ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందుకోసం విదేశాంగ శాఖ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. అదనపు కార్యదర్శి దమ్ము రవిని బాధ్యుడిగా నియమించింది. ఈ విభాగం విదేశాల్లోని భారతీయులు అడిగే ప్రశ్నలకు హెల్ప్‌లైన్ నంబర్లు, ఈమెయిల్స్, సామాజిక మాధ్యమాల ద్వారా సమాధానం ఇవ్వనుంది. కోవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని చేరవేయనుంది. (కరోనా టీకా; అమెరికా కుయుక్తులు!)
ఇరాన్, ఇటలీల్లో భారతీయ విద్యార్థుల క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇక్కడి నుంచి పంపిన వైద్య బృందం అక్కడి భారతీయులకు కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహిస్తోందని వెల్లడించింది. ఇరాన్‌లో చిక్కుకున్న పలువురు భారతీయులు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సాయంతో స్వదేశానికి చేరుకున్నారని తెలిపింది. ఇటలీలోని మిలాన్‌కు చెందిన 218 మంది ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారని కూడా విదేశాంగ శాఖ వెల్లడించింది. (కరోనా ఎదుర్కోవాలంటే ఇలా చేయండి!)
Comments
Please login to add a commentAdd a comment