
వాషింగ్టన్: ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకోకుండా నిరోధించడమే తమకు అత్యంత ప్రాధాన్యాంశమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ చెప్పారు. ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఇరాన్ ప్రమాదకర ఆయుధాలు సొంతం చేసుకోకుండా చూడడానికి ఇప్పుడు సైనిక ఘర్షణ కంటే దౌత్యమే ఉత్తమ మార్గమని నమ్ముతున్నామని తెలిపారు.
ఇరాన్‌పై ఆంక్షలు సహా ఇతర కీలక అంశాల విషయంలో చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నారు. అణ్వస్త్ర కార్యక్రమాలను విరమించుకొనేలా ఇరాన్‌పై చర్చల ద్వారా ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అణ్వస్త్రాల విషయంలో తమ మాట వినకుండా ముందుకు సాగితే ఇరాన్‌పై మళ్లీ కఠినమైన ఆంక్షలు తప్పవన్న సంకేతాలను సలివాన్ ఇవ్వడం గమనార్హం.