న్యూయార్క్: సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ హత్య కుట్రలో ప్రమేయం ఉందని నిఖిల్ గుప్తా(52) అనే భారతీయుడిని గతేడాది చెక్ రిపబ్లిక్ అదుపులోకి తీసుకుంది. అమెరికా అనుమతితోనే చెక్ రిపబ్లిక్ నిఖిల్ గుప్పాను అరెస్ట్ చేసింది. తాజాగా సోమవారం ఆయన్ను అమెరికాలోని ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టి విచారించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నిఖిల్ గుప్తా బ్రూక్లిన్‌లోని ఫెడరల్ మెట్రోపాలిటన్ నిర్భంద కేంద్రంలో ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. చెక్ రిపబ్లిక్ నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించటంతో ఆయన్ను బ్రూక్లిన్ నిర్భంద కేంద్రంలో ఖైదీగా ఉంచినట్లు వెల్లడించింది. అయితే కోర్టు విచారణ కోసం ఆయన్ను అమెరికా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడికి చేరుకున్న ఒక్కరోజు వ్యవధిలోనే నిఖిల్‌ను కోర్టులో ప్రవేశపెట్టి విచారించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 30, 2023న చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో నిఖిల్ గుప్తా అరెస్ట్ అరెస్ట్ చేసింది. అయితే ఆయన్ను తమకు అప్పగించాలని అమెరికా కోరిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పటికే ఫెడరల్ కోర్టు నిఖిల్ గుప్తా.. పన్నూను హత్య చేసేందుకు ఓ వ్యక్తికి 15వేల అమెరికా డాలర్లు ఇచ్చినట్లు అభియోగాలు మోపింది. పన్నూ హత్య కుట్రలో ఓ భారతీయ ప్రభుత్వ అధికారి ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు చేసింది. అయితే ఆయన పేరు మాత్రం వెల్లడించలేదు.
నిఖిల్ గుప్తాను అమెరికా అప్పగించటం.. యూఎస్ జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సుల్లివన్ వార్షిక ఐసీఈటీ చర్చల్లో ఢిల్లీ పర్యటనకు ముందు చోటు చేసుకుంది. అయితే ఈ విషయంపై భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌తో జేక్ సుల్లివన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పన్నూ హత్య కుట్ర వెనక భారతీయుల ప్రమేయం ఉందన్న అమెరికా ఆరోపణలను ఇండియా తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.
మరోవైపు.. నిఖిల్ గుప్తాపై అన్యాయంగా అభియోగాలు మోపారని అతని తరఫు న్యాయవాది రోహిణి మూసా అన్నారు. ‘‘ నిఖిల్ గుప్తాపై అన్యాయంగా అభియోగాలు మోపారు. పన్నూ హత్యకు కుట్ర చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు’’ అని రోహిణి భారత సుప్రీం కోర్టుకు లేఖ రాసింది. నిఖిల్ గుప్తా అభియోగాల కేసు విషయంలో చెక్ రిపబ్లిక్ నియమించిన న్యాయవాదిపై అమెరికా ప్రభావం ఉందని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment