సుష్మాకు మరో తలనొప్పి?
భోపాల్: భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు మరో కొత్త తలనొప్పి తయారైంది. ఇప్పటికే లలిత్ మోడీకి వీసా ఇప్పించేందుకు సహాయపడినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మా స్వరాజ్ సరికొత్త వివాదంలో చిక్కుకోబోతున్నారని తెలుస్తోంది. ఆమె భర్త, కుమార్తెలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నేరుగా ప్రభుత్వ అడ్వకేట్లుగా నియామకాలు చేపట్టినట్లు ఓ సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది.
దీంతో భారీ స్థాయిలో మరోసారి విమర్శలు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మరోసారి విరుచుకుపడింది. అయితే, నిబంధనల ప్రకారమే వారి నియామకాలు జరిపినట్లు, వారి మెరిట్ ఆధారంగానే అడ్వకేట్లుగా నియామకం చేసినట్లు ప్రభుత్వం తరుపు అధికారులు ప్రకటించారు. అజయ్ దుబే అనే సామాజిక ఉద్యమకారుడు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయగా సుష్మా భర్త స్వరాజ్ కౌశల్, కుమార్తె బన్సూరీ కౌశల్ 2009, 2013 సంవత్సరాల్లో నియామకాలు జరిపినట్లు తెలిపారు.