MEA
-
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, వేదిక ఖరారు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (donald trump) ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు షురూ అయ్యాయి. ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధిత విభాగం ఆయా దేశాలకు ఆహ్వానం పంపుతోంది. తాజాగా భారత్ (india)కు సైతం ఆహ్వానం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొనాలంటూ భారత్‌కు ఆహ్వానం అందింది. భారత్ తరుఫున కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) హాజరు కానున్నారు.గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ‘ట్రంప్-వాన్స్ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వానం మేరకు, విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో భారత ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.’ అని కేంద్రం వెల్లడించింది. అమెరికా పర్యటనలో ట్రంప్‌తో పాటు, ఇతర నేతలు, రాజకీయేతర ప్రముఖుల్ని సైతం కలవనున్నారు. క్యాపిటల్ భవనం ముందు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ ప్రసంగిస్తారు. ప్రమాణ స్వీకారానికి జో బైడెన్ హాజరుకానున్నారు. కాగా, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్.. జోబైడెన్ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. ట్రంప్ ప్రారంభోత్సవ వేడుకకు పలువురు ప్రపంచ నేతలను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించినట్లు సమాచారం 👉చదవండి : నా ఉరిశిక్షను రద్దు చేయండి.. కోర్టుకు ట్విన్ టవర్స్ దాడి మాస్టర్‌మైండ్ -
మసూద్ అజార్‌పై పాక్ ద్వంద వైఖరి : భారత్
ఢిల్లీ : ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఆచూకీ దొరికింది. ఇటీవల పాకిస్థాన్‌లో బహ్వల్‌పుర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన పలు వీడియోలు వెలుగులోకి వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ మాట్లాడుతూ.. మసూద్ అజార్ పాకిస్తాన్లో ఉన్నట్లు వచ్చిన సమాచారం నిజమైతే ఉగ్రవాద కార్యకలాపాలను పరిష్కరించడంలో పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుందనేగా అర్ధం. అజార్ తమ దేశంలో లేడని పాక్ చెప్పుకుంటుంది. ఒకవేళ ఉంటే అజార్‌పై పాక్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని జైస్వాల్ వ్యాఖ్యానించారు. -
మోదీ టార్గెట్‌గా కెనడా కొత్త ప్లాన్!.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ: ఢిల్లీ: కెనడాపై భారత ప్రభుత్వం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్లాన్ చేసిన విషయం ప్రధాని మోదీకి ముందే తెలుసు అంటూ కెనడాకు చెందిన ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ వార్తా పత్రిక ఓ కథనం రాసుకొచ్చింది. ఈ కథనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అలాంటి అర్థం లేని కథనాలను కొట్టిపారేస్తున్నామని ఖండించింది.కెనడా కథనంపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. మేము సాధారణంగా మీడియాలో వచ్చే కథనాలపై స్పందించం. కానీ, కెనడా ప్రభుత్వ వర్గాలను ఉద్దేశిస్తూ వెలువడిన ఈ హాస్యాస్పద వార్తలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరాధారమైన ఇలాంటి వార్తలు హాస్యాస్పదం. ఇలాంటి వార్తలపై అధికారులు కచ్చితంగా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు, ప్రచారాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతిస్తాయి. ఇప్పటికైనా తప్పుడు నివేదికలు ప్రచురించకపోవడం మంచిది అంటూ కామెంట్స్ చేశారు.సదరు వార్తా పత్రిక.. ఈ హత్యకు కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ కూడా భాగమైనట్లు తమకు తెలిసిందని కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనం పేర్కొనడం గమనార్హం.ఇదిలా ఉండగా.. గత సంవత్సరం, నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడా వాదనలు నిరాధారమైనవి అని తెలిపింది. నిజ్జర్ హత్య జరిగినప్పటి నుంచి కెనడా.. భారత ప్రభుత్వం, మోదీపై తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. అంతకుముందు.. కెనడాకు చెందిన పలు నేతలు అమిత్ షాను కూడా టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. Our response to queries regarding a report in Canadian media: https://t.co/1IAURpKlfT pic.twitter.com/jIPlg05JM6— Randhir Jaiswal (@MEAIndia) November 20, 2024 -
Kenya: భారతీయులకు అలర్ట్
న్యూఢిల్లీ: భారతీయ విదేశాంగ మంత్రిత్వశాఖ కెన్యాలో ఉంటున్న భారతీయులకు అలర్ట్జారీ చేసింది. పన్నుల పెంపును నిరసిస్తూ అక్కడ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని మార్గదర్శకాలు విడుదల చేసింది.‘‘ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. కెన్యాలోని భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు. పరిస్థితి సద్దుమణిగే వరకు.. నిరసనలు కొనసాగుతున్న ప్రాంతాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. హింసాత్మక ఘటనలు చెలరేగుతున్న ప్రాంతాల వైపు వెళ్లొద్దు’’ అని కెన్యాలోని భారతీయ దౌత్య కార్యాలయం ఎక్స్ ద్వారా సూచించింది. మరింత సమాచారం కోసం స్థానిక వార్త ఛానెల్స్‌ను, అలాగే.. దౌత్య సంబంధిత వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని సూచించింది.ADVISORY FOR INDIAN NATIONALS IN KENYA In view of the prevailing tense situation, all Indians in Kenya are advised to exercise utmost caution, restrict non-essential movement and avoid the areas affected by the protests and violence till the situation clears up.— India in Kenya (@IndiainKenya) June 25, 2024ఇదిలా ఉంటే.. కెన్యాలో పన్నుల పెంపు చట్టానికి ఆ దేశ పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. సరిగ్గా అదే సమయంలోనే పార్లమెంట్ భవనం బయట నిరసనలు కొనసాగాయి. ‘‘కెన్యా ఇంకా వలస పాలనలోనే మగ్గిపోతోందని.. తమ దేశాన్ని తాము రక్షించుకుని తీరతామని’’ నినాదాలు చేస్తూ వేల మంది యువత ఒక్కసారిగా చట్టసభలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న భవనంలోని కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా, 20 మంది దాకా గాయపడ్డారని ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ఇచ్చింది. అయితే ఈ సంఖ్యే ఇంకా ఎక్కువే ఉంటుందని సమాచారం.ఆందోళనలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సోదరి, కెన్యా ఉద్యమకారిణి అవుమా ఒబామా కూడా ఉన్నారు. టియర్‌గ్యాస్ దాడిలో ఆమె సైతం అస్వస్థతకు లోనైనట్లు సమాచారం. ఏమిటీ బిల్లు..కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు మొదటి నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పన్ను సంస్కరణల పేరుతో బ్యాంకు ఖాతాల నగదు లావాదేవీలపై, డిజిటల్ మనీ చెల్లింపులపై, వంట నూనెలపై, ఉద్యోగుల వేతనాలపై, మోటారు వాహనాలపై పన్నులను పెంచుతూ కెన్యా ప్రభుత్వం మనీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఆ బిల్లును ఆమోదించవద్దని చట్టసభ్యుల్ని కోరుతూ నిరసనకారులు పార్లమెంటును చుట్టుముట్టారు. ఈ ఆందోళనలు ఇప్పుడు ఉధృత రూపం దాల్చి.. దేశమంతటా విస్తరించాయి. -
పన్నూ కుట్ర కేసు: ‘నిఖిల్ గుప్తా న్యాయ సాయం కోరలేదు’
ఢిల్లీ: ఖలిస్థానీ తీవ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తా ( 52)ను విచారణ కోసం చెక్ రిపబ్లిక్ దేశం అమెరికాకు అప్పగించింది. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పందించింది. భారత ప్రభుత్వం నిఖిల్ గుప్తా కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నామని విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. సోమవారం మాన్‌హట్టన్‌లోని కోర్టులో విచారణ అనంతరం నిఖిల్ గుప్తా న్యాయం పొందానికి భారత్ సాయం కొరినట్లు ఆయన కుటుంబానికి చెందిన ఓ సన్నిహితుడు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే దీనిపై స్పందించిన భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడారు.‘నిఖిల్ గుప్తా భారత కాన్సులర్‌ను సాయం కోరినట్లు మాకు ఎటువంటి అభ్యర్థన ఆయన నుంచి అందలేదు. కానీ, మేము ఆయన కుటుంబంతో టచ్‌లో ఉన్నాం. ఈ కేసు విషయంలో నిఖిల్ గుప్తా.. కుటుంబ సభ్యుల అభ్యర్థనను మేము పరిశీలిస్తున్నాం’ అని అన్నారు.ఇక.. పన్నూ ఒక సిక్కు వేర్పాటువాద ఉగ్రవాది అని భారత్ పేర్కొంది. అతని హత్యకు కుట్ర పన్నినట్లు అమెరికా చేస్తున్న ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. మరోవైపు.. నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ పోలీసులు అమెరికాకు అప్పగించిననప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. -
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
దుబాయ్ నుంచి జమైకా చేరుకున్న విమానాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెనక్కి పంపింది. జమైకా చేరుకున్న విమానంలో చాలామంది భారతీయులు ఉన్నట్లు తెలిసింది. విమానానికి సరైన డాక్యుమెంట్స్ లేని కారణంగా ఈ విధంగా చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.జమైకా చేరుకున్న చాలామంది ప్రయాణికులు ఐదు రోజుల పర్యటన కోసం అక్కడకు వచ్చినట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలిపారు. వీరిలో కొందరు అక్కడ ఉండటానికి ముందుగానే హోటల్స్ బుకింగ్స్ కూడా చేసుకున్నారు. వీరి వద్ద పర్యటనకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లతో అధికారులు సంతృప్తి చెందలేదు. దీంతో వారిని వెనక్కి పంపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.మే 7న మధ్యాహ్నం చార్టర్డ్ విమానం జమైకా నుంచి బయలుదేరింది. ప్రయాణీకులలో ఎక్కువ మంది భారతీయులు కాగా, ఇద్దరు ఉజ్బెకిస్తాన్, రష్యాకు చెందినవారు ఉన్నట్లు జమైకన్ అధికారులు పేర్కొన్నారు.#WATCH | "We are given to understand that a chartered flight from Dubai landed in Jamaica with several Indians onboard. They had prior travel and hotel bookings. However local authorities were not satisfied with their documents. They were sent back to Dubai on 7th May," says MEA… pic.twitter.com/sjUtcG4vFo— ANI (@ANI) May 9, 2024 -
మాల్దీవులలో సైనిక బలగాలపై భారత్ కీలక నిర్ణయం
మాల్దీవుల-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా భారత విదేశి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాల్దీవులలో ఉండే భారత భద్రత బలగాలపై గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవులలో ఉన్న మిలిటరీ బలగాల స్థానంలో నైపుణ్యంతో కూడిన సాంకేతిక సిబ్బందిని మాలేలో ప్రవేశపెడతామని వెల్లడించింది. ఇటీవల మాలే నుంచి భారత మిలిటరీ బలగాలను వెనక్కి తీసుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేసిన క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ‘ఇరు దేశాల మధ్య రెండో అత్యున్నత స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. మరోసారి కూడా ఇరుదేశాల అధికారులు సమావేశం కానున్నారు. అంతలోపు మాల్దీవులలో ఉన్న భారత్ మిలిటరీ బలగాల స్థానంలో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందిని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం.’ అని భారత విదేశాంగ కార్యదర్శి రణ్‌ధీర్ జైశ్వాల్ వెల్లడించారు. ఇక.. రెండోసారి జరిగిన అధికారుల సమావేశంలో మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ.. తమ దేశంలోని భారత్‌కు చెందిన మూడు వైమానిక స్థావరాల్లోని సైనిక బలగాల్లో.. ముందుగా ఒక స్థావరంలో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందిని మార్చి 10 వరకు భర్తీ చేయాలని కోరింది. మరో రెండు వైమానిక స్థావరాలోని మిలిటరీ బలగాల బదులుగా మాలేలో మే 10వరకు నైపుణ్యం గల సాంకేతిక సిబ్బందని పంపిచాలని విజ్ఞప్తి చేసింది. ఇక.. మల్దీవుల ప్రజలకు మానవతా సాయం, వైద్య సేవలను అందించేందుకు భారత్ వైమానిక స్థావరాల్లో నైపుణ్యం గల సాంకేతిక సిబ్బంది ద్వారా నిరంతరం కార్యకలాపాలు సాగించడానికి ఇరు దేశాలు అంగీకరించినట్ల సమాచారం. -
పాక్, భారత్ మధ్య అణు సమాచార మార్పిడి
ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య భవిష్యత్‌లో ఉద్రిక్తతలు పెరిగిపోతే దాడులు చేయకూడదని అణు కేంద్రాలు, స్థావరాలపై సమాచారాన్ని ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినప్పటికీ మూడు దశాబ్దాలుగా ప్రతీ ఏడాది జరిగే అణు సమాచారాన్ని ఇరుదేశాలు ఒకరికొకకు అందించుకున్నట్టుగా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 1991లో ఇరు దేశాల మధ్య అమల్లోకి వచ్చిన అణు కేంద్రాలు, స్థావరాలపై దాడులు నిషిద్ధమనే ఒప్పందం మేరకు ఈ స్థావరాల వివరాలు అందించుకున్నారు. ఈ ఒప్పందంపై 1988, డిసెంబర్ 31న సంతకాలు జరగగా.. 1991, జనవరి 27న అమలులోకి వచ్చింది. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లో ఒకేసారి ఈ ప్రక్రియను చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. తొలిసారి 1992లో అణు సమచారాన్ని ఇచ్చిపుచ్చుకోగా.. 32 ఏళ్లుగా ప్రతిఏటా ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: దేవుడా ఏమిటీ పరీక్ష? పాకిస్థాన్‌లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనం..! -
FATF: పాక్‌కు ఊరటపై భారత్ స్పందన
ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాల వ్యతిరేక గ్లోబల్ విభాగం ఫాట్ఫ్(FATF.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) తన ‘గ్రే లిస్ట్’ నుంచి పాకిస్థాన్‌ను తొలగించింది. ఫ్రాన్స్ పారిస్‌లో జరిగిన రెండు రోజుల సమావేశం అనంతరం.. ఫాఫ్ట్ అధ్యక్షుడు రాజ కుమార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే నాలుగేళ్ల తర్వాత పాక్‌కు దక్కిన ఊరట పరిణామంపై పొరుగు దేశం భారత్ స్పందించింది. మనీల్యాండరింగ్ అంశంలో ఆసియా ఫసిఫిక్ గ్రూప్‌నకు పాక్ సహకారం కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు భారత్ పేర్కొంది. అంతేకాదు.. ఫాట్ఫ్ పరిశీలన ఫలితంతో.. 26/11 ముంబై దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులతో పాటు మరికొందరిపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా.. పాక్ తన ఆధీనంలో ఉన్న భూభాగంలో ఉగ్రవాదం, ఉగ్రవాద ఆర్థిక కార్యాకలాపాలకు వ్యతిరేకరంగా నమ్మకమైన, నిరంతర చర్యలను కొనసాగించాలని.. ఈ విషయాన్ని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేయాలని ఆయన ప్రకటనలో కోరారు. ► ఇక.. జూన్ 2018 మరియు జూన్ 2021లో FATF గుర్తించిన వ్యూహాత్మక లోపాలకు సంబంధించి పాక్ ఇచ్చిన వివరణ పట్ల ఫాట్ఫ్ సంతృప్తి వ్యక్తం చేసింది. కార్యాచరణ ప్రణాళికల కట్టుబాట్లను నెరవేర్చడానికి సాంకేతిక లోపాలను కారణంగా చూపించింది పాక్. ఈ కారణంతో.. పాక్‌కు ఊరట ఇస్తూ ఫాట్ఫ్ నిర్ణయం తీసుకుంది. ► FATF బ్లాక్‌లిస్ట్‌లో ఒక దేశం చేరిందంటే.. ఆ దేశం మనీల్యాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్‌లో ప్రపంచ పోరాటానికి సహకారం అందించడం లేదనే అర్థమన్నమాట. ► ఒకవేళ ఫాట్ఫ్ బ్లాక్ లిస్ట్‌లో ఏదైనా దేశానికి స్థానం దక్కితే.. ఆ దేశానికి ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూరోపియన్ యూనియన్ నుంచి సహకారం అందడం తగ్గిపోతుంది. ► FATF(Financial Action Task Force)లో సభ్య దేశాలు 39. అమెరికా, యూకేతో పాటు భారత్ కూడా కూడా సభ్య దేశంగా ఉంది. ► పాకిస్తాన్‌ను ఫాట్ఫ్ గ్రే లిస్ట్ నుంచి తొలగించడంపై.. అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంలో మరణించిన రష్యా సైనికుల సంఖ్య అంతా? -
రష్యాకు వ్యతిరేకంగా ఓటు.. భారత్ వివరణ
మునుపెన్నడూ లేనివిధంగా ఐక్యరాజ్య సమితిలో భారత దేశం వ్యవహరించింది. తొలిసారిగా భద్రతా మండలిలో మిత్రపక్షం రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి.. రష్యాను విమర్శించకుండా, కీలక ఓటింగ్‌లకు భారత్ దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. అగ్రరాజ్యం అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఈ విషయంలో భారత్ తీరును తప్పుబడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం జరిగిన ప్రొసీజరల్ ఓటింగ్‌లో భారత్, రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. పదిహేను దేశాల సభ్యత్వం ఉన్న భద్రతా మండలిని ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వీడియో టెలి కాన్ఫరెన్స్ ద్వారా తొలుత ప్రసంగించాడు. ప్రసంగం కోసమే.. ఉక్రెయిన్ 31వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. జెలెన్స్కీని ప్రసంగించేందుకు భద్రతా మండలి ఆహ్వానించింది. అయితే భద్రతా మండలిలో ప్రసంగం ఎప్పుడూ నేరుగా ఉండాలే తప్ప.. ఇలా టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జరగకూడదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రష్యా ప్రతినిధి వసెల్లీ నెబెంజియా.. కావాలంటే జెలెన్స్కీని న్యూయార్క్‌ను పిలవండని లేదంటే ఉక్రెయిన్ ప్రతినిధిని ప్రసంగించేందుకు అనుమతించాలని కోరారు. అయినప్పటికీ జెలెన్స్కీ ప్రసంగానికే అమెరికా ప్రతినిధి పట్టుబట్టారు. దీంతో ప్రోసీజరల్ ఓటింగ్ నిర్వహించాలని రష్యా కోరింది. దీనికి భద్రతా మండలి అంగీకరించింది. అనంతరం జరిగిన ఓటింగ్‌లో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. రష్యా వ్యతిరేక ఓటు వేయగా.. చైనా తెలివిగా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. భారత్ తరపున.. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్.. ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రసంగానికి మద్దతుగా ఓటేశారు. దీంతో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటేసిందన్న విమర్శ తెరపైకి వచ్చింది. ఇక ఈ టెలీ వీడియో కాన్ఫరెన్స్‌లో ఊహించినట్లుగానే రష్యాను చీల్చి చెండాడాడు జెలెన్స్కీ. అది రష్యాకు వ్యతిరేకం కాదు వ్యతిరేక విమర్శల నేపథ్యంలో భారత్ స్పందించింది. జెలెన్స్కీ ప్రసంగానికి మద్దతుగా ఓటేసినంత మాత్రానా.. భారత్ స్టాండ్ మారినట్లు కాదని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు. స్వేచ్ఛ కోణంలోనే భారత్ ఆలోచించిందని, అంతేకానీ.. ఎవరికో వ్యతిరేకంగా ఓటేసినట్లు కాదని ఆయన అన్నారు. గతంలోనూ రెండుసార్లు జెలెన్స్కీ యూన్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది మూడోసారి. అందుకు మద్దతుగా భారత్ ఓటేసింది. అంతేతప్ప ఇది రష్యాకు వ్యతిరేకంగా ఓటేసినట్లు కాదు.. అసలు అలాంటి ప్రశ్నే లేదు అని ఆయన తెలిపారు. అలాగే అధికారులు సైతం.. భారత్ తీరు మారలేదని.. మారబోదని.. కేవలం జెలెన్స్కీ ప్రసంగ సమయంలో భారత్ ఓటు కీలకంగా మారినందునా అలాంటి నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఆయిల్ కాదు.. అది మా రక్తం ఇక ఉక్రెయిన్‌కు ఔషధాల పంపిణీ విషయంలో ఇప్పటికే భారత్, ఉక్రెయిన్ విదేశాంగ శాఖతో మాట్లాడింది. నైతికంగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చింది. అయితే ఉక్రెయిన్ మాత్రం భారత్ వ్యవహారంపై అసంతృప్తితోనే ఉంది. కారణం.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని సైతం పెంచుకుంటూ పోవడం. ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా తీవ్రంగా స్పందించారు. అది ముడి చమురు కాదని.. తమ రక్తం చెల్లిస్తున్న డిస్కౌంట్ అని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే భారత్ మాత్రం దేశం కోసం.. ప్రజల కోసం.. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోక తప్పడం లేదని సమర్థించుకుంది. డిసెంబర్‌తో ముగింపు ఇదిలా ఉంటే.. ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్ సందర్భంగా.. రుచిరా కాంబోజీ ప్రసంగిస్తూ.. దౌత్యం, చర్చల ద్వారా ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారం అవుతుందని భారత్ భావిస్తోందని, అలాగే.. మానవ దృక్ఫథంతో అందించాల్సిన సాయం భారత్ ఈ సంక్షోభం వల్ల ప్రభావితం అవుతున్న దేశాలకు అందిస్తుందని తెలిపారు. భారత్ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం కాదు. రెండేళ్ల కాలపరిమితితో సభ్యురాలిగా కొనసాగుతోంది. ఈ డిసెంబర్లో ఆ కాలపరిమితి ముగుస్తుంది. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌లా పోరాడడం మా వల్ల కాదు! -
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న పాతబస్తీ మహిళలు.. సాయం కోసం..
