ట్రంప్‌ మగ్‌ షాట్‌:మస్క్‌ రియాక్షన్‌ అదిరిపోయింది! | SpaceX Boss Elon Musk reaction On Donald Trump Sharing His Mugshot - Sakshi
Sakshi News home page

ట్రంప్‌ మగ్‌ షాట్‌: మస్క్‌ రియాక్షన్‌ అదిరిపోయింది!

Published Fri, Aug 25 2023 12:52 PM | Last Updated on Fri, Aug 25 2023 1:19 PM

SpaceX Boss Elon Musk reaction On Donald Trump Sharing His Mugshot - Sakshi

Elon Musk On Donald Trump అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  "నెవర్ సరెండర్" మగ్‌షాట్‌పై  తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో  సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ,ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌  స్పందించారు.  ఇది "నెక్స్ట్ లెవెల్" అంటూ ట్వీట్‌ చేశారు.  ట్రంప్‌  ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ  ఈ కామెంట్‌ పోస్ట్‌ చేశారు.  (బిల్‌ తీసుకుంటే చాలు..కోటి రూపాయలు మీవే!)

జార్జియాలోని ఫుల్టన్‌ కౌంటీ జైలు వద్ద గురువారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ జార్జియాలో అరెస్టు తర్వాత గురువారం  ట్విటర్‌(ఎక్స్‌) లో తన పోలీసు మగ్‌షాట్‌ను పోస్ట్ చేసారు. జనవరి 2021 నుండి ప్లాట్‌ఫారమ్‌పై అతని తొలి పోస్ట్ కావడం విశేషం. ట్విటర్‌నుంచి బ్యాన్‌ తరువాత గత ఏడాది అక్టోబర్‌లో ట్విటర్‌ను కొనుగోలు చేసిన అనంతరం మస్క్‌  2022 నవంబరులో  ట్రంప్  ట్విటర్‌ అకౌంట్‌ను  పునరుద్ధరించారు. (ఫెస్టివల్‌ సీజన్‌ వచ్చేస్తోంది...సూపర్‌ అప్‌కమింగ్‌ కార్లు )

కాగా 2020 సంవత్సరంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్రపూరితంగా వ్యవహరించడం వంటి కేసులు నమోదైన నేపథ్యంలో ట్రంప్‌ పోలీసులకు సరెండర్‌ అయ్యారు. అయితే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాముగా పోలీసులు ఎదుట లొంగిపోయినా కూడా అక్కడ అరెస్ట్‌ కిందే లెక్క. అలా అమెరికా చరిత్రలోనే ఫొటోతో సహా(మగ్‌షాట్‌) పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన  తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్‌ నిలిచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement