New York Federal court
-
పన్నూ హత్య కేసు: న్యూయార్క్ కోర్టులో నిఖిల్ గుప్తా వాదన ఇదే..
వాషింగ్టన్: ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కేసులో నిందితుడిగా అభియోగం ఎదుర్కొంటున్న భారత సంతతి నిఖిల్ గుప్తాను పోలీసులు న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్బంగా వాదనల అనంతరం కేసు విచారణను కోర్టు జూన్ 28వ తేదీకి వాయిదా వేసింది.అయితే, ఖలిస్థానీ తీవ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూను చంపేందుకు ఒక కిరాయి హంతకుడిని వియోగించాడనే ఆరోపణను ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తా (52)ను చెక్ రిపబ్లిక్ గత వారంలో అమెరికాకు అప్పగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్రూక్లిన్ లోని ఫెడరల్ మెట్రోపాలిటన్ నిర్బంధ కేంద్రంలో ఉన్న గుప్తాను సోమవారం న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు.ఈ క్రమంలో వాదనల సందర్భంగా గుప్తా ముందస్తుగా 15,000 డాలర్లు ఇచ్చి ఒక కిరాయి హంతకుడిని వియోగించాడని అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. తనపై అన్యాయంగా అభియోగాన్ని మోపారని గుప్తా చెప్పుకొచ్చారు. మరోవైపు.. భారత ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారి ఆదేశం మేరకు పన్నూ హత్యకు గుప్తా కుట్రపన్నాడని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది. ఇరు వాదనలు విన్న అనంతరం, ఈ కేసు విచారణను జూన్ 28వ తేదీకి వాయిదా వేసింది. 28వ తేదీ వరకు గుప్తా పోలీసుల కస్టడీలోనే ఉండాలని ఆదేశించింది. గుప్తాకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.ఇదిలా ఉండగా.. చెక్ రిపబ్లిక్ పోలీసులు నిఖిల్ గుప్తాను యునైటెడ్ స్టేట్స్కు అప్పగించిన వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Czech police has released visuals of Nikhil Gupta being extradited to the US. The visuals from 14th June shows NYPD-New York City Police Department official also present. pic.twitter.com/1ll4SePJIQ— Sidhant Sibal (@sidhant) June 17, 2024 -
Hush money case: డొనాల్డ్ ట్రంప్ దోషి
న్యూయార్క్/వాషింగ్టన్: ఒక కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(77) అప్రతిష్ట మూటగట్టుకున్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు 1.30 లక్షల డాలర్లు అక్రమంగా చెల్లించి, బిజినెస్ రికార్డులు తారుమారు చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనను దోషిగా తేలి్చంది. ట్రంప్‌పై నమోదైన 34 తీవ్ర అభియోగాలన్నీ రుజువయ్యాయని వెల్లడించింది. జూలై 11న న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వడంతోపాటు శిక్ష ఖరారు చేయనుంది. ఈ వ్యవహారంలో ట్రంప్‌కు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. శిక్ష పడినప్పటికీ.. మరో ఆరు నెలల్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కాబోవని అంచనా వేస్తున్నారు. న్యూయార్క్ కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. కోర్టు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ న్యాయమూర్తి అవినీతికి పాల్పడి తప్పుడు తీర్పు ఇచ్చారని విమర్శించారు. ఇక్కడేం జరిగిందో ప్రజలకు తెలుసని చెప్పారు. అసలైన తీర్పును నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజలు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. తాను నిజాయతీపరుడినని, ఎలాంటి తప్పూ చేయలేదని పేర్కొన్నారు. అమెరికా కోసం, అమెరికా రాజ్యాంగం కోసం పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు. ఈ పోరాటంలో అంతిమ విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. హష్ మనీ కేసులో దోషిగా తేలిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ నిబ్బరంగానే కనిపించారు. కోర్టులో నిశ్శబ్దంగా ఉండిపోయారు. తుది తీర్పు వచ్చేదాకా బెయిల్‌పై బయటే ఉంటారు. జూలై 11న శిక్ష ఖరారు కానుంది. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైంది. జూలై 15న మిల్వాకీలో రిపబ్లికన్ జాతీయ సదస్సులో ట్రంప్ అభ్యరి్థత్వాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(81)తో డొనాల్డ్ ట్రంప్ తలపడతారు. కోర్టు తీర్పుపై బైడెన్–కమలా హారిస్ ప్రచార విభాగం ప్రతినిధి, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైఖేల్ టైలర్ హర్షం వ్యక్తం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని న్యూయార్క్ కోర్టు తేల్చిచెప్పిందని అన్నారు ఏమిటీ కేసు? శృంగార తార స్టార్మీ డేనియల్‌తో ట్రంప్ సన్నిహితంగా గడిపినట్లు వార్తలొచ్చాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరు విప్పితే తనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ట్రంప్ అడ్డదారి ఎంచుకున్నారు. ఆమె నోరు మూయించేందుకు 1.30 లక్షల డాలర్లు తన లాయర్ ద్వారా చెల్లించారు. ఎన్నికల ప్రచారం కోసం పారీ్టకి అందిన విరాళాల నుంచే ఈ సొమ్మును స్టార్మీ డేనియల్‌కు చేరవేశారు. అక్రమ చెల్లింపులను కప్పిపుచ్చడానికి బిజినెస్ రికార్డులను తారుమారు చేశారు. ఈ వ్యవహారమంతా బహిర్గతం కావడంతో అమెరికాలో గగ్గోలు మొదలైంది. ట్రంప్‌పై విచారణ అధికారులు 34 అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో న్యూయార్క్ కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. 22 మంది సాక్షులను న్యాయస్థానం ప్రశ్నించింది. ఎన్నికల చట్టాన్ని ట్రంప్ ఉల్లంఘించారని, పోర్న్ స్టార్‌కు చెల్లించిన సొమ్మును కోర్టు ఖర్చుల కింద చూపించారని ప్రాసిక్యూటర్లు వాదించారు. ట్రంప్ తనతో ఏకాంతంగా గడిపిన మాట నిజమేనని స్టార్మీ డేనియల్ కోర్టుకు ఇచి్చన వాంగ్మూలంలో అంగీకరించారు. గురువారం 12 మంది న్యాయమూర్తుల ప్యానెల్ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయొచ్చా? న్యూయార్క్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ట్రంప్ భవితవ్యంపై పడింది. కోర్టు ఆయనకు జైలు శిక్ష గానీ, జరిమానా గానీ విధిస్తే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? చట్టపరంగా అది సాధ్యమేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకొనే నిబంధన ఏదీ లేదని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాకు చెందిన న్యాయశాస్త్ర ప్రొఫెసర్ రిచర్డ్ ఎల్.హసెన్ చెప్పారు. చట్టపరంగా ఇప్పుడు ట్రంప్ అభ్యరి్థత్వానికి వచ్చే ముప్పేమీ లేదని అన్నారు.కారాగారమా? గృహ నిర్బంధమా? ⇒ ట్రంప్‌పై 34 అభియోగాలు రుజువయ్యాయి. ఒక్కో అభియోగానికి గరిష్టంగా నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష, 5 వేల డాలర్ల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. ⇒ జైలు శిక్ష కాకుండా జరిమానా, ప్రొబేషన్/సామాజిక సేవను శిక్షగా విధించవచ్చు. ప్రొబేషన్ శిక్ష విధిస్తే ప్రొబేషన్ అధికారి ఎదుట ట్రంప్ తరచుగా హాజరు కావాల్సి ఉంటుంది. కండీషనల్ డిశ్చార్జి అనే శిక్ష వేస్తే ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాల్సిన అవసరం ఉండదు. ⇒ గృహ నిర్బంధం విధించే అవకాశం సైతం లేకపోలేదు. అప్పుడు ట్రంప్ తన ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆయన చుట్టూ ఎల్రక్టానిక్ నిఘా పెడతారు. హౌజ్ అరెస్టు అయితే ట్రంప్ నాలుగు గోడల మధ్య నుంచే ఎన్నికల ప్రచారం చేయాలి. ⇒ ట్రంప్ జైలుకెళ్తారా? అంటే కచ్చితంగా చెప్పలేమని న్యాయ నిపుణులు అంటున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కోర్టు ఆయనకు జైలుశిక్ష విధించకుండా కేవలం జరిమానాతో సరిపెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రాజకీయ దురుద్దేశాలతోనే నాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఇది హష్మనీ వ్యవహారం కాదు. ఇది బహిర్గతం చేయకూడదనే ఒక ఒప్పందం మాత్రమే. పూర్తిగా చట్టబద్ధంగానే జరిగింది. ఇలాంటివి అమెరికాలో సర్వసాధారణమే. ప్రత్యర్థులు నన్ను ఇలా ఇరికించారంటే వారు ఇక ఎవరినైనా ఇరికించగలరు. నాపై తప్పుడు కేసు పెట్టి, ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారు. వారి ఆటలు సాగవు – డొనాల్డ్ ట్రంప్ -
పరువునష్టం కేసులో డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన కోర్టు
వాషింగ్టన్: అమెరికా మ్యాగజైన్ కాలమిస్ట్ ఇ. జీన్ కరోల్పై డోనాల్డ్ ట్రంప్ వేసిన పరువు నష్టం దావాను న్యూయార్క్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం చాలా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. వరుసగా తనపై నమోదవుతున్న కేసులతో పాటు అంతకుముందు నమోదైన కేసుల్లో తీర్పులు ఆయనకు ఊపిరి ఆడనివ్వడంలేదు. ఒకపక్క తాను వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేయాలని చూస్తుండగా మరోపక్క కేసుల వలయం ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో అమెరికా మ్యాగజైన్ కాలమిస్ట్ ఇ. జీన్ కరోల్పై లైంగిక వేధింపుల కేసులో డోనాల్డ్ ట్రంప్ ను నేరస్తుడిగా పరిగణిస్తూ ఆమెకు నష్టపరిహారంగా 5 మిలియన్ డాలర్ల చెల్లించాల్సిందిగా సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆ కేసులో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరానికి మాత్రమే శిక్ష విధించినట్లు అత్యాచార నేరానికి కాదని కోర్టు మే నెలలో ఇచ్చిన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. అయినా కూడా జీన్ కరోల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తాను లైంగిక వేధింపుల తోపాటు అత్యాచారం కూడా జరిపినట్లు ప్రతి సందర్భంలోనూ మీడియాతో చెబుతుండడంతో డోనాల్డ్ ట్రంప్ ఆమెపై పరువునష్టం దావా వేశారు. సోమవారం ఈ కేసుపై జిల్లా కోర్టు న్యాయమూర్తి లూయిస్ కప్లాన్ స్పందిస్తూ కరోల్‌ను డోనాల్డ్ ట్రంప్ అత్యాచారం చేశారన్నది వాస్తవమేనని అందుకే కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్లో దారుణం.. తండ్రిని చంపినట్టే కుమారుడిని కూడా.. -
40 కోట్లు చెల్లించాలంటూ దిగ్గజం మైక్ టైసన్‌పై సివిల్ దావా
బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ తనకు 5 మిలియన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 40 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలంటూ ఒక మహిళ కోర్టులో సివిల్ దావా వేయడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. 1992లో లిమోసిన్ నగరంలో ఒక పబ్‌లో 18 ఏళ్ల మోడల్‌పై బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అత్యాచారం చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అత్యాచారం కేసులో దోషిగా తేలిన టైసన్ మూడు సంవత్సరాలు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. తాజాగా ఈ కేసులో పౌర నష్టపరిహారాన్ని కోరుతూ న్యూయార్క్ రాష్ట్ర చట్టం ప్రకారం సదరు మోడల్.. కోర్టులో సివిల్ దావా సమర్పించారు. 1992లో నైట్‌క్లబ్‌లో మైక్ టైసన్‌ను కలిసినప్పుడు ఆయన తనపై అత్యాచారం చేశాడని ఆమె తన సివిల్ దావాలో పేర్కొంది. టైసన్ తనపై అత్యాచారం చేయడం వల్ల తాను శారీరకంగా, మానసికంగా బాధపడుతూనే ఉన్నానని బాధిత మోడల్ చెప్పారు. తనకు 5మిలియన్ డాలర్ల( సుమారు రూ. 40 కోట్లు) నష్టపరిహారం ఇవ్వాలని కోరింది. ఇక 1966వ సంవత్సరంలో బ్రూక్లిన్ నగరంలో జన్మించిన టైసన్ హెవీ వెయిట్ ఛాంపియన్‌గా అవతరించాడు. బాక్సింగ్ రింగ్‌లో కింగ్‌గా నిలిచిన మైక్ టైసన్ పంచ్‌ల దాటికి ప్రత్యర్థులు వణికిపోయేవారు. చదవండి: మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! బుమ్రా విషయంలో రోహిత్ శర్మ కీలక అప్డేట్ -
ట్రంప్ కు కోర్టులో ఎదురుదెబ్బ
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కు తొలిసారిగా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులను తమ దేశంలోకి అడుగుపెట్టనీయకుండా డొనాల్డ్ ట్రంప్ వెలువరించిన ఉత్తర్వుపై న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు అత్యవసర స్టే విధించింది. డొనాల్డ్ నిర్ణయంతో న్యూయార్క్ లోని జేఎఫ్ కే విమానాశ్రయంలో 12 మంది శరణార్థులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరిని మాత్రమే అమెరికా అధికారులు విడిచిపెట్టారు. మిగతావారి తరపున కోరుతూ అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్(ఏసీఎల్ యూ) కోర్టును ఆశ్రయించింది. నిర్బంధించిన వారిని 14 నుంచి 24 గంటల్లో విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. తాము విధించిన స్టే దేశమంతా వర్తిస్తుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఉన్న శరణార్థులను వెనక్కు పంపొద్దని.. అంటే దీనర్థం వారిని అమెరికాలోకి అనుమతించమని కాదని... వీరిని గ్రే ఏరియా(శరణార్థి శిబిరం)లో ఉంచాలని సూచించింది. శరణార్థులను అనుమతించకూడదని డొనాల్డ్ ట్రంప్ అధికారిక ఉత్తర్వు జారీచేయడంతో అమెరికా విమానాశ్రయాల్లో ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులను, శరణార్థులను అడ్డుకున్నారు. అన్నిపత్రాలు ఉన్నప్పటికీ వారిని అనుమతించలేదు. శనివారం ఒక్కరోజే 100 నుంచి 200 మందిని అమెరికా అధికారులు అడ్డుకున్నారని ఏసీఎల్ యూ సంస్థ అంచనా వేసింది. -
అమెరికాలో భారత్ ఫండ్ మేనేజర్‌కు 9 ఏళ్ల జైలు
న్యూయార్క్: ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో భారతీయ సంతతికి చెందిన ఫోర్ట్పోలియో(ఫండ్) మేనేజర్ మాథ్యూ మార్టోమా(40 ఏళ్లు)కు 9 ఏళ్ల జైలు శిక్ష పడింది. 27.6 కోట్ల డాలర్లకుపైగా మొత్తంతో ముడిపడిఉన్న ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ స్కీమ్‌లలో మార్టోమాను కీలక సూత్రధారిగా పేర్కొంటూ న్యూయార్క్ ఫెడరల్ కోర్టు డిస్ట్రిక్ట్ జడ్జి పాల్ గార్డఫే తీర్పు ఇచ్చారు. ఈ కేసులో మథ్యూ అక్రమంగా ఆర్జించిన 98 లక్షల డాలర్ల బోనస్ మొత్తాన్ని జప్తు చేయాలని ఆదేశించారు. ఫ్లోరిడాలో ఆయనకున్న ఇంటితోపాటు, పలు బ్యాంక్ అకౌంట్లను కూడా స్వాధీనం చేసుకోవాలని తేల్చిచెప్పారు. అల్జీమర్స్ ఔషధానికి సంబంధించిన పరీక్షల(ట్రయల్స్) రహస్య సమాచారాన్ని ఇద్దరు డాక్టర్ల నుంచి అక్రమంగా సేకరించి.. ఎస్ఏసీ క్యాపిటల్ 27.5 కోట్ల డాలర్ల మేర నష్టపోకుండా చూడటంతోపాటు లాభాలను కూడా ఆర్జించిపెట్టాడన్నది కేసు ప్రధానాంశం. కాగా, ఈ కేసులో ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా మార్టోమాకు వ్యతిరేకంగా వాదించింది కూడా భారతీయ సంతతికి చెందిన ప్రీత్ భరారాయే. గతంలోనూ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుల్లో గోల్డ్‌మన్ శాక్స్ మాజీ డెరైక్టర్ రజన్ గుప్తా, హెడ్జ్ ఫండ్ దిగ్గజం రాజ్ రజరత్నంలకు శిక్ష పడేలా చేసింది భరారా కావడం గమనార్హం. తాజా కేసుతో ఇప్పటిదాకా వాల్‌స్ట్రీట్‌లో 78 ఇన్సైడర్ నేరాల్లో శిక్షలు వేయించిన చెక్కుచెదరని రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు కూడా.