ajith doval
-
జ్ఞాపకాలు విప్పి చెప్పిన కథనాలు
ఉన్నత స్థానంలో పనిచేసిన వ్యక్తి తన జ్ఞాపకాలను రాస్తే అవి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెబుతాయి. అందునా ఆయన ఒక గూఢచార సంస్థకు అధిపతి అయితే? అప్పుడు మామూలుగా మనం ఎప్పటికీ తెలుసుకోలేని వ్యక్తులు, వారి కథనాలు మన ముందుకు వస్తుంటాయి. ‘రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్’(రా)కు అధిపతిగా పనిచేసిన ఎ.ఎస్.దులత్ తనను తాను ఒక దయ్యంగా అభివర్ణించుకుంటారు. నీడలా ఉండి చేయాల్సిన పని అది కాబట్టి. అందుకే ఆయన తన పుస్తకానికి ‘ఎ లైఫ్ ఇన్ ద షాడోస్’ అనే పేరుపెట్టారు. ఇందులో ప్రిన్స్ చార్లెస్‌కు ఇందిరా గాంధీ ఇచ్చిన ఆతిథ్యం నుంచి, తన భద్రతాధికారి పట్ల మార్గరేట్ థాచర్ చూపిన ఔదార్యం దాకా ఎన్నో విషయాలున్నాయి. ఇంకా ఢిల్లీలో సిక్కులను చంపుతున్నప్పుడు అప్పటి కాంగ్రెస్ నాయకుడు అర్జున్ సింగ్ ప్రతిస్పందన విశేషమైన ప్రాధాన్యత కలిగినది. రెండు అంశాలు జ్ఞాపకాలను తప్పనిసరిగా చదివేలా చేస్తాయి– సుప్రసిద్ధ వ్యక్తులను గురించిన వృత్తాంతాలు, వారి గురించిన పదునైన వ్యాఖ్యలు. రచయిత ఎప్పుడైతే ఒక ‘దయ్యమో’– ఒక జీవితకాలం పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్నతస్థానంలో ఉండి ‘రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్’కు అధిపతిగా పనిచేసిన తర్వాత ఆయన తనను తాను అలాగే అభివర్ణించుకున్నారు– మామూలుగా అయితే మనం ఎప్పటికీ తెలుసుకోలేని వ్యక్తులు, వారి కథనాలు మన ముందుకు వస్తుంటాయి. ఇదే ఎ.ఎస్. దులత్(అమర్జీత్ సింగ్ దులత్) రాసిన ‘ఎ లైఫ్ ఇన్ ద షాడోస్’ పుస్తకాన్ని అంత సరదాగా మలిచింది. 1980లలో ఢిల్లీ సందర్శించే ప్రముఖులకు దులత్ భద్రతా అనుసంధాన అధికారిగా ఉండేవారు. అలాంటి ప్రముఖులలో ఒకరు ప్రిన్స్ చార్లెస్. ఈ బ్రిటన్ యువరాజును ఇందిరాగాంధీ భోజనానికి ఆహ్వానించారు. అయితే అదంత బాగా సాగలేదు. ‘‘ఎవరో చితక బాదినట్టిగా భారత ప్రధాని నివాసం నుంచి చార్లెస్ బయటపడ్డారు!’’ అని దులత్ రాశారు. ‘‘యువర్ హైనెస్(మహాశయా), భోజనం ఎలా అయ్యింది?’’ అని అడిగాను. ‘‘నన్ను అడగొద్దు,’’ అంటూ ఊపిరి పీల్చుకుంటున్న రీతిలో చార్లెస్ కారు ఎక్కారు. ‘‘ఆ మహిళ నిన్ను గడ్డ కట్టించేయగలదు. నీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా చాలామంది నాయకులను నేను కలిశాను, కానీ ఈ మహిళ ఒక్క మాట కూడా మాట్లాడదు!’’ మార్గరేట్ థాచర్ (బ్రిటన్ మాజీ ప్రధాని) భిన్నమైన ముద్ర వదిలేసి వెళ్లారు. ఈ ఉక్కు మహిళ తన సిబ్బందని ఎంతో జాగ్రత్తగా చూసుకునే బాస్‌గా ఉండేవారు. థాచర్ భద్రతాధికారి గోర్డాన్ కేథార్న్ ఒక రాత్రి ఆమె గది బయట చలిలో గడుపుతానని చెప్పినప్పుడు థాచర్ ఎలా స్పందించారో దులత్ రాశారు. ‘‘గోర్డాన్, రాత్రి ఇక్కడే గడపటం గురించి నీవు సీరియస్‌గానే అంటున్నావా?’’ అని ఆమె అడిగారు. ‘‘అవును మేడమ్, అఫ్కోర్స్, నిజంగానే’’ అన్నాడు గోర్డాన్. అప్పుడు ప్రధాని ఇలా అన్నారు: ‘‘అయితే ఒక నిమిషం ఉండు. బయట చలిగా ఉంది. డెనిస్ స్వెటర్లలో ఒకటి నీకు తెచ్చిస్తాను.’’(డెనిస్– డెనిస్ థాచర్. ఆమె భర్త.) ఆ ప్రయాణంలో థాచర్ కారు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. అద్దాల్లోంచి బయటికి చూస్తూ ఆమె కేథార్న్ కారు వెంట జాగింగ్ చేయడాన్ని గమనించారు. ముందు సీట్లో డ్రైవర్ పక్కనే కూర్చున్న దులత్ను మనం అతడికి లిఫ్ట్ ఇద్దామా అని అడిగారు. దులత్ అంగీకరించి, కేథార్న్ లోపలికి వచ్చేలా తన డోరు తెరిచారు. ‘‘నో, నో, నువ్వు అసౌకర్యానికి గురి కావొద్దు,’’ అని వెంటనే థాచర్ అన్నారు. ‘‘అతడు మాతో వెనక కూర్చుంటాడు’’. దులత్ ఏమంటారంటే – ‘‘ఇలాంటి దృశ్యాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక భద్రతాధికారికి అసౌకర్యం కలిగించడం కంటే కూడా, బ్రిటన్ దేశపు ప్రధాని వెనక సీట్లో ముగ్గురితో సర్దుకుని కూర్చోవడానికి సిద్ధపడ్డారు.’’ దులత్ ఉపాఖ్యానాల్లో ఎక్కువగా జ్ఞానీ జైల్ సింగ్ గురించి ఉన్నాయి. దులత్ రాశారు: ‘‘1982 నుంచి 1987 మధ్య ఆయన చేసిన ప్రతి విదేశీయానంలోనూ నేను వెంట ఉన్నాను.’’ అయితే రాష్ట్రపతి వారి సమక్షంలో లేనప్పుడు నిజమైన సరదా జరిగినట్టుంది. ‘‘ఎప్పుడు మేం కొత్త దేశంలో అడుగు పెట్టినాసరే, ఒకవేళ రాష్ట్రపతితో ప్రయాణిస్తున్న కార్యదర్శి రమేశ్ భండారీ అయితే, ఆయన నాతో అనేవారు, ‘పార్టీ నా రూములో’’’. హోనోలూలూ(అమెరికా నగరం) నుంచి తిరిగివస్తూ, కాసేపటి కోసం హాంకాంగ్‌లో ఆగినప్పుడు ‘‘మేము ఎంత అలసిపోయామంటే, ఒక చక్కటి మసాజ్ స్వర్గ తుల్యంగా ఉంటుందనిపించింది... సమీపంలో ఎక్కడైనా మసాజ్ సెంటర్ ఉందా అని హోటల్ ఫ్రంట్ డెస్క్‌లో ఉన్నవారిని అడిగాను... తీరా నేను పరుగెత్తుకెళ్లి కనుక్కున్నదల్లా అప్పటికే అక్కడికి మంత్రి పదవి కోసం వేచి చూస్తున్న, సరదా మనిషి అయిన ఎన్.కె.పి.సాల్వే నాకంటే ముందు చేరుకున్నారని!’’ ముఖ్యమైన వ్యక్తుల గురించి దులత్‌కు తెలియవచ్చిన విషయాలు చాలా విశేష ప్రాధాన్యత కలిగినవి. 1984లో సిక్కులను హత్య చేస్తున్న కాలంలో కాంగ్రెస్ నేత(అప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రి) అర్జున్ సింగ్‌ను దులత్ కలిశారు. ‘‘ఒక ముఖ్యమంత్రిగా భోపాల్‌లోని సిక్కులను మీరు కలిసి వారి భయాలను నివృత్తి చేయాలని నేను సూచించాను... కానీ ఆయన కరాఖండీగా నిరా కరించారు. ఆయన ఎలాంటి అంతఃగర్భితమైన సందేశాన్ని వ్యక్తపరి చారంటే, రాజ్యం– భారత ప్రభుత్వం– తన సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ తరుణంలో సిక్కులు ఇంకేమిటో కాదు, అభద్రతను ఫీల్ కావాలి.’’ తన మాజీ సహచరుల్లో ఒకరైన, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు c(అజీత్ డోభాల్) గురించి కూడా దులత్ రాశారు. వారిద్దరూ నార్త్ బ్లాక్‌లోని ఇంటెలిజెన్స్ కార్యాలయంలోని పార్కింగ్ ప్లేసులో మొట్టమొదటిసారి కలిశారు. అప్పట్లో దోవల్ యువకుడు, దులత్ కంటే మూడేళ్లు జూనియర్. ‘‘ఆ రోజుల్లోనే అతడిని చూసినప్పుడల్లా తన కెరియర్లో ఎంతో అత్యున్నత స్థానా నికి వెళుతున్న మనిషి ఇక్కడున్నాడు అనిపించేది. దోవల్ ప్రతి ఒక్కరికీ స్నేహితుడు, అదేసమయంలో ఎవరి స్నేహితుడూ కాదు. ప్రతిరోజూ అలా వ్యవహరించడం అనేది మనలో చాలామందికి ఎంతో కష్టమైన మార్గం.’’ ఏమైనా దోవల్ మారారని దులత్ నమ్ముతున్నారు. యువకుడిగా ఉన్నప్పుడు ఆయన బీజేపీ సీనియర్ నేత ఎల్.కే.ఆడ్వాణీ వీరా రాధకుడు, అలాగే పాకిస్తానీయులతో చర్చలకు సిద్ధంగా ఉండేవారు. ఇప్పుడు మాత్రం ‘‘వారితో చర్చలకు, సర్దుబాటకు ససేమిరా అంటు న్నారు. ఇప్పుడు ఆయన దృష్టి అంతా కఠిన వైఖరి మీద, నిర్దాక్షిణ్యత మీద, లక్ష్యాలను చేరుకోవడం మీద ఉంది. పాత రోజుల్లో నాకు తెలిసిన దోవల్ ఎన్నడూ నరేంద్ర మోదీపై దృష్టి పెట్టేవారు కాదు. ఆయన దృష్టి అంతా తనకు అభిమాన నేత అయిన ఆడ్వాణీ పైనే ఉండేది.’’ ‘‘అజిత్ గురించి చాలావరకు ప్రశంసించిదగిన కథనాలు నా వద్ద ఎన్నో ఉన్నాయి,’’ అని దులత్ కొనసాగిస్తారు. నేననుకోవడం అవి ఆయన వాటిని సీక్వెల్ కోసం పదిలపరుచుకుంటున్నట్టున్నారు. వాటి గురించి దోవల్ ఏమనుకుంటారోగానీ, వాటిని చదవడానికి నేను మాత్రం వేచి ఉండలేను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అజిత్ దోవల్ పేరుతో ‘గుణపాఠం ట్వీట్’.. కాసేపటికే డిలీట్
న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేతలు మహమ్మద్ ప్రవక్త పట్ల చేసిన వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాలన్నీ గుర్రుగా ఉన్నాయి. ఈ తరుణంలో.. భారత్ తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరాన్ విదేశాంగ మంత్రి న్యూఢిల్లీకి రావడం విశేషం. అయితే ప్రవక్త వ్యాఖ్యలను ఉద్దేశించి.. ఇరాన్ విదేశాంగ శాఖ చేసిన ఆసక్తికర ప్రకటనను కాసేపటికే ఇరాన్ డిలీట్ చేసింది. ప్రధాని మోదీతో ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహేన్ భేటీ అయ్యారు. అలాగే, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులతోనూ ఆయన చర్చలు నిర్వహించారు. కొందరు వ్యక్తులు మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు వ్యతిరేక వాతావరణానికి దారితీసినట్టు ఆయన అజిత్ దోవల్ కు తెలియజేసినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించుకుంది. అందుకు బదులుగా భారత్ మహమ్మద్ ప్రవక్తను గౌరవిస్తుందని ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రికి భారత్ స్పష్టం చేసిందని, ఈ అంశంలో ఇతరులకు ఒక గుణపాఠంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని దోవల్ హామీ ఇచ్చినట్టు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి ఓ ట్వీట్ కూడా చేశారు. అంతేకాదు.. నిందితుల పట్ల భారత్ అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిపై ముస్లింలు సంతోషంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. అయితే ఈ ప్రకటనను కాసేపటికే భారత ప్రభుత్వం ఖండించింది. దీంతో ‘ఇతరులకు ఒక పాఠంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని దోవల్ హామీ ఇచ్చినట్టు’ లైన్‌ను తొలగించి.. మరో ట్వీట్ చేశారు. ఇక విదేశాంగ మంత్రి వద్ద గానీ అసలు ప్రవక్త వ్యాఖ్యల అంశమే రాలేదని ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీంతో మరో ట్వీట్ చేశాడు ఇరాన్ విదేశాంగ మంత్రి. Pleased to meet PM Modi, FM Jaishankar & other Indian officials to advance our bilateral strategic dialogue. Tehran & New Delhi agree on the need to respect divine religions & Islamic sanctities & to avoid divisive statements. 🇮🇷🇮🇳 determined to bring relations to new heights. — H.Amirabdollahian امیرعبداللهیان (@Amirabdolahian) June 8, 2022 -
అఫ్గాన్ పరిణామాలపై కేంద్రం ప్రత్యేక బృందం ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ విషయంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా అఫ్గాన్ పరిణామాలపై కేంద్రం మంగళవారం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అమెరికా బలగాలు అఫ్గాన్‌ను పూర్తిగా వీడిన నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అత్యున్నత స్థాయి బృందం ఏర్పాటు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: జమ్ము కశ్మీర్లో అఫ్గాన్ యువకుడు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు బృంద సభ్యులుగా కేంద్రమంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను నియమించారు. అఫ్గాన్ నుంచి భారతీయులు, మైనారిటీలను తీసుకురావడంపై ఈ బృందం ప్రత్యేక దృష్టి సారించనుంది. చదవండి: Afghanistan: రెచ్చిపోయిన తాలిబన్లు.. చేతికి చిక్కిన బిలియన్ డాలర్ల పరికరాలు -
26/11 దాడి తరహాలో మరో ఉగ్రదాడికి భారీ ప్లాన్!
