National security adviser
-
అమెరికా విదేశాంగ మంత్రిగా రూబియో
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిౖన డొనాల్డ్ ట్రంప్ కీలక పదవులకు ఎంపికలను వేగిరం చేశారు. విదేశాంగ మంత్రిగా ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియో(53)ను, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) పదవికి కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జ్ (50)లను ఎంపిక చేశారు. రూబియో, వాల్జ్‌ల ఎంపికను ట్రంప్ రెండో హయాంలో భారత్– అమెరికాల మధ్య సన్నిహిత సంబంధాలకు కొనసాగింపుగా భావిస్తు న్నారు. భారత్‌కు మిత్రుడిగా పేరున్న రూబియో, భారత్– అమెరికా సంబంధాలను మెరుగుపర్చడంలో కీలకంగా ఉంటున్నారు.ట్రంప్‌కు నమ్మినబంటుగా పేరున్న వాల్జ్ భారత్‌కు పాత మిత్రుడే. భారతీయ అమెరికన్ల పక్షాన మాట్లాడే వాల్జ్, ఇండియా కంగ్రెషనల్ కాకస్‌కు సహాధ్యక్షుడిగా ఉండటం గమనార్హం. వీరిద్దరితోపాటు యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్టివ్ ఏజెన్సీ(ఈపీఏ) హెడ్‌గా కాంగ్రెస్ మాజీ సభ్యుడు లీ జెల్డిన్ పేరును ట్రంప్ ప్రకటించారు. అయితే తాజా ఎంపికలపై ట్రంప్ యంత్రాంగం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇండియా కాకస్ హెడ్‌కు ఎన్ఎస్ఏ బాధ్యతలుభారత్ కాకస్ కో–చైర్‌గా ఉన్న వాల్జ్ ఎన్ఎస్ఏ హోదాలో ట్రంప్ విధానాలకు అనుగుణంగా కఠిన విధానాలను తీసుకొస్తారని భావిస్తు న్నారు. ఈ నియామకానికి సెనేట్ ఆమోదం అవసరం లేదు. అమెరికా ఆర్మీలో కల్నల్‌గా అఫ్గానిస్తాన్, పశ్చిమాసియా, ఆఫ్రికాల్లో పనిచేశారు. వీరోచితంగా పోరాడినందుకు ప్రతిష్టాత్మక గ్రీన్ బెరెట్ గౌరవం పొందారు. వాల్జ్ 2019 నుంచి అమెరికా కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నారు.ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్‌గా 2021లో అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణపై అధ్యక్షుడు జో బైడెన్‌ను నిలదీసి వార్తల్లో కెక్కారు. ప్రాంతీయ సుస్థిరత సాధనకు చైనాపై కఠిన వైఖరి, భారత్ వంటి ప్రజాస్వామిక దేశాలతో బలమైన పొత్తులు అవసరమన్నది ఈయన వాదన. 2023లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా క్యాపిటల్ హిల్ వద్ద ప్రసంగాన్ని ఏర్పాటు చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఏమిటీ ఇండియా కాకస్..?అమెరికా కాంగ్రెస్‌లో భాగమైన ఇండియా కాకస్ భారత్ అనుకూల విధానాల రూప కల్పనలో చురుగ్గా వ్యవహరిస్తుంది. భారత్–అమెరికా ఆర్థిక వ్యవస్థ, భద్రతలను ప్రభావితం చేస్తుంది. 2004లో అప్పటి సెనేటర్లు, విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్, జాన్ కార్నిన్‌లు నెలకొల్పారు. ప్రస్తుతం 40 మంది సభ్యులున్న ఈ కమిటీ సెనేట్‌లో అతిపెద్ద కాకస్‌గా గుర్తింపు పొందింది. -
Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు ఇంటి వద్ద అపరిచితుడి కలకలం
జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ నివాసం వద్ద బుధవారం ఉదయం కలకలం రేగింది. గుర్తు తెలియని ఓ దుండగుడు నేరుగా దోవల్ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కారులో వేగంగా దూసుకొచ్చినప్పటికీ.. గేట్ వద్దే భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో దోవల్ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. తన శరీరంలో ఎవరో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చారని, అందుకే తనకు తెలియకుండానే అలా వచ్చేశాని తొలుత ఆ వ్యక్తి చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. అప్రమత్తమై.. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే అతని వాలకానికి, సమాధానాలకు పొంతన లేకపోవడంతో వైద్యుల్ని పిలిపించారు. ప్రాథమిక విచారణలో అతను మతిస్థిమితం సరిగాలేని వ్యక్తి అని, కర్ణాటకవాసిగా గుర్తించామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అజిత్ దోవల్ నివాసం ఢిల్లీ 5, జన్‌పథ్‌లో ఉంది. ఐబీ మాజీ చీఫ్, పైగా ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు కావడంతో.. ఆయన నివాసం వద్ద జెడ్ ఫ్లస్ కేటగిరీ కింద భారీగా సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది మోహరింపు ఉంటుంది. అంతేకాదు భద్రతా కారణాల దృష్ట్యాతో ఆయన నివాసానికి నేమ్ ప్లేట్ కూడా ఉండదు. అయినప్పటికీ ఆ వ్యక్తి సరాసరి దోవల్ ఇంట్లోకి దూసుకెళ్లడంతో అంతా ఉలిక్కిపడ్డారు. బుధవారం ఉదయం 7:30-8 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆ అపరిచితుడి ఐడెంటిటీని గుర్తించే పనిలో ఉన్నారు. -
ఇరాన్‌కు అణ్వాయుధాలు దక్కొద్దు
వాషింగ్టన్: ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకోకుండా నిరోధించడమే తమకు అత్యంత ప్రాధాన్యాంశమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ చెప్పారు. ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఇరాన్ ప్రమాదకర ఆయుధాలు సొంతం చేసుకోకుండా చూడడానికి ఇప్పుడు సైనిక ఘర్షణ కంటే దౌత్యమే ఉత్తమ మార్గమని నమ్ముతున్నామని తెలిపారు. ఇరాన్‌పై ఆంక్షలు సహా ఇతర కీలక అంశాల విషయంలో చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నారు. అణ్వస్త్ర కార్యక్రమాలను విరమించుకొనేలా ఇరాన్‌పై చర్చల ద్వారా ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అణ్వస్త్రాల విషయంలో తమ మాట వినకుండా ముందుకు సాగితే ఇరాన్‌పై మళ్లీ కఠినమైన ఆంక్షలు తప్పవన్న సంకేతాలను సలివాన్ ఇవ్వడం గమనార్హం. చదవండి: (మరో వేవ్ ముప్పు తప్పాలంటే ఇలా చేయాల్సిందే..) -
అజిత్ దోవల్ నివాసం వద్ద ఉగ్రవాదుల రెక్కీ
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకి కుట్ర పన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆయన నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీంతో దోవల్ కార్యాలయం, నివాసం వద్ద భద్రతను పెంచారు. జైషే మహమ్మద్ ఉగ్రవాది హిదయత్ ఉల్లా మాలిక్‌ను అరెస్ట్ చేసి ప్రశ్నించడంతో రెక్కీ విషయం బయటపడింది. దోవల్‌తో పాటుగా ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న వారి సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్‌కు చేరవేసినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 6న పోలీసులు మాలిక్‌ను అరెస్ట్ చేశారు. అతనితో సహా నలుగురిని పోలీసులు ప్రశ్నించారు. వారిలో మాలిక్ భార్య, చండీగఢ్‌కు చెందిన ఒక విద్యార్థి, బీహార్ నివాసి ఉన్నారు. పోలీసుల విచారణలో పాకిస్తాన్ ఆదేశాల మేరకే తామందరం రెక్కీ నిర్వహించామని మాలిక్ అంగీకరించాడు. గత ఏడాది మేలో న్యూఢిల్లీలోని దోవల్ కార్యాలయం సహా కొన్ని ప్రాంతాలను వీడియో తీసి పంపించామని వెల్లడించాడు. దోవల్ 2019 బాలాకోట్ వైమానిక దాడులు జరిగినప్పట్నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉన్నారు. దీంతో ఆయనకి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. -
చర్చలతో చైనా దారికి రాదు
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య గత అయిదారు నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతలకు చర్చలతో పరిష్కారం లభించదని అమెరికా అభిప్రాయపడింది. డ్రాగన్ దేశంతో చర్చలు జరిపి ఇక లాభం లేదని భారత్‌కు హితవు పలికింది. ఇరుదేశాల మధ్యనున్న వాస్తవాధీన రేఖను చైనా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని స్పష్టం చేసింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియెన్ చైనాతో ఒప్పందాలు, చర్చలు అంటూ కాలయాపన చేయొద్దని, చర్చలతో పరిష్కారం దొరకదన్న విషయాన్ని భారత్ అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా చైనా వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. భారత్ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉత్తరంగా చైనా 60 వేల మందికి పైగా సైనికుల్ని మోహరించి కయ్యానికి కాలు దువ్వుతోందని అన్నారు. చైనాది దురాక్రమణ బుద్ధి కమ్యూనిస్టు పార్టీ దురాక్రమణ బుద్ధితో భారత్, తైవాన్ దేశాల సరిహద్దుల్ని ఆక్రమించుకోవడానికి కుట్రలు పన్నుతోం దని రాబర్ట్ ఓ బ్రియెన్ అన్నారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తైవాన్ సరిహద్దుల్లో నిరంతరాయంగా సైనిక విన్యాసాలకు దిగుతోందని అన్నారు. చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్) ప్రాజెక్టు కూడా ఇతర దేశాల ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయడానికేనని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యులైన కంపెనీలకు చైనా బలవంతంగా రుణాలు తీసుకునే పరిస్థితి కల్పిస్తుందని వాటిని చెల్లించలేక అవన్నీ డ్రాగన్ దేశానికి దాసోహం అంటాయని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కల్పించే మౌలిక సదుపాయాలు అంతిమంగా చైనాకే ప్రయోజనం చేకూరుస్తున్నాయని ఆయన అన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని భారత్ ఇకనైనా చర్చలతో చైనా దారికి రాదు అన్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు. క్వాడ్ దేశాలకు డ్రాగన్‌తో ముప్పు డ్రాగన్ దేశం అత్యంత హీనంగా వ్యవహరిస్తూ క్వాడ్ దేశాలకు ముప్పుగా మారిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ సరిహద్దుల్లో 60 వేల మందికి పైగా సైనికుల్ని మోహరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంద న్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో చైనాకు చెక్ పెట్టడానికి ఇండో పసిఫిక్ దేశాలు అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా క్వాడ్ గ్రూపుగా ఏర్పడ్డాయి. ఇటీవల ఈ దేశాల విదేశాంగ మంత్రులు టోక్యోలో సమావేశమై చర్చించారు. భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్‌తో ఫలప్రదమైన చర్చలు జరిపానని టోక్యో నుంచి వాషింగ్టన్కు తిరిగి వచ్చిన అనంతరం ఒక టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
ట్రంప్ భద్రతా సలహాదారునికి కరోనా
న్యూయార్క్ : అమెరికాలో కరోనా విలయ తాండవం సృష్టిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఒబ్రెయిన్‌కు కరోనా సోకింది. ఇప్పటివరకు కరోనా సోకిన అతున్నత స్థాయి అధికారి ఈయనే. ఒబ్రెయిన్‌కు కరోనా సోకిన విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఒబ్రెయిన్‌కు తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతం సురక్షిత ప్రాంతంలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాడని పేర్కొన్నాయి. అయితే అధ్యక్షుడుకి, ఉపాధ్యక్షుడికి రిస్క్ ఏమి లేదని.. జాతీయ భద్రత మండలి నిరంతరాయంగా విధులు కొనసాగిస్తుందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. బ్రెయిన్ ఇటీవల ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరయ్యారని.. ఆ తర్వాతే అతనికి కరోనా సోకినట్టు నిర్దారణ అయిందని వార్తలు వెలువడుతున్నాయి. -
ఎన్ఎస్ఏగా మళ్లీ దోవల్
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ – నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్)గా అజిత్ దోవల్ (74)ను కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండోసారి నియమించింది. ఆయనకు కేంద్ర కేబినెట్ మంత్రి హోదాను కూడా తాజాగా కల్పించింది. దోవల్ 2014 మే 30న తొలిసారి ఎన్ఎస్ఏగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం గత నెల 30న ముగిసింది. దీంతో మరోసారి ఆయననే ఎన్ఎస్ఏగా నియమించామనీ, మే 31 నుంచి మొదలై వచ్చే ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారని తెలుపుతూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు సోమవారం బయటకు వచ్చాయి. 1968 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన దోవల్ 2005లో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్‌గా పదవీ విరమణ పొందారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టాక చేపట్టిన తొలి కీలక నియామకం ఇదే. నియామకాల కేబినెట్ కమిటీ దోవల్ నియామానికి ఆమోదం తెలిపినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఐదేళ్ల తర్వాత మోదీ పదవి నుంచి దిగిపోయినప్పుడే దోవల్ పదవీ కాలం కూడా ముగుస్తుందంది. వరుసగా రెండు పర్యాయాలు ఎన్ఎస్ఏగా నియమితులైన తొలి వ్యక్తి దోవలే. 2014 మే నెలలో ఆయన ఈ పదవి చేపట్టారు. అప్పటికి మంత్రి హోదా లేదు. అయితే మంత్రిస్థాయి వ్యక్తులతో తాము మాట్లాడతామని చైనా పట్టుబట్టడంతో అదే ఏడాది సెప్టెంబర్ నెలలో దోవల్‌కు కేంద్రం సహాయ మంత్రి హోదా కల్పించింది. ఉరీలో ఉగ్రవాద దాడి అనంతరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ (లకి‡్ష్యత దాడులు) చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారు. ఇటీవల పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాక్‌లోని బాలాకోట్‌పై వాయుసేన జరిపిన దాడిలోనూ ఈయన పాత్ర కీలకం. శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను అందుకున్న తొలి వ్యక్తి దోవలే. 1988లో మిజో తీవ్రవాద నాయకుడు లాల్డెంగాను చర్చలకు ఒప్పించడంతో ఆయనకు ఈ అవార్డు దక్కింది. మిజో తీవ్రవాద సంస్థ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు మయన్మార్, చైనాల్లోకి ఆయన అప్పట్లో రహస్యంగా వెళ్లారు. దేశం లోపలే కాకుండా, సరిహద్దుల ఆవల నుంచి కూడా దేశానికి పొంచి ఉన్న ప్రమాదాల గురించి దోవల్ ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఉంటారు. 33 ఏళ్లపాటు ఐబీలో పనిచేశారు. -
మోదీ సర్కార్ కీలక నిర్ణయం
-
అజిత్ దోవల్‌కు క్యాబినెట్ హోదా
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)గా అజిత్ దోవల్ నరేంద్ర మోదీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వంలోనూ కొనసాగుతారు. జాతీయ భద్రతా సలహాదారుగా దోవల్‌కు క్యాబినెట్ హోదా కట్టబెట్టారు. మరో ఐదేళ్ల వరకూ దోవల్‌ను ఈ పదవిలో నియమించినట్టు సోమవారం ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో సహాయ మంత్రి హోదాలో ఎన్ఎస్ఏగా సేవలందించిన అజిత్ దోవల్‌కు ప్రస్తుతం క్యాబినెట్ హోదా కల్పించారు. కాగా,జాతీయ భద్రతా సలహాదారు బాధ్యతలు చేపట్టకముందు దోవల్ ఐబీ చీఫ్‌గా వ్యవహరించారు. అజిత్ దోవల్ మార్గదర్శకత్వంలో యూరి ఉగ్రదాడి అనంతరం 2016లో పాకిస్తాన్‌పై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టగా, పుల్వామా దాడి అనంతరం 2018లోనూ బాలాకోట్‌లో భారత వైమానిక దళం సర్జికల్ స్ర్టైక్స్ నిర్వహించింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మోదీ సర్కార్ కీలక నిర్ణయం -
అపరిమితాధికారం.. అతి ప్రమాదకరం
ఇండియాలో అత్యంత శక్తిమంతమైన భద్రతా వ్యవస్థకు అధిపతిగా అజిత్ దోవల్ అవతరించారు. అయితే, అధికారాలన్నీ ఆయన చేతిలో కేంద్రీకృతం చేయడంతో దొంతరల రూపంలో ఉన్న మన భద్రతా వ్యవస్థకు కీడే జరుగుతుంది. ఇందిర హయాంలో మాదిరిగా దేశ భద్రత విషయంలోప్రధానికే సర్వాధికారాలు ఇస్తే, కీలకమైన కేంద్ర మంత్రులు రబ్బరు స్టాంపులుగా మారతారు! ఇది కేవలం ఉన్నతాధికార ప్రభుత్వ వ్యవస్థలో ఎవరు పైన, ఎవరు కింద అనే అధికార దొంతరల సమస్య కానే కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన ఈ ప్రధాన విషయంలో గట్టి చర్చ అవసరం. భారత ప్రభుత్వంలోని భద్రతా వ్యవస్థను భూమితో పోల్చవచ్చు. మార్పులకు అనుకూలంగాని పొరలతో కూడిన ఈ వ్యవస్థలో భూమిలో మాదిరిగానే మార్పులు అతి స్వల్పంగా ఉంటాయి. భూమిలోని పొరల మధ్య తీవ్ర రాపిడి ఉంటే కొంప మునుగుతుంది. భారత భద్రతా వ్యవస్థలో హఠాత్తుగా మార్పు తెస్తే అదే పద్ధతిలో ప్రమాదం ముంచుకొస్తుంది. ప్రధాని నరేం ద్రమోదీ ఓ నోటిఫికేషన్ ద్వారా హడావుడిగా ఇంతటి మార్పునకు కారణమయ్యారు. దీంతో జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ కుమార్ దోవల్ నాయకత్వంలోని దేశ భద్రతా విధాన నిర్ణయ గ్రూపు(ఎస్పీజీ) కొత్త రూపు సంతరిం చుకుంది. దీని 18 మంది సభ్యుల్లో ఎప్పటిలాగానే త్రివిధ దళాల(ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) అధిప తులు, ఇద్దరు నిఘాసంస్థల(ఐబీ, రా) అధిపతులు, రక్షణ, హోం, ఆర్థిక, అంతరిక్ష శాఖల కార్యదర్శులు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్, రెవెన్యూ కార్యదర్శి, ఇంకా దేశంలోనే అత్యంత సీనియర్ సివిల్ సర్వెంట్ అయిన కేబినెట్ కార్యదర్శి కూడా సభ్యులుగా ఉంటారు. కేబినెట్ సెక్రెటరీ రాజ్యాం గబద్ధమైన పదవి కాగా, ఎన్ఎస్ఏకు అలాంటి హోదా లేదు. కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఎస్పీజీ సమావేశానికి ఏ ఇతర మంత్రిత్వశాఖ కార్యదర్శు లనైనా రమ్మని ఆదేశించే అధికారం ఎన్ఎస్ఏకు ఉంటుంది. రెండోది, ఎస్పీజీ నిర్ణయాలను కేంద్ర మంత్రిత్వశాఖలు/విభాగాలు అమలు చేయడాన్ని కేబినెట్ సెక్రెటరీ సమన్వయం చేస్తారు. మూడోది, ఈ నోటిఫికేషన్‌పై సంతకం చేసింది ప్రధాని కార్యా లయం(పీఎంఓ) లేదా కేబినెట్ సెక్రెటేరియట్‌లోని సంబంధిత అధికారి కాదు. జాతీయ భ్రదతా మండలి(ఎన్ఎస్సీ)లోని జాయింట్ సెక్రెటరీ సంత కంతో ఇది విడుదలైంది. ఎస్పీజీని మొదట 1999 ఏప్రిల్‌లో వాజ్‌పేయి ప్రభుత్వం తొలుత ఏర్పాటు చేసింది. కాని, తేడా ఏమంటే అప్పుడు ఇది కేబినెట్ కార్యదర్శి సారథ్యంలో ఉండడమే. అప్పట్లో ఎన్ ఎస్ఏ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు దీనికి ప్రత్యేక ఆహ్వానితులు. ఈ సంస్థ(ఎస్పీజీ) కేబినెట్ సెక్రెటేరియట్ నుంచి పనిచేసేది. తాజా నోటిఫికేషన్ ప్రకారం దీని కార్యస్థలాన్ని జాతీయ భద్రతా మండలి సచివాలయానికి (ఎన్ఎస్సీఎస్)కి మార్చారు. దీనికి సారథ్యం వహించాల్సిన కేబినెట్ కార్యదర్శి దీని సభ్యునిగా మారడమేగాక, దాని నిర్ణయాలు అమలుచేసే అధికారి అయ్యారు. ఎస్పీజీ కొత్త అధిపతి ఎన్ఎస్ఏ. ఇది పెద్ద మార్పు. ఈ మార్పులను చూశాక, ‘కేబినెట్ క్లర్క్’ ఇప్పుడు ‘ఎన్ఎస్సీఎస్ క్లర్క్’గా అవరించాడని వ్యాఖ్యానిం చక తప్పదు. ఇలాంటి విచిత్రమైన మార్పుల వల్ల అత్యంత సున్నితమైన రంగంలో అతి తెలివి ప్రదర్శి ంచడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ఇది కేవలం ఉన్నతాధికార ప్రభుత్వ వ్యవస్థలో ఎవరు పైన, ఎవరు కింద అనే అధికార దొంతరల సమస్య కానే కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన ఈ విషయంలో గట్టి చర్చ అవసరం. కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలు తీసుకునే అధికారం కేబినెట్ సెక్రెటేరియట్ నుంచి ఎనెస్సీఎస్కు బదిలీ చేయ డమే ఇక్కడ అత్యంత ప్రధాన మార్పు. కేబినెట్ సెక్రె టేరియట్లోనే పరిశోధన, విశ్లేషణ విభాగం(ఆర్ఏడ బ్ల్యూ–రా) ఉంటుంది. రాకు నిధులకు కూడా అక్కడి నుంచే వస్తాయి. ఎస్పీజీ నిర్ణయాలను కేబినెట్ సెక్రె టరీ అమలు చేస్తారు కాబట్టి సాంకేతికంగా చూస్తే పూర్వ స్థితి కొనసాగుతుందనిపిస్తుంది. కాని, అధి కారం ఆయన చేతిలోనో, కేబినెట్ చేతిలోనో ఉండదు. భద్రతకు సంబంధించిన విషయాల్లో ప్రధా నికి కీలక సలహాదారు ఎన్ఎస్ఏ కావడంతో తనకు అప్పగించిన అధికారంపై నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఆయనకు ఉందని చెప్పవచ్చు. అయితే, ఇలాంటి మార్పునకు కేంద్ర సర్కారులో కీలకమైన ఈ వ్యవస్థ తేలికగా అలవాటు పడుతుందా? చర్చనీయాంశాలు చాలా ఉన్నాయి! ఈ మార్పు వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలపై చర్చనీయాంశాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఈ మార్పు కేంద్ర హోం, రక్షణ, ఆర్థిక మంత్రుల అధి కారాన్ని బలహీనపరచదా? వారి అధికారులు, త్రివిధ దళాల అధిపతులు వాస్తవానికి ఎస్పీజీ సమా వేశం నిర్ణయాలను వారికి తెలిపితే, కేబినెట్ కార్య దర్శి వాటిని అమలు జరిగేలా చూస్తారు. రెండు, భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఎస్)కు ఇక చేయడానికి పనేమి ఉంటుంది? కేబినెట్ తరహా పాలనా వ్యవస్థలో ఉమ్మడి బాధ్యత అత్యంత కీలకం. అంటే సీసీఎస్ సభ్యులందరికీ ఎలాంటి కీలకాం శంపైనైనా మాట్లాడవచ్చు. వారి మాటకు విలువ ఉంటుంది. అలాగే వారంతా ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. వారిలో ప్రధాని మాటకు ఎక్కువ విలువ అని చెప్పాల్సిన పనిలేదు. సీసీఎస్‌లో భిన్నా భిప్రాయం, చర్చ ఎంతో అవసరం, ఆరోగ్యకరం. ప్రధాని అధికార పరిధికి లోబడి పనిచేసే త్రివిధ దళా ధిపతులు, ఇతర ఉన్నతాధికారులతో కూడిన భారీ ఎస్పీజీ తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు చర్చగాని, భిన్నాభిప్రాయం చెప్పడంగాని సాధ్యమా? ఏదైనా అంశంపై ప్రధాని అభిప్రాయం అప్పటికే తెలిస్తే– దానిపై వారేం చర్చిస్తారు? అంటే మిగిలిన నాలుగు బడా శాఖల(హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగం) మంత్రులు కేవలం రబ్బరు స్టాంపులుగా మారి పోతారు కదా? మూడోది, ఇది జరిగేది కాదను కోండి. అదేమంటే, రక్షణ బలగాల ఉమ్మడి అధిపతి నియామకం లేదా ఈ అవసరంపై చర్చ ఇక ఈ తాజా మార్పు వల్ల ఉండదు. బలమైన ప్రధాని ఉన్న ప్పుడు నిర్ణయాలు పై నుంచి కిందకే గాని, కింద నుంచి పైకి రావనే అభిప్రాయానికి సర్వామోదం లభిస్తుంది. ఇందిరాగాంధీ హయాంలో ఇదే జరి గింది. అయితే, అధికార కేంద్రీకరణ లాంఛనంగా, వ్యవస్థీకృతంగా ఇప్పుడు జరుగుతోంది. ఇక అడ్డ గోలు నిర్ణయాలకు అడ్డుకట్టవేసే వ్యవస్థ ఉండదు. రఫాల్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రశ్న? రఫాల్ యుద్ధవిమానాల కొనుగోలు వివాదంపై సుప్రీంకోర్టు ఏ ప్రశ్న అడిగిందో ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. ఈ ఒప్పందం విషయంలో నిర్ణీత పద్ధతి అనుసరించారా? లేక ప్రధాని నిర్ణయం తీసుకుని ప్రకటించారా? ప్రధాని సదుద్దేశంతో నిర్ణయించినా దానికి అవసరమైన లాంఛనప్రాయమైన లిఖితపూ ర్వక పని జరిగిందా? ఇన్ని అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఎన్నో దశాబ్దాలుగా మార్పులకు అవకాశం లేకుండా పనిచేస్తున్న ఉన్నతాధికార సర్కారీ వ్యవస్థలు చురుకుగా కదలవు. మార్పు అవసరమే. అంటే, అనేక దొంతరలతో కూడిన రాజ్యాంగబద్ధ వ్యవస్థను ఒక్కసారిగా చిందరవందర చేసి కూలదోయడం భావ్యం కాదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్– ఇలా ‘కులాల మాదిరిగా విడి విడిగా పనిచేసే’ ఉన్నతాధికార వ్యవస్థలను (నిజా నికి నేను ఈ మాట అనలేదు. ఇండియన్ పోలిస్ సర్వీస్–ఐపీఎస్ అధికారుల సంఘం ప్రభుత్వానికి ఇచ్చిన వినతిపత్రంలో ఈ మాట వాడింది) ప్రతిభ ఆధారంగా తిన్నగా, సక్రమంగా పనిచేసేలా చేయాలి. ఇది ఒక్క ఐఏఎస్‌కే కాదు ఏ ముఖ్య సర్వీ సుకైనా వర్తిస్తుంది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విచిత్రమైన పద్ధతి కారణంగా అగ్రశ్రేణి ఐపీఎస్ అధికారి ఎవరూ ఇక రిటైరయ్యే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. వారిలో అత్యధికులకు ప్రభుత్వంలో పదవీ విరమణ చేశాక కూడా పదవులు వస్తాయి. కాగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల్లో చాలా మంది రిటైర య్యాక ఇంటి దారిపట్టడమో లేదా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందడమో జరుగుతుంది. ఇక్కడ సత్వరమైన –నిర్దిష్టమైనది కాని– ఏర్పాటు ఉంది: రా మాజీ అధినేత రాజిందర్ ఖన్నా ఇప్పుడు డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు అయ్యారు. అతనికంటే ముందు ఆ స్థానంలో ఉన్న అలోక్ జోషిని ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఎన్టిఆర్ఓ చైర్మన్‌ని చేసేశారు. 65 ఏళ్లు సమీపించిన తర్వాత అయన్ని సాగనంపారు. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ స్పెషల్ డైరెక్టర్ సతీష్ ఝాని నియమించారు. ఈయనను పదవీవిరమణ తర్వాత మొదట్లో ఎన్టిఆర్ఓ సలహాదారుగా నియమించారు. ఇప్పుడు ఈయనకు ప్రమోషన్ వచ్చింది. ఐబీ మాజీ అధినేత దినేశ్వర్ శర్మ జమ్మూ కశ్మీర్ వ్యవహారాల ప్రతినిధిని చేశారు. ఐబీ నుంచి రిటైరైన ఆర్.ఎన్.రవి నాగా వ్యవహారాల ప్రతినిధిగా ఉంటున్నారు. ఇప్పుడు తను డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా కూడా ఉంటున్నారు. రా మాజీ అధికారి అమితాబ్ మాథుర్‌ని టిబెటన్ వ్యవహారాల సలహాదారును చేశారు. రా సంస్థలో నంబర్ టూ స్థానంలో కూడా ఉన్న మాథుర్ మొదట ఎన్ఎస్సిఎస్లో ఇప్పుడు ఎన్ఎస్ఏబీ (జాతీయ భద్రతా సలహా మండలి)లో ఉంటున్నారు. వీరితో పాటు, కర్నాల్ సింగ్‌ని రిటైర్మెంట్ అనంతరం ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా చేశారు. మాజీ ఎన్ఐఏ అధిపతి అయిన శరద్ కుమార్ రైటైరయ్యాక ప్రస్తుతం విజిలెన్స్ కమిషర్‌గా ఉన్నారు. వీళ్లంతా రిటైరైన ఐఏఎస్ అధికారులే. ఎన్ఎస్సీఎస్ బడ్జెట్ 2016–17లో రూ.81 కోట్ల నుంచి 2018–19 నాటికి రూ. 333 కోట్లకు పెరిగింది. లెంట్రల్ లుటీన్స్లో ఎన్ఎస్సీఎస్ కొలువైనచోట ఉన్న సర్దార్ పటేల్ భవన్ దాదాపుగా ఖాళీ అయిపోయింది. అక్కడ ఒక కొత్త సామ్రాజ్యం నిర్మితమైంది. ఈ అంశంపై ఈ వారం మొదట్లో నేను చేసిన సాధారణ ట్వీట్‌పై తీవ్రంగా స్పందించారు. ఆ స్పందన ప్రభుత్వ సమర్థకులు, దోవల్ అభిమానుల నుంచి కాకుండా ఐపీఏస్ అసోసియేషన్ సభ్యుల నుంచి రావడం సరదా కలిగించింది. మాజీ కాని స్టేబుల్స్ హోమ్ మంత్రిగా (సుశీల్‌కుమార్ షిండే), ఉపరాష్ట్రపతిగా (బైరన్ సింగ్ షెఖావత్) అవుతున్న ఈ దేశంలో ఒక రిటైరైన ఐపీఎస్ అధికారి అతి శక్తిమంతుడైన భద్రతా జారు కావడంలో సమస్య ఉంటుందని చెప్పగలనా? అయితే ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే 1.34 బిలియన్లమంది ప్రజలున్న, అణ్వాయుధ సమేతమైన దేశంలో అత్యంత శక్తిమం తుడు కావచ్చునా అనేది మంచిప్రశ్నగా ఉంటుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
అజిత్ దోవల్‌కు ప్రమోషన్ యుద్ధానికేనా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘హెన్రీ కిస్సింజర్, జేమ్స్ బాండ్ 007ను కలిపితే జాతీయ భద్రతా సలహాదారు’ అజిత్ దోవల్ అవుతారు’ అని ఆయన గురించి ‘కారవాన్ మాగజైన్’ గొప్పగా రాసింది. దేశానికి సంబంధించిన కీలకమైన సమస్యలను కూడా అత్యంత సూక్ష్మ దృష్టితో ఆయన పరిష్కరిస్తున్నారని ఆయన్ని పొగిడింది. ‘మోదీని దోవ్ ఎలా రక్షించారంటే’ అనే శీర్షిక పెట్టి మరీ ప్రశంసించింది. ఆయన గత నాలుగేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీతో అంటకాగిన మాట వాస్తవమేగానీ ఆయన సాధించిన విజయాలేమిటో ! తెలియదు. జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన అంశాల్లో, విదేశాంగ విధానాల వ్యూహ రచనలో ప్రధానికి జాతీయ భద్రతా సలహాదారు సహాయకారిగా ఉంటారు. కశ్మీర్లో మిలిటెంట్ సమస్యను నిర్మూలించాలంటే ఎదురుదాడి వైఖరి అవలంభించడం ఒక్కటే మార్గమని సలహా ఇచ్చిందీ అజిత్ దోవల్. ఈ విషయాన్ని ఆయన కూడా గర్వంగా చెప్పుకున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకంటే ఇప్పుడు కశ్మీర్లో మిలిటెన్సీ సమస్య ఎక్కువగా పెరిగింది. మిలిటెంట్లు, మిలటరీ మధ్య ప్రతిరోజూ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇరువురు మధ్య స్థానిక ప్రజలు నలిగి పోతున్నారు. పాకిస్థాన్‌తోని సంబంధాలు మెరుగు పడకపోగా, మరింత దిగజారాయి. అమెరికాతోని, చైనాతోని సంబంధాలు మాత్రం కాస్త మెరుగయ్యాయి. రష్యా నుంచి క్షిపణలను కొనుగోలు చేయడం కొత్త విషయం కాదు. ఇరుదేశాల మధ్య ఈ కొనుగోళ్లు ఎప్పటినుంచో జరుగుతున్నవే. రష్యా నుంచి కొనుగోళ్లు చేస్తే ఆంక్షలు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు పట్టించుకోకపోవడం ఒక్కటే ఇక్కడ మోదీగానీ, దోవల్‌గానీ చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ట్రంప్‌కు రహస్య మిత్రుడేనాయే! ట్రంప్ విజయంలో పుతిన్ పాత్ర ఉన్న విషయం అందరికి తెల్సిందే. కారవాన్ మాగజైన్ అంతగా పొగిడినందుకో, తన విదేశీ టూర్లకు వ్యూహరచన చేసినందుకో ఏమోగానీ అజిత్ దోవల్‌ను మరింత అత్యున్నత పదవితో సత్కరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ భద్రతా సలహాదారు కూడా స్వయంగా వచ్చి సలాం కొట్టాల్సిన ‘వ్యూహాత్మక విధాన కమిటీ’ అధిపతిగా దోవల్‌ను నియమిస్తున్నారు. ఇందులో జాతీయ భద్రతా సలహాదారుతోపాటు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, త్రివిధ దళాధిపతులు సభ్యులుగా ఉంటారు. త్రివిధ దళాధిపతులను ఆదేశించే సంపూర్ణ అధికారాలను కమిటీ అధిపతిగా దోవల్‌కు కల్పిస్తున్నారు. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య లేదా ప్రభుత్వ ఉన్నతాధికారాల మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించడం కోసం ఇలాంటి కమిటీ ఉందంటే అర్థం ఉంది. ఇంతకాలం భారత్‌కు అవసరంరాని త్రివిధ దళాధిపతులను ఆదేశించే అధికారాలు కలిగిన కమిటీ ఇప్పుడు ఎందుకు అవసరం అయింది? అందులోనూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ అవసరం ఎందుకు వచ్చింది? ‘అఫెన్సే బెస్ట్ డిఫెన్స్’ అని నమ్మే దోవల్‌కు కీలక బాధ్యతలు అప్పగించడం అంటే ఏ దేశంపై యుద్ధానికి సన్నాహాలు అనుకోవాలి? కాలమే సమాధానం చెబుతుంది. -
దోవల్.. ది మాస్టర్ మైండ్!
♦ ఆర్మీ దూకుడు వెనుక జాతీయ భద్రతా సలహాదారు ♦ ఒక్క పాక్ బుల్లెట్‌కు రెండు బుల్లెట్లతో బదులివ్వండి న్యూఢిల్లీ: ‘శాంతి.. సహనం.. వ్యూహాత్మక మౌనం..’ సరిహద్దుల వెంట పాక్ విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్నా భారత్ ఇన్నాళ్లూ జపించిన మంత్రాలివీ! కానీ వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టి గురువారం బెబ్బులిలా విరుచుకుపడింది. పీవోకేలోకి వెళ్లి ఉగ్రమూకల పీచ మణిచింది. అడ్డొచ్చిన ఇద్దరు పాక్ సైనికులనూ మట్టికరిపించింది! దీంతో ఇన్నాళ్లూ రక్షణాత్మక ధోరణిని అవలంబించిన భారత్ ఎదురుదాడి వ్యూహానికి పదును పెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ వ్యూహానికి బీజాలు ఇప్పుడు కాదు.. రెండేళ్ల కిందటే పడ్డాయి!! దీనంతటి వెనుక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలకపాత్ర పోషించారు. ‘పాక్ ఒక్క బుల్లెట్ పేలిస్తే మీరు రెండు బుల్లెట్లతో సమాధానం చెప్పండి’ అంటూ రెండేళ్ల కిందటే అజిత్ దోవల్ సైన్యానికి స్పష్టంచేశారు. పాక్ ఏమాత్రం కవ్వించినా తగిన విధంగా బుద్ధి చె ప్పాలని, దీటుగా స్పందించాలని సూచించారు. కాల్పుల విషయంలో పై నుంచి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా అప్పటికప్పుడు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలంటూ దిశానిర్దేశం చేశారు. 2014 అక్టోబర్ 7న బీఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్‌తో జరిగిన సమావేశంలో దోవల్ ఈ మేరకు పేర్కొన్నారు. ‘అటు వైపు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే.. మీరు రెండు బుల్లెట్లతో బదులివ్వండి..’ అని ఆయన చెప్పినట్లు తెలిసింది. పాక్ రేంజర్లు కాల్పులు ఆపేంత వరకు ఒక క్రమ పద్ధతి ప్రకారం సరిహద్దుల వెంట వారి మౌలిక వసతులను టార్గెట్ చేసుకొని విరుచుకుపడాలని ఆ భేటీలో చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో పాక్ సైన్యంతో ఎలాంటి సమావేశాలు జరపకూడదని కూడా నిర్దేశించారు. అప్పట్నుంచి సరిహద్దుల వెంట పాక్ చిన్న కవ్వింపు చర్యకు పాల్పడ్డా.. భారత సైన్యం విరుచుకుపడింది. ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ సైన్యం ఇలా దూకుడుగా వ్యవహరించడంతో సరిహద్దు ప్రాంతంలో పాక్‌కు భారీ నష్టమే మిగిలింది. కాల్పులు ఆపండి.. ప్లీజ్! కిందటి అక్టోబర్‌లో పాకిస్తాన్ రేంజర్స్(పంజాబ్) డెరైక్టర్ జనరల్ ఉమర్ ఫరూక్ బుర్కీ చర్చల కోసం ఢిల్లీకి వచ్చిన సమయంలో కూడా సరిహద్దుల వెంట పాక్ సైన్యం రెచ్చిపోయింది. బుర్కీ పాక్‌కు తిరిగి వెళ్లాక కూడా పెద్దఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఏమాత్రం తగ్గకుండా గట్టిగా బదులివ్వాలని దోవల్, హోంమంత్రి రాజ్‌నాథ్ బీఎస్ఎఫ్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మన సైన్యం ధాటికి పాక్ వైపు 26 మంది మరణించారు. దీంతో బుర్కీ... బీఎస్ఎఫ్ చీఫ్ డీకే పాఠక్‌ను ‘హాట్‌లైన్’ ద్వారా సంప్రదించి కాల్పులు ఆపాల్సిందిగా విన్నవించినట్లు తెలిసింది. గత జూలైలో భారత ఆర్మీ.. మియన్మార్ భూభాగంలోకి చొచ్చుకువెళ్లి తీవ్రవాదులను మట్టుబెట్టడం వెనుక కూడా దోవలే కీలక పాత్ర పోషించారు. మొత్తమ్మీద గత రెండేళ్లలో భారత్ వైఖరిలో వచ్చిన మార్పు.. ఇటు ఆర్మీలో స్థైర్యాన్ని పెంచగా అటు తమతో పెట్టుకుంటే భారీగా నష్టపోక తప్పదన్న స్పష్టమైన సంకేతాన్ని పాక్‌కు అందించింది. గురువారం కూడా పీవోకేలో మన కమెండోలు సర్జికల్ స్ట్రైక్స్ చేసి వచ్చిన తర్వాత పాక్ బలగాలు రాజౌరీ, బారాముల్లాలోని బీఎస్ఎఫ్ పోస్టుల వైపు కాల్పులు జరిపాయి. ‘బహుశా అసహనంతోనే పాకిస్తాన్ ఈ చర్యకు పాల్పడి ఉంటుంది. ఆ కాల్పులను కూడా మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది’ అని అధికారులు తెలిపారు. -
భారత్- పాక్ చర్చల్లో తీవ్ర ప్రతిష్ఠంభన
-
భారత్- పాక్ చర్చల్లో తీవ్ర ప్రతిష్ఠంభన
జాతీయ భద్రతా సలహదారు స్థాయిలో పాకిస్థాన్‌తో జరగాల్సిన చర్చలలో ప్రతిష్ఠంభన చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ, ఆ చర్చలకు ముందుగానే కాశ్మీర్‌లోని వేర్పాటువాద నాయకులను పాకిస్థాన్ చర్చలకు పిలవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హురియత్ నాయకులతో చర్చించడం తగదని స్పష్టంగా చెప్పినా.. పాక్ వినిపించుకోకుండా మొండిగా ముందుకెళ్లడం, మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ లాంటి హురియత్ నేతలు కూడా తాము పాకిస్థాన్‌తో చర్చలకు వెళ్తామని చెప్పడం.. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చర్చలు జరగాలా.. వద్దా అనే విషయాన్ని పాకిస్థాన్ కే వదిలేసింది. వాస్తవానికి రెండు దేశాల మధ్య చర్చల విషయంలో మూడో పక్షానికి అవకాశం లేదని భారత్ ఎప్పుడూ చెబుతూ వస్తున్నా, పాక్ మాత్రం పదే పదే అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ సమస్యను ప్రస్తావించడం, మూడో పక్షం జోక్యాన్ని ఆహ్వానించడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్‌తో శాంతియుత చర్చలకే భారత్ ఎప్పుడూ ముందుకెళ్లిందని, కానీ పాక్ ఎజెండా మాత్రం ఉగ్రవాదంతోనే ముడిపడి ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు. ఏకపక్షంగా కొత్త నిబంధనలు విధించడం, ముందుగా ఒప్పుకొన్న ఎజెండాను తప్పించడం.. ఇదంతా ఏంటని ప్రశ్నించారు. పాకిస్థాన్ గతంలో చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కడానికి దారి తీసిన పరిస్థితులేంటో వాళ్లే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో అజిత్ దోవల్ సమావేశమయ్యారు. -
జాతీయ భద్రతా సలహాదారుగా:దోవల్
-
జాతీయ భద్రతా సలహాదారుగా: అజిత్ దోవల్
న్యూఢిల్లీ: కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధిపతి అజిత్ దోవల్ (69) నూతన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా నియమితులయ్యారు. జాతీయ, అంతర్జాతీయ భద్రతా అంశాలపై అపారమైన అనుభవం ఉన్న ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ఆ అంశాలపై సలహాదారుగా వ్యవహరిస్తారు. దోవల్ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం ఆయన నియామకం శుక్రవారం నుంచే అమలులోకి వచ్చింది. ప్రస్తుత ప్రధాని పదవీకాలం ముగిసే వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ దోవల్ ఈ పదవిలో కొనసాగుతారు. శివశంకర్ మీనన్ స్థానంలో దోవల్ బాధ్యతలు స్వీకరిస్తారు. భారత్-చైనా సరిహద్దు అంశంలో ప్రధాని ప్రతినిధిగానూ ఉంటారు. ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు చేపట్టిన అనంతరం జరిగిన రెండో కీలక నియామకం ఇది. ఇంతకుముందు ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నృపేంద్ర మిశ్రా నియమితులవడం తెలిసిందే. దోవల్ 1968 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి. ఇంటెలిజెన్స్ విభాగంలో అత్యుత్తమ వ్యూహరచన చేయడంలోనూ, అమలులోనూ నిష్ణాతునిగా ఆయన పేరుపొందారు.