Vikas Swarup
-
కెనడా హైకమిషనర్‌గా వికాస్ స్వరూప్
న్యూఢిల్లీ: విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ కెనడాలో భారత హైకమిషనర్‌గా నియమితులయ్యారు. ప్రçస్తుతం అదనపు కార్యదర్శి హోదాలో కొనసాగుతున్న ఆయన త్వరలోనే కొత్త బాధ్యతలు చేపడతారని విదేశాంగ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ అఫ్గానిస్తాన్ , ఇరాన్ డివిజన్ లో ఉమ్మడి కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న గోపాల్ బాగ్లే స్వరూప్ స్థానంలో విదేశాంగ శాఖ నూతన అధికార ప్రతినిధిగా నియమితులవుతారు. 1986 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన స్వరూప్ విదేశాంగ శాఖ సేవలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువచేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన రాసిన తొలి నవల ‘క్యూ అండ్ ఏ’ను ఆస్కార్ అవార్డు గెలుపొందిన ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంగా తీశారు. -
‘ఎన్నారైల నోటు పాట్లు పరిష్కరిస్తాం’
న్యూఢిల్లీ: రద్దైన పాత రూ. 500, వెయ్యి నోట్ల మార్పిడిలో ఎన్ఆర్ఐల ఇబ్బందులపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టిందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఏర్పాౖటెన అంతర్ మంత్రిత్వ శాఖ టాస్క్‌ఫోర్స్ సూచనల్ని సమీక్షిస్తున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. అంతర్ మంత్రిత్వ శాఖ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ప్రవాస భారతీయుల దగ్గరున్న పాత పెద్ద నోట్ల మార్పిడిపై కేంద్రం ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని ఆయన అంగీకరించారు. -
భారత ఎంబసీల వెబ్సైట్లు హ్యాక్
లండన్/న్యూఢిల్లీ: ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లోని 7 భారత రాయబార కార్యాలయాల వెబ్సైట్లను దుండగులు హ్యాక్ చేశారు. హ్యాకింగ్‌కు గురైన వాటిలో రొమేనియా, దక్షిణాఫ్రికా, లిబియా, ఇటలీ, స్విట్జర్లాండ్, మలావీ, మాలి కార్యాలయాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని భారత రాయబార కార్యాలయాల వెబ్సైట్ ముందుగా హ్యకింగ్ కు గురైంది. 22 టేబుళ్ల డేటాను హ్యాక్లర్లు బహిర్గతం చేశారు. లాగిన్, పాస్ వర్డ్ వివరాలు బయటపెట్టేశారు. 161 మంది భారతీయుల పేర్లు, పాస్ పోర్టు నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు బహిర్గతం చేశారు. మిగతా ఆరు దేశాల్లోని భారత ఎంబసీల కార్యాలయాల వెబ్సైట్లను ఇదేవిధంగా హ్యాక్ చేశారు. సమస్యను గుర్తించామనీ, పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. -
13 మంది భారతీయులకు జికా వైరస్
సింగపూర్‌లో 13 మంది భారతీయులు దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే ప్రమాదకర జికా వైరస్ బారినపడ్డారు. భారత విదేశాంగశాఖ అధికారులు గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే సింగపూర్ లో వందల మందికి జికా వైరస్ సంక్రమించిన విషయం తెలిసిందే. తాజాగా వైద్యులు జరిపిన టెస్టుల్లో భారతీయులకు ఈ వైరస్ సంక్రమించినట్లు తమకు సమాచారం అందినట్లు వికాస్ స్వరూప్ తెలిపారు. మొదటగా భవన నిర్మాణ కార్మికులలో జికా వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. గతంలో బ్రెజిల్ ను వణికించిన జికా వైరస్ ప్రస్తుతం సింగపూర్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జికా నిర్మూలనకు సింగపూర్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా జికా కేసులు మాత్రం పెరుగిపోతున్నాయి. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గర్బిణీలకు జికా వైరస్ వ్యాప్తి చెందితే పుట్టబోయే పిల్లలు చిన్న తలతో పుట్టడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. -
'నీస్ దాడిలో భారతీయులకు ఏం కాలేదు'
-
'నీస్ దాడిలో భారతీయులకు ఏం కాలేదు'
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడిలో భారతీయులెవరూ మృతి చెందలేదని విదేశాంగ శాఖ తెలిపింది. భారతీయులు మృతి చెందినట్టుగానీ, గాయపడినట్టు గానీ సమాచారం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. పారిస్ లోని భారత రాయబారి అక్కడి భారతీయులకు అందుబాటులో ఉన్నారని, నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. నీస్ ఉగ్రదాడి నేపథ్యంలో ఫ్రాన్స్ లోని భారతీయుల కోసం రాయబార కార్యాలయం +33-1-40507070 హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసిందని ప్రకటించారు. సహాయం కావాల్సిన వారు ఈ నంబర్ కు ఫోన్ చేయొచ్చని తెలిపింది. ఉగ్ర దాడిలో కనీసం 80 మంది మృతి చెందగా, వందమందిపైగా గాయపడినట్టు సమాచారం. -
గుండెపోటుతో కిర్పాల్ సింగ్ మృతి: పాకిస్థాన్
న్యూఢిల్లీ: భారత ఖైదీ కిర్పాల్ సింగ్ గుండెపోటుతో మృతి చెందాడని కేంద్ర ప్రభుత్వానికి పాకిస్థాన్ సమాచారం అందించింది. లాహోర్ జైల్లో రెండు రోజుల క్రితం కిర్పాల్ సింగ్ మృతి చెందాడు. ఈ నెల 11న మధ్యాహ్నం 2.55 ప్రాంతంలో కిర్పాల్ గుండెపోటుతో మృతి చెందాడని పాక్ ప్రభుత్వం తమకు తెలిపిందని విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ వెల్లడించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉందని చెప్పారు. పంజాబ్ ప్రావిన్స్ లో జరిగిన సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో 25 ఏళ్లుగా లాహోర్ జైల్లో కిర్పాల్ సింగ్ శిక్ష అనుభవిస్తూ మరణించాడు. కిర్పాల్ మృతిపై అతడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు ఆందోళనకు దిగడంతో ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం దృష్టికి కేంద్రం తీసుకెళ్లింది. కేంద్రం ఆదేశాలతో పాకిస్థాన్ లో భారత హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న జేపీ సింగ్ బుధవారం పాక్ విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. కిర్పాల్ మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. -
మోదీతో నేపాల్ ప్రధాని భేటీ
న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీతో నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అంతకుముందు ఈ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ హౌస్‌కు వచ్చిన నేపాల్ ప్రధాని కె.పి.శర్మకు మోదీ ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత్‌లో పర్యటన నిమిత్తం నేపాల్ ప్రధాని కె.పి.శర్మ శుక్రవారం న్యూఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. 2011లో నేపాల్ ప్రధాని బాబురామ్ భట్టారాయ్ ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మొదటిసారిగా భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత 2014లో మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి ప్రధాని సుశీల్ కోయిరాల హాజరయ్యారు. అలాగే అదే ఏడాది ఆగస్టులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ నేపాల్‌లో పర్యటించారు. అదే ఏడాది నవంబర్‌లో ఖాట్మండ్ వేదికగా జరిగిన సార్క్ లో మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24వ తేదీన కె.పి.శర్మ భారత పర్యటన ముగించుకుని ముంబై నుంచి తిరిగి నేపాల్ కి వెళ్లతారు. -
చర్యలు తీసుకుంటేనే చర్చలు
-
చర్యలు తీసుకుంటేనే చర్చలు
* ఇప్పుడు బంతి మీ కోర్టులోనే ఉంది: పాకిస్తాన్‌కు స్పష్టం చేసిన భారత్ * భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల భేటీపై అనిశ్చితి * ఏం చేస్తారో చెప్పండి.. ఆ తర్వాతే మాట్లాడుకుందాం: వికాస్ స్వరూప్ * జైషే పాత్రపై పాక్‌కు స్పష్టమైన ఆధారాలిచ్చిన అజిత్ దోవల్ న్యూఢిల్లీ: భారత్-పాక్ మధ్య చర్చల ప్రక్రియ ముందడుగేయాలంటే.. ముందుగా పఠాన్‌కోట్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది. ‘ఇప్పుడు బంతి పాక్ కోర్టులో ఉంది’ అని తెలిపింది. దాడికి వ్యూహరచన పాక్‌లో జరిగినట్లు ఆధారాలున్నందున.. తర్వాత ఏం చేయాలో నిర్ణయించాల్సింది పాకిస్తానేనని తేల్చిచెప్పింది. షెడ్యూల్ ప్రకారం 15న ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య చర్చలు జరగాల్సి ఉండగా.. పఠాన్‌కోట్ ఘటన తర్వాత ఈ భేటీపై అనిశ్చితి నెలకొంది. అయితే, ఈ చర్చలను నిలిపేసి ఇరుదేశాల భద్రతా సలహాదారులు మరోసారి కలుస్తారని వార్తలొస్తున్నాయి. ఢిల్లీలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘విదేశాంగ కార్యదర్శుల మధ్య చర్చలు జరుగుతాయో లేదో చెప్పలేం. పఠాన్‌కోట్‌పై పాక్ ఎలాంటి డెడ్‌లైన్ ఇవ్వకుండా.. చర్చలు కష్టం’ అన్నారు. పాక్ ప్రధానితో ఫోన్ సంభాషణలో.. ఉగ్రవాదంపై కఠిన చర్యలపైనే మోదీ పట్టుబట్టారని వెల్లడించారు. పాక్ నుంచి భారత్‌లో విధ్వంసానికి జరుగుతున్న ప్రణాళికలపై చర్యలు తీసుకోవాలని గట్టిగానే చెప్పారని.. దీనికి పాక్ ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. షరీఫ్ ఉన్నతస్థాయి సమావేశం భారత్-పాక్ చర్చల ప్రక్రియపై అనిశ్చితి నెలకొన్న సమయంలో.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసి.. పఠాన్‌కోట్ దాడిపై చర్చించారు. ఆర్థిక, హోం శాఖ మంత్రులు, విదేశాంగ శాఖ సలహాదారు, ఎన్ఎస్ఏ చీఫ్, ఇంటెలిజెన్స్చీఫ్లతో మాట్లాడారు. దాడి ఘటనపై భారత్ అందజేసిన సమాచారం ఆధారంగా విచారణ ప్రారంభించాలని.. కేవలం టెలిఫోన్ నంబర్లే ఉన్నందున మరింత సమాచారాన్ని భారత్‌నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. విచారణ పూర్తయిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. జైషే పాత్ర స్పష్టమే!: పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో జైషే మొహమ్మద్ సంస్థ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలను భారత ఇంటలిజెన్స్ సంపాదించింది. జైషే చీఫ్ మౌలానా మసూద్ అజర్, అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ (1999 కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి)తో పాటు మరో ఇద్దరు ఈ దాడికి వ్యూహరచన జరిపినట్లు గుర్తించింది. లాహోర్ సమీపంలో కుట్ర జరిగినట్లు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. భారత ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్.. పాక్ ఎన్ఎస్ఏ చీఫ్‌తో మాట్లాడి.. స్పష్టమైన,చర్యలు తీసుకునేందుకు అనువైన సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిసింది. ఈ వివరాలను పాకిస్తాన్‌కు అందజేసి వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చర్చలు కొనసాగించండి: చైనా ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న భారత్-పాక్ సంబంధాలను దెబ్బతీసేందుకే కొన్ని గ్రూపులు ప్రయత్నిస్తున్నాయని స్నేహబంధాన్ని మెరుగుపరుచుకునేందుకు చర్చల ప్రక్రియ కొనసాగించాలని ఆకాంక్షించింది. చివరి దశలో కూంబింగ్ పఠాన్‌కోట్: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో కూంబింగ్ చివరి దశకు చేరుకుందని భద్రతా దళాలు వెల్లడించాయి. ఎన్ఎస్జీ, గరుడ్, ఐఏఎఫ్ కమాండోలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాగున్నారా? ఎక్కడైనా బాంబులు పెట్టారా? అని వెతికేందుకే ఈ కూంబింగ్ జరుగుతోందని ఎయిర్ కమాండర్ జేఎస్ దమూన్ తెలిపారు. ఎన్ఎస్జీ బలగాల తక్షణ స్పందన, గరుడ్ విభాగం చాకచక్యంగా వ్యవహరించటంతో ఉగ్రవాదులను ఒక ప్రాంతానికే పరిమితం చేశామని చెప్పారు. బీఎస్ఎఫ్ నిజనిర్ధారణ కమిటీ ఉగ్రవాదులు భారత్-పాక్ సరిహద్దుగుండా ప్రవేశించి దాడికి పాల్పడ్డారనే విమర్శల నేపథ్యంలో.. అక్రమ చొరబాట్లు, నదులు, దట్టమైన అడవులున్న చోటనిఘా కొరవడటంపై విచారించేందుకు బీఎస్ఎఫ్ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. పదిహేను రోజుల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది. సల్వీందర్ వాంగ్మూలం నమోదు: విచారణలో భాగంగా ఎస్పీ సల్వీందర్ సింగ్ వాంగ్మూలాన్ని ఎన్ఐఏ తీసుకుంది. ఈయన మిత్రుడు రాజేశ్ వర్మను విచారించారు. సరిహద్దు గ్రామాల్లో పర్యటించిన ఎన్ఐఏ అధికారులు.. బీఎస్ఎఫ్ సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులను విచారించారు. ఉగ్రవాదుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక సివిల్ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు? సరిహద్దు గ్రామమైన టిబ్రీలో మిలటరీ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగాడుతుండగా చూశామని గ్రామస్తులు చెప్పటంతో సైనికులు, పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. -
'మోదీ మాట్లాడారు.. బంతి పాక్ కోర్టులోనే ఉంది'
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ దాడి విషయంపై ప్రధాని నరేంద్రమోదీ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ఇప్పటికే మాట్లాడారని భారత విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. తగిన చర్యలు తీసుకుంటామని షరీఫ్ హామీ ఇచ్చారని, ఆయన తీసుకోబోయే చర్యలకోసం ఇప్పుడు ఎదురుచూస్తున్నామని తెలిపారు. బంతి ఇప్పుడు పాకిస్థాన్ కోర్టులోనే ఉందని, పఠాన్ కోట్ దాడికి తగిన చర్యలు తీసుకునేందుకు నిఘా విభాగం సమాచారం కూడా అందుబాటులో ఉందని అన్నారు. పఠాన్ కోట్ దాడితో మరోసారి, సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యల అంశం కీలకంగా మారిందని, దీనిపై మరింత దృష్టిని సారిస్తామని చెప్పారు. విదేశాల్లో భారత వ్యవహారాలశాఖను భారత విదేశాంగ వ్యవహారాలశాఖలో కలిపేందుకు చేసిన ప్రతిపాదనకు ప్రధాని మోదీ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే సిరియా విదేశాంగ మంత్రి ఈ నెల 11 నుంచి 14 వరకు భారత్ పర్యటనకు రానున్నట్లు చెప్పారు.