'మోదీ మాట్లాడారు.. బంతి పాక్ కోర్టులోనే ఉంది' | We now await prompt and decisive action from Pak PM: Vikas Swarup | Sakshi
Sakshi News home page

'మోదీ మాట్లాడారు.. బంతి పాక్ కోర్టులోనే ఉంది'

Published Thu, Jan 7 2016 4:44 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

'మోదీ మాట్లాడారు.. బంతి పాక్ కోర్టులోనే ఉంది' - Sakshi

'మోదీ మాట్లాడారు.. బంతి పాక్ కోర్టులోనే ఉంది'

న్యూఢిల్లీ: పఠాన్ కోట్ దాడి విషయంపై ప్రధాని నరేంద్రమోదీ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ తో ఇప్పటికే మాట్లాడారని భారత విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. తగిన చర్యలు తీసుకుంటామని షరీఫ్ హామీ ఇచ్చారని, ఆయన తీసుకోబోయే చర్యలకోసం ఇప్పుడు ఎదురుచూస్తున్నామని తెలిపారు.

బంతి ఇప్పుడు పాకిస్థాన్ కోర్టులోనే ఉందని, పఠాన్ కోట్ దాడికి తగిన చర్యలు తీసుకునేందుకు నిఘా విభాగం సమాచారం కూడా అందుబాటులో ఉందని అన్నారు. పఠాన్ కోట్ దాడితో మరోసారి, సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యల అంశం కీలకంగా మారిందని, దీనిపై మరింత దృష్టిని సారిస్తామని చెప్పారు. విదేశాల్లో భారత వ్యవహారాలశాఖను భారత విదేశాంగ వ్యవహారాలశాఖలో కలిపేందుకు చేసిన ప్రతిపాదనకు ప్రధాని మోదీ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే సిరియా విదేశాంగ మంత్రి ఈ నెల 11 నుంచి 14 వరకు భారత్ పర్యటనకు రానున్నట్లు చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement