ఢిల్లీ: ఖలిస్థానీ తీవ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తా ( 52)ను విచారణ కోసం చెక్ రిపబ్లిక్ దేశం అమెరికాకు అప్పగించింది. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పందించింది. భారత ప్రభుత్వం నిఖిల్ గుప్తా కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నామని విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.
సోమవారం మాన్‌హట్టన్‌లోని కోర్టులో విచారణ అనంతరం నిఖిల్ గుప్తా న్యాయం పొందానికి భారత్ సాయం కొరినట్లు ఆయన కుటుంబానికి చెందిన ఓ సన్నిహితుడు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే దీనిపై స్పందించిన భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడారు.
‘నిఖిల్ గుప్తా భారత కాన్సులర్‌ను సాయం కోరినట్లు మాకు ఎటువంటి అభ్యర్థన ఆయన నుంచి అందలేదు. కానీ, మేము ఆయన కుటుంబంతో టచ్‌లో ఉన్నాం. ఈ కేసు విషయంలో నిఖిల్ గుప్తా.. కుటుంబ సభ్యుల అభ్యర్థనను మేము పరిశీలిస్తున్నాం’ అని అన్నారు.
ఇక.. పన్నూ ఒక సిక్కు వేర్పాటువాద ఉగ్రవాది అని భారత్ పేర్కొంది. అతని హత్యకు కుట్ర పన్నినట్లు అమెరికా చేస్తున్న ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. మరోవైపు.. నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ పోలీసులు అమెరికాకు అప్పగించిననప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment