అణు కేంద్రం వద్దు | we dont want nuclear plant | Sakshi
Sakshi News home page

అణు కేంద్రం వద్దు

Published Thu, Aug 11 2016 10:20 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

we dont want nuclear plant

కావలి : ప్రజల మారణకాండకు కారణమయ్యే అణు విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయొద్దని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి గొట్టిపాటి సునీత అన్నారు. పట్టణంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అణు విద్యుత్‌ప్లాంటు నిర్మించడానికి లోలోపల ప్రభుత్వాలు ప్రయత్నించడం చూస్తుంటే జిల్లా ప్రజలపై కక్ష సాధిస్తున్నట్లు ఉందన్నారు. దీనిని అడ్డుకోవడానికి నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు సిద్ధంగా కావాలని పిలుపునిచ్చారు. చాలాదేశాల్లో ప్రజలు పెద్దఎత్తున వ్యతిరేకించడంతో అణు విద్యుత్‌ కేంద్రాలను మూసివేశారన్నారు. మనదేశంలో బెంగాల్, కేరళ, గుజరాత్‌ రాష్ట్రాల్లో కేంద్రాలు పెట్టేందుకు ప్రయత్నిస్తే అక్కడి ప్రజలు వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వీవీ రమణయ్య, నవయువ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement