హెచ్–1బీ వీసా కాలపరిమితిని మూడేళ్ల కన్నా తక్కువకు కుదించడంపై అమెరికా కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. వేయికి పైగా ఇండో–అమెరికన్ల నేతృత్వంలోని కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీ సర్వ్ అలయన్జ్ అనే సంస్థ అమెరికా వలస సేవల సంస్థ యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్)కి వ్యతిరేకంగా ఈ దావా వేసింది.