'హ్యాపీ బర్త్ డే..' ఇక అందరిదీ! | ‘Happy Birthday’ Not Under Copyright Protection, federal court Rules | Sakshi
Sakshi News home page

'హ్యాపీ బర్త్ డే..' ఇక అందరిదీ!

Published Wed, Sep 23 2015 11:37 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

'హ్యాపీ బర్త్ డే..' ఇక అందరిదీ!

'హ్యాపీ బర్త్ డే..' ఇక అందరిదీ!

- పాట అందరిది.. ఏ ఒక్కరికో హక్కులు ఉండబోవన్న ఫెడరల్ కోర్టు
- బర్త్ డే సాంగ్ పేటెంట్పై వివాదానికి తెర

కాలిఫోర్నియా:
ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. పుట్టినరోజు పాటపై పట్టువిడుపులకు పోవద్దని, ఇప్పటికే విశ్వజనీనమైన ఈ పాట అందరికీ చెందిందని, ఏ ఒక్కరికో దీనిపై హక్కులు కల్పించలేమని అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు తీర్పు చెప్పింది.

అంతేకాదు.. 'హ్యాపీ బర్త్ డే టు యు' అనే పాటకు ఇకపై రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అమెరికాకే చెందిన వార్నర్- చాపెల్ మ్యూజిక్ కంపెనీ ఇప్పటివరకు ఈ పాటపై రాయల్టీ పొందుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా బర్త్ డే సాంగ్ పై హక్కును నిరసిస్తూ వార్నర్ సంస్థకు వ్యతిరేకంగా పోరాడింది ఓ మహిళ కావటం గమనార్హం.

బర్త్ డే సాంగ్ ను ఎవరు రాశారు? ఎప్పటి నుంచి ఇది వాడుకలోకి వచ్చింది? తదితర వివరాలను పొందుపరుస్తూ జెన్నీఫర్ నెల్సన్ అనే మహిళా దర్శకురాలు ఓ డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీలోనూ బర్త్ డే సాంగ్ ఉండటంతో రాయల్టీ చెల్లించాల్సిందేనని వార్నర్ సంస్థ డిమాండ్ చేసింది. 'అదేంటి పాట చరిత్రను వెలికితీసినా రాయల్టీ కట్టాల్సిందేనా!' అని వాపోయిన జెన్నీఫర్.. వార్నర్ సంస్థ తీరును నిరసిస్తూ కోర్టును ఆశ్రయించింది. వార్నర్ కు వ్యతిరేకంగా మరి కొందరూ వాదులుగా చేరారు. విచారణ చేపట్టిన కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.

ఇదీ పుట్టినరోజు పాట నేపథ్యం
గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం 'హ్యాపీ బర్త్ డే టూ యూ'.. ఇంగ్లీష్ లో మోస్ట్ పాపులర్ సాంగ్. అమెరికాకు చెందిన పాటీ హిల్, మిల్డెడ్ అనే సొదరీమణులు 1893లో ఈ పాటను రాసి, ట్యూన్ చేసినట్లు ఆధారాలున్నాయి. కిండర్ గార్డెన్ బోధకురాలైన పాటీ.. పియానో విధ్వాంసురాలైన తన సోదరి మిల్డెడ్ తో కలిసి.. పిల్లలకు సులభంగా అర్థమయ్యే, నేర్చుకోగలిగే పాటలను రూపొందించేవారు. ఆ క్రమంలో రూపొందించిన 'గుడ్ మార్నింగ్ టు ఆల్' ట్యూన్ నుంచి 'హ్యాపీ బర్త్ డే టు యు' పుట్టింది. 1912లో మొదటిసారి ఈ పాట అచ్చయింది. తర్వాతి కాలంతో సమ్మీ సంస్థ ఈ పాటపై కాపీరైట్ (1935లో) సాధించింది. 1990లో వార్నర్ బ్రదర్స్ కు చెందిన వార్నర్- చాపెల్ మ్యూజిక్ కంపెనీ.. 15 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 100 కోట్లు) చెల్లించి 2030 వరకు హ్యాపీ బర్త్ డే పాటపై హక్కులు పొందింది. కాగా జెన్నీఫర్ లారెన్స్ పోరాటంతో బర్త్ డే పాట అందరి సొంతమైనట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement