్రాంత నగరాలూ దీని పరిధిలోకి వస్తాయని రష్యా చెబుతోంది! ఏమిటీ అండర్ వాటర్ డ్రోన్? ► వీటిని ఒకరకంగా చిన్నపాటి మానవరహితజలాంతర్గాములుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సముద్ర గర్భంలో వరుస పేలుళ్ల ద్వారా అతి పెద్ద రాకాసి అలల్ని పుట్టించి పరిసర ప్రాంతాలను నీట ముంచేస్తాయి. ఇవి స్వయంచాలితాలు. యుద్ధనౌకలు, లేదా ఇతర ప్రాంతాల నుంచి కంప్యూటర్లు, సెన్సర్ల ద్వారా వీటిని నియంత్రిస్తుంటారు. ఇలాంటి అండర్‌వాటర్ డ్రోన్లు 1950ల నుంచే ఉనికిలో ఉన్నట్టు్ట్ట బార్డ్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ద డ్రోన్ చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 250కి పైగా ఇలాంటి డ్రోన్లు వినియోగంలో ఉన్నట్టు అంచనా. మిలిటరీ డాట్‌కామ్ వివరాల మేరకు వీటిని జలాంతర్గాముల ద్వారా అమెరికా నేవీ 2015లో తొలిసారిగా మోహరించింది. ‘‘ఇది ప్రమాదకరమైన పనులెన్నింటినో అండర్‌వాటర్ డ్రోన్ గుట్టు గా చక్కబెట్టగలదు. ఒకవైపు వీటిని ప్రయోగించి శత్రు లక్ష్యాలను ఛేదించవచ్చు. శత్రువు దృష్టిని అటువైపు మళ్లించి ప్రధాన జలాంతర్గామి తన ప్రధాన లక్ష్యం మీద మరింత మెరుగ్గా దృష్టి సారించవచ్చు. అంటే రెట్టింపు ప్రయోజనమన్నమాట’’అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. -
పాక్, భారత్ మధ్య అణు సమాచార మార్పిడి
ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య భవిష్యత్‌లో ఉద్రిక్తతలు పెరిగిపోతే దాడులు చేయకూడదని అణు కేంద్రాలు, స్థావరాలపై సమాచారాన్ని ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినప్పటికీ మూడు దశాబ్దాలుగా ప్రతీ ఏడాది జరిగే అణు సమాచారాన్ని ఇరుదేశాలు ఒకరికొకకు అందించుకున్నట్టుగా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 1991లో ఇరు దేశాల మధ్య అమల్లోకి వచ్చిన అణు కేంద్రాలు, స్థావరాలపై దాడులు నిషిద్ధమనే ఒప్పందం మేరకు ఈ స్థావరాల వివరాలు అందించుకున్నారు. ఈ ఒప్పందంపై 1988, డిసెంబర్ 31న సంతకాలు జరగగా.. 1991, జనవరి 27న అమలులోకి వచ్చింది. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లో ఒకేసారి ఈ ప్రక్రియను చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. తొలిసారి 1992లో అణు సమచారాన్ని ఇచ్చిపుచ్చుకోగా.. 32 ఏళ్లుగా ప్రతిఏటా ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: దేవుడా ఏమిటీ పరీక్ష? పాకిస్థాన్‌లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనం..! -
పుతిన్ వార్నింగ్‌ని బేఖాతారు చేస్తూ..నాటో సైనిక కసరత్తులు
ఉక్రెయిన్‌పై మిసైల్ దాడులతో దూకుడు పెంచిన రష్యా ఒకవేళ నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు అని హెచ్చరించింది. అవసరమనుకుంటే అణ్వాయుధ దాడికి దిగుతానని వార్నింగ్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ ఉద్రిక్తతల నడుమ పశ్చిమ యూరప్‌లో నాటో దళాలు అణు నిరోధ కసరత్తులు నిర్వహించాయి. ఇది తమ రోటిన్ అణు నిరోధక డ్రిల్ అని నొక్కి చెబుతోంది. వాస్తవానికి ఈ కసరత్తులు రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగక మునుపే ఈ కసరత్తుల ప్రణాళిక ఉందని తెలిపింది. ఈ విన్యాసాలకు రష్యా బెదిరింపులతో సంబంధంల లేదని నాటో స్పష్టం చేసింది. పుతిన్ బెదిరింపుల మధ్య తాము కసరత్తులు నిర్వహించకపోతే తప్పు అర్థం వస్తుందని స్పష్టం చేసింది. అలా రద్దు చేస్తే తమ సైనిక బలాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని చెప్పింది. అయినా పుతిన్ అణ్వాయుధాలకు పాల్పడతానని హెచ్చరిక నేపథ్యంలో నాటో జనరల్ స్టోలెన్‌బర్గ్ ఈ కసరత్తులు రద్దు చేయకూడదని నిర్ణయించారు. ఏం చేసినా రష్యా అణుదాడికి సంబంధించిన వైఖరిలో మార్పు ఉండదని తెలుసన్నారు. ఏదీఏమైన తాము మాత్రం అప్రమత్తంగా ఉంటామని చెప్పారు. (చదవండి: జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా నిరసనలు...ఈడ్చుకెళ్లి చితకబాది...:) -
రష్యా వ్యూహం ఏంటి? యుద్ధ రంగంలో ఏం ప్రయోగిస్తోంది?
యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతోన్న తరుణంలో సైనిక పరంగా ఇప్పటికే బాగా నష్టపోయి ఉన్న రష్యా చిన్నపాటి వ్యూహాత్మక అణ్వస్త్రాలను ప్రయోగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ పల్స్‌తో దాడులు పెంచాలని రష్యా భావిస్తోంది. తమ వద్ద రెండు వేలకు పైగా ఇటువంటి ఆయుధాలు ఉన్నాయని కూడా రష్యా అంటోంది. దీంతో పాటు కొద్ది రోజుల క్రితమే రష్యా దీర్ఘశ్రేణి న్యూక్లియర్ మిసైల్ ను పరీక్షించింది. ఈ పరీక్షలే ఇపుడు ప్రపంచ దేశాలను కంగారు పెడుతున్నాయి. రష్యా పొరపాటున అణ్వాయుధాలు ప్రయోగిస్తే పరిస్తితిని అదుపులోకి తీసుకురావడం ఎవ్వరి వల్లా కాదని అగ్రరాజ్యం భయపడుతోంది. అపుడు జరగబోయే నష్టాన్ని ఊహించడం కూడా కష్టమే అంటున్నారు నిపుణులు. రష్యా చేతిలో కీలక అణు కర్మాగారం జపోరిజియా లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ ప్లాంట్ పై న్యూక్లియర్ వెపన్స్ దాడి చేస్తే పెను విపత్తు సంభవించే ప్రమాదం ఉందంటున్నారు. రష్యా ఇదంతా ఎందుకు చేస్తోందో అర్ధం కావడం లేదంటున్నారు కొందరు చరిత్ర కారులు. అయితే నాటో దేశాలకు చెక్ చెప్పడానికే ఉక్రెయిన్ పై యుద్దానికి కాలుదువ్వింది రష్యా. ఉక్రెయిన్ వార్ సమయంలో అమెరికాతో కలిసి నాటో దేశాలన్నీ కూడా రష్యాపై ఆంక్షలు విధించాయి. తనను ఇబ్బంది పెట్టిన దేశాలకు గట్టిగానే బదులివ్వాలని రష్యా పంతంగా ఉంది. అందుకే అణ్వాయుధాలను తెరపైకి తెచ్చి ఉంటుందని అంటున్నారు. అయితే కేవలం అందరినీ భయపెట్టడానికే రష్యా ప్రయత్నిస్తూ ఉండచ్చని నిజానికి రష్యా ఎలాంటి అణ్వాయుధాలను ప్రయోగించకపోవచ్చునని మేథావులు అభిప్రాయపడుతున్నారు. నలిగిపోతోన్న ఉక్రెయిన్ పెద్ద దేశాల మధ్య పంతాల నడుమ ఉక్రెయిన్ పాపం బాగా నలిగిపోయింది. ఇప్పటికే నగరాలకు నగరాలు నాశనం అయిపోయాయి. కోట్లకు కోట్ల విలువ జేసే ఆస్తులు,భవనాలు బుగ్గిపాలయ్యాయి. శిధిలాల నడుమ ఉక్రెయిన్ గాయాల దిబ్బగా మారిపోయింది.దీన్నుంచి కోలుకుని పూర్వవైబవం తీసుకురావాలంటే ఉక్రెయిన్ ప్రభుత్వానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇంతటి నెత్తుటి గాయానికి కారణం మాత్రం రష్యానే. అందుకే అది ఇపుడు ప్రపంచ దేశాల మేథావుల దృష్టిలో ఓ విలన్ గా మిగిలిపోయింది. రష్యా తప్పులపై తప్పులు చేసుకుంటూ పోతోంది. నాటో విస్తరణను అడ్డుకోవాలన్న తలంపుతో ఉక్రెయిన్ పై యుద్దానికి దిగింది రష్యా. అయితే దాని వల్ల నాటో కూటమి మరింతగా విస్తరించింది. అలాగే ఇపుడు అణ్వస్త్రాలు ప్రయోగిస్తామన్న హెచ్చరిక ద్వారా యూరప్ దేశాలు అణ్వాయుధాలను పెంచుకునేందుకు రష్యానే ఓ దారి చూపినట్లయ్యిందంటున్నారు మేథావులు. ఇది ప్రపంచానికి కానీ రష్యాకి కానీ మంచివి కానే కావు. యుద్దానికి వీలైనంత తొందరగా చరమగీతం పాడాలన్నది ప్రపంచం ఆశ. (చదవండి: ప్రపంచానికి పెను సవాల్ విసిరిన పుతిన్.. అదే జరిగితే భారీ విధ్వంసమే..?) -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు 3 లక్షల రిజర్వు సేనలు
మాస్కో: ఉక్రెయిన్‌లో భారీ ఎదురుదెబ్బల నేపథ్యంలో ఏకంగా 3 లక్షల రిజర్వు దళాలను తక్షణం యుద్ధ రంగానికి తరలించాలని రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మేరకు ఆదేశించారు. బుధవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌తో పాటు మొత్తం పాశ్చాత్య దేశాల సంఘటిత యుద్ధ వ్యవస్థతో తాము పోరాడుతున్నామని ఈ సందర్భంగా వాపోయారు. ‘‘పోరు బాగా విస్తరించింది. సరిహద్దుల్లోనూ, విముక్త ప్రాంతాల్లోనూ ఉక్రెయిన్ నిత్యం కాల్పులకు తెగబడుతోంది. దాంతో ఈ చర్య తీసుకుంటున్నాం’’ అని ప్రకటించారు. అమెరికా సారథ్యంలో పాశ్చాత్య దేశాలు అణు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ‘‘రష్యాను బలహీనపరిచి, విభజించి, అంతిమంగా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 1991లో సోవియట్ యూనియన్ను ముక్కలు చేశామని ఇప్పుడు బాహాటంగా ప్రకటించుకుంటున్నాయి. రష్యాకూ అదే గతి పట్టించాల్సిన సమయం వచ్చిందంటున్నాయి’’ అంటూ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో తమ భూభాగాలను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు అన్ని రకాల ఆయుధ వ్యవస్థలనూ వాడుకుంటామంటూ నర్మగర్భ హెచ్చరికలు చేశారు. ఇది అన్యాపదేశంగా అణు దాడి హెచ్చరికేనంటూ యూరప్ దేశాలు మండిపడుతున్నాయి. రష్యా అంతటి దుస్సాహసం చేయకపోవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. పుతిన్ ప్రకటనను రష్యా బలహీనతకు ఉదాహరణగా, దురాక్రమణ విఫలమవుతోందనేందుకు రుజువుగా అమెరికా, బ్రిటన్ అభివర్ణించాయి. ఉక్రెయిన్‌తో పోరులో ఇప్పటిదాకా 5,937 మంది రష్యా సైనికులు మరణించినట్టు వెల్లడించారు. అయితే ఉక్రెయిన్ అంతకు పదింతల మంది సైనికులను కోల్పోయిందని చెప్పుకొచ్చారు. రష్యాను వీడుతున్న యువత పుతిన్ తమనూ నిర్బంధంగా యుద్ధానికి పంపుతారేమోనని రష్యా యువకులు భయపడుతున్నారు. బుధవారం ఆయన ప్రకటన వెలువడగానే వారు భారీ సంఖ్యలో అందుబాటులో ఉన్న విమానాల్లో దేశం వీడారు. దాంతో టికెట్లకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మాస్కో–ఇస్తాంబుల్ టికెట్ ఏకంగా 9 వేల డాలర్లు దాటింది. అయినా కొనేందుకు ఎగబడటంతో టికెట్లన్నీ హట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. రానున్న కొద్ది రోజుల దాకా అన్ని విమానాల్లోనూ సీట్లన్నీ నిండిపోయాయి. దాంతో రైలు తదితర మార్గాల వెదుకులాట మొదలైంది. -
Russia-Ukraine War: చెర్నోబిల్‌ను వీడిన రష్యా ఆర్మీ
ప్రమాదకరంగా మారిన చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ నుంచి రష్యా సేనలు వైదొలిగాయని ఉక్రెయిన్ ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఎనెర్గోఆటం తెలిపింది. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24వ తేదీ నుంచి యుద్ధం ప్రారంభించిన రష్యా సేనలు చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకోవడంతో ప్రపంచ నేతలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 1986 నుంచి మూసివేసి ఉన్న ఈ ప్లాంట్ వెలుపల తవ్విన గుంతల నుంచి ప్రమాదకర స్థాయిలో అణుధార్మికత వెలువడటంతో ఆ ప్రాంతం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా సేనలు తెలిపాయని ఎనెర్గోఆటం పేర్కొంది. చెర్నోబిల్‌కు సంబంధించి తాజాగా తమకు ఎటువంటి సమాచారం అందలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తెలిపింది. త్వరలోనే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తామని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోస్సి తెలిపారు. మారియుపోల్ నగరంపై రష్యా దాడులు తీవ్రతరమయ్యాయి. నగరంలో చిక్కుకుపోయిన పౌరులను తీసుకు వచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం పంపించిన 45 బస్సుల కాన్వాయ్‌ను రష్యా ఆర్మీ అడ్డుకుంది. మారియుపోల్‌లో పౌరుల కోసం 14 టన్నుల ఆహారం, మందులతో వెళ్లిన వాహనాలను కూడా రష్యా సైన్యం అడ్డుకున్నట్లు సమాచారం. బెల్గోరాడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ హెలికాప్టర్ గన్‌షిప్పులు దాడి చేయడంతో చమురు డిపో మంటల్లో చిక్కుకుందని ఆ ప్రాంత గవర్నర్ ఆరోపించారు. ఉక్రెయిన్–రష్యా చర్చలు పునఃప్రారంభం ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి చర్చలు వీడియో లింక్ ద్వారా శుక్రవారం పునఃప్రారంభమయ్యా యి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కార్యాలయం సైతం ధ్రువీకరించింది. ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చివరిసారిగా మూడు రోజుల క్రితం టర్కీలో చర్చలు జరిగాయి. డోన్బాస్, క్రిమియాపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చర్చల్లో రష్యా ప్రతినిధి మెడిన్స్కీ చెప్పారు. -
అతి చేరువలో అంతులేని శక్తి
అణు సంయోగంలో దాగున్న అంతులేని శక్తిని సరిగా వినియోగించుకుంటే మానవాళి ఇంధనావసరాలన్నీ ఇట్టే తీరిపోతాయి. కానీ న్యూక్లియర్ ఫ్యూజన్ (అణు సంయోగం) క్లిష్టమైన, ఖర్చుతో కూడిన ప్రక్రియ. అందువల్లే ఇంతవరకు దీన్ని ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఉపయోగించేందుకు భారీ యత్నాలు జరగలేదు. తాజాగా యూరప్ శాస్త్రవేత్తలు చేసిన ఒక ప్రయోగం ఫ్యూజన్‌పై ఆశలు రేకెత్తిస్తోంది. త్వరలో శిలాజ ఇంధనాల స్థానంలో ఫ్యూజన్‌తో ఉత్పత్తిచేసే ఇంధనాన్ని విరివిగా వాడుకోవచ్చని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది చివరలో జరిపిన నూతన ప్రయోగ ఫలితాలను యూకే అణు ఇంధన శాఖ బుధవారం ప్రకటించింది. జేఈటీ (జాయింట్ యూరోపియన్ టోరస్)లోని అణురియాక్టర్‌లో ఫ్యూజన్ ద్వారా ఐదు సెకండ్ల కాలంలో 59 మెగా జౌల్స్ ఉష్ణ శక్తి విడుదలైందని తెలిపింది. ఇది ప్రపంచ రికార్డు. 1997లో ఇలాంటి ప్రయోగంలో విడుదలైన ఉష్ణ శక్తి కన్నా ఇది చాలా అధికం. ఐదు సెకన్ల కాలపరిమితిని క్రమంగా పెంచుకోగలిగితే ప్రపంచ ఇంధన కష్టాలు గట్టెక్కుతాయని సైంటిస్టు టోనీ డన్ చెప్పారు. ఈ ప్రయోగంలో ఎలాంటి శిలాజ ఇంధనాల వాడకం, ఉత్పత్తి జరగలేదన్నారు. దీంతో ఇది అత్యంత పర్యావరణ హితమైన ఇంధన మార్గంగా ఉపయోగపడనుంది. నక్షత్రాల్లో శక్తికి ఈ అణు సంయోగమే కారణం. హైడ్రోజన్ బాంబ్ కూడా ఈ సంయోగంపై ఆధారపడి పనిచేస్తుంది. అణు విచ్ఛిత్తికి వ్యతిరేకంగా ఫ్యూజన్లో పరమాణువులు (ఆటమ్స్)ను సంయోగపరుస్తారు. దీంతో శక్తి విడుదలవుతుంది. ఇలా విడుదలైన శక్తిని నిల్వ చేయడం, ఉపయోగించుకోవడం అతిపెద్ద సవాలు. సంయోగ ప్రక్రియ జరిపే రియాక్టర్ మధ్య భాగంలో దాదాపు సూర్యుడి వద్ద ఉన్నంత వేడి ఉంటుంది. ఈ సవాలును అధిగమించేందుకు సైంటిస్టులు యత్నిస్తున్నారు. వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఫ్యూజన్ ఎనర్జీ మానవాళికి అందుబాటులోకి వస్తుందని అంచనా. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఇరాన్‌కు అణ్వాయుధాలు దక్కొద్దు
వాషింగ్టన్: ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకోకుండా నిరోధించడమే తమకు అత్యంత ప్రాధాన్యాంశమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ చెప్పారు. ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఇరాన్ ప్రమాదకర ఆయుధాలు సొంతం చేసుకోకుండా చూడడానికి ఇప్పుడు సైనిక ఘర్షణ కంటే దౌత్యమే ఉత్తమ మార్గమని నమ్ముతున్నామని తెలిపారు. ఇరాన్‌పై ఆంక్షలు సహా ఇతర కీలక అంశాల విషయంలో చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నారు. అణ్వస్త్ర కార్యక్రమాలను విరమించుకొనేలా ఇరాన్‌పై చర్చల ద్వారా ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అణ్వస్త్రాల విషయంలో తమ మాట వినకుండా ముందుకు సాగితే ఇరాన్‌పై మళ్లీ కఠినమైన ఆంక్షలు తప్పవన్న సంకేతాలను సలివాన్ ఇవ్వడం గమనార్హం. చదవండి: (మరో వేవ్ ముప్పు తప్పాలంటే ఇలా చేయాల్సిందే..) -
చైనా సంచలనం; సూర్యుడి ప్రతిసృష్టి!
బీజింగ్: కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనాపై ప్రపంచ దేశాలు అసహనంతో ఉన్నాయి. తన తీరుతో ఇతర దేశాలకు ఆగ్రహం తెప్పించే డ్రాగన్ దేశం తాజాగా అవే దేశాలు మెచ్చుకునేలా చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా టెక్నాలజీతో ప్రయోగాలు చేయడంలో ముందుంటుంది. అలా అత్యాధునిక సాంకేతికతను తన సొంతం చేసుకుంటూ అగ్రరాజ్యం అమెరికాను సైతం వణికేలా చేస్తుంది. అయితే సృష్టికి ప్రతిసృష్టి అన్నట్టుగా ఈ డ్రాగన్ దేశం తాజాగా కృత్రిమ సూర్యుడిని తయారు చేసింది. తన సాంకేతికతతో ఆర్టిఫిషియల్ సన్ను తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తమ దేశ శాస్త్రవేత్తలు కృత్రిమ సూర్యుడిని విజయవంతంగా తయారు చేసినట్లు మంగళవారం చైనా ప్రభుత్వ మీడియా ప్రకటించింది. ఈ సూర్యుడి పేరు హెచ్ఎల్-2ఎమ్ టోకామాక్ రియాక్టర్. ఇది చైనాలో అతి పెద్ద, అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రయోగ పరిశోధనా పరికరమని.. ఇది న్యూక్లియర్ ఎనర్జీని విజయవంతంగా ఇవ్వగలదని సైంటిస్టుల అంచనా. అయితే ప్రపంచ దేశాలు ఎప్పుడు తనవైపే చూడాలన్నది చైనా కోరిక. అందుకే ఏకంగా సూర్యుడినే తయారు చేసి సాంకేతికపరంగా ఇతర దేశాలు తమ వైపు చూసేలా ప్రయోగం చేసి చూపించింది. (చదవండి: యూఎస్ తర్వాత ఆ రికార్డు చైనాదే..) చైనా తయారు చేసిన కృత్రిమ సూర్యుడు అత్యంత శక్తివంతమైన మాగ్నెటిక్ ఫీల్డ్‌ను కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ న్యూక్లీయర్ గుండా వేడి ప్లాస్మాను విచ్చిన్నం చేసి దాని ద్వారా 15 కోట్ల డిగ్రీల సెల్సియస్(అసలు సూర్యుడి మధ్య భాగంలో ఉండే వేడి కంటే 10 రెట్లు ఎక్కువ) ఎనర్జీని విడుదల చేయగలదని చైనా ‘పీపుల్స్ డైలీ’ వెల్లడించింది. ఇది ఎక్కువ పవర్ రిలీజ్ చేస్తున్నందున దీన్ని ‘ఆర్టిఫిషియల్ సన్’గా పిలుస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే సూర్యుడి పరమాణు కేంద్రంలో విపరీతమైన సూపర్ పవర్ ఉంటుంది. అణువులను విచ్ఛిన్నం చేస్తే దాని నుంచి విపరీతమైన ఎనర్జీ విడుదలవతుంది. అందుకే ఈ రియాక్టర్ ద్వారా చైనా పరిశోధకులు అదే చేశారు. కాగా ఈ రియాక్టర్ వాయువ్య చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉంది. 2019లోనే చైనా దీని నిర్మాణాన్ని పూర్తి చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకే చైనా ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. 2006 నుంచి ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ తయారీపై చైనా సైంటిస్టులు దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ కూడా ప్రపంచంలోనే అతి పెద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ తయారు చేస్తోంది. అది 2025 నాటికి పూర్తికానుందని ప్రాన్స్ సైంటిస్టులు భావిస్తున్నారు. (చదవండి: చైనా సూపర్ సైనికులను సృష్టిస్తోంది: అమెరికా) -
మిస్సైల్
ఎన్టీఆర్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందట. తాజాగా ఈ సినిమా గురించిన ఓ వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు ‘న్యూక్లియర్’ లేదా ‘మిస్సైల్’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఇందులో రామ్‌చరణ్ మరో హీరో. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివ్రిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసే సినిమా ఆరంభమవుతుందని తెలిసింది. -
‘అణు ఇంధన అవసరాలు తీర్చేందుకు సిద్ధం’
సాక్షి, హైదరాబాద్ : దేశ అణు విద్యుత్తు ఇంధన అవసరాలను తీర్చే దిశగా న్యూక్లియర్ ఫ్యుయెల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ) విస్తరణ కార్యకలాపాలు చేపట్టిందని సంస్థ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ దినేశ్ శ్రీవాత్సవ తెలిపారు. ఇంధన బండిల్ తయారై ఏడాది పూర్తయిన సందర్భంగా ఎన్ఎఫ్సీలో శుక్రవారం నిర్వహించిన వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2030 నాటికల్లా దేశంలోని అన్ని అణువిద్యుత్తు రియాక్టర్లకు యేటా మూడు వేల టన్నుల ఇంధనం అవసరమవుతుందన్నారు. హైదరాబాద్ కేంద్రంలో గత ఏడాది రికార్డు స్థాయిలో 1,200 టన్నులకు పైగా ఇంధన బండిళ్లను తయారు చేశామని.. రాజస్తాన్‌లోని కోటాలో ఏర్పాటవుతున్న కొత్త కేంద్రం ద్వారా వెయ్యి నుంచి రెండు వేల టన్నుల ఇంధనం ఉత్పత్తి కావచ్చునని వివరించారు. ఎన్ఎఫ్సీ 2017–18 నుండి పూర్తి స్వదేశీ సాంకేతికతతో ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి ఇంధన కడ్డీలను తయారు చేస్తోందన్నారు. -
తైవాన్ కేంద్రంగా చైనా భారీ స్కెచ్..!
బీజింగ్ : హిందు మహా సముద్రంపై పట్టు సాధించేందుకు చైనా ప్రయత్నాలను తీవ్రతరం చేస్తోందని అందులో భాగంగా తైవాన్ కేంద్రంగా పథక రచన చేస్తోందని యూఎస్ చట్టసభ ప్రతినిధి రిచర్డ్ డి ఫిషర్ హెచ్చరించారు. చైనా చాలా కాలం నుంచి భారత్, జపాన్ల మధ్య సంబంధాలను దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దక్షిణ చైనా, హిందు మహాసముద్రాల మీద అధిపత్యం సాధించడం ద్వారా భారత్‌కు మిత్రదేశాలతో ఉన్న వాణిజ్య సంబంధాలను దెబ్బతీయాలనేది చైనా వ్యుహం. రిచర్డ్ మాట్లాడుతూ.. ‘తైవాన్‌లో అణుకేంద్రాలతోపాటు, భారీగా మిలటరీ స్థావరాలు ఏర్పరుచుకోవడం ద్వారా క్రమంగా హిందు మహాసముద్రంపై, దక్షిణ చైనా సముద్రంపై అధిపత్యాన్ని పెంచుకోవచ్చని చైనా భావిస్తుంది. ఆర్థికంగా స్థిరపడుతున్న చైనా, అదే విధంగా సైనిక శక్తిని పెంచుకుంటుంది. దీని ద్వారా భారత్, జపాన్ల మధ్య సంబంధాలను దెబ్బతీయాలని చూస్తోంది. భారత్ పొరుగు దేశాలను తన అదుపులోకి తెచ్చుకోవడానికి వాటికి భారీగా ఆర్థిక సాయం చేయబోతోంది’ అన్నరు. అయా దేశాల్లో కూడా సైనిక బలాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని జిబూటీలో సైనిక స్థావరాన్ని ఏర్పరుచుకున్న చైనా ఆ సరిహద్దుల్లో అమెరికా సైనిక జోక్యం చేసుకోకుండా చర్యలు చేపట్టవచ్చన్నారు. ఇప్పటికే శ్రీలంకతో సత్సబంధాలు కొనసాగిస్తున్న చైనా .. ప్రస్తుతం వనౌతు, పాకిస్తాన్, థాయ్‌లాండ్ వంటి దేశాలతో కూడా అదే విధంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇప్పటికే తైవాన్ను తన సైనిక, అణు స్థావరంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నా చైనా 2025 వరకల్లా ఆ పని పూర్తి చేస్తుందని రిచర్డ్ అన్నారు. -
అణు నిరాయుధీకరణపై చర్చకు కిమ్ ఓకే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో అణు నిరాయుధీకరణపై చర్చలు జరిపేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అంగీకరించినట్లు వైట్‌హౌస్‌లోని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఉ.కొరియా ప్రతినిధులు కిమ్ నిర్ణయాన్ని తమకు చెప్పారన్నారు. మరోవైపు ట్రంప్–కిమ్ భేటీపై ఇరుదేశాల ఇంటెలిజెన్స్ అధికారుల మధ్య ఇప్పటికే రహస్య చర్చలు ప్రారంభమయ్యాయని సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. మంగోలియా లేదా స్వీడన్లో ట్రంప్–కిమ్‌ల మధ్య భేటీ జరిగే అవకాశముందని వెల్లడించింది. కాగా, తాను కిమ్‌తో ఈ ఏడాది మే లేదా జూన్‌లో సమావేశమవుతానని ట్రంప్ వెల్లడించారు. -
పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చిన అమెరికా
వాషింగ్టన్: పాకిస్తాన్‌కు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్( ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం ఆరాటపడుతున్న పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. అణుసంబంధిత వ్యాపారం చేసే ఏడు సంస్థలపై అమెరికా నిషేదం విధించడంతో ఎన్ఎస్జీలో సభ్యత్వం పొందాలనే పాక్ ఆశలు అడియాశలయ్యాయి. పాక్‌కు చెందిన ఈ సంస్థలు అణు సంబంధిత వ్యాపారం చేస్తూ అమెరికాకు నష్టం చేకూరుస్తాయనే నెపంతో నిషేదం విధించింది. ఉగ్ర కార్యకలాపాలపై నిఘా ఉంచే ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ ఆశలు ఆదిలోనే ఆవిరయ్యాయి. భారత్‌తో సమానంగా ఎన్ఎస్జీలో సభ్యత్వం కావాలని పాక్ గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే భారత్‌కు ఈ విషయంలో అనేక దేశాల మద్దతు లభించింది. అలాగే క్షిపణి పరిఙ్ఞానం, వాసేనర్ ఒప్పందం, ఆస్ట్రేలియా గ్రూప్‌లో ఇప్పటికే భారత్‌కు సభ్యత్వం ఉంది. సాధారణంగా ఈ సభ్యత్వాలను ఎన్ఎస్జీకి ఎంట్రీగా భావిస్తారు. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలకు పాక్ సహాయపడిందనే వార్తలు రావడంతో ఎన్ఎస్జీలో చేరాలని భావిస్తోన్న పాకిస్తాన్ ఆకాంక్ష వెనుక సదుద్దేశం లేదని అమెరికా గ్రహించింది. తమ జాతీయ భద్రత, విదేశాంగ విధాన ప్రయోజనాలకు విరుద్ధంగా కార్యకలాపాలు చేపట్టే ఆస్కారం ఉందని బలంగా నమ్ముతూ ఈ ఏడు పాకిస్థాన్ సంస్థలపై నిషేధం విధించామని యూఎస్ బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ పేర్కొంది. ఈ జాబితాలో మొత్తం 23 సంస్థలను చేర్చినట్టు తెలిపింది. అయితే పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకురావడానికే అమెరికా ఈ నిర్ణయాలు తీసుకుంటుందని పాకిస్తాన్‌కి చెందిన ఓ పత్రిక పేర్కొంది.