వాషింగ్టన్: ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కేసులో నిందితుడిగా అభియోగం ఎదుర్కొంటున్న భారత సంతతి నిఖిల్ గుప్తాను పోలీసులు న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్బంగా వాదనల అనంతరం కేసు విచారణను కోర్టు జూన్ 28వ తేదీకి వాయిదా వేసింది.
అయితే, ఖలిస్థానీ తీవ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూను చంపేందుకు ఒక కిరాయి హంతకుడిని వియోగించాడనే ఆరోపణను ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తా (52)ను చెక్ రిపబ్లిక్ గత వారంలో అమెరికాకు అప్పగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్రూక్లిన్ లోని ఫెడరల్ మెట్రోపాలిటన్ నిర్బంధ కేంద్రంలో ఉన్న గుప్తాను సోమవారం న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు.
ఈ క్రమంలో వాదనల సందర్భంగా గుప్తా ముందస్తుగా 15,000 డాలర్లు ఇచ్చి ఒక కిరాయి హంతకుడిని వియోగించాడని అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. తనపై అన్యాయంగా అభియోగాన్ని మోపారని గుప్తా చెప్పుకొచ్చారు. మరోవైపు.. భారత ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారి ఆదేశం మేరకు పన్నూ హత్యకు గుప్తా కుట్రపన్నాడని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది. ఇరు వాదనలు విన్న అనంతరం, ఈ కేసు విచారణను జూన్ 28వ తేదీకి వాయిదా వేసింది. 28వ తేదీ వరకు గుప్తా పోలీసుల కస్టడీలోనే ఉండాలని ఆదేశించింది. గుప్తాకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
ఇదిలా ఉండగా.. చెక్ రిపబ్లిక్ పోలీసులు నిఖిల్ గుప్తాను యునైటెడ్ స్టేట్స్‌కు అప్పగించిన వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Czech police has released visuals of Nikhil Gupta being extradited to the US. The visuals from 14th June shows NYPD-New York City Police Department official also present. pic.twitter.com/1ll4SePJIQ
— Sidhant Sibal (@sidhant) June 17, 2024
Comments
Please login to add a commentAdd a comment