ఓ కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్‌జీపీటీ ఇచ్చిన ఆధారాల్ని పరిగణలోకి తీసుకొని తీర్పు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇంతకీ ఆ కేసు ఏంటి? చాట్‌జీపీటీ ఇచ్చిన ఆధారాలేంటి?
పలు నివేదికల ప్రకారం.. ఇటీవల ఫ్రాన్స్ లగ్జరీ షూ తయారీ సంస్థ క్రిస్టియన్ లౌబౌటిన్.. భారత్‌లోని ఢిల్లీ కేంద్రంగా షుటిక్ అనే కంపెనీ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా షూ’లను తయారు చేసి అమ్మకాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు షుటిక్‌పై క్రిస్టియన్ లౌబౌటిన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.
తమ సంస్థ కొన్ని షూ డిజైన్లు తమకే చెందుతాయంటూ ట్రేడ్‌మార్క్ తీసుకుందని, ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కోర్టుకు వివరించింది. అయితే, షుటిక్ తమ ట్రేడ్ మార్క్ షూ డిజైన్లను కాపీ కొట్టిందని, ఇదే విషయాన్ని చాట్‌జీపీటీ చెప్పినట్లు ఆధారాలు సమర్పించింది. తమకు న్యాయం చేయాలని విన్నవించుకుంది.
ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు.. న్యాయస్థానంలో చట్టపరమైన లేదా వాస్తవిక సమస్యల పరిష్కారానికి చాట్‌జీపీటీ ఇచ్చిన ఆధారాలు సరిపోవని కోర్టు పేర్కొంది. ఏఐ చాట్‌బాట్‌ల ప్రతిస్పందనలు, కల్పితాలు, ఊహాజనిత డేటా మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు.. ప్రతివాది ఉద్దేశపూర్వకంగా మనీ సంపాదనకు ట్రేడ్ మార్క్ నిబంధనలను ఉల్లంఘించారని అర్థమవుతుందని తెలిపింది. ఇకపై బూట్ల డిజైన్లు, రంగులు కాపీ చేయరాదని, ఆ ఒప్పందం ఉల్లంఘిస్తే రూ.25 లక్షలు జరిమాన చెల్లించాల్సి వస్తుందని ప్రతివాదిని హెచ్చరించింది. ప్రస్తుతం, పిటిషనర్ ఖర్చుల కింద వాదికి రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
చదవండి👉 ‘ఆ AI టూల్‌ను షట్‌డౌన్ చేస్తున్నాం’.. చాట్‌జీపీటీ సృష్టికర్త సంచలన ప్రకటన!
Comments
Please login to add a commentAdd a comment