Attempts
-
లొంగు‘బాట’లో దళ కమాండర్
ఛత్తీస్‌గఢ్: దండకారణ్యంలో మన్పూరు ప్రాంతానికి చెందిన మావోయిస్టు నేత గాండ్ సింగ్ కొవాసి.. తన భాగస్వామితో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ నెల 8 నుంచి నక్సలైట్ సంస్థకు దూరంగా ఉన్నారని.. వారి కోసం మావోయిస్టులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా గాండ్ సింగ్ జన జీవన స్రవంతిలోకి రావాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఛత్తీస్‌గఢ్ ఇంటలిజెన్స్ విభాగం విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం గాండ్ సింగ్ ఇప్పుడు ప్రధాన జీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నట్లు సమాచారం. -
ఢిల్లీ పోలీసు అరాచకం..
బులాంద్షహర్ః ఢిల్లీ పోలీసుల అరాచకం మరోమారు బయట పడింది. ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి కారణమైంది. తనతో లైంగిక సంబంధం పెట్టుకోమంటూ బలవంతపెడుతున్న ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ వేధింపులు తాళలేక సదరు యువతి ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఢిల్లీ బులంద్‌షహర్ కు చెందిన సంగీత.. కానిస్టేబుల్ మంజిత్ వేధింపులు తాళలేక విషం తాగి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది. అయితే ప్రమాద పరిస్థితిలో ఉన్న ఆమెను బంధువులు ఆస్పత్రిలో చేర్పించగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అయిన 28 ఏళ్ళ మంజిత్.. తనతో లైంగిక సంబంధం పెట్టుకోమని వెంటపడటంతో వేధింపులు తట్టుకోలేని సంగీత సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు సిటీ ఎస్పీ రామ్ మోహన్ సింగ్ తెలిపారు. ప్రమాద పరిస్థితిలో ఉన్న సంగీతను ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారని, ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత నయంగా ఉందని ఎస్పీ సింగ్ తెలిపారు. సంగీత తమ్ముడిని ఫాల్స్ కేసులో ఇరికించిన కానిస్టేబుల్ మంజిత్.. ఆమెపై వేధింపులకు పాల్పడటంతో సంగీత అటువంటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోందని ఎస్పీ వెల్లడించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు మంజిత్ పై సెక్షన్ 354 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఎస్పీ... ప్రస్తుతం నిందితుడు మంజిత్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. -
కుమారులతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్ రూరల్ (వరంగల్): తన ఇద్దరు కొడుకులపై అకారణంగా దొంగతనం నేరాన్ని మోపడంతో ఓ తండ్రి మనస్తాపం చెంది దారుణానికి ఒడిగట్టాడు. ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ తాగాడు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా, పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు..రెడ్యాల గ్రామానికి చెందిన దాసరి యాసయ్య (45) ఖమ్మంలో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ ఖమ్మం వెళ్లి వస్తుంటాడు. యాసయ్యకు 7వ తరగతి చదివే సాయి, 4వ తరగతి చదివే ప్రభాకర్‌తోపాటు ఓ కుమార్తె కూడా ఉంది. సాయి, ప్రభాకర్‌లు తన ఇంట్లో రూ.12వేలు దొంగతనం చేశారంటూ ఐలబోయిన భద్రమ్మ వారిద్దరినీ తన ఇంటికి తీసుకెళ్లి చిత్ర హింసలకు గురిచేసింది. సోమవారం ఖమ్మం వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన యాసయ్యకు విషయం తెలిసింది. ఎందుకు తన పిల్లలను హింసించావని భద్రమ్మను ప్రశ్నించాడు. తన ఇంట్లో రూ.12వేలు దొంగతనం చేశారని ఆమె చెప్పడంతో పిల్లల్ని నిలదీశాడు. వారు దొంగతనం చేయలేదని చెప్పారు. దీంతో తన పిల్లలపై అనవసరంగా దొంగతనం నేరాన్ని మోపారంటూ మనస్తాపం చెందిన యాసయ్య శీతల పానీయంలో పురుగుల మందు కలిపి సాయి, ప్రభాకర్లకు తాగించాడు. తర్వాత తానూ తాగాడు. స్థానికులు వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స ప్రారంభించేలోపే యాసయ్య మృతి చెందాడు. సాయి, ప్రభాకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
వనపర్తిలో బ్యాంక్ చోరీకి యత్నం
-
ట్రై చేద్దాం..!
అధికారుల ఊగిసలాట బదిలీ కోసం విశ్వప్రయత్నాలు తరచూ సెలవుపై వెళ్తున్న జిల్లా అధికారులు విభజన పర్వం ముగిసినా అధికారుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఇప్పుడు జిల్లాలోని ఉన్నతస్థాయిలోని ఉన్నవారు తమకు అనువైన ప్రాంతాలకువెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ ప్రభావం పాలనపై పడి వివిధ పనులపై కార్యాలయాలకు వచ్చేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నతాధికారులంతా ఇదే మూడ్‌లో ఉండడంతో ప్రజావసరాలకు ఇబ్బందులు వస్తున్నాయి. మహబూబ్‌నగర్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో.. జిల్లాలోని ఉన్నతాధికారులు బదిలీపై దృష్టి సారించడంతో.. ఊగిసలాట మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయించుకునేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తుండగా.. తెలంగాణ రాష్ట్రంలోనే మెరుగైన స్థా నాలకు వెళ్లాలన్న యోచనలో మరికొందరు జి ల్లా అధికారులు బదిలీల కోసం విశ్వ ప్రయత్నా లు చేస్తున్నారు. జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అనువైన చోట్లకు బదిలీ చే యించుకునే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చ ర్చించుకుంటున్నాయి. ఆ కోవలోనే కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆంధ్రప్రదేశ్ సీఎం పేషీకి వె ళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని విసృ్తత ప్రచారం సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన పొరుగు జిల్లాల్లోని కలెక్టర్లు కొందరిని బదిలీ చేయడం, పదోన్నతులు కల్పించడం వంటివి చేపట్టారు. అయితే మన జిల్లా కలెక్టర్ బదిలీపై ఏమాత్రం స్పష్టత లేకపోగా.. బదిలీపై వెళ్లనున్నట్లు ఊహగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. జాయింట్ కలెక్టర్ ఎల్.శర్మణ్కూడా మంచిస్థానానికి పదోన్నతిపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఆయన సెలవుపై వెళ్లడం వెనుక ఇటువంటి ఉద్దేశమే ఉందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌కు ఓఎస్డీగా మహబూబ్‌నగర్ ఆర్డీఓ హన్మంతరావును బదిలీ చేశారు. ఆయా శాఖల పరిధిలోని జిల్లా స్థాయి అధికారులు బదిలీ ధ్యాసలో ఉంటుండటంతో వాటి రోజువారీ పనితీరుపై సమీక్ష చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇదిలా ఉండగా.. తమకు అనుకూలంగా ఉండే అధికారులను జిల్లాకు రప్పించేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఢిల్లీస్థాయి నేత మన జిల్లాకు తమ అనుయాయుడైన కలెక్టర్‌ను రప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలు కూడా తాము చెప్పినట్లు నడుచుకునే ఆర్డీఓలు, ఎంపీడీఓలను తమ నియోజకవర్గాలకు రప్పించే ప్రయత్నంలో ఉన్నారని, ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో ఆ అధికారులు వీరి కనుసన్నల్లో మెలగాలన్న భావనతో అధికారులను బదిలీ చేయించుకునేందుకు దృష్టిపెట్టారు. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కొనసాగిన తహశీల్దార్ల పోస్టింగుల్లోనూ వివాదాలు చెలరేగాయి. జిల్లా స్థాయిలో కొత్త అధికారులు వచ్చాక తహశీల్దార్ల పోస్టింగుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయని రెవిన్యూ శాఖకు చెందిన కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. స్తంభించిన పాలనజిల్లా స్థాయి అధికారులు కొంతమంది ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు జవాబు లేదు. దీంతో అధికారులు బదిలీలపై దృష్టి పెట్టడంతో క్షేత్రస్థాయిలో పాలన కొంతమేరకు స్తంభించిపోయింది. కొన్ని శాఖల పరిధిలో పురోగతి శూన్యమైంది. కనీసం కొంతమంది అధికారుల బదిలీలు చేసినా పాలన గాడిలో పడేందుకు వీలుదొరికేది.. అలా కాకుండా బదిలీ చేస్తారని తెలిసినా చేయకపోవడంతో పనులు చేసుకోవడం కష్టంగా ఉంది. సంక్షేమం, అభివృద్ధి పనుల విషయం మరుగును పడిపోతోంది. -
మహిళను కిడ్నాప్ చేయబోయిన ఆటోడ్రైవర్