నోట్ల మార్పిడిలో ఎన్‌ఆర్‌ఐల ఇబ్బందులపై దృష్టి పెట్టినట్టు విదేశాంగ శాఖ పేర్కొంది.
న్యూఢిల్లీ: రద్దైన పాత రూ. 500, వెయ్యి నోట్ల మార్పిడిలో ఎన్‌ఆర్‌ఐల ఇబ్బందులపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టిందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఏర్పాౖటెన అంతర్ మంత్రిత్వ శాఖ టాస్క్‌ఫోర్స్ సూచనల్ని సమీక్షిస్తున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు.
అంతర్ మంత్రిత్వ శాఖ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ప్రవాస భారతీయుల దగ్గరున్న పాత పెద్ద నోట్ల మార్పిడిపై కేంద్రం ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని ఆయన అంగీకరించారు.