వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విటర్ ఖాతాపై విధించిన నిషేధం తొలగించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. తాజాగా తన ట్విటర్ ఖాతాను పునరుద్ధరించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జూలైలో ట్విటర్, ఫేసుబుక్, గూగుల్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ట్రంప్ కేసు విచారణ కొనసాగుతోంది.
చదవండి: ఎంఏ, బీఈడీ చదివి మేస్త్రీ పనికి యువతి
రాజకీయ దురుద్దేశంతోనే జనవరిలో తన సామాజిక మాధ్యమాలు నిషేధానికి గురయ్యాయని వాదించారు. వెంటనే తన ఖాతాను పునరుద్ధరణపై ట్విటర్‌కు ఆదేశాలు ఇవ్వాలని ట్రంప్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ట్విటర్‌పై ఒత్తిడి పెంచాలని కోరాడు. అయితే ఈ వాదనకు ట్విటర్ స్పందిస్తూ.. ‘మేము చేసిన విజ్ఞప్తిపై ట్రంప్ వెంటనే స్పందించలేదు’ అని పేర్కొంది. జనవరి 6వ తేదీన అమెరికాలో ట్రంప్ మద్దతుదారులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు ప్రేరేపించేలా ట్రంప్ పోస్టులు ఉన్నాయని ఆరోపిస్తూ ట్విటర్ అతడి ఖాతాను నిషేధించింది. ఆ తర్వాత ఫేస్‌బుక్, గూగుల్ కూడా ట్రంప్ ఖాతాలపై పలు చర్యలు తీసుకున్నాయి.
చదవండి: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పాలమూరు బుడ్డోడు
Donald Trump Twitter ట్విటర్ కోసం అష్టకష్టాలు: కోర్టుమెట్లెక్కిన డొనాల్డ్ ట్రంప్
Published Sat, Oct 2 2021 1:09 PM | Last Updated on Sat, Oct 2 2021 2:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment