‘అణు’ ఆధునీకరణకు అమెరికా కొత్త విధానం  | america new policy for nuclear modernization | Sakshi
Sakshi News home page

‘అణు’ ఆధునీకరణకు అమెరికా కొత్త విధానం 

Published Sun, Feb 4 2018 2:32 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

america new policy for nuclear modernization

వాషింగ్టన్‌: అణ్వస్త్రాలను ఆధునీకరించేందుకు, చిన్నస్థాయి అణ్వాయుధాల తయారీకి వీలుగా అమెరికా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 100 పేజీలతో న్యూక్లియర్‌ పోస్టర్‌ రివ్యూ(ఎన్‌పీఆర్‌)–2018 పేరిట తీసుకొచ్చిన ఈ విధానం ద్వారా అమెరికా, దాని మిత్రదేశాలపై జరిగే అణు దాడుల్ని నిరోధించవచ్చని ట్రంప్‌ యంత్రాంగం తెలిపింది. ఈ విధానంపై పెంటగాన్‌లో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘21వ శతాబ్దంలో అమెరికాకు ఎదురవుతున్న అనేక రకాల ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఈ విధానం చాలా అనువైనది.

అణ్వాయుధ కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్‌ విభాగాలతో పాటు సంప్రదాయ, అణ్వాయుధాలు ప్రయోగించే విమానాలు, భూ,సముద్ర, వాయు మార్గాల నుంచి దాడిచేసే సామర్థ్యం ఆధునీకరణకు ఈ విధానం దోహదం చేస్తుంది. అమెరికా అణ్వాస్త్రాలను వాడాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ విధానం అణువ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పీటీ), అణ్వాయుధాల నియంత్రణతో పాటు అణు పరీక్షల నిషేధంపై అమెరికా నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది అని వెల్లడించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement