federal court
-
పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
న్యూయార్క్: సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ హత్య కుట్రలో ప్రమేయం ఉందని నిఖిల్ గుప్తా(52) అనే భారతీయుడిని గతేడాది చెక్ రిపబ్లిక్ అదుపులోకి తీసుకుంది. అమెరికా అనుమతితోనే చెక్ రిపబ్లిక్ నిఖిల్ గుప్పాను అరెస్ట్ చేసింది. తాజాగా సోమవారం ఆయన్ను అమెరికాలోని ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టి విచారించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిఖిల్ గుప్తా బ్రూక్లిన్‌లోని ఫెడరల్ మెట్రోపాలిటన్ నిర్భంద కేంద్రంలో ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. చెక్ రిపబ్లిక్ నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించటంతో ఆయన్ను బ్రూక్లిన్ నిర్భంద కేంద్రంలో ఖైదీగా ఉంచినట్లు వెల్లడించింది. అయితే కోర్టు విచారణ కోసం ఆయన్ను అమెరికా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడికి చేరుకున్న ఒక్కరోజు వ్యవధిలోనే నిఖిల్‌ను కోర్టులో ప్రవేశపెట్టి విచారించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 30, 2023న చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లో నిఖిల్ గుప్తా అరెస్ట్ అరెస్ట్ చేసింది. అయితే ఆయన్ను తమకు అప్పగించాలని అమెరికా కోరిన విషయం తెలిసిందే.ఇక ఇప్పటికే ఫెడరల్ కోర్టు నిఖిల్ గుప్తా.. పన్నూను హత్య చేసేందుకు ఓ వ్యక్తికి 15వేల అమెరికా డాలర్లు ఇచ్చినట్లు అభియోగాలు మోపింది. పన్నూ హత్య కుట్రలో ఓ భారతీయ ప్రభుత్వ అధికారి ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు చేసింది. అయితే ఆయన పేరు మాత్రం వెల్లడించలేదు. నిఖిల్ గుప్తాను అమెరికా అప్పగించటం.. యూఎస్ జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సుల్లివన్ వార్షిక ఐసీఈటీ చర్చల్లో ఢిల్లీ పర్యటనకు ముందు చోటు చేసుకుంది. అయితే ఈ విషయంపై భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌తో జేక్ సుల్లివన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పన్నూ హత్య కుట్ర వెనక భారతీయుల ప్రమేయం ఉందన్న అమెరికా ఆరోపణలను ఇండియా తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నిఖిల్ గుప్తాపై అన్యాయంగా అభియోగాలు మోపారని అతని తరఫు న్యాయవాది రోహిణి మూసా అన్నారు. ‘‘ నిఖిల్ గుప్తాపై అన్యాయంగా అభియోగాలు మోపారు. పన్నూ హత్యకు కుట్ర చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు’’ అని రోహిణి భారత సుప్రీం కోర్టుకు లేఖ రాసింది. నిఖిల్ గుప్తా అభియోగాల కేసు విషయంలో చెక్ రిపబ్లిక్ నియమించిన న్యాయవాదిపై అమెరికా ప్రభావం ఉందని ఆమె అన్నారు. -
Apple: ప్రపంచ నం1 కంపెనీ వాచ్‌లపై నిషేధం!
ప్రపంచ నంబర్‌వన్ కంపెనీ ఉత్పత్తులపై నిషేధం విధించాలని ఆరోపణలు వస్తున్నాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను గుర్తించే లైట్ టెక్నాలజీతో పనిచేసే యాపిల్ వాచ్ మోడళ్ల దిగుమతులను నిషేధించాలంటూ మాసిమో కార్ప్ ఆరోపించింది. ఇందుకు సంబంధించి అమెరికా ట్రేడ్ కమిషన్‌కు సిఫారసు చేసినట్లు మెడికల్ టెక్నాలజీ కంపెనీ మాసిమో కార్ప్ గురువారం తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన మాసిమో తెలిపిన వివరాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్(యుఎస్ఐటీసీ) 60 రోజులపాటు ‘పరిమిత మినహాయింపు ఉత్తర్వు’లు జారీ చేసినట్లు సమాచారం. యుఎస్ఐటీసీ ఇచ్చే తీర్పు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ కూడా చట్టానికి అతీతం కాదనే సందేశాన్ని పంపుతుందని మాసిమో చీఫ్ ఎగ్జిక్యూటివ్ జో కియాని ఒక ప్రకటనలో తెలిపారు. తమ పేటెంట్ టెక్నాలజీని యాపిల్ చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తున్నారు. ‘లైట్-బేస్డ్ ఆక్సిమెట్రీ ఫంక్షనాలిటీ’ కోసం ఆపిల్ వాచ్ మాసిమో పేటెంట్ టెక్నాలజీని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ 2021లో సంస్థ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. (ఇదీ చదవండి: BIS Helmets: ఇకపై ఇవి వాడరాదు.. ఎందుకంటే..?) యాపిల్ వినియోగదారుల ఆరోగ్యం కంపెనీకి చాలా ముఖ్యమని సంస్థ తెలిపింది. తమ ఉత్పత్తుల్లో భద్రతా ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చి యూజర్లకు మరింత సేవలందించేలా సంస్థ నిత్యం పనిచేస్తుందని చెప్పింది. అయితే కొందరు కావాలనే యాపిల్ ఉత్పత్తులను కాపీచేసి తమ సొంత ఉత్పత్తులుగా ప్రచారం చేస్తున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మాసిమో చర్యలపై ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేస్తామని యాపిల్ తెలిపింది. యాపిల్ గత నెలలో వాచ్సిరీస్ 9ని విడుదల చేసింది. ఆరోగ్య డేటాను యాక్సెస్ చేసి వివరాలు విశ్లేషించే వెసులుబాటు అందులో ఉంది. -
ట్రంప్ మళ్లీ అరెస్టు
మియామీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మరోసారి కోర్టు ఎదుట హాజరయ్యారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక అధికారిక రహస్యాలున్న పత్రాలను వెంట తీసుకెళ్లాడని అభియోగాలను ఎదుర్కొంటున్న ట్రంప్ మంగళవారం మియామీ ఫెడరల్ కోర్టుకు వచ్చారు. లాంఛనంగా అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ట్రంప్‌ను హాజరుపరిచారు. ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌లో ట్రంప్ నిబంధనలకు విరుద్ధంగా అధికారిక రహస్య పత్రాలను దాచారని అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ట్రంప్ మొత్తం 37 అభియోగాలను ఎదుర్కొంటున్నారు. -
ఏ మి టీ రహస్య పత్రాల కేసు..?
అమెరికా అధ్యక్షుడు ఎవరైనా పదవి దిగిపోయిన వెంటనే తన అధీనంలో ఉన్న ప్రభుత్వ డాక్యుమెంట్లు జాతీయ ఆర్కీవ్స్ అండ్ రికార్డ్స్ ఏజెన్సీ (ఎన్ఏఆర్ఏ)కి అప్పగించాలి. ప్రభుత్వానికి సంబంధించిన ఆ రహస్య పత్రాలన్నీ జాతి సంపదగా భావిస్తారు. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలైన కొద్ది నెలలకి అంటే 2021 మేలో ఎన్ఏఆర్ఏ ట్రంప్ రహస్య పత్రాలు పూర్తిగా ఇవ్వలేదని తొలిసారిగా బయటపెట్టింది. రెండు డజన్ల బాక్సుల్లో ఉండే పత్రాలు ఇవ్వలేదని పేర్కొంది. దీనిపై విచారణ మొదలై ట్రంప్ అధీనంలో ఉన్న రహస్య పత్రాలన్నీ ఆర్కీవ్స్‌కు ఇవ్వాలంటూ కోర్టు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 2021 జనవరిలో అధ్యక్షుడిగా గద్దె దిగిన ట్రంప్ వందలాది పత్రాలను తన అధీనంలోనే ఉంచుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశాలతో ట్రంప్ తరఫు లాయర్లు మరో 30 పత్రాలు అందజేశారు. అంతకు మించి తమ దగ్గర ఏవీ లేవని స్పష్టం చేశారు. 2022 ఆగస్టులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రంగంలోకి దిగి ఫ్లోరిడాలోని ట్రంప్ ప్రైవేటు ఎస్టేట్ మార్ ఎ లాగోలో సోదాలు చేపడితే 15 బాక్సుల్లో 184 కీలక పత్రాలు లభించాయి. ఇందులో 67 విశ్వసనీయ పత్రాలు, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు లభించినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే తరహా రహస్య పత్రాల కేసులో ట్రంప్ హయాంలో ఉపాధ్య’క్షుడిగా వ్యవహరించిన మైక్ పెన్స్, అంతకు ముందు ఉపాధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై కేసులు నమోదై ఉన్నాయి. వైట్ హౌస్ నుంచి అత్యంత కీలకమైన డాక్యుమెంట్లను ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే తీసుకువెళ్లారా ? గూఢచర్య చట్ట నిబంధనల్ని ట్రంప్ ఉల్లంఘించారా ? అన్న దిశగా ప్రాసిక్యూషన్ విచారణ సాగిస్తోంది.అయితే శ్వేతసౌధం ఖాళీ చేయడానికి తక్కువ సమయం ఇవ్వడంతో హడావుడిగా తీసుకువెళ్లిన సామాన్లలో పత్రాలు కూడా వచ్చి ఉంటాయని ట్రంప్ కార్యాలయం అప్పట్లో సమర్థించుకుంది. ట్రంప్ ఎదుర్కొంటున్న కేసులు ఇవే..! హష్ మనీ అగ్రరాజ్యం చరిత్రలో నేరాభియోగాలు ఎదుర్కొన్న ఒక మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ హష్ మనీ కేసులో నిలిచారు. 2016 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నప్పుడు తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ నోరు మూయించడానికి 1.30 లక్షల డాలర్లను ముట్టజెప్పినట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ట్రంప్ లాయర్ మైఖేల్ కోహెన్ ద్వారా సొమ్ములు చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ట్రంప్ మన్‌హట్టన్ క్రిమినల్ కోర్టుకు ఈ ఏడాది ఏప్రిల్ 4న హాజరయ్యారు. ఎన్నికల్లో అక్రమాలు 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నికల తుది ఫలితాలు ప్రకటించడానికి ముందే జో బైడెన్‌పై గెలుపు తనదేనంటూ ట్రంప్ ప్రచారం చేయడంపై విచారణ జరుగుతోంది. జార్జియా రాష్ట్ర కార్యదర్శి బ్రాడ్ రాఫెన్స్‌పెర్గర్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడుతూ జార్జియాలో జరిగిన రీకౌంట్‌లో తనకు అదనపు ఓట్లు లెక్కించాలంటూ మాట్లాడిన సంభాషణ బయటకు రావడంతో ఈ కేసు నమోదైంది. ఈ ఏడాది జులై–సెప్టెంబర్ మధ్య ఈ కేసులో నేరాభియోగాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. క్యాపిటల్‌పై దాడి 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ట్రంప్ ఓటమి భారాన్ని తట్టుకోలేక క్యాపిటల్ భవనంపై దాడికి తన అనుచరుల్ని ఉసిగొల్పిన ఘటనకు సంబంధించిన కేసు కూడా పెండింగ్‌లో ఉంది. కొలంబియా జిల్లా కోర్టులో ట్రంప్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. అదే సమయంలో కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను కాంగ్రెస్ ధ్రువీకరించకుండా అడ్డుకోవాలని అప్పటి ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌పై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలపై కూడా కేసు నమోదై ఉంది. అక్రమ వ్యాపారాలు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లో చేసిన వ్యాపారాల్లో నిబంధనల్ని తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడ్డారని, తన ఆస్తుల్ని కూడా తప్పుడుగా చూపించారంటూ న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్ కేసు నమోదు చేశారు. ట్రంప్ న్యూయార్క్ రాష్ట్రంలో వ్యాపార లావాదేవీలు కొనసాగించకుండా నిషేధం విధించాలంటూ ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశంలో ఇప్పటికే ట్రంప్‌ను అటార్నీ జనరల్ తన కార్యాలయంలోనే కొన్ని గంటలు ప్రశ్నించారు. న్యాయస్థానంలో ఈ కేసు అక్టోబర్‌లో విచారణకు రానుంది. కాలమిస్ట్‌పై అత్యాచారం మూడు దశాబ్దాల క్రితం తనపై అత్యాచారం చేశారన్న ఆరోపణలతో కాలమిస్ట్ జీన్ కరోల్ వేసిన కేసులో డొనాల్డ్ ట్రంప్‌ను న్యూయార్క్ కోర్టు మే 9న దోషిగా తేల్చింది. 1990లో మన్‌హటన్‌లోని ఒక డిపార్ట్మెంట్ స్టోర్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారం చేశారంటూ 2019లో న్యూయార్క్ కోర్టులో ఆమె పిటిషన్ వేశారు. ఏప్రిల్ 25న దీనిపై విచారణ మొదలైంది. కరోల్‌ను అబద్ధాల కోరుగా ప్రచారం చేసి ఆమె పరువుని బజారుకి ఈడ్చినందుకు నష్టపరిహారంగా 50 లక్షల డాలర్లు చెల్లించాలంటూ న్యూయార్క్ కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై ట్రంప్ న్యాయనిపుణుల బృందం పై కోర్టుకు వెళ్లనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాలో దీపావళికి సెలవు.. ప్రత్యేక బిల్లు!
వాషింగ్టన్: అమెరికాలో దీపావళిని ఫెడరల్ హాలీడేగా ప్రకటించాలని కోరుతూ అమెరికా చట్టసభ్యురాలు ఒకరు ప్రత్యేక బిల్లు (Diwali Day Act )ప్రవేశపెట్టారు. గ్రేస్ మెంగ్ శుక్రవారం ప్రతినిధుల సభ( House of Representatives)లో ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనపై పలువురు చట్టసభ్యులతో పాటు భారతీయ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. గ్రేస్ మెంగ్ వర్చువల్‌గా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందికి దీపావళి పండుగ ఎంతో ముఖ్యమైంది. క్వీన్స్, న్యూయార్క్ లాంటి అమెరికా ప్రధాన నగరాల్లోనూ లెక్కలేనన్ని కుటుంబాలు, కమ్యూనిటీలు దీపావళిని ఘనంగా నిర్వహించుకుంటాయి. అమెరికన్ పౌరులు సైతం హుషారుగా పాల్గొనడమూ చూస్తున్నాం. ఆ వెలుగులు ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి. కాబట్టి, ఈ పండుగను ఫెడరల్ హాలీడేగా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని ఆమె వివరించారు. మరో ఈ ప్రతిపాదనపై సౌత్ ఏషియా కమ్యూనిటీతో పాటు పలువురు అక్కడి చట్టసభ్యులు హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. న్యూయార్క్‌కు చెందిన మరో చట్టసభ్యురాలు జెన్నిఫర్.. దీపావళిని అధికారిక సెలవు దినంగా గుర్తించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని అంటున్నారు. అమెరికాలో 40 లక్షల మంది దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారామె. న్యూయార్క్ సెనెటర్ జెర్మీ కూనీ, న్యూయార్క్ సిటీ కౌన్సిల్మ్యాన్ శేఖర్ కృష్ణన్ సైతం ఈ బిల్లును స్వాగతిస్తున్నారు. శేఖర్ కృష్ణన్ న్యూయార్క్ ప్రభుత్వానికి ఎన్నికైన తొలి ఇండియన్ అమెరికన్. ఇక అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌లోనూ దీపావళి వేడుకలు జరుగుతుండడం చూస్తున్నదే. ఈ బిల్లు తొలుత పార్లమెంట్లో పాస్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధ్యక్షుడు సంతకంతో చట్టం అవుతుంది. ఒకవేళ దీపావళి పండుగకు గనుక సెలవు దినంగా ఆమోద ముద్ర పడితే.. అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఫెడరల్ హాలీడేస్ జాబితాలో 12వదిగా నిలుస్తుంది. అమెరికాలో పబ్లిక్ హాలీడేస్(నేషనల్ హాలీడేస్)తో పాటు ఫెడరల్ హాలీడేస్(ప్రత్యేక సెలవులు) ఉంటాయి. ఈ లిస్ట్‌లో న్యూఇయర్, మార్టిన్ లూథర్ కింగ్ జయంతోత్సవాలు, వాషింగ్టన్ బర్త్‌డే, మెమొరియల్ డే, జూన్టీన్త్ నేషనల్ ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ డే, లేబర్ డే, కొలంబస్ డే, వెటరన్స్ డే, థాంక్స్‌గివింగ్ డే, క్రిస్మస్ డేలు ఉన్నాయి. -
సాయివర్షిత్పై తీవ్ర అభియోగాలు! ఏ శిక్ష పడుతుందంటే..
తాను హిట్లర్‌కు అభిమానినని, నాజీయిజం గొప్పదని చెబుతూ.. అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవడమే లక్ష్యమని, అడ్డొస్తే ఏకంగా అధ్యక్షుడినైనా చంపుతానంటూ ప్రకటించి సంచలనానికి తెర తీశాడు తెలుగు మూలాలున్న సాయి వర్షిత్. వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో సహా దూసుకెళ్లి బారికేడ్లను ఢీ కొట్టి హల్చల్ చేసిన ఆ టీనేజర్‌పై తీవ్ర అభియోగాలే నమోదు అయ్యాయి. తెలుగు మూలాలు ఉన్న 19 ఏళ్ల సాయివర్షిత్.. సోమవారం(మే22 రాత్రి సమయంలో) ఓ ట్రక్‌తో వైట్‌హౌజ్ వైపు దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టి కలకలమే రేపాడు. ఆపై అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే.. విస్తూపోయే విషయాలను వెల్లడించాడు. బుధవారం ఫెడరల్ కోర్టులో అతన్ని హాజరుపర్చగా.. మే 30 దాకా కస్టడీ విధించింది న్యాయస్థానం. ‘‘ప్రెసిడెంట్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్‌ను చంపుతానని బెదిరించడం, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులకూ హాని తలపెడతానని ప్రకటించడం, అధ్యక్షుడి కిడ్నాప్‌నకు యత్నం, అధ్యక్షుడికి హాని తలపెట్టే యత్నం, మారణాయుధాలు కలిగి ఉండడం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అక్రమ చొరబాటు, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలగజేయడం.. లాంటి అభియోగాలను యూఎస్ పార్క్ పోలీసులు సాయి వర్షిత్‌పై నమోదు చేశారు. అంతేకాదు అతనసలు అమెరికా పౌరుడే కాదని ప్రాసిక్యూటర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అభియోగాల ఆధారంగా.. గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల(మన కరెన్సీ ప్రకారం) జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయమూర్తి రాబిన్ మెరివెదర్ సాయివర్షిత్‌కు స్పష్టం చేశారు. Here are the court doc’s 👉 compiled by @SecretService in this investigation. 19yo Sai Kandula was held w/out bond by a D.C. Superior Court judge today. He’s expected to appear at the federal courthouse tomorrow. No time announced yet. @fox5dc continues to follow developments https://t.co/qLUZvIIo1A pic.twitter.com/FFneR5bQUb — Stephanie Ramirez (@RamirezReports) May 23, 2023 సోమవారం రాత్రి.. సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్కు సాయివర్షిత్ రాత్రి ఎనిమిది గంటలకు చేరుకున్నాడు. అక్కడ యూ హాల్ బాక్స్ ట్రక్‌ను అద్దెకు తీసుకున్నాడని, నేరుగా వైట్ హౌజ్ వైపు దూసుకెళ్లాడని కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో పోలీసులు వెల్లడించారు. వైట్ హౌజ్‌లోకి చొరబడి.. అధికార కైవసం చేసుకోవాలని అనుకున్నానని, దేశాన్ని పాలించడమే తన ఉద్దేశమని సాయివర్షిత్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. అదెలా సాధ్యమని పోలీసులు నిలదీయగా.. అధ్యక్షుడిని చంపడమో లేదంటే అడ్డొచ్చే వాళ్లను గాయపర్చడం ద్వారానో అనుకున్నది సాధించాలని సాయివర్షిత్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లకు హాని తలపెట్టడమే తన ఉద్దేశమని స్పష్టం చేశాడు సాయివర్షిత్. ఈ మేరకు ఆరు నెలల నుంచే గ్రీన్ బుక్ పేరిట తాను ఎలా ప్లాన్ చేసుకున్నదంతా సాయి రాసుకున్నట్లు తెలుస్తోంది. Sai Varshith Kandula of Chesterfield, Missouri is the teenager who was driving the U-Haul and carrying a Nazi flag as he crashed into the security barrier near the White House on Lafayette Square. Kandula allegedly wanted to kill or harm President Biden and VP Kamala Harris. If… pic.twitter.com/dWC5OLED9j — Ed Krassenstein (@EdKrassen) May 23, 2023 సాయివర్షిత్ మిసోరీ రాష్ట్రం చెస్టర్‌ఫీల్డ్‌లో ఉంటున్నాడు. అతని తల్లిదండ్రుల నేపథ్యం తెలియాల్సి ఉంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు అతడి ట్రక్‌లో జర్మనీ నియంత హిట్లర్‌కు చెందిన నాజీ పార్టీ జెండా కూడా కనిపించింది. బైడెన్‌ను చంపి అమెరికా పగ్గాలు చేపట్టడమే తన లక్ష్యమని సాయివర్షిత్ పోలీసులకు చెప్పాడు. గతంలో డేటా అనలిస్ట్‌గా పని చేశానని, ప్రస్తుతం తానొక నిరుద్యోగినని చెప్పాడు. బుధవారం కోర్టు విచారణలోనూ వినయంగా అతను సమాధానాలు ఇవ్వడంతో జడ్జి సైతం ఆశ్చర్యపోయారు. మరోవైపు అతని తల్లిదండ్రులు బెయిల్ కోసం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 14 దేశాలను టచ్ చేసే రోడ్డు ఇదే! -
స్విస్ సెంట్రల్ బ్యాంక్‌పై ఇన్వెస్టర్ల దావా
లండన్: క్రెడిట్‌సూసే ఇన్వెస్టర్ల బృందం స్విస్ స్విట్జర్లాండ్ ఫైనాన్షియల్ మార్కెట్ సూపర్ వైజరీ అథారిటీ (ఎఫ్‌ఐఎన్‌ఎంఏ/స్విస్ సెంట్రల్ బ్యాంక్)కి వ్యతిరేకంగా ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. గత నెలలో సంక్షోభంలో పడ్డ క్రెడిట్ సూసేని కాపాడేందుకు తీసుకున్న నిర్ణయం ఫలితంగా 16 బిలియన్ స్విస్ఫ్రాంకోలు (17.3 బిలియన్ డాలర్లు) విలువైన బాండ్ల విలువ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారు సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేశారు. క్రెడిట్ సూసేని యూబీఎస్ 3.25 బిలియన్ డాలర్లకు కొనడం తెలిసిందే. ఇదంతా కేంద్ర బ్యాంకు మార్గదర్శకంలోనే జరిగింది. దీంతో స్విట్జర్లాండ్‌లోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌గా ఉన్న క్రెడిట్‌సూసే మునిగిపోకుండా కాపాడినట్టయింది. ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను వెనక్కి తీసుకోవడంతో క్రెడిట్‌సూసే సంక్షోభం పాలైంది. ఎఫ్‌ఐఎన్‌ఎంఏ తీసుకున్న నిర్ణయం స్విస్ ఆర్థిక వ్యవస్థపై ఉన్న విశ్వసనీయత, కచ్చితత్వాన్ని దెబ్బతీసిందని లా సంస్థ క్విన్ ఎమాన్యుయేల్ అర్కుహర్ట్ మేనేజింగ్ పార్ట్నర్ థామస్ వెర్లెన్ తెలిపారు. ఇన్వెస్టర్ల తరఫున ఈ సంస్థే వ్యాజ్యం దాఖలు చేసింది. కోర్టును ఆశ్రయించిన ఇన్వెస్టర్లు సంయుక్తంగా 5 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను బాండ్లలో కలిగి ఉన్నారు. -
తప్పుడు ట్వీట్.. మస్క్ చుట్టూ మరో ఉచ్చు
న్యూఢిల్లీ: ట్విటర్ కొనుగోలు తరువాత ఆర్థికంగా చిక్కుల్లోపడిన ఎలాన్ మస్క్ మెడకు మరో వివాదం చుట్టుకుంది. స్టాక్‌మార్కెట్‌ను మానుప్యులేట్ చేసేలా ట్వీట్ చేశారన్న ఆరోపణలపై విచారణను ఎదుర్కోబోతున్నారు. 2018లో చేసిన ట్వీట్‌కు సంబంధించి ఫెడరల్ కోర్టు మంగళవారం విచారించ నుంది. జ్యూరీ ఎంపిక ఈరోజు ప్రారంభం కానుండగా, ఈ కేసును కాలిఫోర్నియా నుండి తరలించాలన్న మస్క్ పిటీషన్‌ను ఫెడరల్ న్యాయమూర్తి తిరస్కరించారు. ఆగస్ట్ 7, 2018 ట్వీట్ ద్వారా టెస్లా కొనుగోలు కోసం ఫైనాన్సింగ్‌ను సమీకరించినట్లు, షేరు 420 డాలర్ల చొప్పున తన దగ్గర సరిపడిన నిధులున్నాయని పేర్కొంటూ మస్క్ ట్వీట్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ ట్వీట్ కారణంగా షేర్లు దూసుకుపోవడంతొ వాటాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత టెస్లా స్టాక్ ట్రేడింగ్ నిలిపివేశారు. దీంతో దాదాపు రెండు వారాల పాటు షేరు ధరలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. దీంతో టెస్లా బోర్డు చైర్మన్ పదవినుంచి మస్క్‌ను తొలగించాలని 20మిలియన్ల డాలర్ల జరిమానా విధించాలని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆదేశించింది. మస్క్ చేసిన ఈ ట్వీట్‌పై జడ్జి ఎడ్వర్డ్ చెన్ ఇప్పటికే మస్క్ ట్వీట్ తప్పు అని నిర్ధారించారు. అయితే మస్క్ నిర్లక్ష్యంగా ప్రవర్తించి, టెస్లా వాటాదారులకు ఆర్థికంగా హాని కలిగించాడా లేదా అనే నిర్ణయాన్ని జ్యూరీకి వదిలివేసింది. టెస్లాకు భారీ జరిమానా మరోవైపు టెస్లాపై 2.85 బిలియన్ వోన్ (2.2 మిలియన్ డాలర్లు ) జరిమానా విధించేందుకు దక్షిణ కొరియా యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ సిద్ధమవుతోంది. తక్కువ ఉష్ణోగ్రతలలో దాని ఎలక్ట్రిక్ వాహనాల క్క తక్కువ డ్రైవింగ్ పరిధి గురించి వినియోగదారులకు చెప్పడంలో విఫలమైందని కొరియా ఫెయిర్ ట్రేడ్ కమీషన్ (కేఎఫ్టీసీ) ఆరోపించింది. కాగా 2018 తరువాత టెస్లా షేరు 6 రెట్లకు పైగా ఎగిసింది. కానీ 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ కొనుగోలు తరువాత టెస్లా షేరు ధర దారుణంగా పడిపోయింది. దాదాపు సగానికి సగం పతనమై ప్రస్తుతం 120 డాలర్లకు పరిమితమయ్యాయి. -
ట్విటర్ ఉద్యోగి కీలక చర్య: ఎలాన్ మస్క్‌కు మరో షాక్!
న్యూఢిల్లీ: ట్విటర్ కొత్త బాస్, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో షాక్ తగిలింది. తనను అన్యాయంగా విధుల్లోంచి తొలగించారని ఆరోపిస్తూ ట్విటర్‌కు చెందిన దివ్యాంగ ఉద్యోగి ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంలో కోర్టులో మూడు కేసులు నమోదైనాయి. కాలిఫోర్నియాకు చెందిన ఇంజినీరింగ్ మేనేజర్ డిమిత్రి బోరోడెంకో బుధవారం శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో దావా వేశారు. వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న తనను ఆఫీసుకు తిరిగి రావాలని ఆదేశించారని అయితే దీనికి నిరాకరించడంతో ట్విటర్ తనను తొలగించిందని పేర్కొన్నారు. ఇది ఫెడరల్ అమెరికన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ ఉల్లంఘన అని బోరోడెంకో చెప్పారు. తన వైకల్యం కారణంగా కోవిడ్ బారిన పడితే కష్టమని ఆయన వాదించారు. అలాగే డిమాండ్ పనితీరు,ఉత్పాదకత ప్రమాణాలను అందుకోలేక పోవడంతో వైకల్యం ఉన్నఅనేక మంది ట్విటర్ ఉద్యోగులు బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందని మరో దావాలో పేర్కొన్నారు. ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్, 2020లో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం యజమానికి భారం కానంతవరకు వర్క్ ఫ్రం హోం పని విధానం సహేతుకమైందే. అలాగే రిమోట్ పనివిధానాన్ని రద్దు చేసిన మస్క్ నేతృత్వంలోని ట్విటర్ యాజమాన్యం చట్టం ప్రకారం 60 రోజుల నోటీసు ఇవ్వకుండా వేలాదిమంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించిందని ఆరోపిస్తూ అదే కోర్టులో మరో ఫిర్యాదు దాఖలైంది. ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న మస్క్ ఇంత తక్కువ సమయంలో ఉద్యోగులను చాలా ఆవేదనకు, బాధకు గురిచేశాడని వారిని అనిశ్చితిలో పడవేశాడని ట్విటర్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఈ మూడు కేసులను వాదిస్తున్న న్యాయవాది షానన్ లిస్-రియోర్డాన్ వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలపై ట్విటర్ అధికారికంగా స్పందించలేదు. ట్విటర్ మస్క్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపు 3,700 మంది ఉద్యోగులను లేదా కంపెనీలోని సగం మంది ఉద్యోగులను ఆకస్మికంగా తొలగించడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిందని శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. (మునుగుతున్న ట్విటర్ 2.0? ఉద్యోగుల సంఖ్య తెలిస్తే షాకవుతారు!) కాగా ఎక్కువ పనిగంటలు పనిచేస్తూ, ట్విటర్ అభివృద్ధికి తోడ్పడతారో, లేదా సంస్థను వీడతారో తేల్చుకోమని ట్విటర్ ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేయడం కలకలం రేపింది. దీంతో వందలాది ఉద్యోగులు కంపెనీకి గుడ్‌బై చెప్పడం మరింత ఆందోళన రేగింది. ఫలితంగా నవంబరు 21, సోమవారం వరకు ట్విటర్ ఆఫీసులను మూసివేస్తున్నట్టు ట్విటర్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు పనితీరు, ప్రతిభ ఆధారంగా వారికి ప్రాధాన్యత ఉంటుందని తెగేసి చెప్పింది. అలాగే రిమోట్‌గా పనిచేసే ఉద్యోగుల పనితీరును ఎక్కువ చేసి చూపిస్తూ ఆయా మేనేజర్లు తప్పుడు రిపోర్ట్ చేస్తే వారిపై చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించడం గమనార్హం. (ఉద్యోగుల ఝలక్, ఆఫీసుల మూత: మస్క్ షాకింగ్ రియాక్షన్) -
శామ్సంగ్కు 75 కోట్ల జరిమానా
మెల్బోర్న్: ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శామ్సంగ్కు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు ఝలకిచ్చింది. మొబైల్ ఫోన్లు వాటర్ ప్రూఫ్ అంటూ తప్పుదోవ పట్టించినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన కోర్టు శామ్సంగ్కు రూ.75 కోట్ల మేర జరిమానా విధించిందని ప్రభుత్వ నియంత్రణ సంస్థ వెల్లడించింది. 2016 మార్చి నుంచి 2018 అక్టోబర్ మధ్య ఎస్7, ఎస్8 సిరీస్ చెందిన 31 లక్షల గ్యాలెక్సీ ఫోన్లను శామ్సంగ్ ఆస్ట్రేలియా విక్రయించింది. ఈ ఫోన్లు నీళ్లలో తడిచినా పాడవవంటూ ప్రకటనలు ఇచ్చింది. అయితే, నీళ్లలో తడిచిన తర్వాత తమ ఫోన్లు పనిచేయడం లేదంటూ వందలాదిగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి 2019లో నమోదైన కేసులపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. సంబంధిత ఫోన్లను కొనుగోలు చేసిన వినియోగదారులు శామ్సంగ్ను సంప్రదించాలని సూచించింది. -
గూగుల్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా కోర్టు
కాన్బెర్రా: యూట్యూట్ వీడియోలు తన కెరీర్‌ను పాడు చేశాయంటూ ఓ మాజీ రాజకీయ నాయకుడు వేసిన పరువు నష్టం కేసులో ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. యూట్యూట్ మాతృసంస్థ గూగుల్‌కు 7.15 లక్షల ఆస్ట్రేలియా డాలర్ల (సుమారు రూ.4 కోట్లు) జరిమానా విధించింది. న్యూసౌత్‌వేల్స్ స్టేట్ మాజీ డిప్యూటీ ప్రీమియర్‌గా జాన్ బరిలరో పనిచేశారు. జాన్ బరిలరో పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా 2020 సెప్టెంబర్–అక్టోబర్ మధ్య కాలంలో జోర్డాన్ షాంక్స్ అనే కమెడియన్ పలు వీడియోలు యూట్యూట్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోల కారణంగా బరిలరో రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. సదరు వీడియోలను తొలగించాలంటూ పలుమార్లు ఆయన రాసిన లేఖలను గూగుల్ సంస్థ పట్టించుకోలేదు. దీంతో బరిలరో కోర్టును ఆశ్రయించారు. -
Novak Djokovic: జొకోవిచ్‌కు ఆస్ట్రేలియా భారీ షాక్.. ఓడిపోతే ఇక అంతే!
ఆస్ట్రేలియా ఓపెన్ డ్రా చూస్తే సెర్బియన్ స్టార్ జొకోవిచ్ తప్పక బరిలోకి దిగుతాడనిపించింది. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీరు చూస్తుంటే ప్రపంచ నంబర్‌వన్‌కు బహిష్కరణ తప్పేలా లేదు. మామూలుగా టెన్నిస్ కోర్టులో ఆటగాడు ‘డబుల్‌ఫాల్ట్’ చేస్తాడు. కానీ ప్రభుత్వం దెబ్బకు ఈ టాప్‌సీడ్ ‘డబుల్‌ఫాల్ట్’ అయ్యాడు. రెండో సారీ అతని వీసా రద్దయింది. ఆసీస్ విదేశీ మంత్రిత్వశాఖ తన విచక్షణాధికారం మేరకు అతని వీసాను రెండోసారి రద్దు చేసింది. దేశ ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ‘టెన్నిస్ లెజెండ్’ను అమర్యాదగా సాగనంపబోమని, కొన్ని రోజులు ఇక్కడ ఉండే వెసులుబాటు ఇస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు జొకో మాత్రం ‘తగ్గేదేలే’... వెనక్కి వెళ్లేదేలే అంటున్నాడు. ప్రభుత్వ నిర్ణయంపై తన న్యాయపోరాటం కొనసాగిస్తానని తెలిపాడు. తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లోని 20 టైటిళ్లలో 9 సార్లు విజేతగా నిలిపిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను అంత తేలిగ్గా వదిలేలా లేడు. ప్రాక్టీస్‌లో అతను శ్రమిస్తుంటే... అతని లీగల్ టీమ్ కోర్టులో తేల్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఫెడరల్ సర్క్యూట్‌లోని ఫ్యామిలీ కోర్టులో అత్యవసర విచారణ కోసం అప్పీల్ చేసింది. సోమవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుండటంతో ఫెడరల్ కోర్టు నేడు (శనివారం) అత్యవసర విచారణ చేపడుతుందా లేదంటే విచారణను తిరస్కరిస్తుందో తెలియాలంటే వేచిచూడక తప్పదు. ఈ ఫెడరల్ కోర్టులోనే మొదటిసారి రద్దయిన వీసాను పునరుద్దరించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్టు నుంచి వీసా పునరుద్ధరణ లభించినప్పటికీ మళ్లీ రద్దు చేసే అధికారం విదేశీ మంత్రిత్వ శాఖకు ఉంటుంది. ఇప్పుడు ఆ శాఖ రద్దు చేసింది. ఇలా ఒక వ్యక్తికి వరుసగా రెండోసారి వీసా రద్దు చేస్తే... అతను మళ్లీ మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడానికి వీలుండదు. జొకో న్యాయ పోరాటం చేసి విఫలమైతే మూడేళ్లు అంటే 2025 వరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడే అవకాశం రాదు. చదవండి: Virat Kohli Vs Dean Elgar: సైలెంట్‌గా ఉంటానా డీన్.. 3 ఏళ్ల క్రితం ఏం చేశావో తెలుసు.. కోహ్లి మాటలు వైరల్ View this post on Instagram A post shared by Novak Djokovic (@djokernole) -
ట్రంప్ కిడ్నాప్, హత్యకు కుట్ర!
The US Secret Service arrested a 72-year-old man in New York: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ 72 ఏళ్ల థామస్ వెల్నిక్ని న్యూయార్క్‌లో అరెస్టు చేసింది. ట్రంప్ 2020 ఎన్నికలలో ఓడిపోయి పదవీ విరమణ చేయడానికి నిరాకరిస్తే గనుక కిడ్నాప్ చేసి చంపేస్తానని యూస్ కాపిటల్ పోలీసులకు ఇచ్చిన విచారణలో వెల్లడైంది. పైగా గతేడాది జనవరిలో న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని సీక్రెట్ సర్వీస్ కార్యాలయానికి రెండు వాయిస్ మెయిల్ సందేశాలను పంపినట్లు కూడా వెల్నిక్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు వెల్నిక్ గత నవండర్ నెలలో కూడా న్యూయార్క్ నగరంలోని సీక్రెట్ సర్వీస్ డెస్క్‌కి తన సెల్ ఫోన్ నుండి మూడుసార్లు కాల్ చేశాడని, కాల్ చేసిన ప్రతిసారి తన పేరుతోనే పరిచయం చేసుకోవడం గమనార్హం. ఈ మేరకు ఫెడరల్ కోర్ట్ సోమవారం ఈ కేసును విచారించింది. అయితే ఉద్దేశపూర్వకంగానే థామస్ వెల్నిక్ యూఎస్ మాజీ అధ్యక్షుడిని కిడ్నాప్ చేస్తానని, చంపుతానని బెదిరించాడని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి బ్రూక్లిన్ పేర్కొన్నారు. పైగా వెల్నిక్ వద్ద 22 క్యాలిబర్ తుపాకీ కూడా ఉందన్నారు. ఈ మేరకు వెల్నిక్కి రూ 3 లక్షల పూచికత్తుతో షరతులతో కూడిన బెయిల్‌ని ఫెడరల్ కోర్టు మంజూరు చేసింది. అయితే అతన్ని రాత్రిపూట గృహనిర్బంధం చేయాలని, పైగా జీపీఎస్ మానిటరింగ్ పరికరాన్ని కూడా అమర్చాలని బ్రూక్లిన్ ఆదేశించారు. అంతేగాక అతని మానసిక పరిస్థితిని విచారించి మద్యం లేదా మాదకద్రవ్యాలకు బానిసైనట్లయితే గనుక తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. (చదవండి: కెమెరామెన్ అమ్మతో చిట్టితల్లి.. ఏం చెప్పిందో వింటే ఫిదా అవుతారు) (చదవండి: అఫ్ఘనిస్తాన్‌లో పేలుడు... తొమ్మిది మంది మృతి) -
జొకో కేసు గెలిచాడు... కానీ ఆట ముగిసిపోలేదు
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి 21వ గ్రాండ్‌స్లామ్ సొంతం చేసుకునేందుకు వచ్చిన ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ముందుగా ప్రభుత్వంపై కోర్టు కేసు గెలిచాడు. వ్యాక్సినేషన్‌పై వైద్యపరమైన మినహాయింపు ఇచ్చాకే వచ్చిన ఆటగాడి నిలిపివేత, బహిష్కరణ సరి కాదన్న ఫెడరల్ సర్క్యూట్ కోర్టు... తక్షణం నిర్బంధ క్వారంటైన్ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. రద్దు చేసిన వీసాను పునరుద్ధరించాలని న్యాయమూర్తి ఆంథోని కెల్లీ తన తీర్పులో వెల్లడించారు. మినహాయింపు కోసం జొకోవిచ్ కావాల్సిన పత్రాలన్నీ సమర్పించాడని...ఇంకా ఏం చేయాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆట ముగిసిపోలేదు... అయితే ఇక్కడితో సెర్బియన్ స్టార్‌కు ఊరట లభిం చినట్లేనని సంతోషించడానికి వీల్లేదు. ఫెడరల్ కోర్టు తీర్పుతో డిఫెండింగ్ చాంపియన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ ఆడటం ఇంకా ఖాయం కాలేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం వీసాను రెండోసారి రద్దు చేసే విశేషాధికారం ప్రభుత్వానికే ఉంది. ఒక వేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం తమపై కోర్టుకెక్కిన జొకోవిచ్పై ప్రతిష్టకు పోయి వీసాను రెండోసారి రద్దు చేసే నిర్ణయం తీసుకుంటే సెర్బియన్ చేయగలిందేమీ లేదు! -
కరోనా పాజిటివ్ వచ్చినందుకే జకోవిచ్‌ను..
మెల్బోర్న్: కరోనా వ్యాక్సిన్ తీసుకోకున్నా... ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు ప్రత్యేక మినహాయింపు ఎందుకు ఇచ్చారనే కారణాన్ని ఫెడరల్ సర్క్యూట్ కోర్టుకు అతని తరఫు లాయర్లు వివరించారు. గత నెల డిసెంబర్ 16వ తేదీన జొకోవిచ్‌కు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిందని... ఆ సమయంలో అతనికి ఎలాంటి జ్వరంగానీ, శ్వాస సంబంధిత ఇబ్బందులుగానీ లేవని సెర్బియా స్టార్ తరఫు లాయర్లు శనివారం కోర్టుకు సమర్పించిన పత్రాలలో వివరించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం ...గత ఆరు నెలల కాలంలో కరోనా బారిన పడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ తీసుకోకున్నా... ప్రత్యేక మినహాయింపు ద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడేందుకు అవకాశం ఇస్తారు. జొకోవిచ్‌కు డిసెంబర్ 16న కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసినా... అదే రోజు, ఆ మరుసటి రోజు బెల్గ్రేడ్లో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో అతను పాల్గొనడం గమనార్హం. 17వ తేదీన తన ముఖచిత్రంతో ముద్రించిన తపాళా బిళ్లను స్వయంగా జొకోవిచ్ విడుదల చేశాడు. 16వ తేదీన నొవాక్ జొకోవిచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సెమినార్‌లోనూ ఈ సెర్బియా స్టార్ పాల్గొన్నాడు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను జొకోవిచ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ కూడా చేశాడు. ఈనెల 17న మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు 5వ తేదీన మెల్బోర్న్ వచ్చిన జొకోవిచ్ వద్ద అవసరమైన పత్రాలు లేవని ఆరోపిస్తూ ఆస్ట్రేలియా బోర్డర్ ఆఫీసర్లు అతడిని అడ్డుకున్నారు. అతనికి జారీ చేసిన వీసాను రద్దు చేశారు. బోర్డర్ ఆఫీసర్ల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జొకోవిచ్ కోర్టుకెక్కాడు. సోమవారం జొకోవిచ్ కేసు విచారణకు రానుంది. -
ఎన్ఎస్ఓపై యాపిల్ కేసు
రిచ్మండ్: దిగ్గజ కంపెనీ యాపిల్ వివాదాస్పద స్పైవేర్ పెగాసస్‌ను రూపొందించిన ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూపును కోర్టుకు లాగింది. ఐఫోన్ లాంటి తమ ఉత్పత్తుల్లోకి పెగాసస్‌ను జొ ప్పించకుండా నిరోధించాలని కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేసింది. ‘అత్యంత అధునాతన సైబర్ నిఘా సాంకేతికత సహాయంతో ఎన్ఎస్ఓ ఉద్యోగులు అనైతిక చర్యలకు పాల్పడే కిరాయి సైనికులుగా మారారని ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా కొద్దిసంఖ్యలో ఐఫోన్లపై పెగాసస్ ద్వారా నిఘా పెట్టారని పేర్కొంది. ప్రభుత్వాల అండతో పనిచేసే ఎన్ఎస్ఓ లాంటి గ్రూపులు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా... మిలియన్ల కొద్ది డాలర్లను అత్యాధునిక నిఘా వ్యవస్థ అభివృద్ధికి వెచ్చిస్తాయి. ఇది మారాలి’ అని యాపిల్ సంస్థ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ క్రెయిగ్ ఫెడెరిఘి కోర్టుకు విన్నవించారు. తాము ఎలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం లేదని, కేవలం ప్రభుత్వాలకు మా త్రమే తమ ఉత్పత్తులను అమ్ముతున్నామని ఎన్ఎస్ఓ వాదిస్తోంది. విపక్షనాయకులు, మానవహక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు తదితరులపై పెగాసస్ ద్వారా భారత ప్రభుత్వం నిఘా పెట్టిందనే ఆరోపణలు రావడంతో తీవ్ర దుమారం రేగడంతో దీనిపై సుప్రీంకోర్టు ముగ్గురు సాంకేతిక నిపుణులతో దర్యాప్తు కమిటీని వేయడం తెలిసిందే. -
కోట్లమంది ఫోన్ డేటా చోరీ! ఎట్టకేలకు కదిలిన యాపిల్
Pegasus surveillance scandal: పెగాసస్ స్కామ్‌కు సంబంధించిన వ్యవహారంలో యాపిల్ కంపెనీ ఎట్టకేలకు స్పందించింది. కోట్ల మంది ఐఫోన్ యూజర్ల డేటాను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ లక్క్ష్యంగా చేసుకుందంటూ మంగళవారం కాలిఫోర్నియా కోర్టులో దావా వేసింది యాపిల్. ఇప్పటికే పెగాసస్ స్పైవేర్ ద్వారా కోట్లమంది ఐఫోన్ యూజర్ల డేటాను హ్యాకర్లకు చేర్చిందని సదరు దావాలో యాపిల్ పేర్కొంది. ఇజ్రాయెల్‌కు చెందిన టెక్నాలజీ కంపెనీ ఎన్ఎస్వో గ్రూప్.. పెగాసస్ స్పైవేర్‌ను ఇతర దేశాలకు అమ్ముతుంటుంది. అయితే ప్రభుత్వాలు మాత్రమే మెయింటెన్ చేసే ఈ స్పైవేర్‌ను.. హ్యాకర్లు లక్క్ష్యం చేసుకున్నారని, పలువురు ప్రముఖుల ఫోన్ డేటాను తస్కరించారనే ఆరోపణలతో ‘పెగాసస్ స్కామ్’ వెలుగుచూసింది. పైగా యాపిల్ ఫోన్లు వాడే ప్రముఖుల డేటా లక్క్ష్యం అయ్యిందని, భవిష్యత్తులోనూ ఐఫోన్లు వాడేవాళ్ల డేటా తేలికగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని ఉటంకించింది. Pegasus surveillance scandal నేపథ్యంలోనే మంగళవారం స్పైవేర్ మేకర్ ఎన్‌ఎస్‌వోపై దావా వేసింది. పెగాసస్ స్పైవేర్‌పై అమెరికా ఆంక్షలు విధించిన రెండు వారాలకే యాపిల్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అంతేకాదు ఎన్ఎస్వో గ్రూప్ యాపిల్‌కు సంబంధించి ఎలాంటి డివైజ్‌లను, సాంకేతికతను, సేవలను, వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఫెడరల్ కోర్టును యాపిల్ అభ్యర్థించింది. అంతేకాదు తమ ఫోన్ డేటా కూడా చోరీకి గురయ్యే అవకాశం ఉందన్న భయాందోళనను తాజా సర్వేలో పలువురు యూజర్లు వ్యక్తం చేశారని యాపిల్ దావాలో పేర్కొంది. అయితే పెగాసస్ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి(భారత్‌కు చెందిన పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సెలబ్రిటీల పేర్లు కూడా!).. ఆరోపణల్ని ఎన్ఎస్వో గ్రూప్ ఖండిస్తోంది. పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే ఉండదని స్పష్టం చేసింది. లీక్ డేటా బేస్‌లో నెంబర్లు కనిపించినంత మాత్రనా డేటా హ్యాక్ అయినట్లు కాదని గుర్తించాలని తెలిపింది. తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది కూడా. అయినప్పటికీ వివాదం ముదురుతూనే వచ్చింది. ఇక ఎన్‌ఎస్‌వోకి ఇలాంటి దావాలు కొత్తేం కాదు. 2019లో ఫేస్బుక్ కూడా దావా వేసింది. వాట్సాప్ మెసేంజర్ ద్వారా సైబర్ గూఢచర్యానికి పాల్పడిందని, జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘం ఉద్యమకారుల డాటాను తస్కరించిందనే ఆరోపణలు చేస్తూ కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులోనే ఫేస్బుక్ దావా వేసింది. దావాలు చాలవన్నట్లు 500 మిలియన్ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయి.. డిఫాల్ట్ ప్రమాదానికి చేరువలో ఉంది. మరోవైపు అమెరికా ఆంక్షల తర్వాత భారీ కొనుగోళ్ల ఒప్పందం నుంచి ఫ్రాన్స్ సైతం వెనుదిరిగింది. చదవండి: ఐఫోన్ యూజర్లకు హైఅలర్ట్! వెంటనే.. -
అంతరిక్ష యుద్ధం.. జెఫ్ బేజోస్‌కి మరోసారి ఝలక్ ఇచ్చిన ఎలన్‌మస్క్!
Jeff Bezos Vs Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి రెండో స్థానాల్లో ఉన్న టెస్లా ఎలన్‌మస్క్, అమెజాన్ జెఫ్బేజోస్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. భూమిపై వ్యాపారం విషయంలో ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. తాజాగా అంతరిక్ష ప్రాజెక్టులకు సంబందించిన పనులు దక్కించుకునే విషయంలోనూ వీరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తాజాగా వీరిద్దరికి చెందిన స్పేస్ఎక్స్, బ్లూఆరిజిన్ సంస్థల మధ్య వివాదం చెలరేగగా.. చివరకు ఎలన్‌మస్క్ పైచేయి సాధించారు. నాసా ప్రాజెక్ట్ నార్త్ అమెరికా స్పేస్ ఏజెన్సీ (నాసా) చంద్రుడిపై వ్యోమగాము (అస్ట్రోనాట్స్)లను పంపే విషయంలో రెగ్యులర్‌గా ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఆర్టెమిస్ ప్రాజెక్టులో భాగంగా అస్ట్రోనాట్స్ని మరోసారి చంద్రుడి మీదకు పంపాలని నిర్ణయించింది. అందులో భాగంగా అస్ట్రోనాట్స్ క్షేమంగా చంద్రుడు, భూమిపై దిగేందుకు వీలుగా లూనార్ ల్యాండర్ ప్రాజెక్టును చేపట్టింది. స్పేస్ ఎక్స్‌కి పనులు ఆర్టెమిస్ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ, ప్రైవేటు పార్ట్నర్షిప్లో సాగుతోంది. ఇందులో లూనార్ ల్యాండర్‌ను తయారు చేయాల్సిన బాధ్యతలను ఎలన్‌మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్ సంస్థకి నాసా అప్పగించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2.9 బిలియిన్ డాలర్లుగా ఉంది. బ్లూ ఆరిజిన్ అభ్యంతరం టెక్నాలజీ పరంగా అనేక లోపాలు ఉన్నప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా స్పేస్ఎక్స్ సంస్థకి లూనార్‌ల్యాండర్ పనులు కట్టబెట్టారంటూ జెఫ్‌బేజోస్‌కి చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. ముఖ్యంగా మనుషులను ల్యాండింగ్ సంబంధించి ఈ ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ కాంట్రాక్టు రద్దు చేయాలని కోరింది. Not the decision we wanted, but we respect the court’s judgment, and wish full success for NASA and SpaceX on the contract. pic.twitter.com/BeXc4A8YaW — Jeff Bezos (@JeffBezos) November 4, 2021 ఫెడరల్ కోర్టులో మరోవైపు జెఫ్‌బేజోస్‌కి చెందిన బ్లూ ఆరిజిన్ చెబుతున్న అభ్యంతరాలపై త్వరగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని, ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం అవుతుందంటూ నాసా సైతం న్యాయస్థానాన్ని కోరింది. ఇరువైపులా వాదనలు విన్న ఫెడరల్ కోర్టు చివరకు బ్లూఆరిజిన్ లేవనెత్తిన అభ్యంతరాలను కొట్టి పడేసింది. ఈ ప్రాజెక్టులో ముందుకు వెళ్లవచ్చంటూ నాసాకు అనుమతులు జారీ చేసింది. pic.twitter.com/deqktTvS3U — Elon Musk (@elonmusk) November 4, 2021 ట్వీట్‌వార్ ఫెడరల్ కోర్టు తీర్పుపై స్పందిస్తూ జెఫ్‌బేజోస్ ట్వీట్ చేశారు. ఈ తరహా తీర్పును తాము ఊహించలేదని, ఐనప్పటికీ న్యాయస్థానం తీర్పును గౌరవిస్తామన్నారు. మరోవైపు ఎలన్‌మస్క్ కూడా ట్విట్టర్ వేదికగా ఓ మీమ్‌తో స్పందించారు. చదవండి: రూటు మార్చిన ఎలన్ మస్క్.. ఇండియా మార్కెట్ కోసం సరికొత్త వ్యూహం -
ట్విటర్ కోసం కోర్టుమెట్లెక్కిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విటర్ ఖాతాపై విధించిన నిషేధం తొలగించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. తాజాగా తన ట్విటర్ ఖాతాను పునరుద్ధరించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జూలైలో ట్విటర్, ఫేసుబుక్, గూగుల్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ట్రంప్ కేసు విచారణ కొనసాగుతోంది. చదవండి: ఎంఏ, బీఈడీ చదివి మేస్త్రీ పనికి యువతి రాజకీయ దురుద్దేశంతోనే జనవరిలో తన సామాజిక మాధ్యమాలు నిషేధానికి గురయ్యాయని వాదించారు. వెంటనే తన ఖాతాను పునరుద్ధరణపై ట్విటర్‌కు ఆదేశాలు ఇవ్వాలని ట్రంప్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ట్విటర్‌పై ఒత్తిడి పెంచాలని కోరాడు. అయితే ఈ వాదనకు ట్విటర్ స్పందిస్తూ.. ‘మేము చేసిన విజ్ఞప్తిపై ట్రంప్ వెంటనే స్పందించలేదు’ అని పేర్కొంది. జనవరి 6వ తేదీన అమెరికాలో ట్రంప్ మద్దతుదారులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు ప్రేరేపించేలా ట్రంప్ పోస్టులు ఉన్నాయని ఆరోపిస్తూ ట్విటర్ అతడి ఖాతాను నిషేధించింది. ఆ తర్వాత ఫేస్బుక్, గూగుల్ కూడా ట్రంప్ ఖాతాలపై పలు చర్యలు తీసుకున్నాయి. చదవండి: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పాలమూరు బుడ్డోడు -
కమల హ్యారీస్ హత్య కుట్ర భగ్నం: రూ.40 లక్షలకు ఒప్పందం
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ హత్యకు కుట్ర పన్నింది ఓ మహిళ. అయితే చివరకు ఆమె కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆమెను జైలుకు పంపించారు. ఈ వార్త అమెరికాలో కలకలం రేపింది. అయితే కమలా హత్యకు ఆమె ఏకంగా దాదాపు అరకోటి వరకు సుపారీ తీసుకుంది. కమలా హత్యకు కుట్రకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. నిందితురాలిని మియామి ఫెడరల్ కోర్టులో హాజరుపరచగా పలు విస్తుగొల్పే విషయాలు వెల్లడయ్యాయి. చదవండి: కొత్త ట్విస్ట్.. ‘ఆ బిడ్డ నాకు పుట్టలేదు! డీఎన్ఏ టెస్ట్ చేయండి’ దక్షిణ ఫ్లోరిడాకు చెందిన మహిళ నివియన్ పెటిట్ ఫెల్ప్స్ (39) ఫిబ్రవరిలో కమల హత్యకు కుట్ర పన్నింది. 53 వేల డాలర్ల (సుమారు రూ.39 లక్షలు)కు కమలను హత్య చేసేందుకు ఆమె ఒకరితో ఒప్పందం కుదుర్చుకుంది. 50 రోజుల్లోనే ఆమెను హత్య చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే ఆ విషయాలను మాట్లాడుతూ వీడియో తీసుకుంది. అయితే ఆ వీడియోను ఇతరులకు పంపడం ఆమె చేసిన పెద్ద తప్పిదం. దీంతో ఆమె కుట్ర నిఘా వర్గాలకు తెలిసిపోయింది. నిఘా వర్గాలు ఆ వీడియోను పరిశీలించిన అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మియామీ న్యాయస్థానంలో నిందితురాలిని హాజరుపరిచారు. కమల హ్యారీస్‌ను హత్య చేస్తానని ఆరుసార్లు హెచ్చరికలు పంపింది. కమల హత్యకు ఆమె తుపాకీ లైసెన్స్ అనుమతికి దరఖాస్తు చేసుకున్నది కూడా. ఈ కేసులో విచారణ అనంతరం నివియన్కు ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. చదవండి: బెడ్రూమ్లోకి వెళ్తే వద్దంటుండు: భర్తపై భార్య ఫిర్యాదు హత్యకు కుట్ర పన్నిన మహిళ నివియన్ పెటిట్ ఫెల్ప్స్ -
ఆపిల్ కంపెనీకి భారీ షాక్..!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ వైర్లెస్ స్పీకర్ల తయారీదారు సోనోస్ గూగుల్ కంపెనీపై యూఎస్ ఫెడరల్ కోర్టు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గూగుల్ హోమ్ స్మార్ట్ స్పీకర్స్ ఉత్పత్తుల విషయంలో ఐదు పేటెంట్ హక్కులను ఉల్లంఘించినట్లు ఫెడరల్ కోర్టు గుర్తించింది. అంతేకాకుండా 1930 ఫెడరల్ టారిఫ్ చట్టాలను గూగుల్ ఉల్లంఘించినట్లు కోర్టు నిర్దారించింది. కాగా గూగుల్‌పై భారీ జరిమానాలను విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆపిల్ కూడా అదే బాటలో.. తాజాగా ఆపిల్ కూడా గూగుల్ బాటలో నడుస్తూ హద్దు మీరుతుంది. యూఎస్ ఫెడరల్ కోర్టులో ఆపిల్ పేటెంట్ హక్కులపై జరుగుతున్న విచారణలో ఆపిల్ ఓడిపోయింది. ఆపిల్ ఇతర కంపెనీలకు చెందిన పేటెంట్ల హక్కులను కాలారాసినట్లు కోర్టు గుర్తించింది. కాగా ఆపిల్‌పై యూఎస్ ఫెడరల్ కోర్టు సుమారు 300 మిలియన్ల డాలర్ల జరిమానాను విధించింది. అప్టిస్ వైర్లేస్ టెక్నాలజీ కంపెనీకి చెందిన పేటెంట్ హక్కులను ఆపిల్ ఉల్లంఘించినట్లు ఫెడరల్ కోర్టు నిర్ధారించింది. పేటెంట్ హక్కుల ఉల్లంఘనలో భాగంగా ఆపిల్ కంపెనీ భారీ మొత్తాన్ని అప్టిస్ కంపెనీకు ముట్టజెప్పనుంది. ప్రముఖ బిగ్ టెక్ కంపెనీలు 2015 నుంచి పేటెంట్ హక్కులను కాలారాస్తన్నట్లు ఒక నివేదికలో తెలిపింది. ఆయా దిగ్గజ టెక్ కంపెనీలు పేటెంట్ హక్కుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ కేసులను ఓడిపోతున్నారు. -
హద్దుమీరిన గూగుల్..! భారీ మూల్యం తప్పదా..!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ వైర్లెస్ స్పీకర్ల తయారీదారు సోనోస్ ఇంక్ స్మార్ట్ మ్యూజిక్ సంస్థ గూగుల్ కంపెనీపై యూఎస్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గూగుల్ హోమ్ స్మార్ట్ స్పీకర్స్ ఉత్పత్తుల విషయంలో ఐదు పేటెంట్లను ఉల్లంఘించిందనే కారణంతో ఫెడరల్ కోర్టులో సోనోస్ పిటిషన్‌ను వేసింది. సోనోస్ తన పిటిషన్లో గూగుల్ పేటెంట్స్ హక్కులను ఉల్లంఘించినందుకుగాను అమెరికాలో గూగుల్ స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్ అమ్మకాలను నిషేధించాలని, అంతేకాకుండా కంపెనీలకు నష్టపరిహరాన్ని కూడా అందించాలని కంపెనీ ఫెడరల్ కోర్టులో పేర్కొంది. తన కంపెనీ పేటెంట్లను గూగుల్ 2015 నుంచే ఉల్లంఘించడం మొదలుపెట్టిందని సోనోస్ వెల్లడించింది. తాజాగా పిటిషన్‌పై యూఎస్ ఫెడరల్ కోర్టులో విచారణ జరిగింది. విచారణలో గూగుల్ పేటెంట్ల హక్కులను ఉల్లఘించినట్లు కోర్టు నిర్థారించింది. 1930 ఫెడరల్ టారిఫ్ చట్టాన్ని గూగుల్ ఉల్లఘించిందని కోర్టు పేర్కొంది. గూగుల్‌పై దిగుమతి ఆంక్షలను కోర్టు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గూగుల్ పేటెంట్లను ఉల్లంఘణలకు పాల్పడిందని తెలిసిన క్షణంలో సోనోస్ షేర్లు 11.4 శాతం మేర ఎగబాకాయి. -
అమెరికా: మరో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం
వాషింగ్టన్: అమెరికాలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత సంతతి వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న అధ్యక్షుడు జో బైడెన్.. మరో ఇండియన్ అమెరికన్ మహిళకు అరుదైన గౌరవం ఇచ్చారు. సర్య్కూట్ కోర్ట్ చీఫ్ జస్టిస్‌గా విధులు నిర్వహిస్తున్న భారత సంతతి మహిళ షాలినా డీ కుమార్‌ను మిచిగాన్ తూర్పు ప్రాంత ఫెడరల్ కోర్టు చీఫ్ జస్టిస్‌గా జో బైడెన్ నియమించారు. ఆమె 2007 సంవత్సరం నుంచి ఓక్లాండ్ కౌంటీ ఆరవ కోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. 2018లో సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తిగా ఆమెను మిచిగన్ సుప్రీం కోర్టు నియమించింది. మిచిగాన్‌లో దక్షిణాసియా సంతతికి చెందిన మొదటి ఫెడరల్ న్యాయమూర్తి షాలినా అని వైట్ హౌస్ తెలిపింది. షాలినా ప్రధాన న్యామూర్తి విధుతో పాటు సివిల్, క్రిమినల్ విషయాలను కూడా పరిశీలిస్తారని వైట్ హైస్ తెలిపింది. షాలినా 1993లో మిచిగాన్ విశ్వవిద్యాలయం, 1996లో డెట్రాయిట్ మెర్సీ స్కూల్ ఆఫ్ లా నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. న్యాయమూర్తి జీన్ష్నెల్జ్ పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి మిచిగాన్‌లోని ఓక్లాండ్ కౌంటీలోని 6వ సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తిగా 2007లో షాలినా నియమితులయ్యారు. చదవండి: బైడెన్ టీమ్ మరో భారతీయ మహిళా కిరణం -
హెచ్1బీ వీసా : ఐటీ నిపుణులకు భారీ ఊరట
వాషింగ్టన్: హెచ్1బీ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన హెచ్1బీ వీసాల ఆంక్షలపై అమెరికా ఫెడరల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలను కాలిఫోర్నియాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి జెఫ్రీ వైట్ తోసిపుచ్చారు. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం పారదర్శక విధానాలను పాటించలేదని ఈ మార్పులు కరోనా మహమ్మారి ఉద్యోగ నష్టాలను పూడ్చడంకోసం అని వాదించడం సరికాదని తెలిపింది. ఎందుకంటే ట్రంప్ సర్కార్‌కు అందకుముందే ఈ ఆంక్షల ఆలోచన ఉందనీ, కానీ అక్టోబరులో ఆదేశాలు జారీ చేసిందని జెఫ్రీ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో బే ఏరియా కౌన్సిల్, స్టాన్‌ఫర్డ్ శ్వవిద్యాలయం, ఇతర విద్యా వ్యాపార వర్గం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై చట్టపరమైన విజయం సాధించారు. ఇది మన ఆర్థిక వ్యవస్థకు, చెత్త ఆదేశాలపై సాధించిన పెద్ద విజయం" అని బే ఏరియా కౌన్సిల్ సీఈవో జిమ్ వుండెర్మాన్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ట్రంప్ ఓటమి, జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవిని స్వీకరించనున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికాలోకి విదేశీ నిపుణుల రాకను అడ్డుకోవడం ద్వారా స్ధానికులకు ఉపాధి పెంచేందుకు ట్రంప్ సర్కార్ వీసాలపై ఆంక్షలు విధిస్తూ అక్టోబర్ లో ఆదేశాలు జారీ చేసింది. హెచ్ 1బీ వీసాలపై మూడవ పార్టీ సంస్థలలో హెచ్ 1బీ ఉద్యోగాల నియామకాలపై ఏడాది పాటునిషేధం విధించింది. దీనిపై బే ఏరియా కౌన్సిల్, స్టాన్‌ఫర్డ్, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్ , ఇతర గ్రూపులు సవాల్చేసిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రతీ ఏడాదీ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి రంగాల్లో కలిపి దాదాపు 85 వేల వీసాలను ఇస్తుంది. ఇవి మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత వీటిని రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అమెరికాలో హెచ్1బీ వీసాలు పొందిన వారిలో 6 లక్షల మంది భారత్, చైనాకు చెందిన వారే ఉన్నారు. కాగా అమెరికా నూతన అధ్యక్షునిగా పదవిని చేపట్టనున్న జో బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్రంప్ ఆంక్షలను రద్దు చేయవచ్చునని భావిస్తున్నారు. తద్వారా లక్షలాది భారతీయుల వీసా ఇబ్బందులు చెక్‌పడనుందనే అంచనాలకు మరింత బలం చేకూరింది. బైడెన్ వాగ్దానం ప్రకారం హెచ్1బీ వీసాలతో బాటు హై స్కిల్డ్ వీసాల సంఖ్యను ఆయన పెంచవచ్చునని, అలాగే ఇమ్మిగ్రేషన్ పాలసీని సైతం సవరించే అవకాశం ఉందని అంచనా. -
టిక్‌టాక్ విషయంలో ట్రంప్‌కి చుక్కెదురు
న్యూయార్క్: ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమలును ఫెడరల్ జడ్జి తాత్కాలికంగా వాయిదా వేశారు. నిషేధం ఉత్తర్వులు అమల్లోకి రావడానికి కొద్ది గంటల ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే, అధ్యక్ష ఎన్నికల తర్వాత నవంబర్ నుంచి అమలు కావాల్సిన ఉత్తర్వుల వాయిదాకు కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి కారల్ నికోలస్ నిరాకరించారు. ఈ నిషేధం తమ వ్యాపారానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, ఇది ఒప్పందానికి విరుద్ధమని, టిక్‌టాక్ కేవలం యాప్ కాదని, పౌరులందరికీ ఉపయోగపడే ఆధునిక వేదిక అని, తక్షణం నిషేధం విధిస్తే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని టిక్‌టాక్ న్యాయవాది జాన్హాల్ వాదించారు. టిక్‌టాక్ యాప్ జాతీయ భద్రతకు ప్రమాదకరమని, అమెరికా టిక్‌టాక్ కార్యకలాపాలను అమెరికన్ కంపెనీలకు అమ్మాలని, లేదా దేశం నుంచి నిషేధం ఎదుర్కోవాల్సిందేనని ట్రంప్ ఆగస్టు 6న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్‌కి చైనాకి చెందిన బైట్‌డాన్స్ మాతృ సంస్థ. అమెరికాలో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఈ కంపెనీ యత్నిస్తోంది. ఒరాకిల్, వాల్‌మార్ట్‌లతో వ్యాపారం సాగించడానికి సంప్రదింపులు జరుపుతోంది. దేశ భద్రతకు ఈ యాప్ ప్రమాదకరమని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అమెరికా పౌరుల సమాచారాన్ని టిక్‌టాక్ ద్వారా చైనాకు చేరవేస్తున్నారని వైట్ హౌస్ అభిప్రాయపడింది. అమెరికాలోని తమ కంపెనీలను రక్షించుకోవడానికి తగు చర్యలు చేపట్టనున్నట్టు చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది.