The US Secret Service arrested a 72-year-old man in New York: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ 72 ఏళ్ల థామస్ వెల్నిక్‌ని న్యూయార్క్‌లో అరెస్టు చేసింది. ట్రంప్ 2020 ఎన్నికలలో ఓడిపోయి పదవీ విరమణ చేయడానికి నిరాకరిస్తే గనుక కిడ్నాప్ చేసి చంపేస్తానని యూస్ కాపిటల్ పోలీసులకు ఇచ్చిన విచారణలో వెల్లడైంది.
పైగా గతేడాది జనవరిలో న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని సీక్రెట్ సర్వీస్ కార్యాలయానికి రెండు వాయిస్ మెయిల్ సందేశాలను పంపినట్లు కూడా వెల్నిక్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు వెల్నిక్ గత నవండర్ నెలలో కూడా న్యూయార్క్ నగరంలోని సీక్రెట్ సర్వీస్ డెస్క్‌కి తన సెల్ ఫోన్ నుండి మూడుసార్లు కాల్ చేశాడని, కాల్ చేసిన ప్రతిసారి తన పేరుతోనే పరిచయం చేసుకోవడం గమనార్హం. ఈ మేరకు ఫెడరల్ కోర్ట్ సోమవారం ఈ కేసును విచారించింది.
అయితే ఉద్దేశపూర్వకంగానే థామస్ వెల్నిక్ యూఎస్ మాజీ అధ్యక్షుడిని కిడ్నాప్ చేస్తానని, చంపుతానని బెదిరించాడని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి బ్రూక్లిన్ పేర్కొన్నారు. పైగా వెల్నిక్ వద్ద 22 క్యాలిబర్ తుపాకీ కూడా ఉందన్నారు. ఈ మేరకు వెల్నిక్‌కి రూ 3 లక్షల పూచికత్తుతో షరతులతో కూడిన బెయిల్‌ని ఫెడరల్ కోర్టు మంజూరు చేసింది. అయితే అతన్ని రాత్రిపూట గృహనిర్బంధం చేయాలని, పైగా జీపీఎస్ మానిటరింగ్ పరికరాన్ని కూడా అమర్చాలని బ్రూక్లిన్ ఆదేశించారు. అంతేగాక అతని మానసిక పరిస్థితిని విచారించి మద్యం లేదా మాదకద్రవ్యాలకు బానిసైనట్లయితే గనుక తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు.
(చదవండి: కెమెరామెన్ అమ్మతో చిట్టితల్లి.. ఏం చెప్పిందో వింటే ఫిదా అవుతారు)
Comments
Please login to add a commentAdd a comment