క్రిమినల్‌ను వెంబడిస్తుండగా ఏకే 47 పేలి.. | Constable dies allegedly after his rifle goes off accidentally | Sakshi
Sakshi News home page

క్రిమినల్‌ను వెంబడిస్తుండగా ఏకే 47 పేలి..

Published Wed, Jan 6 2016 3:12 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

క్రిమినల్‌ను వెంబడిస్తుండగా ఏకే 47 పేలి.. - Sakshi

క్రిమినల్‌ను వెంబడిస్తుండగా ఏకే 47 పేలి..

న్యూఢిల్లీ: ఓ క్రిమినల్ను వెంబడించే క్రమంలో తన చేతిలోని తుపాకీ మిస్ ఫైర్ అయ్యి ప్రత్యేక విభాగ పోలీసు అధికారి ప్రాణాలుకోల్పోయాడు. ఈ ఘటన ఢిల్లీ శివారు ప్రాంతంలోని రోహిణిలో బుధవారం వేకువజామున చోటుచేసుకుంది.

రవీంద్ర భోలు అనే రౌడీ షీటర్ కు కీలక సన్నిహితుడైన సోనూపండిట్ అనే నేరస్తుడు రోహిణి సెక్టార్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న ఢిల్లీ ప్రత్యేక పోలీస్ సెల్ విభాగం అతడి కోసం వేకువజామున గాలింపులు మొదలుపెట్టారు. అతడిని గుర్తించి వెంబడించే క్రమంలో చేతిలోని ఏకే 47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలిపోయి ఆనంద్ ఖాత్రి(32) అనే పోలీసు తీవ్రంగా గాయాలపాలై  ప్రాణాలుకోల్పోయాడు. 2015 చివరి రోజుల్లోనే ఆనంద్ ప్రత్యేక సెల్కు బదిలీ అయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement