కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా ప్రకటించడంతో సభలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. విపక్ష సభ్యుల ఆందోళనతో పెద్దల సభ గందరగోళంగా మారింది. అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో జమ్మూకశ్మీర్‌కు చెందిన పీడీపీ సభ్యులు నజీర్ అహ్మాద్, ఎంఎం ఫయాజ్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆయన ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు.