New york police
-
ట్రంప్ కిడ్నాప్, హత్యకు కుట్ర!
The US Secret Service arrested a 72-year-old man in New York: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ 72 ఏళ్ల థామస్ వెల్నిక్ని న్యూయార్క్‌లో అరెస్టు చేసింది. ట్రంప్ 2020 ఎన్నికలలో ఓడిపోయి పదవీ విరమణ చేయడానికి నిరాకరిస్తే గనుక కిడ్నాప్ చేసి చంపేస్తానని యూస్ కాపిటల్ పోలీసులకు ఇచ్చిన విచారణలో వెల్లడైంది. పైగా గతేడాది జనవరిలో న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని సీక్రెట్ సర్వీస్ కార్యాలయానికి రెండు వాయిస్ మెయిల్ సందేశాలను పంపినట్లు కూడా వెల్నిక్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు వెల్నిక్ గత నవండర్ నెలలో కూడా న్యూయార్క్ నగరంలోని సీక్రెట్ సర్వీస్ డెస్క్‌కి తన సెల్ ఫోన్ నుండి మూడుసార్లు కాల్ చేశాడని, కాల్ చేసిన ప్రతిసారి తన పేరుతోనే పరిచయం చేసుకోవడం గమనార్హం. ఈ మేరకు ఫెడరల్ కోర్ట్ సోమవారం ఈ కేసును విచారించింది. అయితే ఉద్దేశపూర్వకంగానే థామస్ వెల్నిక్ యూఎస్ మాజీ అధ్యక్షుడిని కిడ్నాప్ చేస్తానని, చంపుతానని బెదిరించాడని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి బ్రూక్లిన్ పేర్కొన్నారు. పైగా వెల్నిక్ వద్ద 22 క్యాలిబర్ తుపాకీ కూడా ఉందన్నారు. ఈ మేరకు వెల్నిక్కి రూ 3 లక్షల పూచికత్తుతో షరతులతో కూడిన బెయిల్‌ని ఫెడరల్ కోర్టు మంజూరు చేసింది. అయితే అతన్ని రాత్రిపూట గృహనిర్బంధం చేయాలని, పైగా జీపీఎస్ మానిటరింగ్ పరికరాన్ని కూడా అమర్చాలని బ్రూక్లిన్ ఆదేశించారు. అంతేగాక అతని మానసిక పరిస్థితిని విచారించి మద్యం లేదా మాదకద్రవ్యాలకు బానిసైనట్లయితే గనుక తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. (చదవండి: కెమెరామెన్ అమ్మతో చిట్టితల్లి.. ఏం చెప్పిందో వింటే ఫిదా అవుతారు) (చదవండి: అఫ్ఘనిస్తాన్‌లో పేలుడు... తొమ్మిది మంది మృతి) -
సెలబ్రిటీల ఈ-మెయిల్స్ హ్యాకింగ్
న్యూయార్క్: సెలబ్రిటీల ఈ-మెయిల్స్ హ్యాక్ చేసి స్క్రిప్ట్ లు, సెక్స్ వీడియోలు చోరీ చేసిన 23 ఏళ్ల యువకుడిని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బహమానా ప్రాంతానికి చెందిన ఆలొంజో నోవెల్స్ గా గుర్తించారు. కాపీ రైట్ అతిక్రమణ, వ్యక్తిగత వివరాల చోరీ కింద అతడిపై అభియోగాలు నమోదు చేశారు. అతడిపై నేరం రుజువైతే గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. అతడికి బెయిల్ లభించలేదు. బాధితుల పేర్లు విచారణాధికారులు వెల్లడించలేదు. 15 చిత్రాలు, టెలివిజన్ స్క్రిప్ట్ లు అమ్మేందుకు ప్రయత్నించడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. -
‘పెద్దన్న’పై మరో ప్రతిచర్య
న్యూఢిల్లీ/వాషింగ్టన్: దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే అరెస్టు విషయంలో భారత్ మరో ప్రతిచర్యకు దిగనుంది. వీసా అక్రమాల ఆరోపణలతో దేవయానిని అరెస్టు చేసిన న్యూయార్క్ పోలీసులు... ఆ కేసును ఉపసంహరించుకోవడానికి, ఆమెకు క్షమాపణలు చెప్పేందుకు భారత్ ఈనెల 13 వరకు గడువు విధించింది. అప్పటికీ అమెరికా స్పందించకపోతే 16వ తేదీ నుంచి భారత్లోనున్న అమెరికా దౌత్య కార్యాలయాల పరిసరాల్లో నిర్వహిస్తున్న వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మన దేశంలోని నాలుగు అమెరికా దౌత్య కార్యాలయాల పరిసరాల్లో రెస్టారెంట్/బార్, వీడియో క్లబ్, బౌలింగ్ అల్లే, క్రీడా సముదాయం, ఈత కొలను, బ్యూటీ పార్లర్, జిమ్ తదితర వాణిజ్య కార్యకలాపాలను అమెరికా కమ్యూనిటీ సపోర్ట్ అసోసియేషన్ (ఏసీఎస్ఏ) నిర్వహిస్తోంది. వీటిలో దౌత్యేతర వ్యక్తులకు, వారి కుటుంబాల సహా ప్రైవేట్ అమెరికా పౌరులకు అందిస్తున్న వాణిజ్య సేవలకు సంబంధించి టాక్స్ రిటర్న్‌లను సంబంధిత భారత విభాగాలకు సమర్పించాలని ఇప్పటికే అమెరికాను ఆదేశించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇలా దౌత్యేతర వ్యక్తులకు వాణిజ్య సేవలు అందించడం దౌత్య సంబంధాలపై వియన్నా ఒడంబడిక-1961లోని అధికరణ 41(3)కు విరుద్ధమని ప్రస్తావిస్తున్నాయి. తన ఇంటిలో పనిమనిషి సంగీతా రిచర్డ్ వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో డిప్యూటీ కాన్సుల్ జనరల్ దేవయాని ఖోబ్రగడేని గత నెల 12న న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేయడం విదితమే. చర్యలు సమంజసమే: ఖుర్షీద్ దౌత్యవేత్త దేవయాని విషయంలో అమెరికా దౌత్య కార్యాలయాలపై ప్రతిచర్యలకు భారత్ ప్రభుత్వం దిగడాన్ని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సమర్థించారు. భారత్ ఏమైనా చేయడానికి సిద్ధమని చెప్పడానికి అదొక హెచ్చరిక మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ప్రవాిసీ భారతీయ దివస్ కార్యక్రమంలో మాట్లాడారు.