భవిష్యత్తుపై గంపెడాశలతో గల్ఫ్ బాట పడుతున్న వలస కార్మికులకు నీడలా కష్టాలు వెంటాడుతున్నాయి. అవగాహాన లేమి, ట్రావెల్ ఏంజెట్ల మోసాలు, పనికి పిలిపించుకున్న యజమానుల కక్కుర్తి.. వెరసి వలస కార్మికుల జీవితాలను పెనం మీద నుంచి పొయ్యిలో పడేస్తున్నాయి. తాజాగా పాతబస్తీకి చెందిన ముగ్గురు మహిలా కార్మికులు పరాయి దేశంలో చిక్కుకుని... యజమానులు చూపించే నరకం నుంచి బయట పడేయాలంటూ మొరపెట్టుకున్నారు. - సౌదీ అరేబియాలో బ్యూటీ పార్లర్లో ఉద్యోగం ఉందంటూ భర్త చెప్పిన మాటలు విని మెహరున్నీసా విమానం ఎక్కింది. నెలకు రూ.35,000ల వరకు వేతనం వస్తుందని చెప్పడంతో సౌదీకి రెడీ అయ్యింది. రియాద్‌కి చేరుకునే సమయానికి తీవ్ర అనారోగ్యం పాలైంది. అక్కడ సరైన ఆశ్రయం, తిండి లభించకపోవడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించింది. తనను వదిలేస్తే ఇండియాకి తిరిగి వెళ్తానంటూ చెబితే రూ.2 లక్షలు కడితే కానీ వదిలిపెట్టమంటూ యజమాని హుకుం జారీ చేశారు. దీంతో తనను కాపాడాలంటూ ఆమె వీడియో సందేశాన్ని పంపింది. - రిజ్వానా బేగం అనే మహిళ నెలకు రూ.25 వేల వేతనం మీద మెయిడ్‌గా పని చేసేందుకు గల్ఫ్‌కి వెళ్లింది. కనీసం మనిషిగా కూడా గుర్తించకుండా రోజుల తరబడి తిండి పెట్టకుండా వేధించడం, సరైన వసతి కల్పించకుండా నిత్యం నరకం చూపిస్తున్నారు యజమానులు. ఇదేంటని ట్రావెల్ ఏజెన్సీని ప్రశ్నిస్తే.. ఇండియాకు తిరిగి వెళ్లాంటే రూ.2.50 లక్షలు చెల్లించాలు చెప్పారు. దీంతో సాయం అర్థిస్తూ ఆమె ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాసింది. - హసీనా బేగం వలస కార్మికురాలిగా కువైట్‌కి చేరుకుంది. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత వెన్నుపూసలో సమస్య తలెత్తింది. దీంతో అక్కడ ఉండలేనంటూ తనను ఇండియాకు తీసుకురావాలంటూ కుటుంబ సభ్యుల ద్వారా మొరపెట్టుకుంది. విదేశాల్లో వలస కార్మికులు పడుతున్న కష్టాలపై కేంద్రం స్పందించింది. ఆయా దేశాలకు చెందిన ఎంబసీ అధికారుకుల సమస్యలను వివరించింది. వారికి ఇబ్బంది రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరింది. అవసరం అయితే వారిని ఇండియాకు రప్పించే ఏర్పాటు చేయాలంది. చదవండి: వలస కార్మికుల మెడపై దేశ బహిష్కరణ కత్తి -
హంగేరి, రుమేనియా బోర్డర్‌కి రండి - కేంద్రం కీలక ఆదేశాలు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపుకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. హంగేరి, రుమేనియా దేశాలకు దగ్గరగా ఉన్న వారు సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టుల వద్దరు రావాలని సూచించింది. ప్రయాణించే సమయంలో తమ వాహనాలపై ఇండియన్ ఫ్లాగ్‌ను పెట్టుకోవాలని కోరింది. భారతీయుల తరలింపు కోసం గురువారం రాత్రి నుంచి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ హంగరీ, స్లోవేవకియా, రుమోనియా దేశాలకు చెందిన ప్రభుత్వాలతో చర్చలు జరిపారు. భారతీయుల తరలింపుకు పూర్తి సహకారం అందిస్తామని ఆయా దేశాలు ప్రకటించాయి. దీంతో కేంద్రం వెంటనే కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ నుంచి వచ్చిన సూచనలు - విద్యార్థులు హంగేరి, రుమేనియా సరిహద్దులో ఉన్న చెక్‌పోస్ట్‌కి చేరుకోవాలి - ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని హుజూర్ద్, చెర్నీ వెస్ట్ ప్రాంతాలకు చేరుకోవాలి - స్థానిక విదేశాంగ శాఖ అధికారుల సమన్వయంతో విద్యార్థులు టీమ్‌లుగా బయల్దేరాలని సూచన - బోర్డర్ వచ్చే సమయంలో విద్యార్థులు ప్రయాణించే వాహనాలపై భారత జెండాను ఉంచుకోవాలి - బోర్డర్ వచ్చే ముందు పాస్‌పోర్ట్, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను వెంట తెచ్చుకోవాలి - బోర్డర్ దాటే సమయంలో ఇబ్బందులు రాకుండా సరిహద్దుల వద్ద ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్ల ఏర్పాటు. ఏమైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్‌లైన్ సెంటర్లు సహకరిస్తాయి. - రొమేనియా రాజధాని బుచరెస్ట్‌కి 2022 ఫిబ్రవరి 26న రెండు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలు పంపిస్తున్న కేంద్రం. - బుచరెస్ట్ నుంచి భారత పౌరులను ఎయిర్‌లిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు - పశ్చిమ ప్రాంతంలో ప్రస్తుతం విద్యార్థులు ఉన్న స్థావరాల దగ్గర ప్రత్యేక చెక్‌పోస్టుల ఏర్పాటు -
మోసం చేసిన ఏజెంట్! ఒమన్‌లో చిక్కుల్లో పడ్డ భారతీయ మహిళ !
ట్రావెల్ ఏజెంట్లు చేసిన మోసంతో ఓ మహిళ దేశం కాని దేశంలో ఇక్కట్ల పాలైంది. చేతిలో డబ్బులు లేక అక్కడ యజమాని పెట్టే కష్టాలు భరించలేక బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూసింది. చివరకు విదేశాంగ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఆ మహిళకు అండగా నిలిచారు. మారుమూల ప్రాంతానికి మస్కట్‌లో ఉద్యోగం ఉందంటూ మాయమాటలు చెప్పిన ఓ ట్రావెల్ ఏజెంట్ రంగారెడ్డి జిల్లాలోని షహీన్ నగర్‌కి చెందిన ఓ మహిళను విమానం ఎక్కించాడు. మస్కట్‌కి కాకుండా ఒమన్‌లోని మారుమూల ప్రాంతమైన సిర్కి ఆ మహిళను పంపాడు. అక్కడ ఉద్యోగం బదులు ఒకరి ఇంట్లో పని మనిషిగా కుదిర్చాడు. ఈ ఘటన 2021 నవంబరులో జరిగింది. నిత్యం హింసే రోజుకు 18 గంటల పాటు పని చేసినా యజమాని సంతృప్తి చెందకపోవడంతో నిత్యం ఆమెను హింస పెట్టేవాడు. దీంతో తనను ఇండియా పంపివ్వాలంటూ ఆ మహిళ వేడుకోగా.. తనకు రెండు లక్షలు నష్ట పరిహారం చెల్లిస్తే తప్ప విముక్తి లేదంటూ ఖరాఖండీగా ఆ యజమాని చెప్పాడు. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఫోన్ ద్వారా జరిగిన మోసం కుటుంబ సభ్యులకు తెలిపింది. నిఘా పెట్టాలి ఆ మహిళ కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న స్వచ్ఛంధ సంస్థల ద్వారా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. మస్కట్, ఒమన్లలో ఉన్న భారత అధికారులు.. సదరు యజమానితో మాట్లాడి సమస్యకి పరిష్కారం చూపారు. చివరకు 2022 జనవరి 18న ఆ మహిళ సురక్షితంగా ఇండియా చేరుకుంది. ట్రావెల్ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతీసారి సరైన సమయంలో సహాయం అందకపోవచ్చని.. కాబట్టి చిక్కుల్లో పడవద్దంటూ సూచించారు. ట్రావెల్ ఏజెంట్ల ముసుగులో హుమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: అబుదాబి ఎయిర్‌పోర్టు డ్రోన్ ఎటాక్.. యూఏఈ స్పందన -
బస్సు బాంబు దాడిపై పాకిస్తాన్ పచ్చి అబద్ధాలు
న్యూఢిల్లీ: ఖైబర్ పక్తూంఖ్వా ప్రావిన్స్‌లో గత నెలలో జరిగిన బస్సు బాంబు పేలుడు వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శుక్రవారం ఖండించారు. ఆసియా ప్రాంతంలో స్థానికంగా అస్థిరతకు, ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్తాన్ బాహ్య ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు పచ్చి అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫక్తూంఖ్వా ప్రావిన్స్‌లో అప్పర్ కోహిస్తాన్ జిల్లాలో జరిగిన బస్సు బాంబు పేలుడు ఘటనలో 9 మంది చైనా ఇంజనీర్లు సహా మొత్తం 13 మంది మరణించారు. ఈ దాడికి భారత నిఘా సంస్థ ‘రా’, అఫ్గానిస్తాన్‌కు చెందిన నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ(ఎన్డీఎస్) కారణమని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఆరోపించారు. ఈ ఆరోపణలను అరిందమ్ బాగ్చీ తిప్పికొట్టారు. భారత్‌ను అప్రతిష్ట పాలు చేయాలన్నదే పాక్ పన్నాగమని మండిపడ్డారు. ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో భారత్ ముందు వరుసలో నిలుస్తోందని గుర్తుచేశారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజంతో కలిసి పని చేస్తోందని అన్నారు. ఉగ్రవాద విష భుజంగాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందన్న సంగతి అందరికీ తెలుసని చెప్పారు. -
విదేశాల్లోని భారతీయుల కోసం..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందుకోసం విదేశాంగ శాఖ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. అదనపు కార్యదర్శి దమ్ము రవిని బాధ్యుడిగా నియమించింది. ఈ విభాగం విదేశాల్లోని భారతీయులు అడిగే ప్రశ్నలకు హెల్ప్‌లైన్ నంబర్లు, ఈమెయిల్స్, సామాజిక మాధ్యమాల ద్వారా సమాధానం ఇవ్వనుంది. కోవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని చేరవేయనుంది. (కరోనా టీకా; అమెరికా కుయుక్తులు!) ఇరాన్, ఇటలీల్లో భారతీయ విద్యార్థుల క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇక్కడి నుంచి పంపిన వైద్య బృందం అక్కడి భారతీయులకు కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహిస్తోందని వెల్లడించింది. ఇరాన్లో చిక్కుకున్న పలువురు భారతీయులు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సాయంతో స్వదేశానికి చేరుకున్నారని తెలిపింది. ఇటలీలోని మిలాన్‌కు చెందిన 218 మంది ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారని కూడా విదేశాంగ శాఖ వెల్లడించింది. (కరోనా ఎదుర్కోవాలంటే ఇలా చేయండి!) -
మోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు రూ 446.52 కోట్లు వెచ్చించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. చార్టర్డ్ విమానాలతో కలిపి ఇంత మొత్తం ఖర్చయిందని లోక్‌సభలో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ ఓ ప్రశ్నకు బదులిస్తూ తెలిపారు. ఇక 2015-16లో రూ 121.85 కోట్లు, 2016-17లో రూ 78.52 కోట్లు ప్రధాని విదేశీ పర్యటనలకు ప్రభుత్వం వెచ్చించిందని చెప్పారు. 2017-18లో ఈ వ్యయం రూ 99.90 కోట్లు కాగా, 2018-19లో రూ 100 కోట్లు, 2019-20లో రూ 46.43 కోట్లు ప్రధాని విదేశీ పర్యటనలకు ఖర్చయిందని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై భారీగా ఖర్చు పెడుతున్నారన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించడం గమనార్హం. చదవండి : హోలీ వేడుకలకు దూరంగా ఉందాం! -
అమెరికా అభ్యంతరాలు అర్థరహితం
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును ఖండిస్తూ అమెరికన్ కమిటీ యూఎస్సీఐఆర్ఎఫ్ ప్రకటనను భారత్ తోసిపుచ్చింది. అమెరికా వాదన అసమంజసం, అవాస్తవమని ఆక్షేపించింది. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందితే పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం లభిస్తుంది. కాగా ఈ బిల్లు తప్పుడు దిశగా పయనించే ప్రమాదకర మలుపుగా అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) అభివర్ణించింది. పార్లమెంట్ ఉభయసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందితే బిల్లును ప్రవేశపెట్టిన హోంమంత్రి అమిత్ షా సహా ఇతర నేతలు, అధికారులపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించాలని వ్యాఖ్యానించింది. కాగా అమెరికన్ కమిటీ అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చుతూ మతపరమైన మైనారిటీ శరణార్ధుల కష్టాలను తొలగించడం, వారి కనీస మానవ హక్కులను గౌరవించేందుకే ఈ బిల్లు ఉద్దేశమని స్పష్టం చేసింది. పౌరసత్వ బిల్లు, ఎన్ఆర్సీల ద్వారా ఏ ఒక్కరి పౌరసత్వానికి విఘాతం కలగదని తెలిపింది. పౌరసత్వ విధానాలను క్రమబద్ధీకరించే హక్కు అమెరికా సహా ప్రతి దేశానికీ ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. -
‘ఇమ్రాన్ స్పందన ఊహించిందే’
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్ర దాడితో పాకిస్తాన్‌కు సంబంధం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. ఇమ్రాన్ స్పందన ఊహించిందేనని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హేయమైన ఈ ఘటనను పాక్ ప్రధాని ఖండించలేదని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలపలేదని విస్మయం వ్యక్తం చేసింది. ఉగ్రవాద దాడుల్లో పాక్ ప్రమేయానికి సంబంధించి జైషే మహ్మద్ బాధ్యత వహించినా ఇమ్రాన్ ఖాన్ ఈ విషయం విస్మరించారని పేర్కొంది. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్, జైషే చీఫ్ మసూద్ అజర్‌లు పాకిస్తాన్ నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమేనని వ్యాఖ్యానించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్ తమపై ఆరోపణలు చేస్తోందన్న ఇమ్రాన్ వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ముంబై దాడులకు సంబంధించి పాకిస్తాన్‌కు భారత్ స్పష్టమైన ఆధారాలు అందచేసినా పదేళ్లకు పైగా ఈ కేసు ముందుకు కదలలేదని గుర్తుచేసింది. పటాన్‌కోట్ దాడుల్లోనూ దర్యాప్తు కొలిక్కిరాలేదని ప్రస్తావించింది. పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశంగా ఉందన్న ఇమ్రాన్ వ్యాఖ్యలనూ ఖండించింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ కీలక కేంద్రంగా ఉందని అంతర్జాతీయ సమాజం గుర్తెరిగిందని పేర్కొంది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే భారత్ ఉగ్ర దాడిపై తీవ్రంగా స్పందిస్తోందన్న ఇమ్రాన్ వ్యాఖ్యలనూ తోసిపుచ్చింది. -
తెలంగాణలో రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీలు 44
గల్ఫ్‌తో సహా 18 ఇసిఆర్ దేశాలకు భారతీయులను ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో 42 రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. తెలంగాణలో వివిధ కారణాలతో 22 ఏజెన్సీలు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా 1276 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి, 478 ఏజెన్సీలు మూతపడ్డాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇ-మైగ్రేట్ ఆన్ లైన్ పోర్టల్ లో తేదీ: 05.02.2019 ఉదయం వరకు పొందుపర్చిన సమాచారం ప్రకారం ఈ క్రింది ఏజెన్సీలు లైసెన్సు కలిగి 'యాక్టివ్' గా ఉన్నాయి. ఇవి కాకుండా దేశంలోని, రాష్ట్రంలోని పలు ఏజెన్సీల బ్రాంచీలు కూడా తెలంగాణలో పనిచేస్తున్నాయి. మరింత సమాచారం కోసం https://emigrate.gov.in/ext/raList.action వెబ్ సైటులో చూడవచ్చు. 1. షార్ప్ హూమన్ రీసోర్స్, సికిందరాబాద్ (మోహతేషాముద్దీన్ 040-66313922) 2. గ్లోబల్ ప్లేసెమెంట్స్, హైదరాబాద్ (ఎన్. శ్రీనివాస్ 040-23314054) 3. మాస్టర్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ (గుబ్బల సూర్యనారాయణ 040-27844266) 4. పి.ఎం.ఎస్ ట్రావెల్స్, హైదరాబాద్ (పోల్సాని శ్యామల 040-66368333) 5. రికీ ఇంటర్నేషనల్, హైదరాబాద్ (సంగీతా శీలేంద్ర సింగ్ 040-66759889) 6. అల్ మొహసిన్ టూర్స్, హైదరాబాద్ (అబ్దుల్ మజీద్ 040-66804545) 7. ప్లేసువెల్ హెచ్ఆర్డి కన్సల్టెంట్స్, హైదరాబాద్ (డి.శ్రీనివాస రెడ్డి 040-44360990) 8. అల్ ఆజమ్ టూర్స్, హైదరాబాద్ (మహ్మద్ సిరాజ్ ఖాన్ 040-66786111) 9. ట్రంప్స్ రిక్రూటింగ్ కన్సల్టెంట్స్, సికింద్రాబాద్ (ఎం.నాగరాజ్ 040-66888367) 10. మెహరాజ్ హూమన్ రీసోర్సెస్, హైదరాబాద్ (షకీల్ అహ్మద్ 040-23206000) 11. సౌమ్య ట్రావెల్ బ్యూరో, హైదరాబాద్ (నాగిరెడ్డి ప్రశాంతి 040-69000064) 12. హోప్ ప్లేసెమెంట్ రీసోర్సెస్, హైదరాబాద్ (అమీరుల్లా హుసేని 040-23398269) 13. గ్రీన్ వేస్ ట్రావెల్ సర్వీసెస్, హైదరాబాద్ (ఎస్ వై జాఫర్ హుసేన్ 040-66688857) 14. ఆర్బిట్ స్టాఫింగ్ ఇన్నోవిజన్, హైదరాబాద్ (ఈశ్వర్ సింగ్ యాదవ్ 040-23733329) 15. టాంకామ్, హైదరాబాద్ (కె వై నాయక్ 40-23342040) 16. ప్రొఫెషనల్ రిక్రూటర్స్, హైదరాబాద్ (మొహసిన్ పాషా ఖాద్రి 40-23303100) 17. అల్ మెహరాజ్ సర్వీసెస్, హైదరాబాద్ (జమీల్ అహ్మద్ 040-27429898) 18. శ్రీవాణి టూర్స్ అండ్ ట్రావెల్స్, హైదరాబాద్ (రోహిత్ గంట 040-60008379) 19. టి ఎస్ ఓవర్సేస్ కన్సల్టెంట్స్, హైదరాబాద్ (సయ్యద్ గౌస్ 040-29705234) 20. ఏషియన్ మ్యాన్ పవర్ సర్వీసెస్, హైదరాబాద్ (అబ్దుల్ సమీ 40-24472416) 21. డెక్కన్ వల్డ్ ట్రావెల్స్, హైదరాబాద్ (తజ్యీం కౌసర్ 040-23241207) 22. అల్ అహాయత్ టూర్స్, హైదరాబాద్ (సుమయ ఫాతిమా 040-24414577) 23. ఎక్సెల్ ప్లేస్మెంట్ సర్వీసెస్, హైదరాబాద్ (మహేందర్ సింగ్ 40-66661110) 24. ఓంక్యాప్, హైదరాబాద్ (పి. వెంకటరామి రెడ్డి 040-23300686) 25. జిటిఎం ఇంటర్నేషనల్, సికింద్రాబాద్ (చీటి కవిత 040-40071515) 26. ఎస్ ఎల్ ఇంటర్నేషనల్, మెటుపల్లి (గనవేని అంజయ్య 08725-236117) 27. బెస్ట్ మ్యాన్ పవర్ రిక్రూటింగ్, జగిత్యాల (పొట్టవత్తిని భరత్ 8724-297099) 28. మల్లికార్జున మ్యాన్ పవర్, జగిత్యాల (బుర్రవేణి తిరుపతి 08724-226566) 29. ఆర్ కె ట్రావెల్ బ్యూరో, మేటుపల్లి (దేవక్క రవి 08725-252041) 30. విహారీ మ్యాన్ పవర్, జగిత్యాల (బగ్గని మల్లేశ్వరి 08724-224411) 31. కార్తీక్ ఇంటర్నేషనల్, జగిత్యాల (తంగెళ్ల గంగారాం 08724-223004) 32. హన్సిక మ్యాన్ పవర్, జగిత్యాల (చిట్ల రమణ 08724-222277) 33. రమ్య మ్యాన్ పవర్, నిర్మల్ (జోషి వెంకట్రాజు 08734-245539) 34. శివ సాయి కన్సల్టెన్సీ, నిర్మల్ (నాగుల ప్రదీప్ గౌడ్ 08734-248819) 35. కె ఎస్ ట్రావెల్స్, భీంగల్ (నెల్లోల్ల రవీందర్ 08463-238525) 36. శ్రీ గీతాంజలి ట్రావెల్స్, నిజామాబాద్ (పి.గంగారెడ్డి 08462-225599) 37. కౌముది ఇంటర్నేషనల్, నిజామాబాద్ (ఛిల్మల కృష్ణ 08462-241212) 38. యు వి కన్సల్టెన్సీ, నిజామాబాద్ (దొడ్డి అర్చన 08462-255959) 39. సాత్విక ఇంటర్నేషనల్, నిజామాబాద్ (ఇస్సపల్లి సురేందర్ 08462-236355) 40. ఎ ఆర్ ఆర్ మ్యాన్ పవర్, వేములవాడ (షఫీ మహ్మద్ 08723-236777) 41. సుష్మా ఇంటర్నేషనల్, సిరిసిల్ల (కందుకూరి సాధిక 08723-231020) 42. ఆర్ జె మ్యాన్ పవర్, సిరిసిల్ల (ఎస్. దేవేందర్ 087232-33155) 43. డైమండ్ మ్యాన్ పవర్, హైదరాబాద్ (కోనాల బసివిరెడ్డి 040-29885244) 44. అహ్మద్ ఎంటర్ ప్రయిజెస్, హైదరాబాద్ (ఐజాజ్ అహ్మద్ 040-23563895) -మంద భీంరెడ్డి, అధ్యక్షులు, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం +91 98494 22622 -
పాక్ ప్రధాని లేఖపై స్పందించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, భారత ప్రధానమంత్రి నరేంద మోదీకి రాసిన లేఖపై భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరగాలన్న పాక్ ప్రధాని లేఖ నేపథ్యంలో సమావేశానికి సిద్ధమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ ప్రధాని నుంచి వచ్చిన శాంతి చర్చల ప్రతిపాదనను ధృవీకరించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరుకు నాటికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్జీఏ) న్యూయార్క్‌లో భారత, పాకిస్థాన్ విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారని తెలిపారు. ఇది కేవలం సమావేశం మాత్రమే.. చర్చల ప్రక్రియ మొదలుపెట్టినట్లు కాదని రావీష్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏం చర్చించాలనేది ఇంకా నిర్ణయించ లేదని చెప్పారు. అయితే పరస్పర అనుకూలమైన తేదీ , సమయములో ఈ సమావేశం జరుగుతుందని వివరించారు. గత నెలలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొదటి అధికారిక ప్రతిపాదన కావడం విశేషం. రెండు దేశాలు అంగీకరిస్తే యూఎన్ సమావేశంతో పాటు విదేశాంగ మంత్రుల సమావేశాన్ని కోరారు. ఈ నెలలో జరగనున్న ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వీరిద్దరూ భేటీ కావాలని ఆయన ఆకాంక్షించారు, తీవ్రవాదం, రెండు దేశాల మధ్య శాంతి తదితర అంశాలపై చర్చించేందుకు పాకిస్తాన్ సిద్ధమని పాక్ ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా భారత్, పాక్ మధ్య నిర్మాణాత్మక సంబంధాల కోసం భారత్ ఎదురు చూస్తోందని ప్రధాని మోదీ ఆగస్ట్ 20న లేఖ రాసిన సంగతి తెలిసిందే. భారత్ పొరుగు దేశంతో శాంతియుత సంబంధాలకు కట్టుబడి ఉందని మోదీ అందులో ప్రస్తావించారు. -
బ్రిటీష్ ఎంపీని వెనక్కి పంపిన భారత్
న్యూఢిల్లీ : బ్రిటీష్ పార్లమెంటేరియన్ లార్డ్ అలెగ్జాండర్ కార్లిలేను ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు భారత్‌లోకి అనుమతించలేదు. సరైన వీసా పత్రాలు లేని కారణంగా ఎయిర్‌పోర్టు అధికారులు అతన్ని తిరిగి వెనక్కి పంపించారు. ఈ ఘటనపై భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ.. కార్లిలే పర్యటన ఉద్దేశం, అతను వీసాలో సమర్పించిన వివరాలు వేర్వేరుగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతో అతన్ని తిరిగి ఇంగ్లండ్ పంపించామన్నారు. కార్లీలే ప్రస్తుతం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు న్యాయ సలహాదారునిగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ అవినీతి కేసులో బంగ్లా కోర్టు ఆమెకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె న్యాయ సలహాదారుడిగా ఉన్న కార్లిలేను బంగ్లాదేశ్‌లోని రానివ్వబోమని ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆయన జియాకు మద్దతుగా ఇండియాలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు గతంలోనే తెలిపారు. దీని ద్వారా అంతర్జాతీయ మీడియాకు జియా కేసులోని వాస్తవాలను వివరిస్తానని కూడా అన్నారు. కానీ వీసాలో పర్యటన ఉద్దేశాని వేరే విధంగా పేర్కొనడంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
యాత్రలో ఇబ్బందులుంటాయ్ జాగ్రత్త..!
సాక్షి, న్యూఢిల్లీ: మానస సరోవర్ యాత్రికులకు భారత విదేశాంగ శాఖ పలు కీలక సూచనలు చేసింది. భారీ వర్షాలు కురుస్తుండడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తవచ్చని తెలిపింది. యాత్రికులు, టూర్ ఆపరేటర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాల్సిన ముందు జాగ్రత్తలను గురువారం వెల్లడించింది. సిమికోట్ ప్రాంతంలో భక్తులకు మౌలిక సదుపాయాలు తగిన స్థాయిలో లేవని పేర్కొంది. భోజన వసతి, వైద్య సదుపాయాలు సరిగా లేనందున యాత్ర ప్రారంభానికి ముందే భక్తులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. అవసరమైన మందులను వెంట తెచ్చుకుంటే యాత్రలో తలెత్తే ఇబ్బందులను అధిగమించొచ్చని తెలిపింది. హిల్సా, సిమికోట్ ప్రాంతాలకు చేరుకోవాలంటే విమానాలే రవాణా సాధనాలనీ, వాతావరణం ప్రతికూలంగా ఉంటే యాత్రికులు అక్కడే ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది. కాగా, వాతావరణం ప్రతికూలంగా మారడంతో ఇప్పటికే యాత్రలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం మెరుగవడంతో భద్రతా దళాలు ముమ్మరంగా సహాయక చర్యలు ప్రారంభించాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో యాత్రికులను హెలికాప్టర్లు, విమానాలలో మరో మూడు రోజుల్లో వెనక్కి తీసుకొస్తామని భద్రతా వర్గాలు తెలిపాయి. -
‘సుష్మా స్వరాజ్‌కు నాలుగు తగిలించండి’
సాక్షి, న్యూఢిల్లీ: లక్నోలో పాస్‌పోర్టు సేవాకేంద్రం ఉదంతం తాలూకూ ట్వీట్లు, కామెంట్లు, విమర్శల పరంపర ఆగడం లేదు. పాస్‌పోర్టు కార్యాలయ అధికారిని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ బదిలీ చేయడంతో ఆమెపై రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. సంఘ్‌పరివార్ కార్యకర్తలు సైతం ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. తాజాగా.. సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌషల్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ ఢిల్లీ ఐఐటీకి చెందిన ముఖేష్ గుప్తా చేసిన ట్వీట్ చర్చానీయాంశమైంది. ‘ముస్లింలను బుజ్జగించేందుకు మీ ఆవిడ చాలా కష్టపడుతోంది. ఇంటికి వచ్చాక ఆమెకు నాలుగు తగిలించండి. మీరెన్ని ప్రయత్నాలు చేసినా ముస్లింలు బీజేపీకి ఓటు వేయరని చెప్పండి’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. నేపథ్యం: లక్నోలో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్టు ఆఫీసులో గత శనివారం చేదు అనుభవం ఎదురైంది. మహ్మద్ అనాస్ సిద్దిఖీ-తన్వీ సేథ్ దంపతుల పట్ల పాస్‌పోర్టు సేవా కేంద్రం అధికారి వికాస్ మిశ్రా మతపరమైన వ్యాఖ్యలు చేశాడని సదరు జంట సుష్మాస్వరాజ్‌కు ట్వీట్ చేయడంతో ఆమె స్పందించారు. హుటాహుటిన చర్యలు ప్రారంభించి వికాస్ మిశ్రాను గోరఖ్‌పూర్ బదిలీ చేశారు. సిద్దిఖీ-తన్వీ జంటకు వెంటనే పాస్‌పోర్టు జారీ చేయించారు. అయితే, సిద్దిఖీ-తన్వీ సమర్పించిన డిక్లరేషన్ వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని ఇంటలిజెన్స్ వర్గాల వెరిఫికేషన్‌లో బయటపడింది. pic.twitter.com/OIwVL02uoU — Governor Swaraj (@governorswaraj) June 30, 2018 -
90,000 మంది భారతీయులను కాపాడాం..
సాక్షి, న్యూఢిల్లీ : గత నాలుగేళ్లలో మోదీ సర్కార్ అంతర్జాతీయ వ్యవహారాల్లో అనూహ్య విజయాలు సాధించిందని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. పలు దేశాల్లో వివిధ ప్రాంతాల్లో నివసించే 90,000 మంది భారతీయులను ప్రభుత్వం కాపాడిందని చెప్పారు. వివిధ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటనల సందర్భంగా పలువురు భారతీయులను తీవ్ర శిక్షల నుంచి రక్షించారని గుర్తుచేశారు. విదేశాల్లో భారతీయులు ప్రస్తుతం ప్రశాంతంగా నివసిస్తున్నారన్నారు. ప్రపంచం నలుచెరుగులా భారత్ ప్రతిష్టను మోదీ సర్కార్ ఇనుమడింపచేసిందని చెప్పుకొచ్చారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్ మూడు ఎగుమతి నియంత్రిత వ్యవస్థల్లోకి అడుగుపెట్టిందని అన్నారు. నాలుగేళ్లలో మోదీ సర్కార్ సాధించిన విజయాలను సోదాహరణంగా వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో సంబంధాలను మెరగుపరుచుకునే క్రమంలో 192 దేశాలకు గాను 186 దేశాలకు ప్రభుత్వం చేరువైందని చెప్పారు. రష్యాతో భారత్ సంబంధాలు క్షీణించాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రదాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌లు ఇటీవల జరిపిన చర్చలు ఫలవంతమైన విషయం ప్రస్తావించారు. కాగా మానససరోవర్ సరస్సులో మునిగేందుకు చైనా అధికారులు తమను అనుమతించడం లేదని ఒకరు తనకు ట్వీట్ చేసిన విషయం వెల్లడించారు. సరస్సులో నిర్థిష్టంగా కేటాయించిన ప్రదేశంలోనే పవిత్ర స్నానం ఆచరించే అవకాశం ఉంటుందని, నదిలో ఎక్కడైనా స్నానం చేసే అవకాశం ఉండదని చెప్పారు. డోక్లాం ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతంలో యథాతథ స్థితి కొనసాగుతున్నదని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌తో చర్చలకు తాము వ్యతిరేకం కాదని అయితే ఉగ్రవాదం, చర్చలు ఒకే సమయంలో సాగబోవని తేల్చిచెప్పారు. -
పాస్‌పోర్టులు.. ఇక అందుకు పనికిరావు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్టుల జారీ విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై పాస్‌పోర్టు చివరి పేజీలో చిరునామా వివరాలను పొందుపరచకుండా ఖాళీగా వదిలేయాలని నిర్ణయించింది. అది అమలులోకి వస్తే గనుక పాస్‌పోర్టులు ఇక అడ్రస్ ప్రూఫ్‌లుగా పనికి రావు. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించకపోయినా.. సంబంధిత శాఖ అధికారుల నుంచి స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. త్వరలో ఈ నిర్ణయం అమలు చేయబోతున్నట్లు ఎంఏఈ అధికారి సురేంద్ర కుమార్(న్యాయ విభాగం) ఓ జాతీయ మీడియా ఛానెల్ తో చెప్పారు. వచ్చే దఫా నుంచి జారీ చేయబోయే పాస్‌పోర్టుల నుంచే ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పాతవి గడువు ముగిసేవరకు వినియోగించుకోవచ్చని.. రెన్యువల్ సమయంలో వాటికి ఈ మార్పులు వర్తిస్తాయని ఆయన వెల్లడించారు. ఇక పాస్‌పోర్టు విధానంలో మార్పులు రాబోతున్నాయన్న విషయాన్ని పుణే ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి జేడీ వైశంపయన్ కూడా దృవీకరించారు. ప్రస్తుతం పాస్‌పోర్టు మొదటి పేజీలో ఫోటోతో కూడిన వివరాలు.. చివరి పేజీలో చిరునామా వివరాలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక పాస్‌పోర్టు రంగును కూడా మార్చే ఉద్దేశంలో కూడా ఎంఈఏ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాధికారులు, అధికారిక పనుల మీద విదేశాలకు వెళ్లేవారికి తెలుపు రంగు, దౌత్యవేత్తలకు ఎరుపు, మిగతా వారికి నీలి రంగు పాస్‌పోర్టులు జారీ చేయనున్నారని సమాచారం.