జమ్మూ కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రేపు కేంద్ర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనితో పాటు త్వరలోనే కశ్మీర్ పర్యటనకు అమిత్ షా కూడా వెళ్లనున్నారు. ప్రస్తుతం లోయలో ఉద్రిక్త వాతావరణం ఉన్న విషయం తెలిసిందే. ఏం జరుగుతోందో తెలియని పరిస్థితిలో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.