special cell
-
డ్రగ్స్ కట్టడికి పోలీస్ స్టేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నార్కోటిక్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటుపై పోలీస్ శాఖ రూపకల్పన చేస్తోంది. అందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విభాగాలపై అధ్యయనం చేస్తున్న పోలీస్ శాఖ పటిష్టమైన ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు రూపుదిద్దుకోబోతున్న విభాగానికి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ హోదా కలిగి ఉండాలని భావిస్తోంది. ఎందుకంటే ప్రత్యేకమైన నేరాలను విచారించబోతున్న ఈ విభాగానికి కేసు నమోదు చేసుకొని చార్జిషీట్ వేసే అధికారం కల్పిస్తేనే వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడం సులభతరం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఉన్న నేర పరిశోధన విభాగం (సీఐడీ), అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) లాగా నార్కోటిక్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ (ఎన్‌ఓసీసీసీ) విభాగం కూడా విధులు నిర్వర్తించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఇలా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసుకుంటే రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్, సంబంధిత ఇతర నేరాల కేసులు నమోదు చేసే అధికారం, స్థానిక పోలీస్స్టేషన్ల నుంచి కేసులు బదలాయించుకొని విచారణ చేసే అధికారం ఈ యూనిట్‌కు ఉంటుంది. ఎస్హెచ్ఓగా డీఎస్పీ ర్యాంకు అధికారి పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ (స్టేషన్ హౌజ్ ఆఫీసర్)గా డీఎస్పీ ర్యాంకు అధికారిని నియమించుకునేలా నిబంధనలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా ప్రతీ జిల్లాలో ఒక ఎన్‌ఓసీసీసీ (నార్కోటిక్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్) ఏర్పాటు చేయాలని, దీనివల్ల తీవ్రత కిందిస్థాయి వరకు వెళ్తుందని, నిందితుల్లోనూ భయం ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సీఐడీ, ఏసీబీలాగే జిల్లాల వారీగా యూనిట్లు ఏర్పాటుచేసి, డీఎస్పీ ర్యాంకు అధికారి నేతృత్వంలో కార్యాలయాలు ఉండేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు తెలిసింది. అయితే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మాత్రం అదనపు డీసీపీ/అదనపు ఎస్పీ నేతృత్వంలో యూనిట్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది. డిప్యుటేషన్‌పై సిబ్బంది వెయ్యి మందితో ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఎన్‌ఓసీసీసీకి తొలిదశలో 350–400 మందిని నియమించాలని భావిస్తున్నారు. ఇందులో 85 శాతం మందిని పోలీస్ శాఖ నుంచి, మిగిలిన 15 శాతం ఎక్సైజ్ విభాగం నుంచి డిప్యుటేషన్‌పై తీసుకునేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ ర్యాంకు అధికారి వరకు కనీసం మూడేళ్లు, సీఐ ర్యాంకు అధికారిని రెండేళ్లపాటు డిప్యుటేషన్‌పై తీసుకుంటారని తెలిసింది. ఇలా పలు దఫాలుగా సిబ్బందిని పెంచుకుంటూ వెయ్యి మందితో పూర్తిస్థాయి విభాగంగా మార్చాలని భావిస్తున్నారు. మరోసారి సీఎంతో చర్చించి.. కొత్త సెల్ ఏర్పాటుకు ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో రూపొందించి నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నట్టు సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు తెలిపారు. ముందుగా విభాగం ఏర్పాటుపై అదేశాలు వెలువడగానే, నియామకాలకు సంబంధించి ఆదేశాలు వెలువడతాయని చెప్పారు. ప్రతిపాదనలపై మరోసారి సీఎం కేసీఆర్‌తో చర్చించాల్సి ఉంటుందని, మార్పులు చేర్పులు, కార్యాలయాల ఏర్పాటు తదితర అంశాలపై ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
విదేశాల్లోని భారతీయుల కోసం..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందుకోసం విదేశాంగ శాఖ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. అదనపు కార్యదర్శి దమ్ము రవిని బాధ్యుడిగా నియమించింది. ఈ విభాగం విదేశాల్లోని భారతీయులు అడిగే ప్రశ్నలకు హెల్ప్‌లైన్ నంబర్లు, ఈమెయిల్స్, సామాజిక మాధ్యమాల ద్వారా సమాధానం ఇవ్వనుంది. కోవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని చేరవేయనుంది. (కరోనా టీకా; అమెరికా కుయుక్తులు!) ఇరాన్, ఇటలీల్లో భారతీయ విద్యార్థుల క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇక్కడి నుంచి పంపిన వైద్య బృందం అక్కడి భారతీయులకు కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహిస్తోందని వెల్లడించింది. ఇరాన్లో చిక్కుకున్న పలువురు భారతీయులు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సాయంతో స్వదేశానికి చేరుకున్నారని తెలిపింది. ఇటలీలోని మిలాన్‌కు చెందిన 218 మంది ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారని కూడా విదేశాంగ శాఖ వెల్లడించింది. (కరోనా ఎదుర్కోవాలంటే ఇలా చేయండి!) -
‘అత్యాచారాల నిరోధానికి సెల్లు’
సాక్షి, అమరావతి: మహిళలపై అత్యాచారాల నిరోధానికి ప్రత్యేక్ సెల్లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపా రు. ఇలాంటి సంఘట నల్లో ఏంచేయాలనే దానిపై అధ్యయనం చేయిస్తామని, అవసరమైతే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ఆడబిడ్డకు రక్షణగా నిలుద్దాం పేరుతో సోమవారం విజయ వాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకూ జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనం తరం స్టేడియంలో జరిగిన సభలో మాట్లాడారు. కార్యక్రమంలో చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి తదితరులు పాల్గొన్నారు. అది మా విధానం కాదు జనాభా నియంత్రణ తమ విధానం కాదని చంద్రబాబు అన్నారు. జనాభాను నియంత్రిస్తే నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంట్ స్థానాల సంఖ్య తగ్గిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో సోమవారమిక్కడ సచివాలయంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులు కేటాయించడం వల్ల జనాభా నియంత్రణ పాటిస్తూ, ఆర్థికంగా పురోగతిలో ఉన్న రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. కేంద్రం తీరు ప్రగతిశీల రాష్ట్రాలకు చేటు చేసే విధంగా ఉందన్నారు. కాగా, 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో రాష్ట్రాలకున్న అభ్యంతరాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆర్థిక మంత్రుల సమావేశంలో డ్రాఫ్ట్ మెమోరాండం రూపొందించారు. వాటిని సదస్సుకు హాజరైన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు అందజేశారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వాటిని చూపించి మార్పులేమైనా ఉంటే.. సరిచేసి ఢిల్లీలో మూడో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజున రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకుని మెమోరాండం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. -
‘మీ సేవా’ అధికవసూళ్లపై ప్రత్యేక సెల్
అనంతపురం అర్బన్ : మీ సేవా, ఆధార్ కేంద్రాల్లో నిర్దేశించిన మొత్తం కంటే అధికంగా వసూళ్లపై ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ సేవల విషయంలో ప్రజలు కొత్తగా నమోదుకు ఉచితంగానూ, సవరణకు రూ.15 మాత్రమే చెల్లించి రశీదు పొందాలని తెలిపారు. ఇంతకు మించి ఎవరైనా వసూళ్లకు పాల్పడితే 1800 425 6401 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. -
జర్నలిస్టుల ఉచిత విద్య అమలుకు ప్రత్యేక సెల్
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలోని అక్రిడేటేషన్ కలిగిన జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలుకు జిల్లా విద్యాశాఖ అధికారి, ఆర్ఐఓ చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం సూచించారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌ను శనివారం జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలులో ఎక్కడా సమస్యలు తలెత్తకూడదన్నారు. ఎవరైనా ఇబ్బందులు ఉంటే నేరుగా ఈ సెల్లో ఫిర్యాదు చేయవచ్చని జర్నలిస్టులకు సూచించారు. ఈ విషయంలో డీఈఓ, ఆర్ఐఓతో తరచూ పర్యవేక్షిస్తానన్నారు. ప్రత్యేక విభాగానికి అందే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తన దష్టికి తేవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ అంజయ్య, ఏడీలు పగడాల లక్ష్మీనారాయణ, చంద్రలీల, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం కాంగ్రెస్ ప్రత్యేక సెల్
సాక్షి, హైదరాబాద్: అమెరికా వెళ్లి ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకుంటున్న విద్యార్థులకు వీసాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం ఇందిరా భవన్లో టీపీసీసీ, ఎన్ఆర్ఐ విభాగం, ఏపీసీసీ, ఎన్ఎస్యూఐల ఆధ్వర్యం లో అవగాహన సదస్సు జరిగింది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ, అమెరికా న్యాయ నిపుణులు షాండ్రిల్ల శర్మ, ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ వినోద్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈ సదస్సులో మాట్లాడారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు చేసి వారికి సూచనలు, సలహాలు అందించడానికి కృషి చేయనున్నట్లు వారు చెప్పారు. ఇటీవల అమెరికా నుంచి వెనక్కు పంపిన విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సహకారం అందించడం లేదని విమర్శించారు. -
క్రిమినల్‌ను వెంబడిస్తుండగా ఏకే 47 పేలి..
న్యూఢిల్లీ: ఓ క్రిమినల్‌ను వెంబడించే క్రమంలో తన చేతిలోని తుపాకీ మిస్ ఫైర్ అయ్యి ప్రత్యేక విభాగ పోలీసు అధికారి ప్రాణాలుకోల్పోయాడు. ఈ ఘటన ఢిల్లీ శివారు ప్రాంతంలోని రోహిణిలో బుధవారం వేకువజామున చోటుచేసుకుంది. రవీంద్ర భోలు అనే రౌడీ షీటర్ కు కీలక సన్నిహితుడైన సోనూపండిట్ అనే నేరస్తుడు రోహిణి సెక్టార్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న ఢిల్లీ ప్రత్యేక పోలీస్ సెల్ విభాగం అతడి కోసం వేకువజామున గాలింపులు మొదలుపెట్టారు. అతడిని గుర్తించి వెంబడించే క్రమంలో చేతిలోని ఏకే 47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలిపోయి ఆనంద్ ఖాత్రి(32) అనే పోలీసు తీవ్రంగా గాయాలపాలై ప్రాణాలుకోల్పోయాడు. 2015 చివరి రోజుల్లోనే ఆనంద్ ప్రత్యేక సెల్‌కు బదిలీ అయ్యాడు. -
ఖాకీల కాఠిన్యానికి అమాయకులు బలి!
ఢిల్లీ ఖాకీల దౌర్జన్యాలకు అమాయకుల జీవితాలు బలైపోతున్నాయి. పోలీసుల అనుమానాలు యువత భవితను అయోమయం చేస్తున్నాయి. జంతుశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, దక్షిణ కొరియాలో పీహెచ్ డీ చేసేందుకు స్కాలర్ షిప్ కూడ పొంది, పూనెలో టోఫెల్ పరీక్ష రాసేందుకు వెడుతున్న పర్వేజ్ అహ్మద్ రాడూ, ప్రస్తుతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎదురు చూస్తున్నసమయంలో ... ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేయడం... అతడి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసింది. అటువంటి యువత మరెంతోమంది ఖాకీ కాఠిన్యానికి జీవితాలనే కోల్పోతున్నారు. 2006 సెప్టెంబర్ 12... రాడూ జీవితంలో చీకటి రోజు... ఢిల్లీ ద్వారకా హోటల్లోని రహస్య ఛాంబర్ లో నిర్భంధించి, చిత్ర హింసలకు గురి చేసి, సుదీర్ఘ హింస పెట్టి, అనంతరం జైలుపాలు చేసిన రోజది. చివరకు ఏడేళ్ళ జైలు తర్వాత 2013 లో సెషన్స్ కోర్టు అతనిపై ఆరోపణలను కొట్టివేసి నిర్దోషిగా తేల్చింది. కానీ అప్పటికే రాడూ జీవితం నాశనమైపోయింది. ఆ పీహెచ్ డీ డ్రాపవుట్.. ప్రస్తుతం ఓ చిన్న డ్రైఫ్రూట్ హోల్ సేల్ షాప్ నడుపుతూ చాక్లెట్లు, కాండీలు అమ్ముకుంటున్నాడు. ఏడు సంవత్సరాల జైలు శిక్షతో కెరీర్ ను పూర్తిగా కోల్పోయాడు. రాడూ కథలాగే మరో 24 కేసుల్లో . ఢిల్లీ స్పెషల్ పోలీసులు అరెస్టులు చేయగా... ఆరోపణలు, హింస, ఎదుర్కొని, జైలు శిక్ష అనుభవించి చివరికి ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు నిర్దోషులుగా వారిని విడిచిపెట్టినట్లు జామియా టీచర్స్ సాలిడారిటీ అసోసియేషన్ తయారుచేసిన నివేదిక ద్వారా తెలుస్తోంది. వీరిలో ఏడుగురు కాశ్మీర్ కు చెందిన ముస్లిం యువత ఉన్నారు. ఢిల్లీ ఆర్చ్ స్ట్రీట్ బాంబ్ బ్లాస్ట్ కు కారకులైన జైషే ఇ మొహ్మద్ టీం లోని వ్యక్తిగా అనుమానించి రాడూను అరెస్టు చేసిన పోలీసులు టీం కమాండర్ ఆచూకీ కోసం కాశ్మీర్ లో కూడ గాలింపు చేపట్టారు. రాడూ తండ్రి సోపూర్ డిగ్రీ కాలేజీలో ప్రొఫెసర్ గా చేసి రిటైరయ్యారు. ఆయన అప్పట్లో హోం శాఖకు, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు, ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు, మైనారిటీ కమిషన్ కు కూడ లేఖలు రాశారు. తమ కుమారుడికి ఎదో ఒకరకమైన ఉపశమనం దొరుకుతుందని ఎంతో వేచి చూశారు. కానీ అప్పట్లో వారికి ఎటువంటి సహాయం అందలేదు. అయితే సెషన్స్ కోర్టు ప్రాసిక్యూషన్ లో రాడూ మిలిటెంట్ అనేందుకు ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో చివరికి నిర్దోషిగా విడిచి పెట్టారు. పర్వేజ్ ఎటువంటి మిలిటెంట్ ఆపరేషన్స్ కోసం ఢిల్లీ రాలేదని 2013 లో తేల్చి చెప్పారు. పోలీసులు తర్వాత హైకోర్టు లో వేసినా జడ్జిమెంట్ డిస్ మిస్ అయింది. అయితేనేం రాడూ కెరీర్ మాత్రం అంధకారంలో ములిగిపోయింది. జైలు నుంచీ వచ్చిన తర్వాత ఆరునెల్లపాటు కాశ్మీర్ లో ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించాడు. కానీ అతడి కేసు గురించి తెలిసి ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. చివరికి ఓ సంవత్సరం క్రితం రాడూ చిన్న వ్యాపారం ప్రారంభించాల్సి వచ్చింది. ''మా కొడుకు జీవితం ఇలా అయిపోతుందని మేమెప్పుడూ అనుకోలేదు'' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాడూ తల్లిదండ్రులు. ఏది ఏమైనా కొడుకు అమాయకుడు అని తేలిందని, అల్లా న్యాయం చేశాడని సంతోష పడుతున్నారు. ఢిల్లీ పోలీసుల అరాచకానికి ఒక్క రాడూనే కాదు... భారత దేశానికి వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధపడ్డాడంటూ ఆరోపణలతో అరెస్టు చేసి, సంవత్సరాల తరబడి విచారణ కొనసాగి చివరికి నిర్దోషులుగా తేలిన ముష్తాక్ అహ్మద్ వంటి ఎంతోమంది జీవితాలు బలైపోతున్నాయి. ఒక్కోసారి కేసులు ట్రయల్ కోర్టులోనే తేలిపోవడం ఉండదు. సంవత్సరాల తరబడి విచారణ కొనసాగుతూనే ఉంటాయి. అయితే చివరికి వారిని నిర్దోషులుగా తేల్చినా ఉపయోగం ఉండదు. జామియా టీచర్స్ సోలిడారిటీ అసోసియేషన్ ఇచ్చిన 24 కేసుల నివేదిక ఆధారంగా చూస్తే సుమారు అన్ని కేసుల్లోనూ అదే పోలీసుల పేర్లు రిపీట్ అవడం గమనించాల్సిన విషయం. వారి కార్య నిర్వాహణ పద్ధతి హింసాత్మకంగా ఉండటంవల్లే ఇటువంటి కేసులు పునరావృతం అవుతున్నాయని, ఎంతోమంది అమాయకుల జీవితాలు బలైపోతున్నాయని అంటున్నారు. మరణించిన వారిగురించి చెడుగా మాట్లాడకూడదని తెలుసు.. కానీ ఇనస్పెక్టర్ బద్రీష్ దత్ గురించి మాట్లాడాల్సి వస్తోందంటే అతడు మా అందరికీ ఎంతో అన్యాయం చేశాడు. అతడి హింసాత్మక ప్రవర్తన ఎంతో మంది జీవితాలను అంధకారం చేసింది.అలాగే మరెంతోమంది పోలీసు అధికారులు అరాచకంగా ప్రవర్తిస్తున్నారు అంటున్నాడు రాడూ. ఇప్పటికైనా ఢిలీ పోలీసుల అరాచకత్వానికి యువత బలికాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
టార్గెట్ వీవీఐపీ?
♦ ఢిల్లీలో తుపాకీతో పట్టుబడిన హైదరాబాద్‌వాసి ♦ విచారణలో నగరానికి చెందిన ఇద్దరి పేర్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: స్పెషల్ సెల్ బృందానికి ఢిల్లీలో తుపాకీతో పట్టుబడిన హైదరాబాద్‌వాసి తన టార్గెట్‌లో అత్యంత ప్రముఖుడు ఉన్నట్లు విచారణలో వెల్లడించాడు. తనకు నగరానికి చెందిన మరో ఇద్దరితో సంబంధాలున్నట్లు కూడా బయటపెట్టాడు. దీంతో శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న ప్రత్యేక బృందం మదర్సాల నిర్వాహకులైన ఇరువురినీ అదుపులోకి తీసుకుని విచారించి విడిచిపెట్టింది. హైదరాబాద్‌కు చెందిన రెహ్మత్ పాషా ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి రైల్లో వస్తుండగా స్పెషల్ సెల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న అతడిని సోదా చేయగా తుపాకీ, తూటాలు లభించాయి. దీంతో అతడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. తన టార్గెట్‌లో దేశానికి చెందిన అత్యంత ప్రముఖుడు ఉన్నాడని, ఆయన్ని చంపడం కోసమే యూపీ నుంచి తుపాకీ, తూటాలు కొనుగోలు చేసినట్టు బయటపెట్టాడు. పాషా కాల్ డేటాను పరిశీలించిన అధికారులు హైదరాబాద్‌కు చెందిన మరికొందరితో పరిచయాలు ఉన్నట్లు, యూపీ నుంచీ వారితో సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. ఈ కోణంలో రెహ్మత్‌ను ప్రశ్నించగా.. వారూ తమ ముఠాకు చెందిన వారేనని, ఆపరేషన్‌కు ఆర్థిక సాయం చేయడానికి అంగీకరించారని చెప్పుకొచ్చాడు. దీంతో ఓ ప్రత్యేక బృందాన్ని నగరానికి పంపారు. ఈ బృందం నగర పోలీసుల సహకారంతో నల్లకుంట, చింతల్మెట్లో ఉన్న మదర్సాల్లో సోదాలు చేసి వాటి నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రెహ్మత్ పాషా తమను సంప్రదించిన మాట వాస్తవమేనని, అయితే తుపాకీ కొనుగోలు, టార్గెట్ వీవీఐపీ ఆపరేషన్ వివరాలు తమకు తెలియవని స్పెషల్ సెల్ అధికారులకు వివరణ ఇచ్చారు. గతంలో యూపీ వెళ్ళిన రెహ్మత్.. బర్వేలీకి చెందిన ఓ మతపెద్ద చరిత్రను సేకరించానని చెప్పాడని, ఈ వివరాలను ప్రపంచానికి తెలియజేయడానికి ఓ వెబ్సైట్ పెట్టాలని యోచిస్తున్నానని, దీనికి ఆర్థిక సాయం కావాలని కోరాడని వారు తెలిపారు. దాని కోసమే తమను రెండుసార్లు కలవడంతో పాటు ఇటీవల యూపీ నుంచి ఫోన్లు చేసి రూ.20 వేలు అడిగినట్లు చెప్పారు. పాషా వెల్లడించిన విషయాలకు.. మదర్సా నిర్వాహకులు చెపుతున్న అంశాలకు పొంతన లేకపోవడంతో వీరి గత చరిత్రను స్పెషల్ సెల్ బృందం సేకరించింది. వీరికి ఎలాంటి వివాదాస్పద చరిత్ర లేదని నగర పోలీసులు తేల్చడంతో రెహ్మత్‌ను హైదరాబాద్ తీసుకువచ్చి విచారించాలని స్పెషల్ సెల్ అధికారులు భావిస్తున్నారు. -
పెంటగాన్‌లో భారత్ కు ప్రత్యేక సెల్
అమెరికా రక్షణ శాఖ.. భారత్ కు ఒక అరుదైన గుర్తింపు నిచ్చింది. ఆదేశ రక్షణ కార్యాలయం పెంటగాన్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఒక దేశం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటుచేయడం.. పెంటగాన్ చరిత్రలోనే తొలిసారి. భారత్ తో తన రక్షణ, వాణిజ్య, టెక్నాలజీ సంబంధాలను విసృత పరుచుకునే దిశగా.. ఈ సెల్ ఒక ముందడుగని అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్ అభిప్రాయపడ్డారు. వీటితో పాటు... హైటెక్ మిలిటరీ పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి చేయడం.. సంయుక్తంగా తయారు చేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి అమెరికా రక్షణ శాఖ ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ విభాగంలో అమెరికా రక్షణ శాఖలో వివిధ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు అధికారులు పనిచేస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న రక్షణ వాణిజ్యం, టెక్నాలజీ ఒప్పందం కింద తాము చేపట్టిన పనులను వేగ వంతం చేస్తున్నామని.. ఏ పనైనా సరే మూడు నెలల్లో పూర్తి అయ్యేలా ఈ ర్యాపిడ్ యాక్షన్ సెల్ పనిచేస్తుందని తెలిపారు. దీని ద్వారా భారత్-అమెరికా సంబంధాలు సరికొత్త శిఖరానికి చేరనున్నాయి. గతంలో ఒప్పందం అమలుకు ఏడాదిన్నరనుంచి మూడేళ్ల సమయం పట్టేది. అయితే ఇప్పుడు కేవలం మూడు నెలల్లోనే ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందని వెబ్‌స్టర్ చెప్పారు. ఇన్నాళ్లు పాకిస్థాన్‌కు సపోర్ట్ గా ఉన్న అమెరికా.. ఇటీవల భారత్ సైడ్ తీసుకుంది. ముఖ్యంగా చైనా మార్కెట్ ను దెబ్బ తీయాలంటే.. దానికి ధీటైన మార్కెట్ భారత్ లోనే ఉందని అమెరికా భావిస్తోంది. అందువల్లే.. భారత్‌ను వాణిజ్య పరంగా అమెరికా అన్ని రకాలుగా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నెలాఖరులో న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఒబామా, మోడీ మధ్య జరగబోయే చర్చల్లో రక్షణ, వ్యూహాత్మక సహకారం కీలక అంశంగా మారనుంది. -
ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక సెల్
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వ విధానాలే కారణమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీహెచ్.లక్ష్మారెడ్డి ఆరోపించారు. గురువారం కోఠిలోని 104 ఆరోగ్య కేంద్రంలో ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక సెల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యల రేటు ఎక్కువగా పెరగడం బాధాకరమని ఆయన చెప్పారు. -
పిచ్చాసుపత్రిలో రైతులకు ప్రత్యేక సెల్
ఇప్పటి ఏపీ సీఎం.. అప్పుడెప్పుడో చెప్పిన మాటను ఉత్తరప్రదేశ్ సర్కారు వంటబట్టించుకుంది! 'రైతులు ఆత్మహత్యలు చేసుకునేది మానసిక సమస్యలతోనేగానీ ప్రభుత్వాల వైఫల్యంతో కాదు' అని నిర్ధారణకు వచ్చింది. అందుకే మెంటల్ హాస్పిటళ్లలో ప్రత్యేక వార్డులు తెరిచి రైతులకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది! ఆ క్రమంలోనే మొదటి విడతగా ఆగ్రా పట్టణంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో స్పెషల్ వార్డును ప్రారంభించింది. ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలున్న రైతుల్ని గుర్తించి.. ఆసుపత్రికి తీసుకొచ్చి.. పంట నష్టపోతే ఆందోళనకు గురికావద్దని, చనిపోవాలనే ఆలోచన వస్తే భార్యాబిడ్డల్ని తలుచుకోవాలని మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు మానసిక వైద్యులు! అదేంటి..ఒట్టి మాటలే చెబుతారా? గట్టి మేలేదీ చెయ్యరా? అనే ప్రశ్నలకు.. 'ఆత్మహత్యలు నివారించేందుకు మేం చేయగలిన ప్రయత్నాలన్నీ చేశాం. చనిపోయిన రైతుల జాబితాతోపాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రానికి లేఖలు రాశాం. రూ. 3,500 కోట్ల సహాయం అందిస్తే సమస్యలు కొద్దివరకు పరిష్కారమవుతాయిని ఆశిస్తున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం మా విజ్ఞప్తుల్ని పట్టించుకోవట్లేదు' అని ప్రభుత్వాధికారులు సమాధానమిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని 65 జిల్లాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో దాదాపు 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు అఖిలేశ్ సర్కార్ అధికారికంగా వెల్లడించింది. అన్నదాతకు మనోస్థైర్యం పెంచేందుకు అన్ని మెంటల్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు తెరవాలనుకుంటోంది. -
అత్యాచారాలను అరికడతాం
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటుచేసి, ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఆడవాళ్లపై ఎవరైనా దాడులకు దిగితే నిర్భయ చట్టంతో వారిని నియంత్రిస్తామని స్పష్టం చేశారు. ఇక మావోయిస్టులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని చినరాజప్ప కోరారు. తాము అభివృద్ధి చేస్తాము కనుక వారి కార్యకలాపాలను తగ్గించుకోవాలని సూచించారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని, త్వరలోనే వాటిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. -
చెరువుల అనుమతికి ప్రత్యేక సెల్
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలకు సంబంధించి అనుమతులు ఇవ్వడానికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాయలంలోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో చేపల చెరువులకు అనుమతులు, సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే చేపల చెరువులకు అనుమతులు ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. చేపల చెరువుల అనుమతుల్లో పారదర్శకతను పెంచి అవినీతిని తగ్గించాలన్నారు. వ్యవసాయ భూములను చెరువులుగా మార్చరాదని, కొల్లేరును పరిరక్షించాలని, అదే సమయంలో చిన్న రైతులను ఇబ్బందులకు గురిచేయకూడదని పేర్కొన్నారు. చెరువులు తవ్వేటప్పుడు సన్న, చిన్నకారు రైతుల అభిప్రాయాలను, సాగునీటి కాలువలు, మంచినీటి వనరులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మండల స్థాయి కమిటీల నుంచి చేపల చెరువుల అనుమతుల ప్రతిపాదనలను డివిజన్‌స్థాయి కమిటీ పరిశీలించాలన్నారు. అనంతరం జిల్లాస్థాయి కమిటీ ద్వారా అనుమతులు పొందాలన్నారు. ఇరిగేషన్, ఏపీ ట్రాన్స్‌కో, అటవీ శాఖ, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించిన అనుమతులు పొందినదీ లేనిదీ సమీక్షించి ఈ నెల 29న నిర్వహించే జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో మత్స్య శాఖ డెప్యూటీ డెరైక్టర్ వీవీ కృష్ణమూర్తి, ఏడీ షేక్ లాల్ మహ్మద్, వ్యవసాయశాఖ జేడీ కృపాదాస్, బీసీ కార్పొరేషన్ ఈడీ, వికలాంగుల సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జి ఏడీ జి.పెంటోజీరావు పాల్గొన్నారు.