సాక్షి,ఢిల్లీ: రెండు రోజుల క్రితం జమ్మూలో జరిగిన నగ్రోటా ఎన్‌కౌంటర్‌పై ప్రధాన మంత్రి మోదీ శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌తో సమీక్ష సమావేశాన్నినిర్వహించారు. ఈ సమీక్షలో భారత ఉన్నత నిఘా సంస్థ, విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా పాల్గొన్నారు. 26/11 ఉగ్రదాడి జరిగి 12 ఏళ్లు పూర్తి కావొస్తున్న తరుణంలో భారత్‌లో మరో భారీదాడి చేయాలని ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు మోదీకి అధికారులు వివరించారు.(చదవండి: భారీ విధ్వంసానికి వ్యూహం: ఉగ్రవాదుల హతం) ఎన్‌కౌంటర్‌పై ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. జైష్-ఇ-మహమ్మద్ ఉగ్రవాద దాడిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాదులకు అందిస్తున్న సాయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది. జాతీయ భద్రతను కాపాడుకోవాడానికి అవసరమైన చర్యలు తీసుకోవాడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మోదీ అభినందన.. "పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థ జైష్-ఇ-మహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను హతమార్చి, వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలతో విధ్వంసాలను చేయడానికి ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బలగాలు మరోసారి అడ్డుకున్నాయని" ప్రధాని మోదీ తన ట్వీట్లో ప్రశంసించారు. రాబోయే స్థానిక ఎన్నికలే లక్ష్యంగా.. జమ్మూలో నగ్రోటా పట్టణానికి సమీపంలో భద్రతా దళాలతో గురువారం జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 22 వరకు జమ్మూలో జరిగే జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) ఎన్నికల్లో భాగంగా భారీకుట్రకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భద్రతా దళాలకు సమాచారం అందిందని జమ్మూ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ముఖేష్ సింగ్ తెలిపారు. జమ్మూ జిల్లాలోని నగ్రోటా పట్టణానికి సమీపంలో హైవేపై ఉన్న బాన్ టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన మూడు గంటల పాటు జరిగిన కాల్పుల్లో నలుగురు జైష్-ఇ-మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించారు. కాల్పుల్లో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజి)కు చెందిన ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదులతో ప్రయాణిస్తున్న ట్రక్కును భద్రతా దళాలు అడ్డగించడంతో కాల్పులు ప్రారంభమయ్యాయి. 11 ఎకె -47 రైఫిళ్లు, మూడు పిస్టల్స్, 29 గ్రెనేడ్లు, ఆరు యుబిజిఎల్ గ్రెనేడ్లు, మొబైల్ ఫోన్లు, దిక్సూచి, మందుగుండు సామగ్రిని ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ముఖేష్ సింగ్ తెలిపారు. -
ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది
-
సరిహద్దు వివాదం పరిష్కరించుకుందాం
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలను వేగవంతం చేయాలని భారత్, చైనాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకుని పురోగతే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించాయి. సరిహద్దు వివాదంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మధ్య 22వ దఫా చర్చలు శనివారం జరిగాయి. వివాద పరిష్కారం దిశగా వీరిద్దరూ నిర్మాణాత్మకంగా చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. పరస్పర అభిప్రాయాలను గౌరవించుకోవాలని, పరస్పరం విశ్వాసం పెంపొందించుకోవాలని అంగీకారానికి వచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. ‘భారత్–చైనా వ్యూహాత్మక సంబంధాల కోణంలో సరిహద్దు సమస్యను చూడాలని, సరిహద్దుల్లో శాంతి నెలకొల్పాలని ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి. భారత్–చైనాల సంబంధాల్లో సుస్థిర, సమతులాభివృద్ధి ఈ ప్రాంతంతోపాటు ప్రపంచ శాంతి, అభివృద్ధికి సానుకూలంగా మారుతుందనే అభిప్రాయాన్ని ఈ ప్రత్యేక ప్రతినిధుల భేటీ వ్యక్తం చేసింది’అని విదేశాంగ శాఖ తెలిపింది. సరిహద్దు వివాదంపై చర్చించేందుకు వాంగ్, దోవల్‌ను రెండు దేశాలు ప్రత్యేక ప్రతినిధులుగా నియమించాయి. వచ్చే ఏడాది చైనాలో 23వ దఫా భేటీ కావాలని కూడా ఇద్దరు ప్రతినిధులు నిర్ణయించారు. భారత్–చైనాల మధ్య 3,488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖపై వివాదం నలుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు టిబెట్ దక్షిణ ప్రాంతం కూడా తనదేనని చైనా వాదిస్తోంది. -
‘గాజులు పంపమంటారా’ అంటూ పాక్ రెచ్చగొడుతోంది
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ లోయలో అల్లర్లు సృష్టించడానికి పాకిస్తాన్‌కు ఉన్న ఏకైక మార్గం ఉగ్రవాదమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. పాక్ ఎన్ని కుట్రలు పన్నినా కశ్మీర్ ప్రజలను కాపాడాడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత వ్యతిరేక ప్రచారంతో కశ్మీరీలో అలజడులను సృష్టించి లోయలో అశాంతిని ఎగదోయడమే పాకిస్థాన్ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లోని అన్ని ప్రాంతాల్లో ఆంక్షలు సడలించడం అనేది పాకిస్తాన్ ప్రవర్తన మీద ఆధారపడి ఉందన్నారు. ‘కశ్మీర్లో అలజడి సృష్టించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం దేశంలో చొరబడడానికి 230 మంది ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్లో సిద్ధంగా ఉన్నారు. వీరిలో కొందరు ఇబ్బందులు సృష్టించడానికి సరిహద్దుల్లో చొరబడ్డారని, వ్యాపారులు, స్థానిక ప్రజల కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లో 20 కిలో మీటర్ల మేర పాక్‌కు చెందిన సిగ్నల్ టవర్లు ఉన్నాయి. వాటి ద్వారా కశ్మీర్‌లోని తమ వాళ్లకు సందేశాలు పంపుతున్నాన్నారు. కశ్మీర్ నుంచి యాపిల్ ట్రక్కులు సజావుగా ఎలా ప్రయాణిస్తున్నాయని.. వాటిని అడ్డుకోలేరా అంటూ ఇక్కడున్న తమవారికి పాక్ సందేశాలు పంపుతుంది. అడ్డుకుంటారా లేదా గాజులు పంపమంటారా? అంటూ వారిని రెచ్చగొడుతున్నారు’ అని దోవల్ తెలిపారు. పాక్ ఎన్ని కుట్రలు చేసినా అడ్డుకోవడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆంక్షలను క్రమంగా సడలించామని, కశ్మీర్, జమ్మూ, లడఖ్‌లోని మొత్తం 199 పోలీస్ జిల్లాల పరిధిలో 10 చోట్ల మాత్రమే ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. మూడు ప్రాంతాల్లో ల్యాండ్‌లైన్ సేవలను పూర్తిగా పునరుద్ధరించామని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్ లోయలోనే అజిత్ దోవల్ ఉంటున్న విషయం తెలిసిందే. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు అందిస్తున్నారు. -
కోలుకుంటున్న కశ్మీరం..
శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దుతో అలజడి రేగిన జమ్మూ కశ్మీర్లో క్రమంగా తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంటోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గువాల మెరుగైన వ్యూహాలతో కొద్దిరోజుల్లోనే కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని భావిస్తున్నారు. కశ్మీర్‌లోయలో సోమవారం నుంచి పాఠశాలలు, విద్యాసంస్ధలు తెరుచుకోనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రం ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం ప్రకటించిన వెంటనే జమ్మూ కశ్మీర్లో పరిస్థితిని ఎదుర్కొనేందుకు తాము దీటైన వ్యూహాన్ని రూపొందించి అమలు చేశామని సీనియర్ ఐపీఎస్ అధికారి, జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్య పాల్ మాలిక్ సలహాదారు కే విజయ్ కుమార్ వెల్లడించారు. సమస్యలను సృష్టించే వారిని గుర్తించి నిర్భందంలోకి తీసుకోవడం తమకు ఎదురైన ప్రధాన సవాల్‌గా ఆయన చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా వేదికలపై దుష్ప్రచారం సాగించే వారిపై కఠినంగా వ్యవహరించామని అన్నారు. ఉగ్ర సంస్ధల్లో యువత నియామకాలను నిరోధించేందుకు వారి కోసం అవగాహనా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. -
ఈద్ సందర్భంగా కశ్మీర్లో ఆంక్షల సడలింపు
శ్రీనగర్ : ఈద్ పండుగ సందర్భంగా శుక్రవారం ప్రార్థనలకు, వ్యాపారానికి కశ్మీర్లో విధించిన ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐదు రోజులుగా జమ్మూ కశ్మీర్లో కర్ఫ్యూ ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రత్యేక ప్రసంగంలో మాట్లాడుతూ ఈద్ జరుపుకునే ప్రజలు ‘ఇబ్బందులు ఎదుర్కోరు’ అని, త్వరలోనే పరిస్థితి సాధారణమవుతుందని కశ్మీరీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ దిశగా ప్రభుత్వం కశ్మీర్లో సాధారణ పరిస్థితి ఏర్పడటానికి వేగంగా కృషి చేస్తోంది. శ్రీనగర్‌లోని చరిత్రాత్మక జామామసీదులో కూడా ప్రార్థనలకు అనుమతించారు. బ్యాంకు లావాదేవీలు పరిమిత స్థాయిలో జరుగుతున్నాయి. కూరగాయల దుకాణాలు, మెడికల్ షాపులను వ్యాపారులు తెరుస్తున్నారు. కశ్మీర్ లోయలో ఎవరినీ వేధించకుండా చూసుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ అధికారులను ఆదేశించిన తరువాత ఈ ప్రాంతంలో ఆంక్షలు సడలింపు మరింత వేగమైంది. పండుగ వస్తువులు కోసం దుకాణాల దగ్గరకి ప్రజలు రావాల్సిన అవసరం లేదని, ఇళ్ల దగ్గరకే వివిద వస్తువులు సరఫరా చేయబడతాయని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. అలాగే మార్కెట్లు కూడా ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపారు. కశ్మీర్ అంతటా సెక్షన్ 144 అమలులో ఉన్నా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే మినహాయింపులు ఇచ్చామని పేర్కొన్నారు. -
కశ్మీర్‌పై రేపు కేంద్ర కేబినెట్ సమావేశం!
-
కశ్మీర్‌పై షా కీలక భేటీ.. రేపు కేబినెట్ సమావేశం!
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జతీయ భద్రతా వ్యవహారాల కమిటీతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కార్యదర్శి రాజీవ్‌గౌబాతో ఆదివారం పార్లమెంట్లో అమిత్ షా సమావేశం అయ్యారు. వీరి భేటీలో కశ్మీర్‌పై అంశంపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కమిటీతో భేటీ అయిన షా.. రేపు కేంద్ర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనితో పాటు త్వరలోనే కశ్మీర్ పర్యటనకు అమిత్ షా కూడా వెళ్లనున్నారు. ప్రస్తుతం లోయలో ఉద్రిక్త వాతావరణం ఉన్న విషయం తెలిసిందే. ఏం జరుగుతోందో తెలియని పరిస్థితిలో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉగ్రముఠా దాడి హెచ్చరికలతో అక్కడి పర్యాటకులను, అమర్నాథ్ యాత్రికులను ప్రభుత్వం వెనక్కి పంపిస్తోంది. మరోవైపు ఇతర దేశాలు కూడా కశ్మీర్ వెళ్లే పర్యటకులకు ప్రయాణాన్నివాయిదా వేసుకోవాలని సూచిస్తున్నాయి. కాగా ఇప్పటికే లక్షకు పైగా సిబ్బందిని కశ్మీర్‌కు తరలించిన కేంద్రం.. అవసరమైతే మరికొన్ని బలగాలను కూడా తరలించేందుకు సిద్ధంగా ఉంది. దీనిపై ఆందోళన వ్యక్త చేస్తోన్న స్థానిక రాజకీయ పార్టీ ప్రతినిధులతో గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇప్పటికే సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితిపై ఎలాంటి ఆందోళన అవసరంలేదని, వదంతులను నమ్మవద్దని వారికి సూచించారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే మంత్రి మండలి సమావేశంలో తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. -
ఎన్ఎస్ఏగా మళ్లీ దోవల్
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ – నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్)గా అజిత్ దోవల్ (74)ను కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండోసారి నియమించింది. ఆయనకు కేంద్ర కేబినెట్ మంత్రి హోదాను కూడా తాజాగా కల్పించింది. దోవల్ 2014 మే 30న తొలిసారి ఎన్ఎస్ఏగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం గత నెల 30న ముగిసింది. దీంతో మరోసారి ఆయననే ఎన్ఎస్ఏగా నియమించామనీ, మే 31 నుంచి మొదలై వచ్చే ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారని తెలుపుతూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు సోమవారం బయటకు వచ్చాయి. 1968 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన దోవల్ 2005లో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్‌గా పదవీ విరమణ పొందారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టాక చేపట్టిన తొలి కీలక నియామకం ఇదే. నియామకాల కేబినెట్ కమిటీ దోవల్ నియామానికి ఆమోదం తెలిపినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఐదేళ్ల తర్వాత మోదీ పదవి నుంచి దిగిపోయినప్పుడే దోవల్ పదవీ కాలం కూడా ముగుస్తుందంది. వరుసగా రెండు పర్యాయాలు ఎన్ఎస్ఏగా నియమితులైన తొలి వ్యక్తి దోవలే. 2014 మే నెలలో ఆయన ఈ పదవి చేపట్టారు. అప్పటికి మంత్రి హోదా లేదు. అయితే మంత్రిస్థాయి వ్యక్తులతో తాము మాట్లాడతామని చైనా పట్టుబట్టడంతో అదే ఏడాది సెప్టెంబర్ నెలలో దోవల్‌కు కేంద్రం సహాయ మంత్రి హోదా కల్పించింది. ఉరీలో ఉగ్రవాద దాడి అనంతరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ (లకి‡్ష్యత దాడులు) చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారు. ఇటీవల పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాక్‌లోని బాలాకోట్‌పై వాయుసేన జరిపిన దాడిలోనూ ఈయన పాత్ర కీలకం. శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను అందుకున్న తొలి వ్యక్తి దోవలే. 1988లో మిజో తీవ్రవాద నాయకుడు లాల్డెంగాను చర్చలకు ఒప్పించడంతో ఆయనకు ఈ అవార్డు దక్కింది. మిజో తీవ్రవాద సంస్థ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు మయన్మార్, చైనాల్లోకి ఆయన అప్పట్లో రహస్యంగా వెళ్లారు. దేశం లోపలే కాకుండా, సరిహద్దుల ఆవల నుంచి కూడా దేశానికి పొంచి ఉన్న ప్రమాదాల గురించి దోవల్ ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఉంటారు. 33 ఏళ్లపాటు ఐబీలో పనిచేశారు. -
మోదీ సర్కార్ కీలక నిర్ణయం
-
అజిత్ దోవల్‌కు క్యాబినెట్ హోదా
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)గా అజిత్ దోవల్ నరేంద్ర మోదీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వంలోనూ కొనసాగుతారు. జాతీయ భద్రతా సలహాదారుగా దోవల్‌కు క్యాబినెట్ హోదా కట్టబెట్టారు. మరో ఐదేళ్ల వరకూ దోవల్‌ను ఈ పదవిలో నియమించినట్టు సోమవారం ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో సహాయ మంత్రి హోదాలో ఎన్ఎస్ఏగా సేవలందించిన అజిత్ దోవల్‌కు ప్రస్తుతం క్యాబినెట్ హోదా కల్పించారు. కాగా,జాతీయ భద్రతా సలహాదారు బాధ్యతలు చేపట్టకముందు దోవల్ ఐబీ చీఫ్‌గా వ్యవహరించారు. అజిత్ దోవల్ మార్గదర్శకత్వంలో యూరి ఉగ్రదాడి అనంతరం 2016లో పాకిస్తాన్‌పై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టగా, పుల్వామా దాడి అనంతరం 2018లోనూ బాలాకోట్‌లో భారత వైమానిక దళం సర్జికల్ స్ర్టైక్స్ నిర్వహించింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మోదీ సర్కార్ కీలక నిర్ణయం -
అజిత్ దోవల్‌పై ఆరోపణలు తోసిపుచ్చిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను 1999లో భారత్ విడుదల చేయడంలో ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్ర గురించి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసిన నేపథ్యంలో మసూద్ అజర్‌ను అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం విడుదల చేసిన వ్యవహారంలో అజిత్ దోవల్‌కు ఎలాంటి ప్రమేయం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 1999లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో సీనియర్ అధికారిగా ఉన్న అజిత్ దోవల్.. మసూద్ అజర్ విడుదలపై సంప్రదింపులు జరిపేందుకు కాందహార్‌కు వెళ్లిన నలుగురు సభ్యులతో కూడిన కమిటీలో ఒకరు. అజర్ విడుదలను దోవల్ అప్పట్లో వ్యతిరేకించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా కాందహార్‌లో విడుదల చేసిన ముగ్గురు ఉగ్రవాదుల వెంట అజిత్ దోవల్ ఉన్న ఫోటోలను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్ ఈ దాడిలో 40 మంది జవాన్ల ప్రాణాలు కోల్పోయాయని, వారిని హత్య చేసిన మసూద్ అజర్‌ను ఎవరు విడుదల చేశారో వారి కుటుంబాలకు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మసూద్ అజర్‌తో పాటు ముగ్గురు ఉగ్రవాదులను పాకిస్తాన్‌కు అప్పగించేందుకు కాందహార్‌లో అజిత్ దోవల్ నెరిపిన ఒప్పందం గురించి కూడా వారికి చెప్పాలని రాహుల్ నిలదీశారు. -
అస్త్రాలన్నీ ప్రయోగిస్తాం
న్యూఢిల్లీ: మరో ఉగ్రదాడి జరిగితే తిప్పికొట్టేందుకు అన్ని అస్త్రాలను సిద్ధంగా ఉంచుకుంటామని భారత్ ప్రకటించింది. పాకిస్తాన్ భూభాగంలో ఆవాసం పొందుతున్న ఉగ్రమూకలపై విరుచుకుపడే సామర్థ్యం ఉందని చాటుకోవడానికే బాలకోట్లో వైమానిక దాడులకు దిగామని స్పష్టతనిచ్చింది. జైషే మహ్మద్ శిక్షణా శిబిరంపై యుద్ధం ముగిసిందని, పాకిస్తాన్ భూభాగం నుంచి ఇంకా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకునేలా ఆ దేశంపై ఒత్తిడి పెంచడమే తమ తదుపరి లక్ష్యమని పేర్కొంది. ‘ఉగ్రవాదుల మౌలిక వసతులపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తాం. ఆ దేశ కొత్త నాయకత్వం మాటలకు పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం’ అని పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఫిబ్రవరి 27న భారత్‌పై వైమానిక దాడికి దిగినప్పుడు పాకిస్తాన్ ఎఫ్–16 యుద్ధ విమానాన్ని వినియోగించిన సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా అధికారులకు అందజేశారని భారత్ తెలిపింది. మంగళవారం దోవల్‌తో ఫోన్లో మాట్లాడిన అమెరికా భద్రతా సలహాదారు జాన్ బోల్టన్..జైషే చీఫ్ మసూద్ అజహర్‌ను నిషేధిత జాబితాలో చేర్చేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తామని తెలిపారు. అలాగే, యుద్ధ విమానాలను పాకిస్తాన్ దుర్వినియోగం చేయడంపై అమెరికా దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నామని భారత్ పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ అన్ని దేశాలను అభ్యర్థించిందని, కానీ సమస్య ఇండో–పాక్‌ది కాదని, ఉగ్రవాదానిది అని అంతర్జాతీయ సమాజానికి అర్థమయ్యేలా చెప్పామని తెలిపింది. మసూద్ అజహర్ పాకిస్తాన్లో నివసిస్తున్నందున అతనిపై నిషేధం విధిస్తే ఆ దేశానికి ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాకిస్తాన్ నిర్బంధంలోకి తీసుకున్న తరువాత అన్ని దేశాలు తమకే మద్దతుగా నిలిచాయని, అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో పాకిస్తాన్ అభినందన్‌ను వెంటనే విడుదల చేసిందని తెలిపింది. మరోవైపు, బాలాకోట్ వైమానిక దాడి నేపథ్యంలో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ తన బలగాలను పెంచుకుంటోంది. అంతర్జాతీయ సరిహద్దు వెంట రాడార్లను క్రియాశీలకం చేసి, ఆయుధాగారాలు ఎల్లవేళలా పనిచేయాలని ఆదేశాలిచ్చింది. భారత జలాంతర్గామిని అడ్డుకున్నాం: పాక్ నేవీ భారత జలాంతర్గామి తమ జలాల్లోకి రాకుండా నిరోధించామని పాకిస్తాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి మార్చి 4న తీసినట్లుగా భావిస్తున్న ఓ వీడియోను విడుదల చేసింది. పాకిస్తాన్ నేవీ దళం ప్రత్యేక నైపుణ్యాలు ప్రదర్శించి విజయవంతంగా భారత జలాంతర్గామి రాకను నిలువరించిందని పేర్కొంది. శాంతియుత విధానంలో భాగంగా భారత జలాంతర్గామిని తాము లక్ష్యంగా చేసుకోకుండా విడిచిపెట్టామని పాక్ నేవీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ ఘటన నుంచి భారత్ పాఠాలు నేర్చుకుని శాంతి దిశగా నడవాలని సూచించారు. అయితే పాకిస్తాన్ ఆరోపణల్ని భారత్ ఖండించింది. పాక్ నేవీ తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోమని స్పష్టం చేసింది. జాతీయ తీర ప్రాంత భద్రతకే బలగాల్ని మోహరించామని భారత నేవీ తెలిపింది. సుఖోయ్‌కి ‘స్పైస్’ సుఖోయ్–30ఎంకేఐ యుద్ధ విమానాలకు ఇజ్రాయెల్‌లో తయారైన స్సైస్–2000 రకం బాంబులను అమర్చేందుకు విమానాలకు అవసరమైన మార్పులు చేస్తున్నామని భారత వైమానిక దళ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మిరేజ్–2000 విమానాలకు స్పైస్–2000 బాంబులను అమర్చే వెసులుబాటు ఉంది. బాలాకోట్ దాడిలో ఈ విమానాలనే వినియోగించారు. స్పైస్–2000 బాంబులకు లేజర్ ద్వారా మార్గనిర్దేశనం చేయవచ్చు. ‘సముద్ర’ దాడుల ముప్పు ఉంది: నేవీ చీఫ్ సముద్ర మార్గం గుండా దేశంలోకి చొరబడి దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని నేవీ చీఫ్ సునీల్ లాంబా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పక్కా సమాచారం తమకు అందిందని తెలిపారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఇండో–పసిఫిక్ రీజినల్ డైలాగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..భారత్‌ను అస్థిరపరచాలనుకుంటున్న ఓ దేశ మద్దతుతోనే పుల్వామా ఉగ్రదాడి జరిగిందని పరోక్షంగా పాకిస్తాన్‌ను దుయ్యబట్టారు. ఉగ్రవాదం అంతర్జాతీయ స్థాయికి చేరడంతో ముప్పు మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఆసియాలో వేర్వేరు రూపాల్లో ఉగ్రదాడులు జరిగాయని, కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ ముప్పు నుంచి తప్పించుకున్నాయని పేర్కొన్నారు. శత్రు దేశ ప్రభుత్వ మద్దతుతో కూడిన ఉగ్రవాద ముప్పు భారత్‌కు అధికంగా ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ పాక్ వెళ్లి లెక్కించుకోవచ్చు: రాజ్‌నాథ్ ధుబ్రి(అస్సాం): పాక్‌లోని బాలాకోట్‌లో చేపట్టిన వైమానిక దాడిలో ఎందరు ముష్కరులు హతమయ్యారో రేపోమాపో తెలుస్తుందని హోం మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ఈ దాడిపై విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, అవసరమైతే కాంగ్రెస్ అక్కడికి వెళ్లి మృతదేహాల సంఖ్యను లెక్కించుకోవచ్చని చురకలంటించారు. వైమానిక దళం బాంబులు జారవిడవడానికి ముందు ఆ ప్రాంతంలో 300 సెల్ఫోన్లు పనిచేస్తున్నట్లు జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్టీఆర్వో) గుర్తించిందని తెలిపారు. ఆ సెల్ఫోన్లను చెట్లు వాడుతున్నాయా? అని ఎద్దేవా చేసిన రాజ్‌నాథ్ ఎన్టీఆర్వోను కూడా నమ్మరా? అని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు రాజకీయాలు చేయొచ్చు కానీ, దేశ నిర్మాణానికి కాదని హితవు పలికారు. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో అధునాత ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను రాజ్‌నాథ్ మంగళవారం ప్రారంభించారు. అది సైనిక చర్య కాదు చెన్నై: బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై జరిపిన వైమానిక దాడులపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా స్పందించారు. వైమానిక దాడులు సైనిక చర్య కాదని.. ఈ దాడిలో బాలాకోట్ సహా పరిసర ప్రాంతాల్లోని సాధారణ ప్రజలెవరికీ నష్టం కలగలేదని స్పష్టం చేశారు. దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్ కమాండర్లు మరణించారని మాత్రమే విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారని, ఫలానా సంఖ్య అని వెల్లడించలేదని ఆమె గుర్తు చేశారు. దీనినే ప్రభుత్వ ప్రకటనగా భావించాలని సూచించారు. కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్ గ్రామంలో మంగళవారం మిలిటెంట్లు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ధ్వంసమైన తమ ఇంటి వద్ద రోదిస్తున్న స్థానికులు. సుమారు 12 గంటలు కొనసాగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక పౌరుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. నియంత్రణ రేఖ వెంట మూడు చోట్ల పాకిస్తాన్ మోర్టార్లతో దాడికి పాల్పడటంతో ఒక సైనికుడు గాయపడ్డాడు. -
మెరుపు దాడుల వివరాలు ఏడుగురికే తెలుసు
పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన మెరుపు దాడుల నిర్ణయం గురించి కేవలం ఏడుగురికే తెలుసని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, ప్రధాని జాతీయ భద్రత సలహాదారు అజిత్‌కుమార్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు, పరిశోధన, విశ్లేషణ విభాగం (రా), ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతులకు మాత్రమే వాయుసేన జరిపే దాడులకు సంబంధించిన సమాచారం ఉంది. పాక్‌పై మెరుపు దాడులకు లక్ష్యాలను గుర్తించాలని ఈ నెల 14న పుల్వామా ఉగ్రదాడి జరిగిన వెంటనే ‘రా’ను ప్రభుత్వం ఆదేశించింది. ‘రా’ ఆరు లక్ష్యాల జాబితా సమర్పించింది. బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ శిక్షణ శిబిరం, జైషే స్థాపకుడు మసూద్ అజహర్ బావ యూసుఫ్ అజహర్ నడుపుతున్న ఉగ్ర శిబిరం ఈ జాబితాలో అగ్రభాగాన ఉన్నాయి. భారత్ దాడి చేయడానికి అనుకూలమైనదిగా బాలాకోట్ ఉగ్ర స్థావరం కనిపించింది. దీనిపై మెరుపుదాడి చేస్తే జైషే మహమ్మద్‌ను సూటిగా హెచ్చరించినట్టవుతుందని, పుల్వామాలో భారత భద్రతా దళాలకు జరిగిన నష్టానికి సమానంగా బాలాకోట్‌లో జైషేకు నష్టం కలగజేయవచ్చని ప్రభుత్వం భావించిందని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. అలాగే బాలాకోట్ శిబిరంపై దాడి వల్ల సాధారణ పౌరులెవరూ మరణించే అవకాశం లేకపోవడం వల్ల వెంటనే పాక్ ప్రతిదాడికి దిగే అవకాశంగానీ, ప్రపంచదేశాల నుంచి భారత్‌పై విమర్శలుగానీ ఉండవని నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో దాడులు చేసేందుకు ప్రధాని మోదీ ఈ నెల 18న తుది నిర్ణయం తీసుకున్నారు. -
కేంద్ర మంత్రి లంచం తీసుకున్నారు..
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐలో అంతఃకలహం కేసు సోమవారం మరో కీలక మలుపు తిరిగింది. కేంద్ర గనులు, బొగ్గు శాఖల సహాయ మంత్రి హరిభాయ్ ప్రతిభాయ్ చౌదరి, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, కేంద్ర ప్రధాన విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర, తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డిలపై సీబీఐలో డీఐజీగా ఉన్న మనీశ్ కుమార్ సిన్హా అనే ఐపీఎస్ అధికారి సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషి కేసులో నిందితుడిగా ఉన్న సానా సతీశ్‌ను కేసు నుంచి బయటపడేసేందుకు హరిభాయ్ చౌదరి జూన్ తొలిపక్షంలో కోట్లాది రూపాయల లంచం తీసుకున్నారనీ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు అనుకూలంగా విచారణను ప్రభావితం చేసేందుకు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ దర్యాప్తులో జోక్యం చేసుకున్నారనీ, కేంద్ర ప్రధాన విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరిని సతీశ్ సానా కలిశారని మనీశ్ సిన్హా ఆరోపించారు. రాకేశ్ అస్థానాపై వచ్చిన అవినీతి ఆరోపణలను సిన్హా విచారిస్తుండగా, ఇటీవల సీబీఐలో కీలక మార్పులు చేపట్టిన సమయంలో ఆయనను నాగ్‌పూర్‌కు బదిలీ చేశారు.ఆ బదిలీని కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లోనే ఆయన పై విషయాలన్నీ పొందుపరిచారు. అజిత్ దోవల్ అడ్డుకున్నారు.. రాకేశ్ అస్థానాపై విచారణలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కలుగజేసుకుని సోదాలు జరపకుండా, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోకుండా అడ్డుకున్నారని మనీశ్ సిన్హా పిటిషన్లో ఆరోపించారు. మొయిన్ ఖురేషి, సానా సతీశ్‌ల కేసులో ఇప్పటికే దుబాయ్ నుంచి వచ్చి అరెస్టయిన మధ్యవర్తి మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్ ప్రసాద్‌లతో అజిత్ దోవల్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. అస్థానాకు సన్నిహితుడు, సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్ కూడా ఈ కేసులో ఇప్పటికే అరెస్టవ్వడం తెలిసిందే. అస్థానాపై కేసును మరో సీబీఐ అధికారి ఏకే బస్సీ విచారించారు. ‘ఆధారాలుగా వాట్సాప్ చాట్లను సేకరించడం కోసం అస్థానా, దేవేంద్రల ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాలని సీబీఐ డెరెక్టర్ అలోక్ వర్మను బస్సీ కోరారు. కానీ అలోక్ వర్మ అనుమతి ఇవ్వలేదు. అజిత్ దోవల్ తనకు ఆ అనుమతి ఇవ్వడం లేదనీ, సెల్ఫోన్లు తీసుకోవద్దంటున్నారని అలోక్ వర్మ చెప్పారు’ అని సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. అస్థానా పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చిన విషయాన్ని దోవల్‌కు అలోక్ వర్మ చెప్పగా, అదే రోజు ఆ విషయాన్ని దోవల్ అస్థానాకు చేరవేశారని సిన్హా ఆరోపించారు. ఈ కేసు నుంచి బయటపడేయాల్సిందిగా దోవల్‌ను అస్థానా కోరారన్నారు. ‘అరెస్టు చేసి తీసుకొచ్చినప్పుడు తన తండ్రి రా (పరిశోధన, విశ్లేషణ విభాగం)లో గతంలో పనిచేశారనీ, ఎన్ఎస్ఏ దోవల్ ఆయనకు బాగా తెలుసని మనోజ్ ప్రసాద్ చెప్పాడు. ప్రస్తుతం రాలో పనిచేస్తున్న సామంత్ గోయల్ అనే ఉన్నతాధికారి కూడా తన సోదరుడికి బాగా తెలుసన్నాడు. సీబీఐ అధికారుల ఉద్యోగాలు పీకేయించి అంతం చేస్తానని కూడా మనోజ్ బెదిరించాడు. సోమేశ్, సామంత్‌లు ఇటీవలే ఒక వ్యక్తిగత విషయంలో దోవల్‌కు బాగా సాయం చేశారని కూడా చెప్పాడు’ అని పిటిషన్లో సిన్హా పేర్కొన్నారు. మనోజ్ ప్రసాద్‌తో సంబంధాలు నెరిపిన అధికారులపై విచారణకు కూడా దోవల్ అనుమతించలేదని ఆరోపించారు. అలాగే సామంత్‌తో ఓ వ్యక్తి ఫోన్లో మాట్లాడాడనీ, సీబీఐ నుంచి బయటపడేయాలని కోరగా ‘ప్రధాన మంత్రి కార్యాలయంతో మాట్లాడి అంతా సెట్ చేశాం. ఏం భయం లేదు’ అని హామీనిచ్చారనీ, ఆ రాత్రే సీబీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని సిన్హా ఆరోపించారు. కేసుల నుంచి రక్షణకు సురేశ్ హామీ.. సతీశ్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి రక్షణ కల్పిస్తామంటూ న్యాయశాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర హామీనిచ్చారని సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రేఖా రాణి సతీశ్‌కు, సురేశ్‌కు మధ్యవర్తిగా వ్యవహరించారు’ అని పిటిషన్లో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలనీ, తానెప్పుడూ లండన్ వెళ్లలేదనీ, రేఖా రాణి ఎవరో తనకు తెలీదని సురేశ్ చంద్ర చెప్పారు. ఖండించిన హరిభాయ్ చౌదరి: తనపై వచ్చిన ఆరోపణలను హరిభాయ్ చౌదరి ఖండించారు. సతీశ్ సానా ఎవరో తనకు అస్సలు తెలీదనీ, అతణ్ని ఎప్పుడూ కలవలేదని చెప్పారు. ఏ విచారణను ఎదుర్కొనేందుౖకైనా సిద్ధమనీ, లంచం తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పారు. మనీశ్ తాజా ఆరోపణల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చౌదరిని సతీశ్ కలిశాడు అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై సీవీసీ కేవీ చౌదరి విచారణ జరపడం తెలిసిందే. అయితే సీవీసీని ఆయన బంధువు గోరంట్ల రమేశ్ ద్వారా సానా సతీశ్ ఢిల్లీలో కలిశాడని కూడా సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. మెయిన్ ఖురేషీ కేసు విషయమై చౌదరితో సతీశ్ మాట్లాడాడనీ, అనంతరం అస్థానాకు చౌదరి ఫోన్ చేసి కేసు విషయమై వాకబు చేయగా.. సతీశ్‌కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలేవీ లేవని అస్థానా చెప్పారని సిన్హా తెలిపారు. ఈ విషయాలను విచారణలో సతీశే బయటపెట్టారన్నారు. ‘ఇందులో అక్రమమేమీ లేదు. కానీ విషయాన్ని పూర్తిగా తెలియజెప్పడం కోసం పిటిషన్లో ఈ విషయాలను కూడా పొందుపరిచా’ అని సిన్హా చెప్పారు. అలాగే హరిభాయ్ చౌదరికి లంచం విషయమై సతీశ్ తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడారన్నారు. సిన్హా ఆరోపణలపై సీవీసీని స్పందన కోరగా, కోర్టులో ఈ కేసు ఉన్నందున మీడియాతో దీనిపై మాట్లాడటం సరికాదంటూ వెళ్లిపోయారు. -
రిపబ్లిక్ డే ఉత్సవాలకు రావట్లేదు
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనాలంటూ భారత్ పంపిన ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. కొత్త ఏడాది ఆరంభంలో స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంతోపాటు తనకు వేరే పనులు ఉండటంతో రావడం కుదరదంటూ అమెరికా యంత్రాంగం భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌కు లేఖ పంపింది. భారతగణతంత్ర దినోత్సవంలో ప్రతిఏడాదీ ఒక దేశాధినేతను ముఖ్య అతిథిగా భారత్ ఆహ్వానిస్తుంది. అదే కోవలో వేడుకల్లో పాల్గొనాలంటూ భారత అమెరికా అధ్యక్షుడికి జూలైలో ఆహ్వానం పంపింది. అయితే, ట్రంప్ పాల్గొనేదీ లేనిదీ 2 ప్లస్ 2 చర్చల తర్వాత చెబుతామంటూ అమెరికా వాయిదా వేసింది. అనంతర పరిణామాలు ఆ దేశ వైఖరిలో మార్పునకు కారణమయ్యాయి. క్షిపణి రక్షణ వ్యవస్థ ‘ట్రయంఫ్’ కొనుగోలుకు భారత్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడం, ఇరాన్ నుంచి చమురును కొనరాదన్న అమెరికా ఆంక్షలను బేఖాతరు చేయడం ట్రంప్ అసంతృప్తికి కారణమయ్యాయని భావిస్తున్నారు. కాగా, గత అధ్యక్షుడు బరాక్ ఒబామా స్టేట్ ఆఫ్ ది యూనియ న్ ప్రసంగం, ఇతరత్రా కార్యక్రమాలు ఉన్నప్పటికీ 2015 గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. -
భారత్–పాక్ ఎన్ఎస్ఏల రహస్య భేటీ!
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ఉన్నతాధికారుల మధ్య థాయ్‌లాండ్‌లో రహస్య భేటీ జరిగిందన్న వార్త చర్చనీయాంశంగా మారింది. భారత్, పాక్‌ల జాతీయ భద్రతా సలహాదారుల(ఎన్ఎస్ఏ) మధ్య ఈ భేటీ సానుకూలంగా సాగిందని పాకిస్తాన్ జాతీయ భద్రతా విభాగం అధికారి ఒకరు వెల్లడించారు. ఆ అధికారి వెల్లడించిన వివరాల్ని ఉటంకిస్తూ ‘ద డాన్’ అనే పాక్ వార్తాపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. భారత్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, పాక్ ఎన్ఎస్ఏ నాజర్ ఖాన్లు డిసెంబర్ 27న రహస్యంగా కలుసుకున్నారని, భేటీలో దోవల్ సానుకూలంగా వ్యవహరించారని ఆ అధికారి చెప్పారు. భారత్–పాక్‌ల మధ్య ద్వైపాక్షిక స్థాయి చర్చలు ప్రారంభించేందుకు ఈ సమావేశం కొంత మేర సాయపడవచ్చని పాక్ అధికారి పేర్కొన్నట్లు డాన్ తన కథనంలో పేర్కొంది. భేటీ గురించి భారత్ వైపు నుంచి మాత్రం ఎలాంటి అధికారిక, అనధికారిక స్పందన వెలువడలేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకే భేటీ జరిగినట్లు భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కుల్‌భూషణ్ జాధవ్‌ను ఆయన కుటుంబ సభ్యులు కలిసిన రెండు రోజుల అనంతరం ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. జాధవ్ కుటుంబ సభ్యుల్ని పాకిస్తాన్ అవమానించడంతో.. భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు ఇటీవల మరింత దిగజారిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ జైల్లో ఉన్న జాధవ్‌ను చూసేందుకు వెళ్లిన ఆయన భార్య, తల్లితో బొట్టు, తాళి తీయించడంపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. అణు కేంద్రాల సమాచార మార్పిడి ఇరుదేశాల్లోని అణు కేంద్రాలు, వాటికి సంబంధించిన అంశాలపై భారత్, పాక్‌లు దౌత్య మార్గాల ద్వారా సమాచారాన్ని మార్పిడి చేసుకున్నాయి. మూడు దశాబ్దాల క్రితం నాటి ద్వైపాక్షిక ఒప్పందం మేరకు ఢిల్లీ, ఇస్లామాబాద్ రాయబార కార్యాలయాలు సోమవారం అణు కేంద్రాల జాబితాల్ని ఇచ్చి పుచ్చుకున్నాయి. భారత్, పాకిస్తాన్‌ల్లోని అణు కేంద్రాలపై పరస్పర దాడుల నిషేధ ఒప్పందం డిసెంబర్ 31, 1988న జరగగా.. జనవరి 27, 1991 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ప్రతీ ఏడాది జనవరి 1న అణు కేంద్రాలు, సంబంధిత అంశాల సమాచారాన్ని మార్చుకుంటారు. -
పట్టు సడలిస్తున్న చైనా!
బీజింగ్: డోకాలమ్ విషయంలో పట్టువిడుపుల దిశగా చైనా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. గురు, శుక్రవారాల్లో భారత్ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ చైనా రాయబారులతో సమావేశం కానున్నారు. గురువారం బ్రిక్స్ సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత భద్రతా విషయాలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పలువురు నాయకులను కలుస్తారు. అయితే, జిన్‌పింగ్‌తో జరిగే సమావేశానికి మిగతా బ్రిక్స్ దేశాల భద్రతా సలహాదారులు కూడా హాజరవుతారు. డోకాలమ్లో ఉద్రిక్తతలపై చైనా స్టేట్ కౌన్సిలర్, సరిహద్దు భద్రతా సలహాదారు యాంగ్ జీచీతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ధోవల్ పర్యటన సందర్భంగా చైనా మీడియా ప్రధానమంత్రి మోదీని పొగుడుతూ ఆశ్చర్యకరమైన కామెంట్లు చేసింది. మోదీ ఆర్థిక ప్రగతిశీలురని, ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు వర్ధిల్లాలని జిన్హువా న్యూస్ పేర్కొంది. తమ వస్తువులకు కీలకమార్కెట్గా ఉన్న భారత్‌తో గొడవపడేందుకు చైనా అధిష్టానం సుముఖంగా లేకపోవడంతోనే ఆ దేశ మీడియా రూటు మార్చినట్లు తెలుస్తోంది. -
అంతర్గత భద్రత నిర్వహణే సవాల్
* ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో అజిత్ దోవల్ * ఈ సమస్యను పోలీసులే పోరాడి గెలవగలరని వ్యాఖ్య * ఆత్మప్రబోధానుసారం నడుచుకోవాలని సూచన * గౌరవ వందనం స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా మారిన పరిస్థితుల కారణంగా యుద్ధరీతులు మారుతున్నాయని... ఈ తరుణంలో అంతర్గత భద్రత నిర్వహణే దేశానికి పెను సవాల్‌గా నిలవనుందని జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో జరిగిన 67 ఆర్ఆర్ (2014) బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొత్తం 156 మంది ట్రైనీల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 28 మంది మహిళలు సహా 141 మంది ఐపీఎస్ ట్రైనీలు, 15 మంది విదేశీ ట్రైనీలు ఉన్నారు. ఈ సందర్భంగా దోవల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అంతర్గత భద్రత పెనుసవాళ్లను విసురుతోందని, దీన్ని అదుపు చేయలేని దేశాలు చీలుతున్నాయన్నారు. పౌర సమాజంలో జరిగే ఇంతటి కీలక సమస్యను పోలీసులు మాత్రమే పోరాడి గెలవగలరని దోవల్ వ్యాఖ్యానించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని, ముఖ్యంగా సైబర్ క్రైం పెనుసవాళ్లు విసురుతోందన్నారు. అందుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని దోవల్ సూచించారు. ఈ సందర్భంగా గౌతమబుద్ధుడు పేర్కొన్న 'ఆత్మ దిపోభవ'ను దోవల్ ప్రస్తావించారు. ట్రైనీ ఐపీఎస్‌లకు సమర్థ శిక్షణ అందించిన అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణను దోవల్ అభినందించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌ను నిర్వహించడం గర్వకారణమన్నారు. అంతకు ముందు ఎన్పీఏ డెరైక్టర్ అరుణ బహుగుణ మాట్లాడుతూ... ట్రైనీ ఐపీఎస్‌లకు ఇచ్చిన శిక్షణ తీరును వివరించారు. ఉత్తమ ఆల్‌రౌండ్ ప్రొబేషనర్‌గా నిలిచిన గుజరాత్ ట్రైనీ ఐపీఎస్ పార్థ్రాజ్సిన్హ్ ఎన్. గోహిల్‌కు ప్రధాన మంత్రి బాటన్, హోంమంత్రి రివాల్వర్లను దోవల్ ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరచిన మరికొందరికి కూడా అవార్డులను అందించారు.