వాషింగ్టన్: అమెరికా మ్యాగజైన్ కాలమిస్ట్ ఇ. జీన్ కరోల్‌పై డోనాల్డ్ ట్రంప్ వేసిన పరువు నష్టం దావాను న్యూయార్క్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం చాలా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. వరుసగా తనపై నమోదవుతున్న కేసులతో పాటు అంతకుముందు నమోదైన కేసుల్లో తీర్పులు ఆయనకు ఊపిరి ఆడనివ్వడంలేదు. ఒకపక్క తాను వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేయాలని చూస్తుండగా మరోపక్క కేసుల వలయం ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
గతంలో అమెరికా మ్యాగజైన్ కాలమిస్ట్ ఇ. జీన్ కరోల్‌పై లైంగిక వేధింపుల కేసులో డోనాల్డ్ ట్రంప్ ను నేరస్తుడిగా పరిగణిస్తూ ఆమెకు నష్టపరిహారంగా 5 మిలియన్ డాలర్ల చెల్లించాల్సిందిగా సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆ కేసులో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరానికి మాత్రమే శిక్ష విధించినట్లు అత్యాచార నేరానికి కాదని కోర్టు మే నెలలో ఇచ్చిన తీర్పులో స్పష్టంగా పేర్కొంది.
అయినా కూడా జీన్ కరోల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తాను లైంగిక వేధింపుల తోపాటు అత్యాచారం కూడా జరిపినట్లు ప్రతి సందర్భంలోనూ మీడియాతో చెబుతుండడంతో డోనాల్డ్ ట్రంప్ ఆమెపై పరువునష్టం దావా వేశారు. సోమవారం ఈ కేసుపై జిల్లా కోర్టు న్యాయమూర్తి లూయిస్ కప్లాన్ స్పందిస్తూ కరోల్‌ను డోనాల్డ్ ట్రంప్ అత్యాచారం చేశారన్నది వాస్తవమేనని అందుకే కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: పాకిస్తాన్‌లో దారుణం.. తండ్రిని చంపినట్టే కుమారుడిని కూడా..
Comments
Please login to add a commentAdd a comment