సుష్మాస్వరాజ్, కౌషల్ స్వరాజ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: లక్నోలో పాస్‌పోర్టు సేవాకేంద్రం ఉదంతం తాలూకూ ట్వీట్లు, కామెంట్లు, విమర్శల పరంపర ఆగడం లేదు. పాస్‌పోర్టు కార్యాలయ అధికారిని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ బదిలీ చేయడంతో ఆమెపై రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. సంఘ్‌పరివార్ కార్యకర్తలు సైతం ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. తాజాగా.. సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌషల్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ ఢిల్లీ ఐఐటీకి చెందిన ముఖేష్ గుప్తా చేసిన ట్వీట్ చర్చానీయాంశమైంది. ‘ముస్లింలను బుజ్జగించేందుకు మీ ఆవిడ చాలా కష్టపడుతోంది. ఇంటికి వచ్చాక ఆమెకు నాలుగు తగిలించండి. మీరెన్ని ప్రయత్నాలు చేసినా ముస్లింలు బీజేపీకి ఓటు వేయరని చెప్పండి’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు.
నేపథ్యం: లక్నోలో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్టు ఆఫీసులో గత శనివారం చేదు అనుభవం ఎదురైంది. మహ్మద్ అనాస్ సిద్దిఖీ-తన్వీ సేథ్ దంపతుల పట్ల పాస్‌పోర్టు సేవా కేంద్రం అధికారి వికాస్ మిశ్రా మతపరమైన వ్యాఖ్యలు చేశాడని సదరు జంట సుష్మాస్వరాజ్‌కు ట్వీట్ చేయడంతో ఆమె స్పందించారు. హుటాహుటిన చర్యలు ప్రారంభించి వికాస్ మిశ్రాను గోరఖ్‌పూర్ బదిలీ చేశారు. సిద్దిఖీ-తన్వీ జంటకు వెంటనే పాస్‌పోర్టు జారీ చేయించారు. అయితే, సిద్దిఖీ-తన్వీ సమర్పించిన డిక్లరేషన్ వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని ఇంటలిజెన్స్ వర్గాల వెరిఫికేషన్‌లో బయటపడింది.
— Governor Swaraj (@governorswaraj) June 30, 2018
Comments
Please login to add a commentAdd a comment