![Maoist Leader Gond Singh Kovasi Attempts Surrender - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/21/Maoist-Leader_0.jpg.webp?itok=evnIAPLZ)
ప్రతీకాత్మక చిత్రం
ఛత్తీస్‌గఢ్: దండకారణ్యంలో మన్పూరు ప్రాంతానికి చెందిన మావోయిస్టు నేత గాండ్ సింగ్ కొవాసి.. తన భాగస్వామితో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ నెల 8 నుంచి నక్సలైట్ సంస్థకు దూరంగా ఉన్నారని.. వారి కోసం మావోయిస్టులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా గాండ్ సింగ్ జన జీవన స్రవంతిలోకి రావాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఛత్తీస్‌గఢ్ ఇంటలిజెన్స్ విభాగం విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం గాండ్ సింగ్ ఇప్పుడు ప్రధాన జీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment