బులాంద్షహర్ః ఢిల్లీ పోలీసుల అరాచకం మరోమారు బయట పడింది. ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి కారణమైంది. తనతో లైంగిక సంబంధం పెట్టుకోమంటూ బలవంతపెడుతున్న ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ వేధింపులు తాళలేక సదరు యువతి ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమైంది.
ఢిల్లీ బులంద్షహర్ కు చెందిన సంగీత.. కానిస్టేబుల్ మంజిత్ వేధింపులు తాళలేక విషం తాగి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది. అయితే ప్రమాద పరిస్థితిలో ఉన్న ఆమెను బంధువులు ఆస్పత్రిలో చేర్పించగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అయిన 28 ఏళ్ళ మంజిత్.. తనతో లైంగిక సంబంధం పెట్టుకోమని వెంటపడటంతో వేధింపులు తట్టుకోలేని సంగీత సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు సిటీ ఎస్పీ రామ్ మోహన్ సింగ్ తెలిపారు.
ప్రమాద పరిస్థితిలో ఉన్న సంగీతను ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారని, ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత నయంగా ఉందని ఎస్పీ సింగ్ తెలిపారు. సంగీత తమ్ముడిని ఫాల్స్ కేసులో ఇరికించిన కానిస్టేబుల్ మంజిత్.. ఆమెపై వేధింపులకు పాల్పడటంతో సంగీత అటువంటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోందని ఎస్పీ వెల్లడించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు మంజిత్ పై సెక్షన్ 354 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఎస్పీ... ప్రస్తుతం నిందితుడు మంజిత్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.
ఢిల్లీ పోలీసు అరాచకం..
Published Tue, Jul 19 2016 5:29 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM
Advertisement
Advertisement