ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య భవిష్యత్‌లో ఉద్రిక్తతలు పెరిగిపోతే దాడులు చేయకూడదని అణు కేంద్రాలు, స్థావరాలపై సమాచారాన్ని ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినప్పటికీ మూడు దశాబ్దాలుగా ప్రతీ ఏడాది జరిగే అణు సమాచారాన్ని ఇరుదేశాలు ఒకరికొకకు అందించుకున్నట్టుగా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
1991లో ఇరు దేశాల మధ్య అమల్లోకి వచ్చిన అణు కేంద్రాలు, స్థావరాలపై దాడులు నిషిద్ధమనే ఒప్పందం మేరకు ఈ స్థావరాల వివరాలు అందించుకున్నారు. ఈ ఒప్పందంపై 1988, డిసెంబర్ 31న సంతకాలు జరగగా.. 1991, జనవరి 27న అమలులోకి వచ్చింది. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లో ఒకేసారి ఈ ప్రక్రియను చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. తొలిసారి 1992లో అణు సమచారాన్ని ఇచ్చిపుచ్చుకోగా.. 32 ఏళ్లుగా ప్రతిఏటా ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: దేవుడా ఏమిటీ పరీక్ష? పాకిస్థాన్‌లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనం..!
Comments
Please login to add a commentAdd a comment