సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా అజిత్ దోవల్ నరేంద్ర మోదీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వంలోనూ కొనసాగుతారు. జాతీయ భద్రతా సలహాదారుగా దోవల్‌కు క్యాబినెట్ హోదా కట్టబెట్టారు. మరో ఐదేళ్ల వరకూ దోవల్‌ను ఈ పదవిలో నియమించినట్టు సోమవారం ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో సహాయ మంత్రి హోదాలో ఎన్‌ఎస్‌ఏగా సేవలందించిన అజిత్ దోవల్‌కు ప్రస్తుతం క్యాబినెట్ హోదా కల్పించారు.
కాగా,జాతీయ భద్రతా సలహాదారు బాధ్యతలు చేపట్టకముందు దోవల్ ఐబీ చీఫ్‌గా వ్యవహరించారు. అజిత్ దోవల్ మార్గదర్శకత్వంలో యూరి ఉగ్రదాడి అనంతరం 2016లో పాకిస్తాన్‌పై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టగా, పుల్వామా దాడి అనంతరం 2018లోనూ బాలాకోట్‌లో భారత వైమానిక దళం సర్జికల్ స్ర్టైక్స్ నిర్వహించింది.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
మోదీ సర్కార్ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment