
భారత ఎంబసీల వెబ్‌సైట్లు హ్యాక్
లండన్/న్యూఢిల్లీ: ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లోని 7 భారత రాయబార కార్యాలయాల వెబ్‌సైట్లను దుండగులు హ్యాక్ చేశారు. హ్యాకింగ్‌కు గురైన వాటిలో రొమేనియా, దక్షిణాఫ్రికా, లిబియా, ఇటలీ, స్విట్జర్లాండ్, మలావీ, మాలి కార్యాలయాలు ఉన్నాయి.
దక్షిణాఫ్రికాలోని భారత రాయబార కార్యాలయాల వెబ్‌సైట్ ముందుగా హ్యకింగ్ కు గురైంది. 22 టేబుళ్ల డేటాను హ్యాక్లర్లు బహిర్గతం చేశారు. లాగిన్, పాస్ వర్డ్ వివరాలు బయటపెట్టేశారు. 161 మంది భారతీయుల పేర్లు, పాస్ పోర్టు నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు బహిర్గతం చేశారు. మిగతా ఆరు దేశాల్లోని భారత ఎంబసీల కార్యాలయాల వెబ్‌సైట్లను ఇదేవిధంగా హ్యాక్ చేశారు.
సమస్యను గుర్తించామనీ, పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు.