Maoist leader
-
పేరు ఏదైతేనేం... అంతా అణచివేతే!
దేశంలో, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో, ఉన్న పాలన స్వభావాన్ని ఎలా నిర్వచించాలి, దాన్ని ‘ఫాసిజం’ అనాలా, ‘నయా ఫాసిజం’ అనాలా, ‘నయా ఫాసిజం లక్షణాలు’ అనాలా అని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకత్వం మల్లగుల్లాలు పడుతున్నదని ప్రచార సాధనాలలో వార్తలూ, వ్యాఖ్యలూ వస్తున్నాయి. ఆ పార్టీకే చెందిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం తన విధానాల ద్వారా, ఆచరణ ద్వారా, బహుశా మౌనం ద్వారా కూడా ఆ చర్చను మరొక స్థాయికి తీసుకు పోదలచుకున్నట్టున్నారు. కార్పొరేట్ ప్రయోజనాల పరిరక్షణ, ప్రజల సామూహిక ఆందో ళనల అణచివేత, వ్యక్తిగత ఆందోళనల పట్ల మౌనం అనే మూడు విషయాలలో ఆయన ప్రభుత్వం, ఏ పేరు పెట్టినా, కేంద్ర ప్రభుత్వం చేయదలచిన, చేస్తున్న పనులనే చేసి చూపిస్తున్నది.కేరళలోని వియ్యూర్ సెంట్రల్ జైలులో టి. ఆర్. రూపేష్ అనే మావోయిస్టు ఖైదీ ఉన్నారు. కేరళ మావోయిస్టు పార్టీ నాయకులలో ఒకరైన ఆయనను, ఆయన సహచరి షైనా, మరొక ముగ్గురు అనుచరులతో సహా 2015 మేలో తమిళనాడులోని కోయంబత్తూరులో అరెస్టు చేశారు. అంతకు ముందువీ, ఈ పదకొండేళ్లలో పెట్టినవీ కలిసి ఆయన మీద మొత్తం 43 కేసులున్నాయి. అందులో ఒక కేసు విచారణ జరిగి, ఆయన నిర్దోషిగా తీర్పు వెలువడింది. పదమూడు కేసులు డిశ్చార్జి అయ్యాయి.ఒక కేసులో శిక్ష పడి, శిక్షాకాలం ముగిసిపోతుండగా, విడుదల కాకుండా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం పదకొండేళ్ల కిందటి కేసు తవ్వి తీసింది. జైలు అధికారులు ఇవ్వవలసిన రెమిషన్ ఇవ్వకుండా ఉండిపోయారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ మహత్కార్యమే గాని ఇప్పుడిక్కడ చర్చ అది కాదు. రూపేష్ జైలుకు వెళ్లక ముందే కవిగా, రచ యితగా గుర్తింపు పొందారు. అజ్ఞాతవాసంలో ఉండగానే, 2013లో వెలువడిన ఆయన మొదటి నవల ‘వసంత్తిలె పూమరంగళ్’ (వసంతకాలపు పూలచెట్లు) మలయాళ సాహిత్య లోకంలో విస్తృత చర్చకు దారి తీసింది. అంతకు ముందు న్యాయ శాస్త్ర పట్టభద్రుడైన రూపేష్ గత పదేళ్ల జైలు జీవితంలో చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, తత్వశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. జైలు రేడియో నడుపుతున్నారు. బాడ్మింటన్ క్రీడా కారుడిగా పేరు తెచ్చుకున్నారు. వీటితో పాటే, జైలులో ఆయన తన రెండో నవల రాశారు. ‘బంధితారుడె ఒర్మక్కురిప్పుగళ్’ (ఖైదీల జ్ఞాపకాలు) అనే ఈ నవల ప్రచురణను అనుమతించమని జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 130 పేజీలు గల ఈ నవల ఇతివృత్తం ఒక కవి–రాజకీయ కార్యకర్త జైలు జీవితం. జైళ్ల నిర్వహణ రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశంగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి ఒక ఖైదీకి ఉన్న ఈ రాజ్యాంగ బద్ధ హక్కును గౌరవించి అనుమతి ఇచ్చే అధికారం ఉంది. జైలులో ఉన్న ఖైదీకి తన రచనను ప్రచురించుకునే హక్కు ఉందని సుప్రీం కోర్టు ఇచ్చిన ఎన్నో తీర్పులు చెబుతున్నాయి. కాని రూపేష్ లిఖితపూర్వక దరఖాస్తుకు వియ్యూర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ నెల గడిచినా అధికారిక జవాబు ఇవ్వలేదు. దరఖాస్తును పై అధికారులకు పంపామని, జవాబు కోసం వేచి చూస్తున్నామని తాత్సారం చేశాడు. నవలలో జైలుకు, యూఏపీఏ, కోర్టు ప్రస్తావనలు ఉన్నాయి గనుక అనుమతి ఇవ్వబోమని నోటిమాటగా చెప్పాడు. తన నవల ప్రచురణకు అనుమతించకపోతే, ఎమర్జెన్సీలో క్యాలికట్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి రాజన్ హత్య చేయబడిన మార్చ్ 2న ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభిస్తానని రూపేష్ అధికారులకు తెలియజేశారు. మిత్రుల సలహా మేరకు దాన్ని ఒక్కరోజు నిరాహారదీక్షగా మార్చారు. అప్పటికే నవల డీటీపీ ప్రతి చదివిన కె. సచ్చిదానందన్, అశోకన్ చారువిల్,ఎన్. ఇ. సుధీర్ వంటి మలయాళ సాహిత్య ప్రముఖులెందరో ఆ నవల కళాత్మక విలువను ప్రశంసిస్తూ, ప్రచురణను అడ్డుకోవడం లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి తగదని ప్రకటించారు. ‘సృజనాత్మకత నేరం కాదు’ అనే శీర్షికతో సామాజిక మాధ్యమాలలో, ఇతర ప్రచార సాధనాలలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నది. ముఖ్య మంత్రికి బహిరంగ లేఖలు వెలువడుతున్నాయి. ఒక ఖైదీ రచన ప్రచురణను ఫాసిస్టు, నయా ఫాసిస్టు, నయా ఫాసిస్టు లక్షణాలు గల ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అర్థం చేసుకోవడం సులభమే. కాని ఆ పని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రభుత్వం చేయడమే ఆశ్చర్యకరం, విషాద కరం. అదే ప్రభుత్వపు మరి రెండు విధానాలు కూడా ఈ నేపథ్యంలోనే ఆసక్తికరమైనవి. కేరళలోని ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్ – ఏఎస్హెచ్ఏ) సిబ్బందిలో అత్యధికులు ఈ సోమవారానికి ముప్పై ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నారు. రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తున్నప్పటికీ తమను ఉద్యోగులుగా కాక వాలంటీర్లుగా గుర్తించడం మానేయాలని, అధికారపక్షం ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసినట్టు గౌరవ వేతనాన్ని రూ. 7,000 నుంచి రూ. 21,000కు పెంచాలని, ఉద్యోగ విరమణానంతర సౌకర్యాలు కల్పించాలని ప్రధాన డిమాండ్లతో, మరెన్నో డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతున్నది. అనేక రాష్ట్రాలలో ఇవే డిమాండ్ల మీద సీపీఎం కార్మిక సంఘం సీఐటీయూ ఆందోళనలు నిర్వ హిస్తున్నది. కాని కేరళలో సీఐటీయూ కాక మరొక సంఘం ఈ ఆందోళనను నిర్వహిస్తున్నందువల్లనేమో ప్రభుత్వం ఆందోళన కారులతో చర్చలకు కూడా సిద్ధపడడం లేదు. గౌతమ్ అదానీ కంపెనీల మీద విదేశాలలోనూ, దేశంలోనూ లెక్కలేనన్ని విమర్శలు వస్తుండగా, కేరళ ముఖ్యమంత్రి మాత్రం అదానీ మీద పొగడ్తలు కుమ్మరించడంలో దేశ ప్రధానితో పోటీ పడుతున్నారు. ఇందుకు ప్రతిఫలంగా అన్నట్టు, కొద్ది వారాల కిందనే కొచ్చిలో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్‌లో కరణ్ అదానీ అదే స్థాయిలో నరేంద్ర మోదీ, పినరయి విజయన్లు ఇద్దరినీ ఒకే ఊపులో పొగడ్తల్లో ముంచెత్తాడు. ఏది ఫాసిజం? ఏది నయా ఫాసిజం? ఏవి నయా ఫాసిస్టు లక్షణాలు? ఓ మహాత్మా! ఓ మహర్షీ!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మావోయిస్ట్ కీలక నేత బెంగాల్లో అరెస్ట్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ పోలీసులు వాంటెడ్ మావోయిస్ట్ నేత సవ్యసాచి గోస్వామి అలియాస్ కిశోర్(55)ను అరెస్ట్ చేశారు. ఆయన తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జార్ఖండ్ సరిహద్దులకు సమీపంలోని అడవుల్లో గోస్వామిని పట్టుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బఘ్ముండి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చౌనియా గ్రామం వద్ద ఆయన ఉన్నట్లు తెలియడంతో గురువారం రాత్రి దాడి చేసి అరెస్ట్ చేశామన్నారు. ఆయన నుంచి ఒక పిస్టల్, నిషేధిత సాహిత్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో గోస్వామి ఒకరు, ఆయన్ను పట్టించిన వారికి రూ.10 లక్షల బహుమానం ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది. బంకురా, పురులియా, ఝార్గ్రామ్, పశ్చిమ్ మేదినీపూర్ జిల్లాల్లో మావోయిస్ట్ పార్టీని బలోపేతం చేసేందుకు, నిధుల సేకరణకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. గోస్వామి అరెస్ట్‌ను అతిపెద్ద విజయంగా ఆయన పేర్కొన్నారు. ‘కిశోర్‌దా’గా మావోయిస్టులు పిలుచుకునే గోస్వామి దక్షిణ 24 పరగణాల జిల్లా సోడెపూర్ రోడ్ ప్రాంతానికి చెందిన వారు. ఇటీవలే ఆయన మావోయిస్ట్ పార్టీ ‘ఈస్టర్న్ రీజినల్ బ్యూరో ఇన్చార్జి’గా బాధ్యతలు చేపట్టారు. గతంలో పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేశారు. -
అన్నలకే ‘పెద్దన్న’.. నిజాం వెంకటేశం..!
సిరిసిల్ల: మావోయిస్టు అగ్రనేతలకు ఆత్మీయుడు నిజాం వెంకటేశం. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని మావో యిస్టు అగ్రనేతలు ఆయన మరణించే దాకా బయటపెట్టలేదు. సిరిసిల్ల పట్టణానికి చెందిన నిజాం వెంకటేశం(74) గతేడాది సెప్టెంబరు 18న హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణించిన విషయం తెలిసి..సరిగ్గా పది రోజులకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ ఓ వ్యాసం రాశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల రాసిన వ్యాసం ఏడాది కిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎవరీ నిజాం వెంకటేశం.. ఏమిటీ ఆయన చరిత్ర అని ఆరా తీశారు. ఆయన మరణించిన ఏడాది పూర్తి అయిన సందర్భంగా ‘అన్నలకే పెద్ద న్న’ అయిన నిజాం వెంకటేశం అడుగుజాడలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఎవరీ నిజాం వెంకటేశం.. కల్లోల సిరిసిల్లలో 1948 నవంబరు 14న వైశ్య కుటుంబంలో పుట్టి పెరిగిన నిజాం వెంకటేశం ట్రాన్స్‌కో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆయన మూలాలు పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఉన్నాయని తెలుసుకున్న పలువురు సాహితీవేత్తలు ఉద్వేగానికి గురయ్యారు. సమసమాజ స్థాపనకు జరుగుతున్న ప్రజా యుద్ధంలో తన వంతు శక్తికి మించి సాయాన్ని అందించారని నిజాం వెంకటేశం నిజాల గురించి మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రాసిన వ్యాసంతో వెల్లడైంది. పెద్దపల్లిలోని తన చిన్ననాటి మిత్రులు ఒకసారి పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ‘అవును వెంకటేశం సార్ ఇక్కడే ఉండేవారు. ఇక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత తిరిగి పెద్దపెల్లికి రాలేదు’ అంటూ 42 ఏళ్ల క్రితం తనతో ఉన్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఐదారేళ్లు పెద్దపల్లిలోనే ఉద్యోగం చేశారు. కరెంటు పవర్ హౌస్ (రాఘవపూర్ సబ్ స్టేషన్) లో ఉద్యోగం చేస్తూ ఓ సాహితీవేత్తగా విప్లవానికి అందించాల్సిన సేవలు అందించారు. ఆయన విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూనే.. గుట్టలు సమీపంలో ఉండడంతో పెద్దపల్లిలో ఐటీఐ చదివే వారు, విప్లవకారులు ఆయన ఇంటిని షెల్టర్‌గా చేసుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా వారికి భోజనం పెట్టి ఆత్మీయంగా ఉండేవారని మల్లోజుల తన వ్యాసంలో వెల్లడించారు. తన కంటే ముందు తన సోదరుడు మల్లోజుల కోటేశ్వర్రావుకు వెంకటేశం అత్యంత సన్నిహితుడని వివరించారు. తనను సైకిల్‌పై కూర్చోబెట్టుకుని డబుల్ సవారీ చేస్తూ తనకు ప్రపంచాన్ని పరిచయం చేశాడని వేణుగోపాల్ చెప్పడం విశేషం. అగ్రనేతలకు ఆత్మీయుడు.. పశ్చిమబెంగాల్లో అమరుడైన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ మొదలుకొని ఇప్పటికీ సజీవంగా కేంద్ర కమిటీలో ఉన్న గణపతి అలియాస్ ముప్పళ్ల లక్ష్మణ్‌రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి (కోసా), మంథనికి చెందిన మల్లా రాజిరెడ్డి, ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రతినిధి గణేష్ ఇలా.. ఓ పదిపదిహేను మంది మావోయిస్ట్ అగ్రనేతలకు నిజాం వెంకటేశం సార్ ఇల్లు ప్రధాన షెల్టర్ అని రాఘవపూర్ గ్రామస్తులు తెలిపారు. వామ్మో సార్ ఇంటికి అప్పట్లో పెద్ద పెద్దోళ్లు (పెద్దన్నలు) వచ్చేవారని అంటున్నారు. ఇక ఉత్తర తెలంగాణ కార్యదర్శి సాగర్ అలియాస్ దుగ్గు రాజ లింగం ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు. రాజలింగంకు నిజాం వెంకటేశం అత్యంత సన్నిహితుడిగా మల్లోజుల వేణుగోపాల్ పేర్కొన్నారు. నిజాం వెంకటేశం విప్లవ కార్యాచరణకు అందించిన సహకారాన్ని వివరిస్తూ రాసిన లేఖ పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల్లో ఒక సంచలనం రేపింది. విప్లవ ఉద్యమానికి ఆయన నిర్వర్తించిన పాత్ర అనిర్వచనమని మల్లోజుల పేర్కొన్నారు. ఆశ్రయం కల్పించడం, సాహిత్యాన్ని అందించడం, వచ్చినవారిని కడుపులో దాచుకోవడం, ఉద్యమంలో పాల్గొన్నవారిని, వారి ఆర్థిక అవసరాలను తీర్చి, ప్రోత్సహించేవారిని నాటి వెంకటేశం మిత్రులు పేర్కొంటున్నారు. ఇలా ఉద్యమానికి అక్షరమై, ఆయుధాన్ని అందించిన వెంకటేశం సిరిసిల్ల ప్రాంత వాసి కావడం విశేషం. నిజానికి నిజాం వెంకటేశం గురించి సిరిసిల్ల ప్రాంత వాసులకు చాలా తక్కువే తెలుసు కానీ, ఆయనతో సన్నిహితంగా ఉండేవారికి అపర మేధావి, ధైర్యవంతుడు, పెద్ద యుద్ధానికి అగ్రనేతలను సంసిద్ధులను చేసిన పెద్దన్నగా పేరు సంపాదించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో స్థిరపడి.. సిరిసిల్లకు చెందిన నిజాం విశ్వనాథం, సత్తమ్మ దంపతుల కొడుకు వెంకటేశం. భార్య పేరు మాధవి. ఒక్క కొడుకు, ఇద్దరు కూతుర్లు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 1966లో పాలిటెక్నిక్ చేసిన వెంకటేశం, చదువు పూర్తికాగానే 1968లో తొలిసారి ట్రాన్స్‌కోలో ఉద్యోగిగా జగిత్యాలలో విధుల్లో చేరారు. 1972 నుంచి 1978 వరకు పెద్దపల్లిలో పని చేశారు. అనంతరం 1978 నుంచి 1990 వరకు జగిత్యాల ప్రాంతంలో పని చేశారు. 1997లో ఉద్యోగ విరమణ చేశారు. ఇంగ్లిష్‌పై పట్టున్న ఆయన అనేక పుస్తకాలను తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. సిరిసిల్ల శివారులోని రంగినేని ట్రస్ట్‌లో జరిగే సాహిత్య వేడుకలకు ఆయన తరచూ వచ్చేవారు. సిరిసిల్లలో అనేక మంది కవులు, సాహిత్యకారులు నిజాం వెంకటేశం సన్నిహితులుగా ఉన్నారు. కవిగా, విమర్శకులుగా పలు సాహిత్యకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘అజాత శత్రువు’గా పుస్తకం వెంకటేశం సాహిత్యం.. వ్యక్తిత్వాన్ని ‘అజాత శత్రువు నిజాం వెంకటేశం’ పేరుతో పుస్తకాన్ని వెలువరించారు. తెలంగాణ జిల్లాలోని ప్రముఖ రచయితలు, కవులు, సాహిత్యకారులు ఈ పుస్తకంలో ఆయనతో ఉన్న అనుబంధాలను రాశారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఆయన ఎదుటివారికి సాయం చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేవారు కాదు. తన సంపాదనలో ఎక్కువగా పుస్తకాల కొనుగోలుకు వెచ్చించినట్లు పలువురు తమ వ్యాసాల్లో వెల్లడించడం విశేషం. తను మరణించిన ఏడాది పూర్తి అయిన సందర్భంగా సిరిసిల్ల ప్రాంతంలోని సాహిత్యకారులు ఆయన సేవలను యాది చేసుకున్నారు. -
మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి.. శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిని మావోయిస్టు పార్టీ ధృవీకరించకలేదు. రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండటం గమనార్హం. వివరాల ప్రకారం.. మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతిచెందారు. కాగా, రాజిరెడ్డి స్వస్థలం.. పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం ఎగ్లాస్పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి. ఇక, రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అయితే, రాజిరెడ్డిని పట్టుకుంటే రూ.కోటి కూడా ప్రభుత్వం నజరానా కూడా ప్రకటించడం విశేషం. మరోవైపు.. రాజిరెడ్డి ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించారు. ఇది కూడా చదవండి: హైటెక్ సిటీ: ప్రాణం తీసిన అతివేగం.. యువతి మృతి -
కీలక మావోయిస్టు లొంగుబాటు.. 45మంది జవాన్ల హత్యలో సూత్రధారి
సాక్షి, చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 45 మంది జవాన్లను హతమార్చిన ఓ మావోయిస్టు కాంకేర్ జిల్లాలో బీఎస్ఎఫ్ పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయాడు. బీజాపూర్ జిల్లాకు చెందిన సున్నూ మడవి అలియాస్ శివాజీ మావోయిస్టు పార్టీ ప్లాటూన్ నంబర్-5లో డిప్యూటీ కమాండర్‌గా పని చేస్తున్నాడు. అయితే, ఆ పార్టీలో పనిచేసే ఓ మహిళా మావోయిస్టును వివాహం చేసుకోవడంతో పార్టీ డీప్రమోట్ చేసి గంగులూరు ఏరియా కమిటీకి పంపింది. ఆ సమయంలో అతడికి అగ్రనాయకుల వేధింపులు ఎదురవడంతో పార్టీ నుంచి పారిపోయి ఇంటికి వచ్చాడు. కాగా, గ్రామంలో అప్పటికే లొంగిపోయిన కొందరు మావోయిస్టులు.. మళ్లీ పార్టీలోకి వెళ్లవద్దని, నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని సూచించడంతో కాంకేర్‌లోని బీఎస్ఎఫ్ 135 బెటాలియన్ పోలీసు అధికారులను ఆశ్రయించాడు. బాలల సంఘం నుంచి డిఫ్యూటీ కమాండర్‌గా.. శివాజీ తొలుత 2005లో మావోయిస్టు పార్టీతో సంబంధాలు పెంచుకుని బాలల సంఘంలో చేరాడు. 2006లో కాంకేర్ జిల్లాలోని పార్తాపూర్ ఏరియా కమిటీ సభ్యుడిగా, ఆ తర్వాత మిలటరీ ప్లాటూన్ కంపెనీ నంబర్-5కు డిప్యూ టీ కమాండర్‌గా నియమితులయ్యాడు. ఇక, అతనిపై రూ.3 లక్షల రివార్డు ఉంది. 2009లో మదనవాడలో ఎస్పీ వినోద్ చౌబోతే సహా 29 మంది జవాన్లను, 2006లో దంతెవాడలో ఎనిమిది మంది సీఐఎఫ్ జవాన్లపై దాడి చేసి హత మార్చిన ఘటనలో మడవి అలియాస్ శివాజీ పాల్గొన్నాడు. ఇది కూడా చదవండి: బెదిరింపు కాల్స్ రావడంతో అజ్ఞాతంలోకి -
మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
-
మావోయిస్టు అగ్రనేత కటకం కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/ బెల్లంపల్లి/ చర్ల: మావోయిస్టు పార్టీ అగ్రనేత, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ (69) అలియాస్ ఆనంద్ కన్నుమూశారు. ఐదు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన కొంతకాలం నుంచి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో దండకారణ్యం గెరిల్లా జోన్లో మే 31న మధ్యాహ్నం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దీనిపై మావోయిస్టు కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశారు. వందలాది మంది పార్టీ, ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్జీఏ) కార్యకర్తలు, నాయకులు, కమాండర్ల సమక్షంలో విప్లవ సాంప్రదాయాలతో సుదర్శన్ అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపారు. సుదర్శన్ భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులకు మావోయిస్టు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. సుదర్శన్ మృతికి సంతాపంగా సోమవారం నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా స్మారక సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ర్యాడికల్ విద్యార్థి సంఘంతో మొదలై.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన పేద కార్మిక కుటుంబంలో పుట్టిన కటకం సుదర్శన్.. 1974లో మైనింగ్ డిప్లొమా చదువుతున్న సమయంలో విప్లవ పోరాటంలో అడుగుపెట్టారు. 1975లో ర్యాడికల్ విద్యార్థి సంఘం ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారు. తర్వాత బెల్లంపల్లి పార్టీ సెల్ సభ్యుడిగా, సింగరేణి కార్మిక ఉద్యమం, ర్యాడికల్ విద్యార్థి యువజన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. నక్సల్బరీ, శ్రీకాకుళం సంఘర్షణ విముక్తి, పోరాటాల ప్రేరణతో అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో చేరారు. 1978లో లక్సెట్టిపేట, జన్నారం ప్రాంతాల్లో పార్టీ ఆర్గనైజర్‌గా బాధ్యతలు చేపట్టి రైతాంగాన్ని విప్లవోద్యమంలో సమీకరించారు. 1980లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా దండకారణ్య ప్రాంతంలోకి విప్లవోద్యమాన్ని విస్తరించడంలో కీలకంగా పనిచేశారు. 1987లో దండకారణ్య కమిటీ సభ్యుడిగా, తర్వాత ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఇంద్రవెల్లి ఆదివాసీ రైతాంగ ఉద్యమానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. 1995లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2001లో భారత కమ్యూనిస్టు పార్టీ (పీపుల్స్ వార్) 9వ కాంగ్రెస్‌లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ఐదు దశాబ్దాల ప్రస్థానం.. 2004లో పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(ఎంసీసీఐ) కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఆవిర్భవించాయి. ఈ క్రమంలో 2007లో మరోమారు కేంద్ర కమిటీకి ఎన్నికై పొలిట్ బ్యూరో సభ్యుడిగా, సెంట్రల్ రీజనల్ బ్యూరో కార్యదర్శిగా పనిచేశారు. మొత్తంగా 2001 నుంచి 2017 వరకు సెంట్రల్ రీజనల్ బ్యూరో (సీఆర్బీ) కార్యదర్శిగా కొనసాగిన ఆయన.. తర్వాత అనారోగ్య కారణాలతో ఆ బాధ్యతల నుంచి వైదొలగి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ విప్లవోద్యమ ప్రస్థానంలో సుదర్శన్ కీలక బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రచురితమైన పలు విప్లవ పత్రికలకు సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. జీవిత భాగస్వామి ఎన్కౌంటర్లో మృతి విప్లవోద్యమంలో చేరిన తర్వాత సుదర్శన్ సహచర విప్లవకారిణి కోలం లలితాబాయి అలియాస్ లలితక్కను విప్లవ సిద్ధాంతం ప్రకారం వివాహం చేసుకున్నారు. లలితక్క పార్టీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 2003లో కుమురం భీం జిల్లా బెజ్జూర్ మండలం అగర్‌గూడ అటవీ ప్రాంతంలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో ఆమె మృతి చెందారు. తర్వాత సుదర్శన్ మరో సహచర విప్లవకారిణి పద్మను ద్వితీయ వివాహం చేసుకున్నట్టు ప్రచారంలో ఉంది. ప్రభుత్వాల ఫాసిస్టు విధానాల వల్లే సుదర్శన్ మరణం: మావోయిస్టులు విప్లవోద్యమ నాయకులకు, కార్యకర్తలకు మందులు, వైద్య చికిత్స అందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఫాసిస్టు దాడి ఫలితంగానే సుదర్శన్ మరణించారని మావోయిస్టు కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. తీవ్ర అనారోగ్యంతో వైద్యం కోసం మావోయిస్టు, పీఎల్ఏ కార్యకర్తలు, నాయకులు పట్టణాలకు వెళ్తే.. పట్టుకుని హత్యలు చేయడం, లొంగిపోతేనే మెరుగైన వైద్యం అందిస్తామని ప్రకటించడం క్రూరమైన చర్య అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కొత్త ప్లాన్.. వారికి ఎక్కువ సీట్ల కేటాయింపు! -
భారత్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్.. నేపాల్‌లో సినీ ఫక్కీలో అరెస్ట్
ఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సిక్కు వ్యక్తిలా నటిస్తూ నేపాల్‌లో తలదాచుకున్న మావోయిస్టు నేత దినేష్ గోపే అరెస్ట్ అయ్యాడు. ఇక, అంతకుముందు గోపే ఆచూకీ తెలిపిన వారికి ఎన్ఐఏ రూ. 5 లక్షలు, ఝార్ఖండ్ ప్రభుత్వం రూ. 25 లక్షలు రివార్డు ప్రకటించాయి. వివరాల ప్రకారం.. మావోయిస్టు నేత దినేష్ గోపే మారు వేషంతో నేపాల్‌లో తలదాచుకుంటున్నాడు. మూడు రాష్ట్రాల్లో 100కుపైగా క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న గోపేను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆదివారం అరెస్ట్ చేసింది. కాగా, నిషేధిత మావోయిస్టు సంస్థకు చెందిన దినేష్ గోపే పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సిక్కు వ్యక్తిలా నటిస్తూ 13 నెలలుగా నేపాల్‌లో దాబా నడుపుతున్నాడు. అయితే, ఇటీవల ఆయన.. జార్ఖండ్‌లోని బీజేపీ నేతలకు ఫోన్ కాల్ చేయడంతో ఎన్ఐఏకు చిక్కాడు. అతడి ఫోన్‌కాల్‌ను ట్రేస్ చేసిన అధికారులు.. గోపే నేపాల్‌లో ఉన్నట్టు గుర్తించారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు ఎంతో చాకచక్యంగా గోపేను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. గతేడాది జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్భమ్లో గోపే నేతృత్వంలోని పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్ఎఫ్ఐ) సభ్యులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ నుంచి గోపే చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఆ తర్వాత నేపాల్ పారిపోయి అంతర్జాతీయ సరిహద్దులోని బిరత్నగర్లో ధాబా నడుపుతున్నాడు. అయితే, నిరుద్యోగులైన యువకులకు ఆయుధాల వాడకంలో శిక్షణ ఇవ్వడంతో పాటు మోటార్ బైక్స్ ఇచ్చి హింసాత్మక సంఘటనల్లో పాల్గొనేలా చేశాడు దినేష్ గోపే. కాగా, గత 15 ఏళ్లుగా భారతీయ భద్రతా సంస్థలు, సీఆర్పీఎఫ్ ఫోర్స్ నక్సలైట్ దినేష్ గోపే కోసం వెతుకుతున్నాయి. మరోవైపు.. జార్ఖండ్, బీహార్, ఒడిశాలలో హత్యలు, కిడ్నాపులు, బెదిరింపులు, దోపిడీలు, నిధుల సేకరణ వంటి వాటికి సంబంధించి గోపేపై 102 కేసులు నమోదయ్యాయి. అతడి ఆచూకీ తెలిపిన వారికి ఎన్ఐఏ రూ. 5 లక్షలు, జార్ఖండ్ ప్రభుత్వం రూ. 25 లక్షలు రివార్డు ప్రకటించాయి. Most wanted Naxal Commander Dinesh Gope was living in Delhi arrested in Joint op by NIA & JH Police. He is wanted by JH, Odisha, Bihar in 100+ cases & had ₹30L reward. Has 100's of pockets all around the borders of Delhi where u have Illegal Immigrants staying in millions. pic.twitter.com/F35UuJVs0R — Kavi 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 (@kavita_tewari) May 22, 2023 ఇది కూడా చదవండి: 'మా స్టాండ్‌ని వదిలిపెట్టం'! అందుకు మూల్యం చెల్లించేందుకు రెడీ: శరద్ పవార్ -
మావోయిస్టు అగ్రనేత జగన్‌కు మాతృవియోగం
సాక్షి, అల్లూరి: మావోయిస్టు అగ్రనేత కాకూరి పండన్న అలియాస్ జగన్, తల్లి సీతమ్మ కన్నుమూసింది. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే.. ఆ మధ్య ఆమె దీనస్థితి గురించి తెలుసుకున్న అధికారులు.. ఆమె ఇంటికి వెళ్లి మరీ చికిత్సకు సాయం అందించారు. అయినప్పటికీ వృద్ధాప్యరిత్యా సమస్యలతో నెల తిరగకుండానే ఆమె కన్నుమూసినట్లు తెలుస్తోంది. పండన్న అలియాస్ జగన్ స్వగ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీ పరిధిలోని కొమ్ములవాడ గ్రామం. పండన్న ఉద్యమంలోకి వెళ్లిన నాటి నుంచి తల్లి సీతమ్మ స్వగ్రామంలో ఉంటోంది. అయితే.. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న సీతమ్మకు.. కిందటి నెలలో పోలీసులు చికిత్స సాయం అందించారు. ఆ సమయంలో ఉద్యమాన్ని వదిలి జనాల్లోకి రావాలని, వచ్చి వ్యవసాయం చేసుకోవాలని, అన్నింటికి మించి వృద్ధాప్యంలో ఉన్న తన బాగోగులు చూసుకోవాలని ఆమె తన కొడుకుకి పిలుపు ఇచ్చారు. ఇది జరిగిన నెలకే ఆమె కన్నుమూశారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రా-ఒడిశా ప్రత్యేక జోనల్ కమిటీ ప్రత్యామ్నాయ సభ్యుడైన జగన్, తన తల్లి అంత్యక్రియలకు హాజరవుతాడనే ఉద్దేశంతో పోలీసులు నిఘా పెంచారు. -
మావోయిస్టు కీలకనేత రైనో అరెస్ట్
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు (డీసీఎం) జనుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్ అలియాస్ రైనోను ఏవోబీలో అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీలేరు పోలీసు స్టేషన్ పరిధి, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల సమయంలో రైనోను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. రైనో ఏవోబీ టెక్నికల్ టీమ్‌లో, సీఆర్సీ 3వ కంపెనీలో కమాండర్‌గా, మావోయిస్టు నేత ఆర్కేకు ప్రొటెక్షన్ స్క్వాడ్ కమాండర్‌గా, ఏవోబీలో మిలిటరీ ప్లటూన్ కమాండర్‌గా వివిధ హోదాల్లో పనిచేశాడని తెలిపారు. 2018లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేల హత్యకేసులోనూ రైనో ప్రధాన నిందితుడని పేర్కొన్నారు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా పోలీసుశాఖ రికార్డుల్లో ఉన్నాడని తెలిపారు. అరెస్టయిన శ్రీనుబాబు అలియాస్ రైనోపై ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డును గతంలో ప్రకటించిందని పేర్కొన్నారు. రైనోను న్యాయస్థానంలో హాజరుపరిచామని ఎస్పీ తెలిపారు. -
మోస్ట్ వాంటెడ్ హిడ్మా.. చరిత్ర అంతా చిక్కడు దొరకడు..!
తెలంగాణ- ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులో మావోయిస్టు కీలక నేత హిడ్మా హతమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ గ్రేహౌండ్స్-ఛత్తీస్‌ఘడ్ సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా టీం సంయుక్త ఆపరేషన్‌లో హిడ్మా ఎన్కౌంటర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లా ఎల్మాగూడ- బీజాపూర్ జిల్లా ఎగువసెంబి మధ్య ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో... పలువురు మావోలతో పాటు హిడ్మా హతమయ్యాడన్నది పోలీసు వర్గాల సమాచారం. ఈ ఎన్కౌంటర్ కోసం పోలీసులు హెలికాప్టర్ వాడినట్టు స్థానికులు కొందరు చెబుతున్నారు. 50లక్షల రివార్డు ఉన్న హిడ్మాను నాలుగు రాష్ట్రాల పోలీసులు గత రెండు దశాబ్దాలుగా వెతుకుతున్నారు. చేతిలో నెంబర్ వన్ బెటాలియన్ దాదాపు మూడు దశాబ్దాలుగా ఛత్తీస్‌ఘడ్ మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన హిడ్మా... ఆర్మీ స్ట్రాటజీలలో దిట్ట. మావో సిద్ధాంతాన్ని పెద్దగా చదువుకోకపోయినా... తుపాకి ద్వారా పార్టీలో హిడ్మా పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. సుక్మా జిల్లాలో పుట్టిన హిడ్మా 17ఏళ్ల వయసులోనే... పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా పార్టీలో చేరాడు. ఆ తరువాత మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు పార్టీలో ఉన్న నెంబర్-1 బెటాలియన్ ప్రస్తుతం హిడ్మా చేతిలో ఉంది. హిడ్మా ఆదేశాలు ఇస్తే ఈ బెటాలియన్ ఎక్కడైనా విరుచుకుపడుతుంది. మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత భయంకరమైన బెటాలియన్‌గా సుగ్మా టీంకు పేరుంది. టార్గెట్ 100% 2011లో ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన చింతల్నార్ దాడిలో దాదాపు 75మంది CRPF జవాన్లు చనిపోయారు. అప్పట్లో సంచలనంగా మారిన ఈ దాడికి హిడ్మా నాయకత్వం వహించాడు. ఇక 2017లో జరిగిన బూర్కపాల్ దాడిలోనూ హిడ్మా పాత్ర ఉందని మావోయిస్టు పార్టీయే ప్రకటించింది. వందలమంది మిలిటెంట్లను గెరిల్లా ఆర్మీతో ఏకం చేసి దాడి చేయడం ఇతడి ప్రత్యేకత. హిడ్మా దాడి చేస్తే ఎవరూ తప్పించుకోరని మావోయిస్టు పార్టీలో ఒక నమ్మకం. ఛత్తీస్‌ఘడ్‌లో గత రెండు దశాబ్దాల్లో జరిగిన ప్రధాన హింసాకాండలకు హిడ్మాయే కారణం అని అక్కడి పోలీసులు చెబుతారు. చదవండి: (తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్‌లో హిడ్మా హతం?) హింస vs సిద్ధాంతం చాలాకాలం పాటు పోలీసులకు ఫోటో కూడా దొరకకుండా జాగ్రత్తపడిన హిడ్మా గురించి మావోయిస్టు క్యాడర్లోనే చాలా మందికి తెలియదు. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీలోకి హిడ్మాను తీసుకోవడంపై పార్టీలో చాలా విబేధాలు వచ్చాయి. మావోయిస్టు పార్టీలో అత్యంత నిర్ణాయకమైన కేంద్రకమిటీలోకి ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేని హిడ్మాను తీసుకోవడం అంటే హింసను ప్రోత్సహించడమే అని కొంత మంది మావోయిస్టు సానుభూతిపరులు విమర్శించారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని వదిలి పూర్తిగా హింసామార్గాన్ని అందుకుందని హిడ్మాకు వ్యతిరేకంగా వాదనలు వచ్చాయి. మనుషుల్ని చంపడంలో హిడ్మా చేసే హింస ఎంతో భయంకరంగా ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా ఇన్ఫార్మర్ల నెపంతో హిడ్మా కిరాతక హత్యలకు పాల్పడినట్లు చాలా చర్చ ఉంది. తన నీడను కూడా హిడ్మా నమ్మడని... దాదాపు 10మంది వరకు రాత్రింభవళ్లు హిడ్మాకు పహరా కాస్తారని మాజీ మావోలు చెబుతారు. కేంద్ర కమిటీ వల్లే దెబ్బ తిన్నాడా? పార్టీ పుట్టుక నుంచి మావోయిస్టు పార్టీలో కేంద్రకమిటీలో ఒక్క గోండు కూడా లేడు. ఛత్తీస్‌ఘడ్‌లో ప్రస్తుతం 80శాతం మావోయిస్టులు గోండు తెగకు చెందిన గిరిజనులే. అయితే వీరికి నాయకత్వం ఇవ్వడంతో పార్టీలో పెద్ద చర్చ జరిగింది. వీరిలో చాలామందికి సైద్ధాంతిక ప్రాతిపదిక లేదని కొందరు విమర్శించారు. కేవలం చంపడంపైనే శిక్షణ పొందిన వీరు పార్టీని నడపలేరని చెబుతారు. ఇలాంటి సందర్భంలోనే హిడ్మా కేంద్ర కమిటీలోకి రావడం వల్ల... ఛత్తీస్‌ఘడ్ మావోయిస్టు పార్టీలో స్థానిక గిరిజనులు నాయకత్వం తీసుకోడానికి ఒక అవకాశంగా మారింది. నమ్మకం వమ్మయిందా? హిడ్మాను ఎవరూ చంపలేరని మావోయిస్టు పార్టీలో ఒక గుడ్డి నమ్మకం ఉంది. ఇప్పుడు హిడ్మా చనిపోతే అది క్యాడర్‌కు కూడా నైతికంగా ఎదురు దెబ్బేనని పోలీసులు చెబుతున్నారు. గతంలో చాలా ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న హిడ్మా... ఎన్కౌంటర్లో ఎలా చనిపోతారనే చర్చ జరుగుతోంది. గతంలో చాలాసార్లు హిడ్మా చనిపోయాడని వార్తలు వచ్చాయి. అయితే హిడ్మా బ్రతికే ఉన్నాడని తర్వాత తేలింది. ప్రస్తుత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై ఇప్పటివరకు తెలంగాణ -ఛత్తీస్గడ్ పోలీసులు ఎలాంటి ధృవీకరణ చేయలేదు. అటు మావోయిస్టు పార్టీ కూడా దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. - ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి
-
తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్‌లో హిడ్మా హతం?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమయ్యాడు. బీజాపూర్- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఇదిలా ఉంటే, మావోయిస్టు కేంద్ర కమిటీ హిడ్మా మృతిని ఇప్పటిదాకా ధృవీకరించలేదు. గతంలోనూ హిడ్మా చనిపోయాడంటూ అనేకసార్లు ప్రచారం జరిగింది. కాగా, 43 ఏళ్ల వయసు, సన్నగా ఉండే మావోయిస్టు, దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో అత్యధిక సంఖ్యలో పోలీసులను హతమార్చిన మావోయిస్టు హిడ్మా. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం స్థానికుడయిన హిడ్మా అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. 1996-97 ప్రాంతంలో తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరారు మడావి హిడ్మా. ఆయనకు హిద్మల్లు, సంతోష్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. చదివింది మాత్రం 7వ తరగతే అయినా మావోయిస్టు సాయుధ విభాగం పీఎల్జీఏ ( పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)లో కీలక నేతగా ఎదిగాడు హిడ్మా. అటవీ ప్రాంతంలో పోలీసులను, సీఆర్పీఎఫ్ జవాన్లను టార్గెట్ చేయడంలో హిడ్మా వ్యూహాలు చాలా సార్లు సక్సెస్ కావడంతో.. హిట్ లిస్టులో ఉన్నాడు. ఉర్పల్ మెట్లలో 2007లో జరిగిన 24మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, తాడిమెట్లలో 2011లో జరిగిన దాడిలో 76 మంది జవాన్లు, 2017లో 12 మంది జవాన్లు మృతి చెందిన ఘటనల్లో హిడ్మా కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు పార్టీలో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి పార్టీ, రెండోది సాయుధ బలగం, మూడు ప్రజా ప్రభుత్వం. మూడు విభాగాల్లోనూ పని చేసిన హిడ్మాపై 45 లక్షల రూపాయల రివార్డు ఉంది. -
చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు దళ సభ్యుడు అరెస్ట్
చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): మావోయిస్టు పార్టీకి చెందిన దళ సభ్యుడిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ వివరాలను ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కుంట అడిషనల్ ఎస్పీ గౌరవ్‌మండల్ శుక్రవారం కుంటలో మీడియాకు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉన్న మన రాష్ట్రంలోని చింతూరు మండలం బుర్కనకోటలో బుధవారం రాత్రి సోయం సుబ్బయ్య(35) అనే వ్యక్తిని మావోయిస్టులు హత్య చేశారు. ఈ విషయం తెలిసి ఛత్తీస్‌గఢ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం కుంట పోలీసుస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. సున్నంపాడు గ్రామం వద్ద అనుమానాస్పదంగా తారసపడిన గోంపాడు గ్రామానికి చెందిన సోయం సంతోష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారణ చేయగా, తాను మావోయిస్టు దళ సభ్యుడినని, కుంట ఎల్వోఎస్ కమాండర్ హితేష్ హుంగా ఆధ్వర్యంలో 10 మందిమి బుర్కనకోటకు చెందిన సోయం సుబ్బయ్యను హతమార్చినట్లు అంగీకరించాడని అడిషనల్ ఎస్పీ తెలిపారు. సంతోష్‌ను శుక్రవారం చింతూరు పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. -
పట్టుబడిన మావోయిస్టులు, సానుభూతిపరులు.. ఎందుకొచ్చినట్లు!?
సాక్షి, వరంగల్: ఛత్తీస్‌గఢ్‌నుంచి మావోయిస్టులు వరంగల్ నగరానికి ఎందుకు వచ్చారు..? వైద్యం కోసం వస్తే గుట్టుచప్పుడు కాకుండా ఒక్కరో ఇద్దరితోనే ఆస్పత్రికి రావాలి.. మరి బొలెరో వాహనంలో ఐదుగురు ఎందుకు వచ్చినట్లు? వెంట పేలుడు పదార్థాలు ఎందుకు ఉన్నాయి? వీటన్నింటిని పరిశీలిస్తే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్బన్ నక్సల్స్ విస్తరణలో భాగంగా నగరంలో పాగా వేసేందుకు ప్రయత్నించారా? మరేదైనా యాక్షన్‌కు ప్లాన్ చేశారా? అన్న చర్చ జరుగుతోంది. సీపీఐ మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న మావోయిస్టులు సోమవారం వరంగల్ పోలీసులకు చిక్కడం ఉమ్మడి జిల్లాలో సంచలనంగా మారింది. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమాలకు కంచుకోటలాంటి వరంగల్‌లో కొన్నేళ్లుగా ఆ పార్టీ కార్యకలాపాలు కనుమరుగయ్యాయి. ఈ సమయంలో ఇద్దరు మావోయిస్టులతోపాటు ముగ్గురు సానుభూతిపరుల అరెస్ట్ కలకలం రేపింది. మడకం ఉంగి అనేక కేసుల్లో నిందితురాలు.. పోలీసులకు చిక్కిన మడకం ఉంగి అలియాస్ కమల వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన మహిళా మావోయిస్టు. విప్లవ సాహిత్యం, ప్రసంగాలు, పాటలకు ఆకర్షితురాలై 2007 వరకు బాలల సంఘంలో పనిచేసి, 2011లో ముసాకి చంద్రు నాయకత్వంలో మిలీషియా సభ్యురాలిగా పనిచేసింది. అదే ఏడాది పామెడు ఎల్జీఎస్ కమాండర్ బొద్దె కిషన్ అధ్వర్యంలో ఎన్డీఎస్ సభ్యురాలిగా పనిచేసింది. 9వ ప్లాటూన్‌లో, 2012 సంవత్సరంలో సౌత్ సబ్ జోనల్ బ్యూరో టీం ఇన్చార్జ్గా నియమితులైంది. వివిధ ఘటనల్లో గాయపడిన మావోయిస్టులకు చికిత్స అందించేది. 2017 ఏప్రిల్‌లో చింతగుప్ప పోలీస్‌స్టేషన్ బుర్కా పాల్ ఆటవీ ప్రాంతంలో దాడిచేసి 25మంది పోలీసులను హత్య చేసిన çఘటనలో నిందితురాలు. 2018లో మినప అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులను హత్యచేసి మరో ఆరుగురిని తీవ్రంగా గాయపర్చిన సంఘటన, 2020 మార్చిలో చింతగుప్ప పోలీస్‌స్టేషన్ పరిధిలోని మినప అడవి ప్రాంతంలో 17మంది, 2021లో బెటాలియన్ కమాండర్ హిడ్మా, సాగర్ నాయకత్వంలో గుట్టపరివార ప్రాంతంలో ఆడవిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న 24మంది బీజాపూర్ పోలీసులను హత్యచేసిన çఘటనల్లో నిందితురాలు. మరో మావోయిస్టు అసం సోహెన్ ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ప్రసంగాలు, పాటలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. 2019లో మావోయిస్టు పార్టీ కార్యదర్శి, నేషనల్ పార్క్ ఏరియా సెక్రటరీ దిలీప్ వింజ ఆధ్వర్యంలో సభ్యుడిగా నియామకమయ్యాడు. బీడీ ఆకుల కాంట్రా క్టర్లు, ఇతర సంపన్న వ్యక్తులనుంచి పార్టీ ఫండ్ పే రుతో డబ్బు వసూలు చేసి పార్టీకి అవసరమైన ని త్యావసరాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేసి అందజేసేవాడు. దీంతోపాటు పేలుడు పదార్థాలను వరంగల్, కరీంనగర్ ప్రాంతాలనుంచి రహస్యంగా కొనుగోలు చేసి మావోయిస్టు పార్టీకి చేరవేసేవాడు. వీరితోపాటు మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘ్ అధ్యక్షురాలు మీచ అనిత (21), (భూపాలపట్నం తాలూకా కండ్లపర్తి గ్రామం), ఆర్పీసీ సభ్యుడు గొడ్డి గోపాల్ (భూపాలపట్నం తాలూకా వరదల్లి గ్రామం), భూపాలపట్నం తాలూకా నల్లంపల్లికి చెందిన కందగుర్ల సత్యం ఉన్నారు. మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, సెల్ఫోన్లు, నగదు ఛత్తీస్‌గఢ్ టు వరంగల్, వయా ములుగు మావోయిస్టుల అరెస్టుకు సంబంధించి వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ మేరకు అరెస్టయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం భూపాలపట్నం తాలూకా నుంచి ములుగు జిల్లా మీదుగా వరంగల్ నగరానికి చేరినట్లు తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం, ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఆదివారం సాయంత్రం సమయంలో ములుగు రోడ్డు అజర హాస్పిటల్ ప్రాంతంలో వరంగల్ టాస్క్‌ఫోర్స్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో కారులో వస్తూ పట్టుబడ్డారు. ఇద్దరు మహిళలు, డ్రైవర్‌తో సహా మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారంతా నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు, సానుభూతిపరులుగా గుర్తించారు. వారినుంచి 50 జిలిటెన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు, రూ.74వేల నగదు, విప్లవ సాహిత్యం, ఒక బొలెరో కారు, సెల్ఫోన్లు, ఆధార్, ఎన్నికల గుర్తింపు కార్డులను స్వా«ధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. నక్సలైట్లను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ జితేందర్ రెడ్డి, హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, హనుమకొండ ఇన్స్పెక్టర్లు సురేశ్ కుమార్, శ్రీనివాస్‌జీ, హనుమకొండ ఎస్ఐలు, ఇతర సిబ్బందిని సెంట్రల్ డీసీపీ అభినందించారు. పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టులు, సానుభూతిపరులు -
విరాట పర్వం: 30 ఏళ్ల కిందట పేలిన తూటా.. శంకరన్న చేతిలో సరళ బలి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకప్పుడు మావోయిస్టుల ఖిల్లా. అడుగడుగునా అన్నలు కలియతిరిగిన ప్రాంతం. అడవులన్నీ ఉద్యమపాటలతో ఉర్రూతలూగగా ఆకర్షితులైన యువత మన్యంబాట పట్టేది. ఆ సమయంలో జిల్లాలో తూర్పు.. పశ్చిమ డివిజన్లు ఉండేవి. ఈ రెండు ప్రాంతాలు కేంద్రంగా మావోలు కార్యకలాపాలు కొనసాగించేవారు. కరీంనగర్– నిజామాబాద్ జిల్లాల సరిహద్దులను మావోయిస్టు పార్టీ పశ్చిమ డివిజన్‌గా పరిగణించేది. ఆ పశ్చిమ అడవుల్లో 30 ఏళ్ల కిందట జరిగిన ఘటన ఆధారంగా ఇటీవల ‘విరాట పర్వం’ సినిమా వచ్చింది. సరళ అనే అమ్మాయి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఆ సినిమాను తెరకెక్కించినా.. రాజన్నసిరిసిల్ల జిల్లాతో సరళ ఘటనకు ముడిపడి ఉంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సిర్నాపల్లి అడవుల్లో సరళను 1992 జూలైలో హత్య చేశారు. సరళను చంపిన శంకరన్న అలియాస్ దొంతు మార్కండేయ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటవాసి. శంకరన్న అప్పటి పీపుల్స్‌వార్‌లో ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందనేదానిపై కథనం.. సిరిసిల్ల: కరీంనగర్–నిజామాబాద్ జిల్లాల సరిహద్దులను మావోయిస్టు పార్టీ పశ్చిమ డివిజన్‌గా పరిగణిస్తోంది. ఆ పశ్చిమ అడవుల్లో 30 ఏళ్ల కిందట జరిగిన ఘటన ఆధారంగా ఇటీవల ‘విరాట పర్వం’ సినిమా వచ్చింది. సరళ అనే అమ్మాయి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించినా.. రాజన్న సిరిసిల్ల జిల్లాతో సరళ ఘటనకు ముడిపడి ఉంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సిర్నాపల్లి అడవుల్లో సరళను 1992 జూలైలో హత్య చేశారు. సరళను చంపిన శంకరన్న అలియాస్ దొంతు మార్కండేయ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటవాసి. శంకరన్న అప్పటి పీపుల్స్‌వార్‌లో ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఉన్నారు. ఆ రోజు ఏం జరిగింది..? ► ఖమ్మం జిల్లాకు చెందిన తూము సరళ ఇల్లు వదిలి సిర్నాపల్లి అటవీ ప్రాంతానికి చేరింది. వాస్తవానికి అప్పటికే శంకరన్న భార్య జ్యోతి ఎన్కౌంటర్లో మరణించింది. ► ఆ వార్తను పత్రికల్లో చూసిన సరళ, శంకరన్నను కలిసేందుకు ఇల్లు వీడి నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లి ప్రాంతానికి చేరింది. ► అటవీ ప్రాంతంలోని డొంకల్, గన్నారం, సిర్నాపల్లి గ్రామాల్లో ఉంటూ.. పార్టీలో చేరాలని, శంకరన్నను కలవాలని ప్రయత్నించింది. ► ఈక్రమంలోనే డొంకల్ అటవీ ప్రాంతంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం జరుగుతుండగా.. సరళను పిలిచి విచారించారు. ► శంకరన్నతోపాటు హరిభూషణ్, కుమార్ దళాలు ఉన్నాయి. సరళను పోలీస్ ఇన్ఫార్మర్గా భావించి, కోవర్టుకు పాల్పడుతోందనే భయంతో ఆమెను విచారించారు. ► సరళ ఎంత కొట్టినా.. తాను పార్టీలో చేరేందుకు వచ్చానని పదే పదే చెప్పినట్లు సమాచారం. ► చివరకు శంకరన్న, సరళను భయపెట్టేందుకు ఫైర్ చేయగా.. అది పొరపాటున సరళకు తగిలి మరణించినట్లు అప్పట్లో పార్టీలో పనిచేసి లొంగిపోయిన మాజీ దళ నేత కుమార్ వెల్లడించారు. అలా సరళ సిర్నాపల్లి అడవుల్లో శవమైంది. సిరిసిల్ల జిల్లాలో గోడలపై సిర్నాపల్లి రాతలు రాజన్న సిరిసిల్ల జిల్లా అటవీ ప్రాంతాల్లోని పల్లెల్లో గోడలపై సరళ ఉదంతాన్ని ఉటంకిస్తూ పీపుల్స్‌వార్‌కు వ్యతిరేకంగా అప్పటి జనశక్తి పార్టీ వాల్ రైటింగ్స్ చేసింది. పీపుల్స్‌వార్ నేత శంకరన్న చేసిన ఘాతుకం అంటూ ప్రచారం చేసింది. నిజానికి సరళ తల్లిదండ్రులు సరోజ, భిక్షమయ్య.. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ మద్దతుదారులు కావడంతో జనశక్తి పార్టీ ఈ ఘటనపై వ్యతిరేకంగా ప్రచారం చేసింది. సరళ మృతదేహాన్ని కూడా వారి తల్లిదండ్రులకు ఇవ్వలేదని, అడవుల్లోనే కాల్చివేశారంటూ తీవ్రస్థాయిలో ఖండించారు. పొరపాటును గుర్తించిన శంకరన్న సిర్నాపల్లి అడవుల్లో జరిగిన సరళ ఘటనపై పీపుల్స్‌వార్ పార్టీలో తీవ్రస్థాయిలో చర్చసాగింది. ఆ అమ్మాయిని ఇంటికి పంపించే క్రమంలోనే మిస్ ఫైర్ కారణంగా మరణించిందని శంకరన్న స్పష్టం చేశారు. పార్టీ సమావేశంలో శంకరన్న ఆత్మవిమర్శ చేసుకుని పొరపాటును ఒప్పుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 1993 జనవరి 27న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డులో శంకరన్న ఎన్కౌంటర్లో మరణించాడు. ఎల్లారెడ్డిపేటకు చెందిన మార్కండేయ పీపుల్స్‌వార్‌లో చేరి ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా ఎదిగారు. ఆయన అనేక ఎన్కౌంటర్లలో తప్పించుకున్నారు. చివరికి సరళ ఘటన ఆయన్ని మానసికంగా బాధించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా విరాటపర్వంలో సిరిసిల్ల అధ్యాయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. -
చనిపోయినా.. మోస్ట్ వాంటెడ్‌లే!
సాక్షి ప్రతినిధి, వరంగల్: యాప నారాయణ అలియాస్ హరిభూషణ్.. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామం కోయతెగకు చెందిన మావోయిస్టు నేత. రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరించిన ఆయన గతేడాది జూన్ 21న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవుల్లో కోవిడ్‌తో మరణించారు. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. ఏపీలోని గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమకోటకు చెందిన ఆయన.. అనారోగ్యంతో బాధపడుతూ గతేడాది అక్టోబర్ 14న బస్తర్ అటవీ ప్రాంతంలో చనిపోయారు. ..ఈ ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు చనిపోయి నెలలు గడుస్తున్నా.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వారి పేర్లను ఇంకా ‘మోస్ట్ వాంటెడ్’జాబితాలో ఉంచింది. ఎన్ఐఏ తమ వెబ్సైట్లో దేశవ్యాప్తంగా ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద, తీవ్ర ఆర్థిక నేరాలతో సంబంధమున్న 328 మంది పేర్లతో ‘మోస్ట్ వాంటెడ్, పరారీలో ఉన్న వారి జాబితా’ను రూపొందించింది. అందులో ఇప్పటికే చనిపోయిన మావోయిస్టు నేతల పేర్లు ఉండటం చర్చనీయాంశమవుతోంది. మావోయిస్టుల వివరాలపై మళ్లీ ఆరా.. సీపీఐ (మావోయిస్టు) పార్టీలో కీలక నేతలపై మరో సారి రివార్డులు పెరగనున్నాయని.. నిఘా వర్గాలు మోస్ట్ వాంటెడ్‌ల జాబితాను మళ్లీ రూపొందిస్తున్నాయని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల రిక్రూట్మెంట్ పెరిగిందన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు.. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నేతల వివరాలను జిల్లాలు, పోలీస్స్టేషన్ల వారీగా సేకరిస్తున్నారు. హనుమకొండ, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల నుంచి ఇప్పటికే ఇలాంటి డేటా తీసుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ సహా 11 రాష్ట్రాల్లో పనిచేస్తున్న మావోయిస్టు నేతల వివరాలు, వారిపై ఉన్న రివార్డులపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ రివార్డులు పెంచనున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన 54 మంది ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో పనిచేస్తున్నట్టు తేలిందని సమాచారం. ‘మోస్ట్ వాంటెడ్’లో బస్వరాజ్, గణపతి, హిడ్మా ఎన్ఐఏ సిద్ధం చేసిన మావోయిస్టు కీలక నేతల జాబితాలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారే అధికంగా ఉన్నట్టు తెలిసింది. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్, గంగన్న, ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి పేర్లను టాప్ వాంటెడ్ లిస్టులో చేర్చగా.. ఆ తర్వాత మడావి హిడ్మా, మరికొందరి పేర్లున్నట్టు తెలిసింది. గణపతిపై ఇప్పటికే రూ.2.52 కోట్ల రివార్డు, బస్వరాజ్పై రూ.1.25 కోట్లు, కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న నేతలపై రూ.కోటి చొప్పున రివార్డులు ఉన్నా యి. తెలంగాణ నుంచి 9మంది మావోయిస్టులు కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇందులో మల్లోజుల వేణుగోపాల్ అలి యాస్ భూపతి, కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ సాధు, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మల్లా రాజిరెడ్డి, గంకిడి సత్యనారాయణరెడ్డి, మో డం బాలకృష్ణ, పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, గాజర్ల రవి అలియాస్ గణేశ్, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, తిప్పిరి తిరుపతి తదితర అగ్రనేతల పేర్లు ఈ జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఇక ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 40 మందిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చినట్లు తెలిసింది. -
కామ్రేడ్ బాలా కన్నుమూత
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో భారత సంతతికి చెందిన మావోయిస్టు నేత అరవిందన్ బాలాకృష్ణన్ అలియాస్ కామ్రేడ్ బాలా(81) మృతి చెందారు. ఇంగ్లండ్‌లోని హెచ్ఎంపీ డార్ట్మూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయన శుక్రవారం మరణించినట్లు యూకే ప్రిజన్ సర్వీసు అధికారి ప్రకటించారు. లైంగిక వేధింపుల కేసులో యూకే కోర్టు 2016 జనవరిలో కామ్రేడ్ బాలాకు 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అసభ్య ప్రవర్తన కింద ఆరు కేసులు, అత్యాచారం కింద నాలుగు కేసులు, చిత్రహింసల కింద రెండు కేసుల్లో 23 ఏళ్లు జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. అప్పటి నుంచి కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. లండన్‌లో రహస్యంగా మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన అరవింద్ బాలకృష్ణన్‌ను అనుచరులు కామ్రేడ్ బాలా అని పిలుచుకునేవారు. కామ్రేడ్ బాలా భారత్‌లోని కేరళ రాష్ట్రంలో ఓ గ్రామంలో జన్మించారు. సింగపూర్, మలేషియాలో పెరిగారు. అక్కడే కమ్యూనిస్టు నాయకుడిగా చెలామణి అయ్యారు. సింగపూర్ పౌరసత్వం పొందారు. 1963లో యూకేకు చేరుకున్నారు. ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు. అక్కడే టాంజానియాకు చెందిన చందా పాట్నీని కలిశారు. 1969లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. సొంత కుమార్తెను 30 ఏళ్లపాటు బంధించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన నేరం రుజువయ్యింది. సేవా కార్యక్రమాల ముసుగులో ఎంతోమంది మహిళలపై బాలా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, వారిని క్రూరంగా హింసించాడని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అప్పట్లో న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. -
హిడ్మా పోలీసులకు లొంగిపోలేదు
సాక్షి, అమరావతి: మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హిడ్మా పోలీసులకు లొంగిపోయినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ ఖండించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు ఓ వ్యూహం ప్రకారం అసత్య ప్రచారం చేస్తున్నాయని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. విప్లవోద్యమ ప్రాంతాలకు దూరంగా ఉండే మావోయిస్టు పార్టీ సానుభూతిపరులను తప్పుదోవ పట్టించేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పోలీసులు ఎవరో ఒకర్ని అరెస్టు చేసి తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారన్నారు. హిడ్మా దండకారణ్యంలో గెరిల్లా బేస్‌లో ప్రజల మధ్య ఉన్నారని ఆయన వెల్లడించారు. -
ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకాల ముద్రణ
అంబర్‌పేట (హైదరాబాద్): మావోయిస్టు దివంగత అగ్ర నేత రామకృష్ణ (ఆర్కే) పేరుతో పుస్తకం ముద్రిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సదరు ప్రింటింగ్ ప్రెస్పై దాడి చేసి పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తా ప్రాంతంలో రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నవ్య ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రింటింగ్ ప్రెస్‌లో రామకృష్ణ జీవితంపై పుస్తకం ముద్రిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేసి పుస్తకాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ పుస్తకాల్లో మావోయిస్టు భావజాలం ఉందని డీసీపీ వెల్లడించారు. పుస్తకాలు, ప్రింటింగ్ ప్లేట్లు, పెన్‌డ్రైవ్‌లను తీసుకెళ్లారు. ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, రామకృష్ణారెడ్డి పీవోడబ్ల్యూ నేత సంధ్య భర్త కావడం గమనార్హం. భర్త జ్ఞాపకాలతో పుస్తకం వేసుకుంటే తప్పా? ‘నా భర్త, కొడుకు ఇద్దరు చనిపోయారు. వారి జ్ఞాపకాలను ఒక పుస్తకం రూపంలో తెద్దాం అనుకున్నా. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకొచ్చా. ఈనెల 14న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రామకృష్ణ సంస్మరణ సభ ఉంది. భర్త, కొడుకు జ్ఞాపకాలను పుస్తక రూపంలో తీసుకొస్తే తప్పేముంది. వీరి జ్ఞాపకాలు చాలా పత్రికల్లో వచ్చాయి కూడా. వాటినే పుస్తక రూపంలో తీసుకొస్తే దాన్ని తప్పుబట్టి పోలీసులు సీజ్ చేయడం దారుణం’అని ఆర్కే భార్య శిరీష వాపోయారు. -
తలపై కోటి రివార్డు.. టాప్ మావోయిస్టు ప్రశాంత్ బోస్ అరెస్టు
-
తలపై కోటి రివార్డు.. టాప్ మావోయిస్టు ప్రశాంత్ బోస్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు ప్రశాంత్ బోస్, ఆయన భార్య శీలా మరాండిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మావోయిస్టు సీనియర్ నాయకులలో ఒకరైన ప్రశాంత్ బోస్‌ను జార్ఖండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా మావోయిస్టు నాయకుల్లో నెంబర్2గా ఉన్నారు. గణపతి తరువాత మావోయిస్టుల్లో అత్యంత పలుకుబడి ఉన్న వ్యక్తి. ప్రశాంత్ బోస్పై గతంలో కేంద్రం కోటి రూపాయల రివార్డు ప్రకటించింది. చదవండి: ఇద్దరు ఉద్యోగులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు కాగా మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా( ఎమ్‌సీసీఐ) చీఫ్‌గా ప్రశాంత్ బోస్ పనిచేశారు. ప్రశాంత్ బోస్ భార్య షీలా మరాండీ కూడా సీనియర్ మావోయిస్టు నాయకురాలు. ఇదిలా ఉండగా 75 ఏళ్ల ప్రశాంత్ బోస్ కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. కిషన్ దా ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్, పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, ఈస్ట్రన్ రీజినల్ బ్యూరో సెక్రటరీగా కొనసాగుతున్నారు. చదవండి: 23 కోట్ల బీమా సొమ్ము కోసం రైలు పట్టాలపై పడుకుని రెండు కాళ్లు..!! -
మావోయిస్టు అగ్రనేత ఆర్కే వర్ధంతి సభ
-
ఎర్రజెండా ఎగిరిపోయింది
అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే ఉన్న పళాన వెళ్లిపోయారు. ఆకుపచ్చ అడవిలో ఆయన ఎటు వెళ్లారన్నది అక్కడి చెట్లకు మాత్రమే తెలుసు. దశాబ్దాల పాటు ఆయనకు కోరస్‌గా పాడిన పక్షులకూ తెలుసు. ఆయన ప్రతీ కదలికనూ కనిపెడుతూ వచ్చిన మేఘాలకు తెలుసు. ఆయన అడుగుల వరుసను గమనిస్తోన్న భూమికి తెలుసు. ఆర్కే చనిపోతే.. ఆకాశం బద్దలు కాలేదు. భూమి రెండుగా చీలిపోలేదు. ఉద్యోగాలు చేసుకునేవాళ్లు, వ్యాపారాల్లో మునిగిపోయిన వాళ్లు, రకరకాల వ్యాపకాల్లో జీవితాలు గడిపేసే వాళ్లూ కదిలిపోలేదు. కావాలనుకుంటే.. ఆర్కే కూడా చాలా మందిలా తనకున్న మేధకు ఏదో ఓ మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబంతో హాయిగా గడపగలడు. చక్కగా ఏసీ గదుల్లో విలాసవంతంగా జీవితాన్ని నడపగలడు. లేడని కాదు. కానీ పిచ్చో వెర్రో.. అతనికి ఆ ఆలోచన కూడా వచ్చినట్లు లేదు. నమ్మిన సిద్ధాంతం పీడిత వర్గాల సంక్షేమం కోసం జీవితకాలపు పోరాటం చేయాలని ఎప్పుడో 20 ఏళ్ల వయసులో అనిపించిందంతే. ఇక అప్పట్నుంచీ ఇంకో ఆలోచనే పెట్టుకోలేదు. ఆదివాసీల కోసం, నిమ్న కులాల కోసం తానే ఓ ఆయుధం అయిపోవాలనుకున్నాడు. అయిపోయాడు. ఏ వ్యాపకంలో అయినా.. ఉద్యోగంలో అయినా... వృత్తిలో అయినా ఓ పాతికేళ్లు గడపడం అంటేనే చాలా గొప్ప. నాలుగు దశాబ్దాల పాటు ఓ సిద్ధాంతానికి కట్టుబడి జీవితాన్ని ఖర్చుచేసేయడం అంటే ఇంకెంత గొప్ప? ఆర్కే అనుకున్న ఆలోచనలతో కానీ ..ఆయన నమ్మిన సిద్ధాంతంతో కానీ మనం ఎవ్వరూ ఏకీభవించకపోవచ్చు. చాలా మందికి ఏమన్నా పేచీలు ఉండచ్చు. కానీ ఆర్కేలా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి చివరి శ్వాస వరకు ముందుకు సాగడం ఈజీ కాదు. కానే కాదు. అట్టడుగు వర్గాలను దోచుకుంటున్నారని అతను అనుకున్నాడు. ఆ వర్గాల తరఫున పోరాటాలు చేయాలని నమ్మాడు. ఆ పోరాటం ముళ్లబాట అని తెలుసు. ఏ క్షణంలోనైనా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని తెలుసు. అలా తెలిసినా ఆ పోరాటాన్ని కడదాకా తీసుకెళ్లడం తన బాధ్యత అనుకున్నాడు కాబట్టే కడ ఊపిరి వరకు అలానే ఉన్నాడు. అలా ఉండడంలో నిజాయితీగానే ఉన్నాడని కొందరు అనుకుంటే.. అదో గుడ్డినమ్మకం అని వెక్కిరించే వాళ్లూ ఉన్నారు. కాకపోతే జీవించినంతకాలం తాను నమ్మిన సిద్ధాంతానికి నిజాయితీగా కట్టుబడి ఉన్నాడన్న విషయంలో ఆయన్ను సైద్ధాంతికంగా వ్యతిరేకించేవారికి కానీ.. ఆయన ఉద్యమాన్ని నిర్ద్వంద్వంగా ఖండించే పోలీసులకు కానీ మరో ఆలోచన ఉండే అవకాశాలే లేవు. అదీ ఆర్కే నిజాయితీకి గీటురాయి. ఎక్కువమంది జీవితాలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడ్డం, ఎక్కువ మంది కడుపుల్లో ఆకలికేకలు అగ్నిగుండాలు రాజేయడం.. జనాభాలో కొద్దిపాటి శాతం చేతుల్లోనే మెజారిటీ సంపద పోగుబడి ఉండడం కరెక్ట్ కాదనుకున్నాడు. ఆ పరిస్థితిని మార్చాలంటే సాయుధ పోరు ఒక్కటే మార్గం అనుకున్నాడు. ఆర్కే ఎంచుకున్న మార్గం ప్రజాస్వామిక వ్యవస్థలో సరియైనది కాదని ఎక్కువ మంది భావించవచ్చు. నెత్తుటి సిద్ధాంతాన్ని ఒప్పుకోలేమని వాదించవచ్చు. కానీ సమాజంలో మెజారిటీ ప్రజలు పేదరికంలో ఉన్నారు. ఆ పేదలు సుఖంగా ఉండాలన్న ఆర్కే ఆలోచనను ఎవరూ తప్పు బట్టలేరు. ఆర్కే నడిచిన దారి అడుగడుగునా ముళ్లబాటే. అసలు ఆ దారిపట్టడమే తప్పటడుగు వేయడం అనే వాళ్లు ఉండచ్చు. అయితే గుడ్డి నమ్మకమో..పిచ్చి ఆశో.. వెర్రి ఆకాంక్షో పేర్లు ఏవైతేనేం తన జాతి జనుల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడన్నది ఆకుపచ్చ అడవంత నిజం. నలభై ఏళ్ల ఉద్యమకాలంలో చాలా ఎన్కౌంటర్ల నుండి తృటిలో తప్పించుకున్నాడు ఆర్కే. ఆర్కే సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాళ్లు కూడా .. ఆ సిద్ధాంతం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టగలగడాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. వ్యవస్థ దృష్టిలో..మనం రచించుకున్న రాజ్యాంగం పరిధిలో ఆర్కే అనుసరించిన దారి ఆమోదయోగ్యమైనది కాకపోవచ్చు. తప్పులు అందరూ చేస్తారు.. త్యాగాలు మాత్రం కొందరే చేస్తారు అన్నాడు మహారచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి. పదిమంది కోసం జీవితాన్ని కానుకగా ఇచ్చేయడం చాలా తక్కువమంది మాత్రమే చేయగలిగిన త్యాగం. అందుకే కావచ్చు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఆర్కే పనిచేసిన గామాలపాడు ప్రజలు ఇపుడు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ‘‘నాకోసం ఎదురు చూడు‘ ఉరి తీయబడ్డ పాట నుండి చెరపడ్డ జలపాతం నుండి‘ గాయపడ్డ కాలిబాట నుండి ప్రాణవాయువు నుండి‘ వాయులీనం నుండి తిరిగి వస్తాను‘ తిరిగి లేస్తాను నా కోసం ఎదురు చూడు‘ నా కోసం వేచి చూడు–’’ అన్న శివసాగర్ కవిత ఇప్పుడు ఎక్కువమందికి గుర్తుకొస్తూ ఉండొచ్చు. – సి.ఎన్.ఎస్. యాజులు, మొబైల్ : 95055 55384 -
ఆర్కేను రక్షించుకోలేకపోయాం: కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి
సాక్షి, అమరావతి/టంగుటూరు/చర్ల (ఖమ్మం)/కొరాపుట్ (ఒడిశా): సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ (63) అలియాస్ రామకృష్ణ, ఆర్కే, సాకేత్, మధు, శ్రీనివాస్‌కు వైద్యం అందించినప్పటికీ రక్షించుకోలేకపోయామని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ స్పష్టం చేశారు. ఆర్కే మరణాన్ని ధృవీకరిస్తూ శుక్రవారం ఓ ప్రకటన, అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను శనివారం విడుదల చేశారు. ఆర్కేకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలుకాగా, వెంటనే డయాలసిస్ ప్రారంభించినప్పటికీ.. కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయని, పర్యవసానంగా ఈ నెల 14న ఉదయం 6 గంటలకు అమరుడయ్యారని అభయ్ పేర్కొన్నారు. ఆర్కేకు విప్లవ శ్రేణుల మధ్య అంత్యక్రియలు నిర్వహించామని, ఆయన మృతి పార్టీకి తీరనిలోటని చెప్పారు. సాధారణ జీవితం, అకుంఠిత దీక్ష, ప్రజల పట్ల ప్రేమ, కామ్రెడ్స్‌తో ఆప్యాయతలు, విప్లవ గమనంపై స్పష్టతతో విప్లవోద్యమానికి నిస్వార్థంగా సేవలు అందించారని కొనియాడారు. ఆర్కే ఆశయాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంత్యక్రియలకు భారీగా హాజరైన ఆదివాసీలు ► ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు – కొండపల్లి మధ్య అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించారు. ► ఈ సందర్బంగా ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండాను ఉంచి మావోయిస్టులు నివాళులు అర్పించారు. ఆర్కే అంత్యక్రియల్లో బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని పాలగూడ, గుండ్రాయి, కంచాల, మీనగట్ట, దామారం, జబ్బగట్ట తదితర గ్రామాల నుంచి సుమారు 2 వేల మందికిపైగా ఆదివాసీలతో పాటు పెద్ద ఎత్తున మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. భారీ ర్యాలీ నిర్వహించినట్లు సమాచారం. ఆలకూరపాడులో ఆర్కే చిత్రపటానికి నివాళులర్పిస్తున్న భార్య శిరీష, కుటుంబ సభ్యులు లొంగిపోయుంటే బతికుండేవారు ఆర్కే మృతి విషయాన్ని ఒడిశాలోని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పిళ్లై ఓ వీడియో ద్వారా వెల్లడించారు. పోలీసులకు లొంగిపోయుంటే ఆర్కేకు నాణ్యమైన వైద్యం అందేదని, బతికేవాడన్నారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో గతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రామన్న, హరి భూషణలతో పాటు దండకారణ్యం జోనల్ స్పెషల్ కమిటీ సభ్యులు శోభరాజ్, గంగా, వినోద్‌లు సైతం ప్రాణాలు విడిచారని ఐజీ గుర్తు చేశారు. ఆర్కేకు ఘన నివాళి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆర్కే భార్య శిరీష, కుటుంబ సభ్యులు, అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆర్కే చిత్రపటానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ‘ఆర్కే అమర్ రహే.. అమరవీరులకు జోహార్లు’ అంటూ నినాదాలు చేశారు. ఉద్యమ గీతాలు ఆలపించారు. ‘నా భర్తతో పాటు కుమారుడు వీరత్వం పొందాడని గర్వంగా భావిస్తున్నాను. ఆర్కే మృతితో ఉద్యమం ఆగిపోదు. ఆయనలాంటి గెరిల్లా యుద్ధ వీరులు ఇంకా పుట్టుకొస్తారు’ అని శిరీష అన్నారు. ‘ప్రజల కోసం జీవిస్తాం.. ప్రజల కోసమే మరణిస్తాం’ అన్న మాటను ఆర్కే నిలబెట్టుకున్నాడని అమరవీరుల బంధుమిత్రుల సంఘం స్టేట్ సెక్రటరీ భవాని పేర్కొన్నారు. ‘ఆర్కే ప్రజల మనిషి. ప్రజల హృదయాల్లో ఉంటాడు. ఆయన ప్రజల కోసమే అమరుడయ్యారు’ అని విరసం నేత కళ్యాణరావు పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ఆర్కే మరణ వార్తను ధ్రువీకరించుకుని శిరీష, బంధుమిత్రులు విలపించారు. శిరీషను విరసం అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పినాకపాణి, సహాయ కార్యదర్శి రివేరా, అమరుల బంధు మిత్రుల సంఘం సభ్యురాలు శోభా తదితరులు పరామర్శించారు. -
పామేడు– కొండపల్లి మధ్య ఆర్కే అంత్యక్రియలు
చర్ల/టంగుటూరు: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) మృతిని మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆర్కే మృతిపై గురువారమే కథనాలు వచ్చినా పార్టీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం శుక్రవారం వెలువడింది. ఆయన గురువారం ఉదయం కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందగా శుక్రవారం మధ్యాహ్నం పార్టీ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించినట్లు ఆ ప్రకటన తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు – కొండపల్లి మధ్య అటవీ ప్రాంతంలో నిర్వహించిన అంత్యక్రియల ఫొటోలు, వీడియోలను శనివారం మావోయిస్టు పార్టీ మీడియాకు విడుదల చేసింది. ఆర్కే అంత్యక్రియల్లో బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని పాలగూడ, గుండ్రాయి, కంచాల, మీనగట్ట, దామారం, జబ్బగట్ట తదితర గ్రామాల నుంచి సుమారు 2 వేల మందికిపైగా ఆదివాసీలతో పాటు పెద్ద ఎత్తున మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆర్కే మృతి సమాచారాన్ని పార్టీ శ్రేణులు కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలకు తెలియజేయడంతో పాటు మిలీ షియా, గ్రామకమిటీ సభ్యుల ద్వారా వివిధ గ్రామాలకు చేరవేసి అంత్యక్రియలకు రావాలని సూచించడంతో ఆదివాసీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాగా, శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరలి వచ్చిన ఆదివాసీలతో పాటు మావోయిస్టులు ఆర్కేకు నివాళులర్పించి భారీ ర్యాలీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఉద్యమంలో నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన ఆర్కే మృతదేహాన్ని చూసి ఆదివాసీలు కన్నీటిపర్యంతమైనట్లు సమాచారం. ఆర్కేకు ఘన నివాళి ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆర్కే భార్య శిరీష, కుటుంబ సభ్యులు, అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు శనివారం ఆర్కేకు నివాళులర్పించారు. ‘ఆర్కే మృతితో ఉద్యమం ఆగిపోదు. ఆయనలాంటి గెరిల్లా యుద్ధ వీరులు ఇంకా పుట్టుకొస్తారు’అని ఈ సందర్భంగా శిరీష అన్నారు. ఆయన ప్రజల కోసమే అమరుడయ్యారని విరసం నేత కల్యాణరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆర్కే మరణ వార్తను ధ్రువీకరించుకుని భార్య శిరీష, కుటుంబ సభ్యులు విలపించారు. ఇదిలా ఉండగా ఆర్కే పోలీసులకు లొంగిపోయుంటే ఆయనకు మంచి వైద్యం అందేదని, బతికేవాడని ఒడిశాలోని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పిళ్లై అభిప్రాయపడ్డారు. మంచి వైద్యం అందించినా.. పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కేకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య వచ్చిందని, డయాలసిస్ చేయిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ కావడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన మృతి చెందారని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేర్కొన్నారు. ఆర్కేకు పార్టీ తరఫున మంచి వైద్యం అందించినా దక్కించుకోలేకపోయామని తెలిపారు. ఆర్కే మృతి చెందిన నేపథ్యంలో శుక్రవారం అభయ్ ఓ లేఖ విడుదల చేశారు. పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అనారోగ్యంతో 14 అక్టోబర్ 2021న ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచారని లేఖలో వెల్లడించారు. ఆయనకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలుకాగా, వెంటనే డయాలసిస్ ప్రారంభించినా కిడ్నీలు ఫెయిల్ కావడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడయ్యారని పేర్కొన్నారు. ఆయనకు విప్లవ శ్రేణుల మధ్యే శ్రద్ధాంజలి ఘటించి అంత్యక్రియలు పూర్తిచేశామని తెలిపారు. కామ్రేడ్ రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటని, ధైర్యసాహసాలతో పార్టీకి, విప్లవోద్యమానికి నాయకత్వం అందించారని కొనియాడారు. పార్టీకి అన్ని రంగాల్లో సేవలందించారని వివరించారు. ఆర్కే సాధారణ జీవితం, ప్రజల పట్ల ప్రేమ, సహచరులపై ఆప్యాయత, విప్లవం పై స్పష్టత, దూరదృష్టి నుంచి యావత్ పార్టీ కేడర్ ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఆయన ఆశయసాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. -
షేడ్స్ ఆఫ్ రెడ్!
మనం జనజీవన స్రవంతిగా పిలుచుకునే లోకంలో ఆర్కే అనే పేరు అంత సుపరిచితమైనదేమీ కాదు. అధికార పదవుల్లో చక్రం తిప్పిన వ్యక్తి కాదు. వ్యాపారాలు చేసి వేలకోట్ల టర్నోవర్ సాధించడం వంటి ఘనతలేమీ లేవు. చేసిన సేవలకు మెచ్చి ప్రభుత్వం వారిచ్చే ‘పద్మశ్రీ’ బిరుదు రాలేదు. ప్రైవేట్‌వాళ్లు బహూకరించే ‘సేవారత్న’ కూడా లేదు. జీవన సాఫల్య పుర స్కారం లేనేలేదు. అయినప్పటికీ ఆయన మరణవార్తకు తెలుగు మీడియా తగిన ప్రాధాన్యమిచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన ఒక స్కూల్ టీచర్ పెద్దకొడుకు అక్కిరాజు హరగోపాల్ ఉరఫ్ ఆర్కే. వరంగల్ ఆర్ఈసీ (ప్రస్తుతం ఎన్ఐటీ)లో ఇంజనీరింగ్ చదివాడు. అప్పట్లో తెలి వైన విద్యార్థులకే ఇంజనీరింగ్‌లో సీటు దొరికేది. ఆర్ఈసీలో ఆ సీటు సంపాదించడమంటే మరింత నాణ్యమైన సరుకని అర్థం. ‘జనజీవనస్రవంతి’లోనే అతను కొనసాగి ఉన్నట్లయితే ‘నాణ్య మైన’ జీవితాన్నే గడిపి ఉండేవాడు. జీవన సాఫల్య పురస్కారా ల్లాంటివి కూడా లభించి ఉండేవేమో! ఆ రోజుల్లో ఉన్నత విద్యాసంస్థల్లోని విద్యార్థులపై కమ్యూనిస్టు తీవ్రవాద భావజాల ప్రభావం బలంగా ఉండేది. చేగువేరా వేగుచుక్కలా కనిపించేవాడు. జార్జిరెడ్డి ఆదర్శం ఉత్తే జితం చేసేది. వందలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఆ బాట వెంట పయనమయ్యారు. ఉద్యోగాలు, విలాసవంత మైన జీవితావకాశాలను తృణప్రాయంగా వదిలేశారు. వారిలో ఆర్కే ఒకరు. సమష్టిగా ప్రజలందరికీ చెందవలసిన భూమి, ప్రకృతి, సహజ వనరులపై కొందరి పెత్తనమేమిటనే ప్రశ్నలోంచే కమ్యూ నిస్టు సిద్ధాంతం పుట్టింది. ఆ కొంతమంది వ్యక్తుల ‘దోపిడీ’ కారణంగానే అత్యధిక ప్రజానీకం పేదరికంలో మగ్గవలసి వస్తున్నదని అది నిర్ధారించింది. అటువంటి ‘దోపిడీ వ్యవస్థ’ను కూలదోసి, సమసమాజాన్ని ఏర్పాటుచేసే మార్గాలను ఉపదేశిం చింది. అనుసరించవలసిన ఆ మార్గాలపై ఏర్పడిన భిన్నాభిప్రా యాల ఫలితంగా పార్లమెంటరీ కమ్యూనిస్టులూ, విప్లవ కమ్యూనిస్టులుగా చీలిపోయారు. ఈ రెండు భాగాల్లోనూ మరో రెండు డజన్లకు పైగా చీలికలున్నాయి. విప్లవ కమ్యూనిస్టుల్లో ప్రధాన పాయగా ఉన్న మావోయిస్టు పార్టీలో ఆర్కే పొలిట్ బ్యూరో సభ్యుడు. తెలంగాణ నుంచి బెంగాల్ వరకు 8 రాష్ట్రాల్లో మూడు దశాబ్దాల పాటు మావోయిస్టులకు, ప్రభుత్వాలకు మధ్య నడుమ యుద్ధం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో జీవితాలు కల్లోలిత మయ్యాయి. వేలాదిమంది ప్రజలు, పోలీసులు, విప్లవకారులు ఈ కల్లోలానికి బలయ్యారు. మావోయిస్టులు – ప్రభుత్వాల మధ్య శాంతి చర్చలు జరిగితే ఈ హింసాకాండను కొంతమేరకు కట్టడి చేయొచ్చని కొందరు తటస్థ మేధావులు భావించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు. ఆ చర్చల సమ యంలోనే ఆర్కే మీడియా దృష్టిని ఆకర్షించారు. చర్చల్లో మావోయిస్టు బృందానికి నాయకత్వం వహించారు. ఫలితంగా మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లోకి అందరికంటే ఎక్కువ మీడియా సంపర్కం ఆర్కేకు ఏర్పడింది. ఆయన ఫొటోలు, జీవిత విశే షాలు మీడియా వద్ద సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన వివరాలను మీడియా ప్రజలకు తెలియజేయగలిగింది. ఆర్కే మరణవార్త మావోయిస్టు పార్టీ స్థితిగతులపై చర్చను రేకెత్తిస్తుంది. ఆ చర్చ కమ్యూనిస్టు మూలసిద్ధాంతాలను కూడా తడుముతుంది. ప్రస్తుత ప్రపంచంలో, మన దేశంలో ఉన్న పరిస్థితులకు ఆ సిద్ధాంతాలు ఏ మేరకు నప్పుతాయనే అంశం కూడా చర్చల్లోకి రాకుండా ఉండదు. ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసుకొని వందేళ్లయింది. వందేళ్లలో సమాజంలో అసమానతలు తగ్గాయా? తగ్గలేదు పెరిగాయని స్వతంత్ర అంతర్జాతీయ సంస్థలు సాక్ష్యాధారాలతో లెక్కలు కట్టి మరీ చెబుతున్నాయి. ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ తాజా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 90 శాతం మంది ఉమ్మడి సంపద ఎంత ఉంటుందో ఒక్క శాతం కుబేరుల సంపద అంతకంటే ఎక్కువగా ఉందట. మన దేశంలో 119 మంది బిలియనీర్ల సంపద 130 కోట్ల మంది తలరాతలు రాసే భారతదేశ వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువట. కనీస వేతనంపై పనిచేసే ఒక కార్మికుడు మన దేశంలోని ఒక కార్పొరేట్ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ సంపాదించినంత డబ్బు సంపాదించాలంటే 941 ఏళ్ళ పాటు పనిచేయాలట. కోవిడ్ తర్వాత ఈ అసమానతలు మరింత పెరిగాయి. ఆక్స్‌ఫామ్ అంచనా ప్రకారం ఈ ఆర్థిక సంక్షోభంలో కోల్పోయిన సంపదను కుబేరులు ఇప్పటికే భర్తీ చేసుకున్నారు. మెజారిటీ పేదవర్గాల ప్రజలు కోలుకోవడానికి మాత్రం ఇంకో పదేళ్లయినా పడు తుందట. అసమానతలు మరింత పెరిగే విధానాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో అమలవుతున్నాయి. ప్రభుత్వరంగ పరిశ్రమ లను ఒక్కొక్కటిగా ప్రైవేటు రంగానికి కారుచౌకగా కట్ట బెడు తున్నారు. బ్యాంకుల్లో ఉన్న ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచు కున్న ప్రబుద్ధులను విమానాలు ఎక్కించి విదేశాలకు పంపిస్తు న్నారు. లేదా రాజ్యసభ సభ్యత్వమిచ్చి సత్కరిస్తున్నారు. రైతు లకు అండగా ఉన్న భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారు. కార్మికులతో 12 గంటలపాటు పని చేయించుకు నేందుకు అనువుగా లేబర్ చట్టాలను మార్చారు. ఉద్యోగ భద్రత ఊసు మాత్రం అందులో లేదు. రైతులు ససే మిరా అంటున్నా వినకుండా వ్యవసాయ చట్టాలను మోసు కొచ్చారు. ఈ చట్టాల అంతిమ ధ్యేయం మెజారిటీ రైతులను వ్యవసాయరంగం నుంచి వెళ్లగొట్టడమేనని నిపుణులు అభిప్రా యపడుతున్నారు. ఆందోళన చేస్తున్న రైతులను జీపుతో తొక్కించి నాలుగు నిండు ప్రాణాలు తీశాడు ఓ కేంద్ర మంత్రి కుమారుడు. ఇప్పటికీ సదరు కేంద్ర మంత్రి పదవిలోనే కొన సాగుతున్నాడు. వారం రోజులపాటు మీనమేషాలు లెక్కించి గానీ అతడి కుమారుడిని అదుపులోకి తీసుకోలేదు. అదే, మైనా రిటీ మతస్థుడైన సూపర్‌స్టార్ కొడుకు విషయంలో ఆగమేఘాల మీద చట్టం తన పని తాను చేసుకొనిపోయింది. జాతీయస్థాయి ప్రత్యామ్నాయంగా రూపొందడానికి వామ పక్ష రాజకీయాలకు అనువైన కాలమిది. కానీ దేశంలో మావోయి స్టులతో సహా కమ్యూనిస్టు పార్టీలన్నీ అవసానదశకు చేరుకుం టున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. వ్యూహాల్లోనూ, ఎత్తుగడ ల్లోనూ ఆ పార్టీలు దశాబ్దాలుగా విఫలమవుతూనే వస్తున్నాయి. అదే పరంపర ఇప్పుడూ కొనసాగుతున్నది. కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ లాంటి యువ నాయకులను పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్‌కు ఎర్రరంగు పులమాలని రాహుల్ గాంధీ ఉత్సాహ పడుతున్నారు. కానీ మధ్యేవాదమే కాంగ్రెస్ బలమనే చరిత్ర పాఠాన్ని ఆయన అర్థం చేసుకోలేదు. ఫలితంగా మత శక్తుల ప్రాబల్యం పెరిగినప్పుడు కాషాయరంగు పూసుకోవడం, వాటికి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పుడు ఎర్రరంగు కోసం వెతకడం వంటి ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. జాతీయస్థాయి ప్రత్యామ్నా యంగా నిలబడగలిగే అవకాశాలను ఆయనే స్వయంగా దెబ్బతీసుకుంటున్నారు. ఇప్పుడు జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఎవరంటే ప్రాంతీయ పార్టీలే. ఇదొక విచిత్ర పరిస్థితి కానీ యథార్థం. ఇప్పుడు కేంద్ర విధానాలపై గొంతు విప్పుతున్నది ప్రాంతీయ పార్టీలే. తాజా విద్యుత్ సంక్షోభంలోనూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించిన తర్వా తనే జాతీయ ప్రతిపక్ష నేతలు మేల్కొన్నారు. ఇప్పుడు అధి కారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో చాలావరకు ఉదారవాద ప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తున్నాయి. నిఖార్సయిన లౌకిక విధానాలను అవలంబిస్తున్నాయి. దళితులు, గిరిజ నులు, వెనుకబడిన వర్గాలను సాధికార శక్తులుగా మలిచేందుకు తరతమ తేడాలతో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో అందరి కంటే ముందున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పైసా ఖర్చు లేకుండా ఉన్నతస్థాయి వరకూ నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చి ఒక విప్లవానికి ఆ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉన్నతస్థాయి ప్రైవేట్ స్కూళ్లలో ఉండే వసతులను అందుబాటులోకి తెస్తున్నది. ఈ కార్య క్రమంలో ఇప్పటికే ఒక దశ పూర్తయింది. ప్రతి క్లాస్‌కూ ఒక టీచర్, ప్రాథమికోన్నత స్థాయి నుంచి ప్రతి సబ్జెక్టుకూ ఒక టీచర్ ఉండేవిధంగా ఏర్పాటు చేసింది. మాతృభాషను ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇంగ్లిషును ప్రాథమిక స్థాయి నుంచే బోధనాభాషగా ప్రవేశపెట్టింది. ఫలితంగా రాబోయే తరం పేద విద్యార్థులు నిండైన ఆత్మవిశ్వాసంతో సంపన్నుల పిల్లలతో సమాన స్థాయిలో పోటీపడి నెగ్గగలుగు తారు. విజేతలు కాగలుగుతారు. సాధికార శక్తులుగా తమను తాము నిర్మించుకోగలుగుతారు. అప్పుడు వనరుల అసమాన పంపిణీ వ్యవస్థను వారు సవాల్ చేయగలరు. ఒక ప్రత్యా మ్నాయ సంస్కృతిని నిర్మించగలరు. ప్రభుత్వ వైద్య రంగంలో సోషలిస్టు క్యూబాను తలపించే విధమైన విస్తరణనూ, ఆధునికీకరణనూ ప్రభుత్వం ప్రారం భించింది. ప్రతి కుటుంబాన్నీ, ప్రతి రోగినీ నెలలో ఒకసారైనా వైద్యుడే స్వయంగా వారివద్దకే వెళ్లి పలకరించే ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ముఖ్యమంత్రి స్వయంగా రూపొందించారు. ఇది జనవరి 26 నుంచి అమలులోకి రావాలని ఆయన ఆశిస్తున్నారు. అట్లాగే వ్యవసాయ రంగం కూడా. ఒక విప్లవాన్ని ప్రసవించ బోతున్నది. ఊరూరా నెలకొంటున్న ఆర్బీకే సెంటర్లే ఈ ప్రస వానికి మంత్రసానులు. చిన్న రైతును స్వయంపోషకం గావించ గలిగే మహత్తర సామర్థ్యంతో ఆర్బీకే సెంటర్లు పనిచేయ నున్నాయి. నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితి వ్యవసాయ ఆహార విభాగం ఉన్నతాధికారులు, ఏపీ అధికారులను పిలిపించుకొని మరీ ఆర్బీకేల ప్రజంటేషన్ తిలకించారు. హర్షధ్వానాలు చేశారు. సగం జనాభాగా ఉన్న మహిళా శక్తిని ఎంపవర్ చేయడాన్ని ఒక అతి ప్రాధాన్యాంశంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్దేశిం చుకున్నది. చంద్రబాబు వాగ్దాన భంగం వల్ల మరణావస్థకు చేరిన ‘మహిళా పొదుపు సంఘా’లను ఈ ప్రభుత్వం పునరు జ్జీవింపజేసింది. నడివయసు మహిళలకు అండగా నిలబడి, వారు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు చేయూతనందిస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి నామినేషన్ పదవుల్లోనూ, పనుల్లోనూ రిజర్వేషన్ కల్పిం చింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాలను సాధికారిక శక్తులుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాల పట్ల కమ్యూనిస్టుల వైఖరి ఏ విధంగా ఉండాలి? పేద వర్గాల పట్ల అనుకూలంగా కదా ఉండవలసింది! ఆంధ్రప్రదేశ్‌లోని కమ్యూనిస్టు పార్టీల్లో ముఖ్యంగా ఒక పార్టీ వైఖరి ఆశ్చర్యం గొలుపుతున్నది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన రాజధాని భూసమీకరణలో దాగివున్న కుంభకోణాన్ని అంగీకరించడానికి ఈ పార్టీ నిరాకరిస్తున్నది. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న ఒడంబడికలో ఇమిడి ఉన్న దుర్మార్గమైన అంతర్జాతీయ స్కామ్‌ను అంగీక రించడానికి తటపటాయిస్తున్నది. పైపెచ్చు తెలుగుదేశం పార్టీతో కలిసి రాజధాని ఉద్యమాన్ని మొదలుపెట్టింది. రైతులూ, డ్వాక్రా మహిళల పట్ల చంద్రబాబు వాగ్దాన భంగాన్ని విస్మరిస్తున్నది. మహిళలూ, బలహీన వర్గాల పట్ల బాబు వ్యతిరేక వైఖరి పలుమార్లు బహిరంగంగా వ్యక్తమైనప్పటికీ ఆ పార్టీ తప్పు పట్టలేదు. ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం వరస మారింది. ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రజానుకూల కార్యక్రమాలను చూడటానికి నిరాకరిస్తూ కళ్ళు మూసుకుంది. అలా వాల్చిన కనురెప్పల మాటున వారికొక గొప్ప సత్యం సాక్షాత్కరించింది. డ్రగ్స్ మాఫియాతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి సంబంధం ఉందట. బట్టకాల్చి మీద వేసినట్టు తెలుగుదేశం పార్టీ చేసిన అడ్డగోలు ఆరోపణ ఇది. దాన్నే మన కామ్రేడ్ నారాయణ ‘కోరస్’గా అందుకున్నారు. కమ్యూనిస్టులు కూడా నిరాధా రమైన ఎంగిలి ఆరోపణలు చేయవచ్చునా? ఒక్క వర్షానికే కొట్టుకొనిపోయే రోడ్లువేసి కాంట్రాక్టర్ల జేబులు నింపడాన్ని అభివృద్ధిగా గుర్తించి, సకలజన సాధికారతా యజ్ఞాన్ని గుర్తించక పోవడం ఒక జన్యు లోపంగా పరిగణించవలసి ఉంటుంది. 30 లక్షల మంది పేద మహిళలకు ఇళ్లు కట్టించే బృహ త్తరమైన మానవీయ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ప్రారం భించింది. దాన్ని అడ్డుకోవడం కోసం చంద్రబాబు కోర్టుకెక్కించి ఆపించాడు. ఇది తప్పని కామ్రేడ్ నారాయణకు తోచకపోవడం చిత్రం. తాకట్టు గురించి ఆయన మాట్లాడిన తీరు ఆయన పట్ల చాలా అనుమానాలకు తెరతీసింది. ఆస్తుల తాకట్టు సంగతేమో గానీ సిద్ధాంతాలను తాకట్టుపెట్టడం అత్యంత హేయమైన విష యమని గ్రహిస్తే మంచిది. వైఖరి మార్చుకొని వెంటనే ప్రజల పక్షాన నిలబడకపోతే ఒక మహత్తర చరిత్ర కలిగిన పార్టీని భ్రష్టు పట్టించిన వాళ్లవుతారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నల్లమలలో ఆర్కే కీ రోల్..!
ఒంగోలు: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ ఉరఫ్ ఆర్కే మృతి వార్తల ప్రచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు ఆర్కే సతీమణి నివాసం ఉండే టంగుటూరు మండలం ఆలకూరపాడులో కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. దట్టమైన నల్లమల అడవులు మావోయిస్టులకు కేంద్రంగా నిలిచాయి. నల్లమలలో దాదాపు 47 దళాలు పనిచేసేవి. రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తూ రామకృష్ణ ఈ దళాలకు మార్గదర్శకంగా వ్యవహరించేవారు. (చదవండి: భర్త చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టిన భార్య!) ఈ క్రమంలోనే మావోయిస్టులపై (అప్పట్లో నక్సలైట్లు) పోలీసులు ఉక్కుపాదం మోపడంతో రామకృష్ణ అండర్గ్రౌండుకు చేరుకున్నారు. ఇలా ఆయన అండర్‌గ్రౌండులో ఉన్న సమయంలోనే టంగుటూరు మండలం ఆలకూరపాడుకు చెందిన కందుల శిరీష అలియాస్ పద్మను 1988లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వారికి మున్నా అలియాస్ పృథ్వీ అలియాస్ శివాజీ జన్మించాడు. బిడ్డ పుట్టిన కొద్ది నెలల తరువాత రామకృష్ణ తిరిగి ఉద్యమంలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వ చర్చలకు జిల్లా నుంచే బయటకు: జిల్లాలోని పుల్లలచెరువు, యర్రగొండపాలెం, దోర్నాల మండలాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువగా జరిగేవి. 2004 అక్టోబరు 15న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మావోయిస్టులతో చర్చలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో వారు దోర్నాల మండలం చినారుట్ల వద్ద నుంచి బయటకు వచ్చారు. అక్కడ నుంచి గుంటూరు జిల్లా గుత్తికొండ బిళం వద్ద మావోయిస్టులంతా కలుసుకుని చర్చలు జరిపి అనంతరం కారుల్లో హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం జిల్లా నుంచి తిరిగి దళాలు చినారుట్ల వద్ద నుంచే అడవుల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో 2005లో ఒంగోలులో అప్పటి ఎస్పీ మహేష్‌చంద్ర లడ్హాపై జరిగిన దాడి ఘటనను రాష్ట్ర పోలీసుశాఖ సీరియస్‌గా తీసుకుంది. కొద్ది నెలలకే యర్రగొండపాలెం మండలం పాలుట్ల అటవీ ప్రాంతంలో అప్పటి మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌తోపాటు పలువురు ఎన్కౌంటర్ అయ్యారు. ఈ ఘటనలో అగ్రనేత ఆర్కే తప్పించుకున్నాడు. చదవండి: Devaragattu Bunny Festival: భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే..? తండ్రి బాటలోనే తనయుడు: ఇంటర్ వరకు విద్యనభ్యసించిన మున్నా అలియాస్ పృథ్వీ అలియాస్ శివాజీ కూడా తండ్రి అడుగు జాడల్లోనే ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. 2009లో తండ్రి చెంతకు చేరిన మున్నా అతి కొద్దికాలంలోనే టెక్నికల్ డిప్యూటీ కమాండర్‌గా ఎదిగాడు. తరువాత కొన్నాళ్లకు రామకృష్ణను కలిసేందుకు వెళ్తుండగా పోలీసులు ఒక మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె రామకృష్ణ భార్యగా వెల్లడైంది. ఆమె పేరు శిరీష అని, పద్మగా పిలుస్తుంటారనేది తెలిసింది. అంతే కాకుండా విప్లవ రచయితల సంఘం రాష్ట్ర నాయకుడు కళ్యాణరావుకు శిరీష మరదలు కూడా కావడంతో మరింత నిఘా పెంచారు. ఏఓబీ ఇన్చార్జిగా: అయితే నల్లమలలో పోలీసుల పట్టు పెరగడం, అనేక మంది మావోయిస్టులు దోర్నాల, యర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాల్లో ఎన్కౌంటర్లకు గురికావడంతో మావోయిస్టులు నల్లమలను వదిలి దండకారణ్య ప్రాంతమైన ఆంధ్రా, ఒడిశా బోర్డర్‌పై పట్టు పెంచారు. ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ఘడ్ రాష్ట్రాలతో కలిసి కార్యకలాపాలు ఉధృతం అయ్యాయి. 2008లో బలిమెల ఘటనలో కృష్ణానదిలో ప్రయాణిస్తున్న భద్రతా దళాలపై జరిగిన దాడిలో జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం నాలుగు రాష్ట్రాలతో ప్రత్యేకమైన యాక్షన్ టీమును రంగంలోకి దించిన సందర్భంలో 2016లో పృథ్వీ మరణించగా ఆర్కే తప్పించుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించిందని, తద్వారా ఆయన కన్నుమూసినట్లుగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే బంధువులు మాత్రం ఆయన మరణవార్తను నిర్థారించడం లేదు. మావోయిస్టు పార్టీ నుంచి తమకు ఎటువంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు. -
ఆర్కే మృతిని ధ్రువీకరించిన మావోయిస్టులు
సాక్షి, అమరావతి: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే మృతిని మావోయిస్టులు ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14న ఆర్కే మృతి చెందినట్లు మావోయిస్టులు ప్రకటించారు. కిడ్నీలు విఫలమై ఆయన మరణిచారని తెలిపారు. పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. చికిత్స అందించినా ఆర్కేను కాపాడలేకపోయామని తెలిపారు. గురువారం ఆర్కే మృతి చెందారని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ వెల్లడించారు. డయాలసిస్ కొనసాగుతుండగా కిడ్నీలు విఫలమై ఆర్కే మరణించారని తెలిపారు. చదవండి: ఆర్కే కన్నుమూత ఆర్కే తండ్రి, ఎన్టీఆర్ మంచి స్నేహితులు Akkiraju Rama Krishna: నాన్న బాటలోనే మున్నా -
నాన్న బాటలోనే మున్నా
సాక్షి, అమరావతి: తండ్రి ఆశయాలకు ఆకర్షితుడైన ఆర్కే కుమారుడు పృథ్వీ (మున్నా) కూడా 16వ ఏటనే (2004 చర్చల అనంతరం) దళంలో చేరాడు. ఏవోబీలో సెక్షన్ కమాండర్‌గా ఎదిగాడు. అయితే 2016 అక్టోబర్ 24న ఏవోబీ రామ్‌గూడాలో పోలీసులు జరిపిన భారీ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఆ ఎన్కౌంటర్ సమయంలో ఆయన తన తండ్రి ఆర్కే అంగరక్షక దళ సభ్యుడిగా ఉన్నారు. అందులో బుల్లెట్ గాయమైన ఆర్కే తప్పించుకోగా.. మున్నా ప్రాణాలు కోల్పోయారు. తండ్రి మావోయిస్టు కీలక నేత కావడంతో మున్నా బాల్యం అత్యంత నిర్బంధంలో గడిచింది. ఆర్కే ఆచూకీ చెప్పమంటూ ఇంటిపై పోలీసుల దాడులు భయభ్రాంతులకు గురిచేసేవి. ఈ క్రమంలో అతడిని ఒంగోలులో రహస్యంగా చదివించారు. నాన్న కోసం తల్లితో పాటు మున్నా అడవికి వెళ్లినప్పుడల్లా కాంటాక్ట్ దొరకక ఒకోసారి రెండు మూడు నెలలు గిరిజనులతోపాటే అడవిలోనే గడపాల్సి వచ్చేది. అక్కడ తన లాంటి పిల్లలు పడుతున్న కష్టాన్ని చూసిన మున్నా బాధపడేవాడు. ఒకానోక రోజు మున్నా తన నాన్న ఆర్కేను తల్లితో పాటు అడవిలో కలుసుకున్నాడు. అమ్మతో కొద్ది రోజులు అక్కడే ఉంటానన్నాడు. ఆ కొద్ది రోజులూ చాలా రోజులు అయిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే మున్నాని ఉద్యమంలోనికి ఆహ్వనించింది ఆర్కేనే అంటారు. తన కొడుకు అందరిలా ఏ డాక్టరో, ఇంజనీరో కావాలని ఆయన కోరుకోలేదు. తన కొడుకుకు తనలా ప్రపంచ ప్రజలను ప్రేమించడం నేర్పాలని కలలు కన్నాడు. అదే విషయాన్ని భార్యకు ఉత్తరాల్లోనూ రాసేవాడు. మున్నాను మావోయిస్ట్ సైన్యానికే యుద్ధతంత్రాలు నేర్పేంతగా తీర్చిదిద్దాడు. -
ఆర్కే తండ్రి, ఎన్టీఆర్ మంచి స్నేహితులు
చర్ల: ఆర్కే తండ్రి సచ్చిదానందరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావులు మంచి మిత్రులు. గుంటూరు ఏసీ కళాశాలలో చదివే రోజుల్లో వీరిద్దరి మధ్య స్నేహం మొదలైంది. 1983లో ఎన్టీ.రామా రావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో సచ్చిదానందరావును స్వయంగా పిలిచారట. ప్రమాణ స్వీకారానికి వెళ్లిన సచ్చిదానందరావు కుటుంబ వివరాలను తెలుసుకున్న ఎన్టీరామారావు ఆయన కుమారుడు ఆర్కేకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పగా అందుకు నిరాకరించిన ఆర్కే తాను ప్రజల కోసం పీపుల్స్‌వార్‌లో పని చేస్తానని చెప్పడంతో తల్లిదండ్రులు విస్తుపో యారట. అంతకు ముందు నుంచే ఆర్కే పీపుల్స్‌వార్ దళంలో పని చేస్తున్నప్పటికీ ఆయన చెప్పే వరకు తల్లిదండ్రులకు తెలియ దు. తర్వాత కొన్ని రోజులకే ఇంటి నుంచి వెళ్లిపోయి హరగోపాల్ నుంచి రామకృష్ణగా, ఆర్కేగా పేరు మార్చుకున్నాడు. అనంతరం పీపుల్స్‌వార్‌లో ఉన్నత స్థాయికి చేరాడు. తప్పుడు పనులు చేసే వాళ్లకు శిక్షలు 1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్కే పీపుల్స్‌వార్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆ సమయంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. తెలంగాణ, ఉత్తరాంధ్ర, పల్నాడు ప్రాంతాల్లో పోలీసులు, ప్రజాప్రతినిధులు, వడ్డీ వ్యాపారుల అరాచకాలను ఎదిరించాడు. ఈ క్రమంలో ఆర్కే కొందరిని హతమార్చాడు. దీంతో తప్పుడు పనులు చేయడానికి అప్పుడు జనం భయపడ్డారు. అప్పట్లో మహిళలపై అత్యాచారాలు చేసిన వారికి నేరుగా శిక్షలు కూడా విధించారు. దీంతో జనం పీపుల్స్ వార్‌పై ఆసక్తి చూపారు. ఈ క్రమంలో చాలా మంది ప్రజలు వారి బాధలను నేరుగా పీపుల్స్‌వార్ సభ్యులకే చెప్పుకునేవారు. ఉద్యమం ఆ స్థాయికి చేరుకునేలా చేయడంలో ఆర్కే విజయం సాధించాడు. ఆ తర్వాత కాలంలో పీపుల్స్‌వార్ మావోయిస్టు పార్టీలో విలీనం కావడంతో ఆర్కే జాతీయ నాయకుడ య్యాడు. ఉద్యమంలో ఉండగానే విప్లవ రచయితల సంఘం నేత కళ్యాణరావుకు దగ్గరి బంధువునే ఆర్కే వివాహం చేసుకున్నాడు. -
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు ఎక్కంటి సీతారామిరెడ్డి
సాక్షి, ఖమ్మం: ఖమ్మం పోలీసుల ఎదుట మావోయిస్టు నేత ఎక్కంటి సీతారామిరెడ్డి శుక్రవారం లొంగిపోయారు. ప్రస్తుతం సీతారామిరెడ్డి మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ మెంబర్‌గా ఉన్నారు. ఆయన సొంత గ్రామం అశ్వపురం మండలం చింతిర్యాల గ్రామం. అయితే ఇటీవలే మందు పాతర పేలిన ఘటనలో సీతారామిరెడ్డి తన చేతిని కోల్పోయారు. -
పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
సుకుమా (చత్తీస్గడ్): మావోయిస్టు కమాండర్ టైగర్ హుంగా సుక్మా పోలీసులకు చిక్కడు. చత్తీస్గడ్ కేంద్రంగా మావోయిస్టులు చేపట్టిన అనేక ఆపరేషన్లలో హుంగా కీలకంగా వ్యవహరించాడు. మావోయిస్టుల పార్టీలో హుంగాను టైగర్‌గా పిలుచుకుంటారు. అయితే టైగర్ హూంగాను అరెస్టు చేసినట్లు సుకుమా ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు. టైగర్ హుంగా దాడుల్లో దిట్ట చత్తీస్‌గడ్‌లోని సుకుమా జిల్లా కిస్టారం ప్రాంతంలో మావోయిస్టులు దాడికి సంబంధించి 17 ప్రధాన ఘటనల్లో టైగర్ హుంగా కీలక పాత్ర పోషించాడు. దీంతో పాటు పాలోది ప్రాంతంలో ల్యాండ్ మైన్ ప్రూఫ్ వాహన పేల్చివేతలో టైగర్ హూంగా ప్రధాన బాధ్యత తీసుకున్నాడు. ఈ పేలుడులో 9 మంది జవాన్లు చనిపోయారు. 2020లో టైగర్ హూంగా నేతృత్వంలో జరిగిన ఐఈడీ పేలుడు ఘటనలో సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ మరణించారు. ఇటీవల దండకారణ్యంలో జరిగిన పలు ప్రధాన ఘటనల్లో టైగర్ హుంగా కీలకపాత్ర పోషించినట్లు ఎస్పీ తెలిపారు. -
కరోనాతో మరో మావోయిస్టు అగ్రనేత మృతి
దంతేవాడ (చత్తీస్ఘడ్) : మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కరోనా కాటుకు మావోయిస్టు అగ్రనేత వినోద్ మృతి చెందారు. ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగడంతో వినోద్ మృత్యువాత పడ్డారు. మూడు దశబ్ధాల కిందటే తెలంగాణ నుంచి చత్తీస్గడ్కి వెళ్లిన మావోయిస్టుల్లో వినోద్ కూడా ఒకరు. చత్తీస్‌గడ్‌లో జనతన సర్కార్‌ను విస్తరించడంతో, మద్దతు సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దక్షిణ ప్రాంతీయ మావోయిస్టుల కమిటీలోనూ వినోద్ కీలకంగా వ్యవహరించారు. మోస్ట్‌వాంటెడ్ మావోయిస్టు చత్తీస్గడ్, ఏవోబీ కేంద్రంగా జరిగిన పలు కీలక దాడుల్లో వినోద్ ప్రమేయం ఉంది. దీనికి సంబంధించి ఆయనపై చాలా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు వినోద్‌ను పట్టుకునేందుకు ఎన్ఐఏ చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఎన్ఐఏకి మావోయిస్టు వినోద్ మోస్ట్ వాంటెండ్గా ఉన్నారు. ప్రస్తుతం అతనిపై పదిహేను లక్షల రివార్డ్ ఉంది. ఇందులో పది లక్షల రూపాయలు చత్తీస్గడ్ ప్రభుత్వం ప్రకటించగా రూ. 5 లక్షలు ఎన్ఐఏ ప్రకటించింది. దర్భఘటి, జీరం అంబుష్, బీజేపీ ఎమ్మెల్యే బిమా మండవి మృతి ఘటనల్లో వినోద్ కీలక పాత్ర పోషించారు. కామ్రేడ్లలో కరోనా కల్లోలం కరోనా మావోల శిబిరాల్లో అలజడి సృష్టిస్తోంది. ఇటీవల మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ చనిపోయారు. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న ఆయన కరోనాతో అనారోగ్యంతో మరణించారు. దీంతోపాటు పలువురు సభ్యులు కూడా చనిపోయినట్లు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. హరిభూషణ్ ఘటన మరిచిపోక ముందే మరో అగ్రనేత మరణించడం మావోయిస్టులకు సవాలుగా మారింది. ఇద్దరు వినోద్‌లు చత్తీస్‌గడ్‌లో కీలకంగా పని చేస్తున్న మావోయిస్టు నేతల్లో ఇద్దరు వినోద్‌లు ఉన్నట్టు పార్టీ సానుభూతిపరులు అంటున్నారు. ఇందులో ఒకరు వరంగల్ నుంచి చత్తీస్‌గడ్‌కు వెళ్లిన మావోయిస్టు శాంసుందర్‌రెడ్డి కాగా మరొకరు ఆదిలాబాద్‌కు చెందిన కామ్రేడ్‌గా చెబుతున్నారు. అబుజ్మడ్ అడవుల్లో పార్టీ విస్తరణకు వీరు తీవ్రంగా పని చేశారు. అయితే ప్రస్తుతం కరోనాతో చనిపోయింది ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వినోదా ? లేక ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తినా అనే దానిపై స్పస్టత లేదు. పోలీసులు, మావోయిస్టుల్లో ఎవరైనా ప్రకటన చేస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
లొంగిపో బిడ్డా.. ఇంటికి రా!
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): ‘పానం చేతనైతలేదు.. బొందిల జీవి పోకముందు ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది.. రా కొడుకా..’అంటూ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి తల్లి వీరమ్మ వేడుకుంటోంది. బుధవారం ఓఎస్డీ శరత్చంద్ర పవార్, డీసీపీ రవీందర్ రాజన్న స్వగ్రామం కిష్టంపేటను సందర్శించి వీరమ్మను పరామర్శించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి లొంగిపోతే అన్నివిధాల సహకరిస్తామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరమ్మ కంటతడి పెడుతూ తన కన్న కొడుకును చూడాలని ఆత్రంగా ఉందని, మీరన్నా రాజన్నకు విషయం చేర్చాలని మీడియా ముందు చేతులు జోడించింది. ‘పోలీసులే వచ్చి పానం మంచిగున్నదా అని అడిగి మందులు ఇస్తున్నరు. నేను కాటికి దగ్గరవుతున్న.. నిన్ను చివరి చూపు చూసి నీ చేతుల పానం ఇడువాలని ఉంది బిడ్డా’అంటూ కన్నీటి పర్యంతమైంది. ‘జంగళ్ల కూడా కరోనా వస్తుందంటున్నరు. ఎవరూ చూడని చావు నీకొద్దు. నిన్ను చూడకుండా నేను చావద్దు బిడ్డా. నీకు శాత కాకుండా అయిందని అంటున్నరు. కలోగంజో ఉన్నదే తిందాం బిడ్డా. ఇంటకి రా నాయన’అంటూ ప్రాధేయపడుతోంది. కాగా, రాజిరెడ్డి తల్లి వీరమ్మను పరామర్శించిన అనంతరం ఓఎస్డీ శరత్చంద్ర, డీసీపీ రవీందర్ మాట్లాడుతూ, మావోయిస్టులు అడవుల్లో ఇబ్బందులు పడుతున్నారని, వనం వీడి జనంలోకి వస్తే చికిత్సతోపాటు రివార్డు వారికే అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ కాసర్ల తిరుపతిరెడ్డి, పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
మహబూబాబాద్: మావోయిస్టు హరిభూషణ్ ఇంట విషాదం..
-
మావోయిస్టు హరిభూషణ్ ఇంట విషాదం..
మహబూబాబాద్: మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారద అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 24న మృతి చెందినట్లు తెలిసింది. హరిభూషణ్ చనిపోయిన నాలుగు రోజులకే ఆయన భార్య కూడా మరణించడంతో హరిభూషణ్, సమ్మక్క పుట్టిన ఊరు గంగారాంలలో విషాదం అలముకుంది. హరిభూషణ్ భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారద కొద్ది రోజుల క్రితమే తీవ్ర అస్వస్థతకు గురైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో చర్ల–శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేసిన శారద.. ప్రస్తుతం డీసీఎంగా పని చేస్తోంది. కరోనాతో ఇప్పటికే పలువురు మావోయిస్టు ముఖ్యనేతలు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. తాజాగా హరిభూషణ్ భార్య శారద కూడా కరోనా బారిన పడి, తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కాగా స్వచ్ఛందంగా వస్తే వైద్య సహాయం అందజేస్తామని కరోనా బారిన పడిన మావోయిస్టుల జాబితాను తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించిన విషయం విదితమే. ఇదేనా పార్టీ ఇచ్చిన గౌరవం? కొత్తగూడ: పార్టీ కోసం కుటుంబాన్ని లెక్క చేయకుండా పనిచేసిన యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ మృతదేహాన్ని తమకు అప్పగించకుండా మావోయిస్టులు మోసం చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కనీసం చివరి చూపు దక్కకుండా చేయడంపై వారు మండిపడ్డారు. అనారోగ్య కారణాలతో హరిభూషణ్ మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ బాధ్యులు గురువారం అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా శుక్రవారం హరిభూషణ్ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. తమ కొడుకు బతికున్న సమయంలో మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని పోలీసు దెబ్బలు, జైలు జీవితం అనుభవించిన తమకు పార్టీ ఇచ్చిన గుర్తింపు ఇదేనా అని అడిగారు. హరిభూషణ్ చితాభస్మం లేకుండా కర్మ కాండలు ఎలా నిర్వహించుకోవాలని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఏ గ్రామంలో మృతదేహాన్ని ఉంచినా తామే వెళ్లి తెచ్చుకుని అంత్యక్రియలు నిర్వహించుకునే వారమంటూ వారు బోరున విలపించారు. చదవండి: నక్సల్స్‌కు భారీ దెబ్బ: అనారోగ్యంతో హరిభూషణ్ మృతి -
చనిపోయింది కరోనాతోనే...
సాక్షి, హైదరాబాద్, వరంగల్: మావోయిస్టు పార్టీ నేతలపై కరోనా పంజా విసిరింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు యాప నారాయణ అలియాస్ హరిభూషణ్‌తోపాటు మరో కీలక నేత, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్ద బోయిన సారక్క అలియాస్ భారతక్క కరోనా లక్షణాలతో మరణించారు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో ఈ వివ రాలు వెల్లడించారు. 21వ తేదీ ఉదయం హరి భూషణ్, 22న ఉదయం సారక్క చనిపోయారని.. వీరికి దండకారణ్యంలో ప్రజల సమక్షంలో అంత్య క్రియలు నిర్వహించామని తెలిపారు. ఈనెల 22న వారిద్దరి పేరిట సంస్మరణ సభ నిర్వహించామని, వారి కుటుంబాలకు మావోయిస్టు పార్టీ తరఫున సంతాపం తెలియజేశామని వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా బ్రాంకైటిస్, ఆస్తమాతో బాధపడుతున్న హరిభూషణ్.. దండకారణ్యంలో ఉండటం, తగిన చికిత్స అందకపోవడంతో మరణించాడని పోలీసులు తెలిపారు. సారక్క ప్రస్థానమిదీ..: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలోని ఓ ఆదివాసీ కుటుం బంలో సిద్దబోయిన సారక్క జన్మించింది. 1985లో ఏటూరునాగారంలో విప్లవమార్గం పట్టింది. 1986లో అరెస్టైనా జైలు నుంచి విడుదలయ్యాక తిరిగి పార్టీలో చురుకుగా మారింది. 2008లో పదోన్నతిపై దండకారణ్యానికి బదిలీ అయింది. ఎన్నో ఎన్కౌంటర్లలో త్రుటిలో తప్పించుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి ఏరియాలో జనతన సర్కార్ ఏర్పాటు చేసిన పాఠశాల బాధ్యతలు చూస్తోంది. ఆమె కుమారుడు అభిలాష్ కూడా మావోయిస్టు పార్టీలో చేరాడు. గత ఏడాది జూన్ లో మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. సారక్కతో 29 సంవత్సరాలు కలిసి నడిచిన సహచరుడు కత్తి మోహన్ రావు ఈ నెల 10వ తేదీనే గుండెపోటుతో మరణించాడు. తర్వాత 12 రోజుల వ్యవధిలో సారక్క కరోనా లక్షణాలతో చనిపోయింది. మిగతావారి పరిస్థితి ఏమిటి? సాధారణ జనజీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి అడవుల్లో ఉన్న మావోలపైనా ప్రతాపం చూపింది. వందల సంఖ్యలో మావో యిస్టులు కరోనా బారిన పడినట్టు సమాచారం. కాగా హరిభూషణ్‌తో కలిసి ఒకే ప్రాంతంలో ఉన్న ఆయన భార్య, శబరి–చర్ల ఏరియా కమిటీ సభ్యురాలు జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారద ఏమైందని, ఆమె ఆరోగ్యం ఎలా ఉందోనని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటీవల కరోనా బారినపడ్డ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పరిస్థితి ఎలా ఉందోనని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. లొంగిపోతే చికిత్స చేయిస్తాం: భద్రాద్రి ఎస్పీ మావోయిస్టు పార్టీ నేతలు, కార్యకర్తలు కరోనా బారినపడి మరణించడానికి మావో యిస్టు పార్టీ అగ్రనాయకులే కారణమని భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్ గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. మావోయిస్టుల్లో ఎవరికీ కరోనా సోకలేదని మొదట్లో ప్రకట నలు చేశారని.. చికిత్స కోసం బయటికి వెళ్ల కుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. కరోనా సోకిన మావోయిస్టులు తక్షణమే బయటికి రావాలని, వారికి అండగా ఉంటామని, చికిత్స చేయిస్తామని పిలుపునిచ్చారు. చదవండి : వైరల్: చెంప దెబ్బ కొట్టిన ఎస్పీ.. కాలితో తన్నిన సీఎం పీఎస్ఓ -
నక్సల్స్‌కు భారీ దెబ్బ: అనారోగ్యంతో హరిభూషణ్ మృతి
1995లో దళంలోకి... మహబూబాబాద్ జిల్లా గంగారం మండ లం మరిగూడానికి చెందిన యాప నారాయణ 1995లో పీపుల్స్ వార్‌లో చేరాడు. అంచెలంచెలుగా ఎదిగి మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి స్థాయికి చేరాడు. కేడర్ నిర్మాణం కోసం... 2019 చివరి నుంచి మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కార్యకలాపాలు ముమ్మరం చేశాడు. తెలంగాణలో కేడర్ నిర్మాణం కోసం రిక్రూట్మెంట్ చేపట్టడమే గాక, పలు హింసాత్మక ఘటనలకు కారణమయ్యాడు. నలుగురు కీలక నేతలు.. అనారోగ్యంతో జూన్ 6న డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్, జూన్ 10న కత్తి మోహన్.. 16న విశాఖ ఎన్కౌంటర్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన సందె గంగయ్యలను పార్టీ కోల్పోయింది. తాజాగా హరిభూషణ్ మరణం. సాక్షి, హైదరాబాద్/మహబూబాబాద్/ గంగారం/కొత్తగూడ: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అలియాస్ లక్మూ అలియాస్ హెచ్చీ సోమవారం మరణించారు. ఇటీవల అనారోగ్యంతో మావో అగ్రనేత కత్తి మోహన్ అలియాస్ ప్రకాశ్ మరణం మరువకముందే.. మరో కీలకనేత మృతి చెందడం దండకారణ్యంలో కలకలం రేపుతోంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరిభూషణ్ ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలోని మీనాగుట్ట ప్రాంతంలో మరణించాడన్న వార్త మంగళవారం ఛత్తీస్‌గఢ్- తెలంగాణలో దావానంలా వ్యాపించింది. ఆయన అంత్యక్రియలను తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో నిర్వహించారని తెలిసింది. హరిభూషణ్ కరోనాతో లేదా ఫుడ్ పాయిజనింగ్తో మరణించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్త నిజమా? కాదా? అన్న విషయాలను తొలుత బస్తర్ పోలీసులు ధ్రువీకరించలేదు. సాయంత్రానికి ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు హరిభూషణ్ మరణవార్తను నిర్ధారించారు. 2018లో ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుని.. హరిభూషణ్ దళంలో పని చేస్తున్న సమయంలోనే మేనమామ కూతురు జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారదను వివాహం చేసుకున్నాడు. ఈమె ప్రస్తుతం శబరి–చర్ల ఏరియా కమిటీ సభ్యురాలిగా ఉంది. అనేక ఎన్కౌంటర్లలో త్రుటిలో తప్పించుకున్న హరిభూషణ్ చాలాసార్లు మరణించాడని ప్రచారం జరిగింది. 2018, మార్చిలో బీజాపూర్ జిల్లా పూజారి కంకెర అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఆసమయంలో హరిభూషణ్ దంపతులు సురక్షితంగా తప్పించుకున్నారు. అయితే అప్పుడు అతడు మరణించాడంటూ వార్తలొచ్చాయి. పలు కార్యకలాపాలకు మూలం ఇతనే.. గణపతి తరువాత మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నంబాల కేశవరావు స్వీకరించినప్పటి నుంచి పార్టీలో హరిభూషణ్‌కు ప్రాధాన్యం పెరిగింది. తెలంగాణలో కేడర్ నిర్మించుకోవాలన్న కేశవరావు ఆదేశాలతో 2019 చివరి నుంచి కార్యక లాపాలు ముమ్మరం చేశాడు. రిక్రూట్మెంట్లకు, పలు హింసాత్మక ఘటనలకు కారణమయ్యాడు. గతేడాది లాక్డౌన్ సమయంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో కలసి ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్-భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను పోలీసులు తిప్పికొట్టారు. వరుసగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 10 మంది మావోలు మరణించారు. దీంతో హరిభూషణ్ అతని అనుచరులు వెనకడుగు వేశారు. పోలీసుల గాలింపు తీవ్రతరం కావడం, లాక్డౌన్ ఎత్తివేయడంతో హరిభూషణ్ అతని అనుచరులు తిరిగి దండకారణ్యానికి వెళ్లారు. గతే డాది చివర్లో కూడా ప్రాణహిత నది మీదుగా మహా రాష్ట్ర నుంచి పలుమార్లు హరిభూషణ్ తెలంగాణ లోకి ప్రవేశించాడని నిఘా వర్గాలు స్థానిక పోలీసులను హెచ్చరించాయి. దీంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర ప్రాంతాల్లో గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టినా హరిభూషణ్ ఆచూకీ మాత్రం చిక్కలేదు. 3 వారాల్లో నలుగురు నేతలు.. మావోయిస్టుల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర అలజడి సృష్టిస్తోంది. 3 వారాల్లోనే నలుగురు కీలక నేతలను కోల్పోయింది. ఈసారి వచ్చిన స్ట్రెయిన్ ప్రమాదకరంగా ఉండటం.. మావోయిస్టు అగ్రనేతలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండటంతో అగ్రనేతలు మరణాల బారిన పడుతున్నారని బస్తర్ పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏప్రిల్‌లో బీజాపూర్‌లో పోలీసులపై మావో అగ్రనేత హిడ్మా నేతృత్వంలో జరిగిన ఊచకోతకు ప్రతీకారం కోసం సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు ఎదురుచూస్తున్నా యి. దండకారణ్యంలో మావోలకు పట్టున్న ప్రాం తాలను డ్రోన్ల ద్వారా తెలుసుకుంటున్నారు. మావోలను అష్టదిగ్బంధనం చేశారని అందుకే వారు బయటికి రాలేక, చికిత్స అందక మరణిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే, లొంగిపోతే తాము చికిత్స అందిస్తామని తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించినా.. అందుకు మావోలు సిద్ధంగా లేరు. పీపుల్స్ వార్‌లోకి ఇలా.. యాప పాపమ్మ, రంగయ్య దంపతుల ఏడుగురు సంతానంలో నారాయణ పెద్ద కుమారుడు. నర్సంపేటలో డిగ్రీ చదివిన ఆయన 1985 - 90 మధ్యకాలంలో ఎల్ఐసీ ఏజెంట్‌గా, ఐటీడీఏ మైనర్ ఇరిగేషన్లో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు. అయితే అప్పుడు కొత్తగూడ, ఇల్లందు, గుండాల ఏజెన్సీ ప్రాంతాల్లో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. అప్పటి నుంచే నారాయణ పీపుల్స్‌వార్ అనుబంధంగా పనిచేస్తూ మిత్రుడు రాజకోటితో కలసి న్యూడెమోక్రసీ పార్టీ విధానాలు, వారికి వ్యతిరేకంగా గ్రామాల్లో పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని హత్య చేసేందుకు న్యూడెమోక్రసీ నేతలు వ్యూహం పన్నారు. 1991, మే 31న గ్రామంలో జరిగే వివాహానికి నారాయణ, రాజకోటి వస్తారని కాపుకాసిన ఎన్డీ నేతలకు రాజకోటి దొరకగా.. నారాయణ అక్కడి నుండి తప్పించుకున్నాడు. ఆ తర్వాత పీపుల్స్‌వార్ దళంలోకి వెళ్లాడు. పీపుల్వార్లో చేరిన హరిభూషణ్ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. దళసభ్యుడిగా, మిలిటరీ ప్లాటూన్ శిక్షణ కమాండర్‌గా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర కార్యదర్శి, తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా ఎదిగారు. హరిభూషణ్‌పై ప్రభుత్వం రూ.20లక్షల రివార్డు ప్రకటించింది. ఎలాంటి సమాచారం లేదు హరిభూషణ్ మృతి చెందాడనే వార్త సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ఆయన స్వగ్రామం మడగూడెం విషాదఛాయలు అలముకొన్నాయి. అయితే ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. వారంతా మంగళవారం వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండటం కనిపించింది. గతంలోనూ హరిభూషణ్ చనిపోయాడని వార్తలు వచ్చాయని.. దీంతో తమ తండ్రి రంగయ్య మనోవేదనకు గురై మంచాన పడ్డారని హరిభూషణ్ సోదరులు అశోక్, రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కోలుకుంటున్న తమ తండ్రికి మళ్లీ హరిభూషణ్ మరణించాడని వార్తలు చేరడంతో ఆందోళనకు గురవుతున్నారన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని హరిభూషన్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
మావోయిస్టు నేత హరిభూషణ్ మృతి
రాయ్‌పూర్: మావోయిస్టు పార్టీ అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాపా నారాయణ అలియాస్ హరిభూషణ్ (50) కరోనా బారిన పడి మరణించినట్టు తెలుస్తోంది. దంతేవాడ జిల్లా సుకుమా తాలుకాలోని మీనాగూడ గ్రామంలో జూన్ 21న ఆయన చనిపోయినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. హరిభూషణ్ ఆరోగ్య స్థితిగతులపై ఇటు మావోయిస్టులు అటు పోలీసులు నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వారం క్రితం 2021 జూన్ 15న మావోయిస్టు అగ్రనేతలు కరోనా బారిన పడ్డారంటూ పోలీసులు ప్రకటన చేయగా... దాన్ని ఖండించారు మావోయిస్టు నేత అభయ్. మావోయిస్టు అగ్రనేతలకు కరోనా సోకింది అనేది కేవలం పోలీసుల దుష్ప్రచారం అంటూ కొట్టి పారేశారు. ఈ ఘటన జరిగి వారం తిరక్క ముందే కరోనాతో హరిభూషణ్ మరణం అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మడగూడ నుంచి హరిభూషణ్ ఆలియాస్ యాప నారాయణ సొంతూరు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మడగూడ. 1995లో పీపుల్స్ వార్ గెరిల్లాలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. గతంలో జరిగిన పువ్వర్తి, తడపలగుట్ట ఎదురు కాల్పులతో పాటు మరి కొన్ని సందర్భాల్లోనూ హరిభూషణ్ చనిపోయినట్టు ప్రచారం జరిగినా ... ప్రాణలతో బయటపడ్డాడు. ఇటీవల తెలంగాణ – చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన అనేక ఆపరేషన్స్ లో హరిభూషణ్ కీలక పాత్ర పోషించారు. మడగూడెంలోని హరిభూషన్ నివాసం -
మావో అగ్రనేత కత్తిమోహన్‌రావు మృతి
సాక్షి, హైదరాబాద్/మహబూబాబాద్: దండకారణ్యంలో మావోయిస్టులు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అగ్రనేతలు వరుసగా అనారోగ్యం బారిన పడుతున్నారు. మావోయిస్టు పార్టీ రెండవ తరం నాయకుల్లో కీలక నేతగా ఎదిగిన కత్తి మోహన్ రావు అలియాస్ ప్రకాష్ ఈనెల 10న గుండెపోటుతో మరణించినట్లు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 11న దండకారణ్యంలో లాంఛ నాలతో అంత్యక్రియలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మోహన్ రావు మృతికి సంతాపం తెలిపారు. ఆయన దీర్ఘకాలంగా ఆస్తమా, బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతు న్నాడు. గతవారం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ అలియాస్ మోహన్ అలియాస్ శోభ్రాయ్ కరోనా బారిన పడ్డా.. డయేరియాతో మరణించిన విషయం తెలిసిందే. మధుకర్ జూన్ 6న మరణించగా.. 10న మోహన్‌రావు మృతిచెందాడు. దీంతో ఐదు రోజుల వ్యవ ధిలో ఇద్దరు అగ్రనేతలను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. కాకతీయ నుంచి కత్తి ప్రస్థానం మోహన్ రావు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గార్ల గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. మహబూబాబాద్‌లో ఇంటర్, ఖమ్మంలో డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివాడు. వర్సిటీ స్థాయిలో డబుల్ గోల్డ్‌మెడల్ సాధించాడు. ఈ ఘనత సాధించిన వారెవరికైనా ఆ రోజుల్లో సులువుగా ప్రభుత్వ కొలువుదక్కేది. కానీ, మోహన్‌రావు ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు. తన చిన్ననాటి మిత్రుడు ఆమెడ నారాయణతో కలిసి 1982లో రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో చేరాడు. 39 ఏళ్లపాటు ఉద్యమ ప్రస్థానం సాగించాడు. కిన్నెర దళానికి డిప్యూటీ కమాండర్, మహదేవ్పూర్ దళ కమాండర్‌గా పనిచేశాడు. తర్వాత ఏటూరునాగారం, పాండవ దళ స్కాడ్ ఏరియా సభ్యుడిగా, ఉత్తర తెలంగాణ ప్రెస్‌యూనిట్ నిర్వహణ కమిటీలో, ఖమ్మం జిల్లా కమిటీలో పనిచేసి 2008లో దండకారణ్యానికి బదిలీ అయ్యాడు. అక్కడ దామదాదగా పేరు మార్చుకొని జనతన సర్కార్ నడుపుతున్న స్కూల్లో గురూజీగా పనిచేశాడు. ఈ క్రమంలో 1985లో, 1992లో రెండుసార్లు పోలీసులకు పట్టుబడి ఆరేళ్లకుపైగా జైలు జీవితం అనుభవించాడు. మోహన్‌రావు నాలుగు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం ముగిసిందని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. కరోనా, దీర్ఘకాల రోగాల ముప్పు దండకారణ్యంలోనూ కరోనా విలయతాండవం చేస్తుండటంతో పలువురు నేతలు ఆ మహమ్మారి బారినపడ్డారని ఈనెల 2న వరంగల్ పోలీసులకు పట్టుబడిన గడ్డం మధుకర్ తెలిపాడు. 12 మంది కీలక నేతల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని చెప్పాడు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ నుంచి ముందస్తుగా సేకరించిన మందులతో వీరు సొంత వైద్యానికే ప్రాధాన్యమిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మావోయిస్టులు ఆరోగ్యపరంగా మునుపెన్నడూ లేని సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెబుతున్నారు. చదవండి: హైదరాబాద్: పలు ప్రాంతాల్లో భారీ వర్షం -
మావోయిస్టు కీలకనేత లొంగుబాటు: రూ.20 లక్షలు ఆయనకే
సాక్షి, అమరావతి/ దుబ్బాక టౌన్: మావోయిస్టు కీలక నేత, ప్రస్తుతం మావోయిస్టు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు స్పెషల్ జోన్ కమిటీ (ఏఓబీ ఎస్జెడ్సీ) సభ్యుడిగా ఉన్న ముత్తన్నగారి జలంధర్‌రెడ్డి అలియాస్ కృష్ణ అలియాస్ మారన్న, అలియాస్ కరుణ, అలియాస్ శరత్.. మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఎదుట లొంగిపోయాడు. ఇతను 22 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. నలభై ఏళ్ల జలంధర్‌రెడ్డి స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా (పూర్వపు మెదక్ జిల్లా) దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామం. డిగ్రీ చదువుతుండగా మావోయిస్టు పార్టీలో చేరి, వివిధ హోదాల్లో పనిచేసిన ఇతనిపై రూ.20 లక్షల రివార్డు ఉంది. కాగా జలంధర్ లొంగుబాటు పురస్కరించుకుని ఏపీ డీజీపీ సవాంగ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల వల్లే.. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయే మావోయిస్టులకు చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయ పునరావాస ఏర్పాట్లు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఆదివాసీ గిరిజనులు చైతన్యవంతమై మావోయిస్టులకు దూరమవుతున్నారని చెప్పారు. దీంతో ఏఓబీలో మావోయిస్టులు పట్టు కోల్పోయారని, గడిచిన రెండేళ్లలో అనేక మంది లొంగిపోయారని వివరించారు. జలంధర్‌పై ఉన్న రూ.20 లక్షల రివార్డు మొత్తాన్ని ఆయన సహాయ పునరావాస కార్యక్రమానికి వినియోగిస్తామని డీజీపీ చెప్పారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి అడవి బాట.. రిటైర్డ్ వీఆర్వో ముత్తన్నగారి బాలకృష్ణారెడ్డి, సులోచన దంపతుల ముగ్గురు కుమారుల్లో జలంధర్ చివరివాడు. ఇతని తాత పద్మారెడ్డి పోలీస్ పటేల్. 50 ఎకరాలకు పైగా భూమి ఉంది. గ్రామంలో పేరున్న ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ పేద ప్రజల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం అడవి బాట పట్టాడు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళశాలలో డిగ్రీ చదువుతుండగా ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1999–2000లో అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ సంస్థ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ)లో పనిచేస్తూ పూర్తిస్థాయి అజ్ఞాతంలోకి వెళ్లాడు. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో çవివిధ హోదాల్లో, పలు పేర్లతో పనిచేశాడు. 19 ఎదురుకాల్పుల సంఘటనలు, పలు పోలీస్స్టేషన్లపై దాడులతో పాటు 2008లో సంచలనం సృష్టించిన బలిమెల సంఘటనలోనూ జలంధర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇతని ఇద్దరు సోదరుల్లో ఒకరు వ్యవసాయం చేస్తుండగా, మరొకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్నారు. బతికుండగా తమ కొడుకును చూస్తామనుకోలేదంటూ జలంధర్ లొంగుబాటుపై తల్లిదండ్రులు బాలకృష్ణారెడ్డి, సులోచన ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: కరోనా టీకా.. జనాభాలో యవ్వనులే అధికం చదవండి: బొల్లినేని శ్రీనివాస గాంధీ అరెస్ట్ -
ఎవరీ మడవి హిడ్మా?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా.. భారీ సంఖ్యలో పోలీసు బలగాలు వెళ్లింది ఆయనను పట్టుకునేందుకే.. కానీ పక్కాగా ప్లాన్ చేసి ఇంతమంది పోలీసులను రప్పించి, దాడి చేసిందీ ఆయనే.. ఇంతకుముందు జరిగిన భారీ ఎన్కౌంటర్లు, దాడుల ఘటనల్లో కీలకమూ ఆయనే.. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన తాజా ఘటనతో ఎక్కడ చూసినా హిడ్మా పేరే వినిపిస్తోంది. మరి ఇంతకీ ఎవరీ హిడ్మా? ఎక్కడివాడు, ఏం చేశాడనేది చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పువ్వర్తికి చెందిన ఆదివాసీ మడావి హిడ్మా. ఆయన తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉంటున్నారు. 5 వరకే చదువుకున్న హిడ్మా.. 25 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. ప్రస్తుతం ఆయన వయసు 40 ఏళ్లు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ)–1వ బెటాలియన్‌కు కమాండర్‌గా.. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగా పనిచేస్తున్నాడు. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేస్తుంది. హిడ్మా భార్య కూడా మావోయిస్టు పారీ్టలోనే పనిచేస్తోంది. పీఎల్జీఏ సభ్యులకు శిక్షణ ఇచ్చేది హిడ్మానే. ఒక్కో బెటాలియన్ 200 మంది మావోయిస్టులుంటారు. కొత్తగా ఏ బెటాలియన్ పెట్టినా హిడ్మా ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్ ఉంటుంది. పీఎల్‌జీఏతోపాటు మిలీíÙయా సభ్యులకు కూడా ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన 25కుపైగా ఘటనలకు హిడ్మానే సూత్రధారి అని చెబుతారు. రామన్న తర్వాత హిడ్మా.. ఛత్తీస్‌గఢ్‌లో గెరిల్లా దాడుల బాధ్యతలను ఇంతకుముందు మవోయిస్టు నేత రామన్న చూసేవారు. ఆ తర్వాత హిడ్మా ఆ బాధ్యతలు చేపట్టాడు. కూంబింగ్ ఆపరేషన్లు చేసే పోలీస్ బలగాలపై, సీఆర్పీఎఫ్ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. మావోయిస్టు పార్టీలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) విభాగం హిడ్మా కనుసన్నల్లోనే పనిచేస్తుంది. దండకారణ్యంపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. హిడ్మా తలపై రూ.40లక్షల రివార్డు కూడా ఉంది. గతంలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి హత్య కేసులో హిడ్మాపై ఎన్ఐఏ చార్జీషీట్ కూడా వేసింది. హిడ్మా నేతృత్వంలో జరిగిన కొన్ని ఘటనలు ఇవీ.. 2010 ఏప్రిల్ 6న సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైన్ ప్రొటెక్షన్ వాహనాన్ని మందుపాతరలతో పేల్చివేసి, కాల్పులు జరిపిన ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందులో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు. 2017 మార్చి 12న సుక్మా జిల్లా బెజ్జి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తచెరువు దగ్గర రోడ్డు నిర్మా ణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై మందుపాతరతో దాడి జరిగింది. ఆ ఘటనలో 12మంది సీఆర్పీఎఫ్ జవాన్లుమృతి చెందారు. 2017 ఏప్రిల్ 24న ఇదే జిల్లా చింతగుఫా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుర్కాపాల్ సమీపంలో రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో.. 24 మంది జవాన్లు చనిపోయారు. 2018 మార్చి 13న సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 12 మంది జవాన్లు మృతి చెందారు. 2020 ఫిబ్రవరిలో ఇదే జిల్లా పిడిమెట అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చి, కాల్పులు జరపడంతో 12 మంది డీఆర్జీ జవాన్లు మృతి చెందారు. తాజాగా శనివారం జొన్నగూడెం దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు. -
మంచిర్యాలలో మావోల లేఖ.. ఎమ్మేల్యేకు హెచ్చరిక
సాక్షి, ఆదిలాబాద్ : మంచిర్యాల నియోజక వర్గంలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, అతని తనయుడు భూదందాలు, కబ్జాలు ఆపాలని హెచ్చరిస్తూ... మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరుతో లేఖ విడుదల చేశారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి భూముల సెటిల్మెంట్ల పేరిట అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటామని లేఖలో తెలిపారు. గుడిపేటలో 2004లో శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నిర్మాణం చేపట్టారని తెలిపారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిసిన ఈ ఎమ్మెల్యే ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటానని హామీఇచ్చి... ఇప్పటికీ వారి సమస్యలు పరిష్కరించడంలేదని ఆరోపించారు.ఎమ్మెల్యే ముంపు గ్రామాల్లో ఉన్న తన అనుచరులు, అధికారులతో కుమ్మక్కై కోట్ల రూపాయాలు కాజేశారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని అక్కడి నాయకులతో కోర్టులో కేసులు వేయించి... గెలిసిన తర్వాత బాధితుల నుంచి మళ్లీ కమీషన్లు తీసుకున్నారని అన్నారు. గుడిపేటలో ఓ సర్పంచి ఇసుక అక్రమంగా దందా చేస్తున్నారని, వీరి పద్ధతి మార్చుకోకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. చదవండి: నవ్యా రెడ్డి హత్య: వెనీలా ఆత్మహత్య చదవండి: నగ్న ఫొటోలు పంపాలని ఇన్‌స్టాలో వేధింపులు -
ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి
సాక్షి, చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలోని బుధవారం ఉదయం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. దంతెవాడ జిల్లా కట్టే కల్యాణ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చీక్‌పాల్–మర్జుమ్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు డీఆర్జీ, సీఆర్పీఎఫ్–17 బెటాలియన్‌కు చెందిన ప్రత్యేక బలగాలు మంగళవారం ఉదయం నుంచి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో చీక్‌పాల్ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం తారసపడిన మావోయిస్టులు బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో బలగాలు సైతం ఎదురుకాల్పులు జరపడంతో ఒక మావోయిస్టు మృతిచెందగా...అతడి వద్ద ఒక తుపాకీ లభ్యమైంది. మృతిచెందిన మావోయిస్టును కట్టే కల్యాణ్ ఏరియా కమిటీ సభ్యుడు ముసికి ఇడమాగా గుర్తించారు. ఇతడిపై గతంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.5లక్షల రివార్డును ప్రకటించి ఉంది. -
లొంగిపోయిన ఆర్కే ప్రొటెక్షన్ పార్టీ మావోయిస్టు
సాక్షి, కొరాపుట్: ఒకవైపు పీఎల్జీఏ వారోత్సవాలు కొనసాగుతుండగా మావోయిస్టు ప్రభావిత మల్కన్‌గిరి జిల్లాకు చెందిన ఓ మహిళా మావోయిస్టు కొరాపుట్ ఎస్పీ ముకేశ్‌కుమార్ భాము ముందు స్వచ్ఛందంగా లొంగిపోవడం ప్రధాన్యత సంతరించుకుంది. కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆమెను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ.. వివరాలను వెల్లడించారు. మల్కన్‌గిరి జిల్లా కలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుబ గ్రామానికి చెందిన శుక్ర మడ్కామి కుమార్తె.. రామె మడ్కామీ. 2013లో సాంస్కృతిక జన నాట్యమండలి బృందంలో చేరి అనంతరం, తన 16వ ఏట మావోయిస్టులకు దగ్గరైంది. మిలటరీ శిక్షణ, 303 రైఫిల్ వినియోగంపై పూర్తి శిక్షణ పొందింది. అనంతరం ఇన్సాస్ రైఫిల్ శిక్షణ కూడా పూర్తి చేసి, ఏసీఎం కేడర్ వరకు ఎదిగింది. ఈ నేపథ్యంలో పలు తీవ్రవాద కార్యకలాపాల్లో భాగస్వామ్యమైంది. ప్రస్తుతం ఏఓబీఎస్‌జెడ్‌సీ సెంట్రల్ కమిటీ సభ్యురాలిగా, ప్రముఖ మావోయిస్టు నాయకుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ప్రొటెక్షన్ పార్టీలో క్రియాశీలక పాత్రను వహిస్తూ.. ఏసీఎం కేడర్‌లో పనిచేస్తోంది. ఆమెపై కొరాపుట్, మలకనగిరి జిల్లాల్లో పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెపై రూ.4 లక్షల రివార్డును కూడా ప్రభుత్వ ప్రకటించింది. సిద్ధాంతాలను నీరు గార్చుతున్నారు.. రామె మడ్కామీ స్వచ్ఛందంగా లొంగిపోవడంతో ఆమెకు ప్రభుత్వం ప్రకటించిన రివార్డు సొమ్ము, పునరావాస సదుపాయాలను అందించనున్నట్లు ఎస్పీ భాము వెల్లడించారు. అలాగే పూర్తిగా విచారణ చేపట్టి, మావోయిస్టుల కార్యకలాపాల వివరాలను రాబట్టనున్నట్లు తెలిపారు. పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశామన్నారు. ఈ సందర్భంగా మహిళా మావోయిస్టు రామె మడ్కామీ మీడియా ప్రతినిధులకు తన లొంగుబాటుకు గల కారణాలను వివరించింది. ప్రస్తుతం మావోయిస్టులు ఆదివాసీ అభ్యుదయ సిద్ధాంతాలకు తిలోదకాలు పలికి, గిరిజనులపై పోలీసు ఇన్ఫార్మర్లుగా ముద్రవేసి, హత్యకు పాల్పడుతున్నారని ఆరోపించింది. పోలీసులతో ఎదురు కాల్పుల సమయంలో పెద్ద కేడర్‌లో ఉన్నవారు తప్పుకుని, చిన్న చిన్న కేడర్ వారిని తుపాకీ గుళ్లకు బలి చేస్తున్నారని తెలిపింది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ గ్రామీణ, ఆదివాసులకు తీరని అన్యాయం చేయడం దారుణమని పేర్కొంది. తెలిసో.. తెలియకో మావోయిస్టుల మాయాజాలంలో చిక్కుకుని క్షణక్షణం భయం గుప్పెట్లో.. అటవీ ప్రాంతంలో అజ్ఞాతంగా 7 ఏళ్లు నరకయాతన చూశానని, జనజీవన స్రవంతిలోకి వచ్చి కుటుంబంతో పాటు జీవించాలన్న ఆశతో పోలీసుల ముందు లొంగిపోయినట్లు వెల్లడించారు. తన వంటి వారు విజ్ఞతతో మేల్నొని, పోలీసుల ఎదుట లొంగిపోవాలని మడ్కామీ పిలుపునిచ్చింది. -
మూడు రాష్ట్రాల సరిహద్దులోనే... హరిభూషణ్?
సాక్షి , వరంగల్ : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నేతృత్వంలో యాక్షన్ టీంలు మళ్లీ రంగంలోకి దిగాయా? వరుస నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారా? అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలే లక్ష్యంగా దాడులకు దిగనున్నారా? తెలంగాణలో పునర్వైభవం కోసం ఓవైపు మళ్లీ ప్రజాకోర్టులు, దాడులు, మరోవైపు ‘రిక్రూట్మెంట్’పై దృష్టి సారించారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం పోలీసు, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణలో పార్టీ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో 2019 డిసెంబర్లో జరిగిన పార్టీ కీలక సమావేశంలో తెలంగాణ, ఆంధ్రా – ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యనేతలతో కలిసి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ప్లీనరీకి సంబంధించిన కీలకపత్రాలు నిఘావర్గాల చేతికి చిక్కాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ దళాలు దండకారణ్యం మూడు రాష్ట్రాల (తెలంగాణ– మహారాష్ట్ర– ఛత్తీస్‌గఢ్) సరిహద్దు, గోదావరి, ప్రాణహిత మధ్య మకాం వేసినట్లు సమాచారం. రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాక్షన్‌టీంలు రంగంలోకి దిగినట్లు గుర్తించిన పోలీసులు మూడు నెలలుగా సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా, అక్టోబర్ 10న రాత్రి ములుగు జిల్లా బోధాపూర్‌లో టీఆర్ఎస్ నాయకుడు భీమేశ్వర్‌రావును మావోలు హతమార్చడం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత పోలీసుల కూంబింగ్, వరుస ఎన్కౌంటర్లలో ఐదుగురు వరకు మావోయిస్టులు మృతి చెందగా, రెండు రోజుల కిందట ప్రజాకోర్టులో ఇద్దరిని ఇన్ఫార్మర్ల పేరిట మావోయిస్టులు కాల్చి చంపడంతో మూడు రాష్ట్రాల సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కమిటీల పునర్వ్యవస్థీకరణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మూడు రాష్ట్ర కమిటీలు ఉండేవి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ (ఎన్టీఎస్జెడ్సీ), ఆంధ్ర రాష్ట్ర కమిటీ, ఉత్తరాంధ్ర, ఒడిశాకు కలిపి ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏఓబీ) కమిటీలు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత ఎన్టీఎస్జెడ్సీని తెలంగాణ రాష్ట్ర కమిటీ(టీఎస్సీ)గా మార్చారు. ఆంధ్ర రాష్ట్ర కమిటీ కనుమరుగు కాగా... ఏఓబీ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఖమ్మం – కరీంనగర్ – వరంగల్ జిల్లాలకు కలిపి (కేకేడబ్ల్యూ) డివిజినల్ కమిటీ ఉండేది. అయితే తెలంగాణ ప్రభుత్వం 2016లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో మావోయిస్టు పార్టీ కూడా తమ రాష్ట్ర కమిటీని పునర్వ్యవస్థీకరించింది. కేకేడబ్ల్యూను ఎత్తివేసి దాని స్థానంలో కొత్తగా మూడు డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్ లక్మ అలియాస్ హరిభూషణ్ నియమితులయ్యారు. ఇందులో సభ్యులుగా బండి ప్రకాశ్ అలియాస్ క్రాంతి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌ను నియమించారు. ఇటీవల కార్యకలాపాల విస్తరణలో భాగంగా తెలంగాణలో రంగంలోకి దిగిన యాక్షన్ టీంలకు తెలంగాణ నాయకులు నాయకత్వం వహిస్తుండగా, దాడులకు మాత్రం ఛత్తీస్‌గఢ్ కేడర్‌నే వాడుతున్నారు. గత నెలలో ములుగు జిల్లాలో టీఆర్ఎస్ నేత హత్య ఘటనకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ముసాకి ఉంజల్ అలియాస్ సుధాకర్ నాయకత్వం వహించడమే ఇందుకు ఉదాహరణ. కాగా దండకారణ్యంలో పోలీసుల గాలింపు, నిఘా ముమ్మరం కావడంతో మూడు రాష్ట్రాల సరిహద్దులోని ఉత్తర తెలంగాణ జిల్లాలను సేఫ్ జోన్‌గా ఎంచుకున్న మావోయిస్టులు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో తిరిగి కార్యకలాపాలను ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మూడు జిల్లాలకో డివిజన్ కమిటీ పూర్వ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లాలను కలుపుకొని కొత్త కమిటీలు వేసినట్లు పోలీసువర్గాలు నిర్ధారించాయి. పెద్దపల్లి – కరీంనగర్ – భూపాలపల్లి జయశంకర్ – వరంగల్ జిల్లాలు కలిపి ఓ డివిజన్ కమిటీ కాగా, దీనికి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ కింద ఏటూరునాగారం – మహదేవ్పూర్ ఏరియా కమిటీ, ఇల్లెందు – నర్సంపేట ఏరియా కమిటీలు వేయగా, వీటికి సుధాకర్, కూసం మంగు అలియాస్ లచ్చన్నలను కార్యదర్శులుగా నియమించారు. మంచిర్యాల – కొమురంభీం(ఎంకేబీ) డివిజినల్ కమిటీ నాయకత్వాన్ని ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా ఉన్న మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌కు అప్పగించారు. అంతేకాకుండా ఇంద్రవల్లి ఏరియా కమిటీ, మంగి ఏరియా కమిటీ, చెన్నూర్ – సిర్పూర్ ఏరియా కమిటీలు ఏర్పాటైనట్లు సమాచారం. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం – తూర్పుగోదావరి డివిజినల్ కమిటీ కొత్తగా ఏర్పడగా, ఈ కమిటీకి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కార్యదర్శిగా ఉన్నారు. ఈ కమిటీ కింద చర్ల – శబరి ఏరియా కమిటీ, లోకే సుజాత నేతృత్వంలో మణుగూరు ఏరియా కమిటీ, కుంజా లక్షణ్ అలియాస్ లచ్చన్న నేతృత్వంలో స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ ఏర్పాటు చేశారు. చర్ల – శబరి ఏరియా కమిటీకి మడకం కోసీ అలియాస్ రజిత నాయకత్వం వహిస్తున్నారు. ఇక చర్ల లోకల్ ఆర్గనైజింగ్ స్క్వాడ్, ఉబ్బ మోహన్ అలియాస్ సునీల్ నేతృత్వంలో శబరి లోకల్ ఆర్గనైజింగ్ స్క్వాడ్లు, ముసాకి ఉంజల్ అలియాస్ సుధాకర్ నాయకత్వంలో వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీలు పని చేస్తున్నాయి. మొత్తంగా ఈ కమిటీలకు సారథ్యం వహిస్తున్న బడే దామోదర్, మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ కోసం ప్రస్తుతం పోలీసుల వేట సాగుతోంది. -
మావోయిస్ట్ పార్టీకి ఎదురుదెబ్బ
సాక్షి, ఆదిలాబాద్ : మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు పార్టీ కేబీఎం కమిటీ (కుమురం భీం, మంచిర్యాల) కీలక సభ్యుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేబీఎం కార్యదర్శి అడెల్లు అలియాస్ భాస్కర్ కమిటీలో కీలక సభ్యుడిగా వ్యవహరించిన లింగు గురువారం ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్ ఎదుట సరెండర్ అయ్యాడు. జైనూర్ మండలానికి చెందిన 28 ఏళ్ల లింగు రెండున్నర నెలల కిందటే మావోయిస్టు పార్టీలో చేరాడు. అడేల్లు అలియాస్ భాస్కర్ దళంలో లింగు ఆదిలాబాద్ కమిటీ లో పని చేశాడు. కదంబ ఎన్కౌంటర్ తర్వాత లింగు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే స్థానిక పోలీసులు కలిసి.. లొంగుబాటు నిర్ణయానికి వచ్చాడు. దీనిపై ఎస్సీ మాట్లాడుతూ.. లింగుకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని తెలిపారు. (కదంబా అడవుల్లో అలజడి) మరికొంత మంది నేతలు కూడా లొంగిపోయే అవకాశం ఉందన్నారు. లింగు లొంగుబాటుకు అడెల్లుకి ఎదురుదెబ్బగా మాజీ మావోయిస్టులు, పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు మావోల ఏరివేతే లక్ష్యంగా ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం సాగుతుండగా పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో మావోలు ఉన్నారు. గతనెల 19న కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దళ సభ్యులు మృతి చెందగా, ఇందులో ఒకరు చత్తీస్‌గడ్‌కు చెందిన చుక్కాలు కాగా, మరొకరు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన జుగ్నాక్ బాదీరావు ఉన్నాడు. కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కేబీఎం డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్న విషయం తెలిసిందే. భాస్కర్ నేతృత్వంలోని ఆరుగురు దళ సభ్యులు ఉమ్మడి జిల్లాలో కొద్దికాలంగా సంచరిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో వలస కూలీల రూపంలో జిల్లాలోకి చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలు, ప్రాణహిత తీరం వెంట సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలలుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి నేతృత్వంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
‘గణపతిని మావోయిస్టు పార్టీ వదులుకోదు’
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటు వార్తల్లో నిజం లేదని మావోయిస్టు పార్టీ మాజీ సభ్యుడు జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న స్పష్టం చేశారు. పోలీసులకు గణపతి లొంగిపోతున్నాడని, ఆ క్రమంలోనే సంప్రదింపులు జరిపినట్లు వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. ఈ మేరకు ‘సాక్షి’తో మాట్లాడిన జంపన్న.. ‘గణపతికి అనారోగ్యం సమస్యలుంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ చూసుకుంటుంది. పోలీసుల స్టేట్మెంట్లో కూడా వాళ్లు వస్తే మేము సహకరిస్తామని మాత్రమే చెప్పారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో ఎలాంటి ప్రాంతీయ విభేదాలు లేవు. గణపతిని మావోయిస్టు పార్టీ వదులుకోదు.మావోయిస్ట్ పార్టీ ఎదుగుదలకు గణపతి ఎంతో కృషిచేశాడు. గణపతి లొంగుబాటు కేవలం ప్రచారం మాత్రమే. డీజీపీ ఏజన్సీ పర్యటనకు గణపతి లొంగుబాటుకు సంబంధం లేదు. తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ ఉనికి కారణంగానే డీజీపీ పర్యటన ఉండొచ్చు. గణపతికి విదేశాల్లో చికిత్స అవాస్తవం. గణపతి లొంగిపోతాడని నేను అనుకోవడం లేదు’ అని జంపన్న తెలిపారు. గణపతి ఆచూకీపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, త్వరలో లొంగిపోతాడని వస్తున్న వార్తలపై ఏపీ– తెలంగాణతోపాటు జాతీయ మీడియాలోనూ వరుస కథనాలు వస్తున్నాయి. తెలంగాణ పోలీసుల సహకారం మేరకు గణపతి లొంగుబాటుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, లొంగుబాటులోని సాధ్యాసాధ్యాలపై అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఓవైపు గణపతి ఇప్పటికే లొంగిపోవడానికి అంగీకరించాడని, మరికొన్ని రోజుల్లో లొంగుబాటు చూపుతారంటూ సాగుతున్న ప్రచారంపై పోలీసులు పెదవి విప్పడంలేదు. ఆయన లొంగిపోతే మాత్రం స్వాగతిస్తామని, ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని భరోసా మాత్రమే ఇస్తున్నారు. -
మావోయిస్టు సుదర్శన్ లొంగిపోతారా..?
సాక్షి, బెల్లంపల్లి: మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ ప్రభుత్వానికి లొంగి పోతారనే ప్రచారం సాగుతోంది. రెండురోజుల నుంచి పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుదర్శన్ డిగ్రీ చదువుతున్న క్రమంలో విప్లవోద్యమానికి ఆకర్షితుడయ్యాడు. చదువు పూర్తయ్యాక ఆర్నెళ్లపాటు సింగరేణిలో కార్మికుడిగా పనిచేశాడు. 1978లో విప్లవోద్యమానికి అంకితమై అజ్ఞాతంలోకి వెళ్లాడు. 42 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఆయన అంచలంచెలుగా ఉన్నత శ్రేణికి ఎదిగారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగి కీలకమైన పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా ఉన్నాడు. మావోయిస్టు పార్టీలో మిలటరీ శిక్షణ ఇవ్వడం.. వ్యూహాలను రచించి సమర్థవంతంగా అమలు చేయడంలో సుదర్శన్‌కు మంచి పట్టున్నట్లు చెబుతుంటారు. నాలుగు దశాబ్దాల పైబడి అజ్ఞాతవాసం గడుపుతున్న సుదర్శన్ ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కకపోవడం విశేషం. (గణపతి లొంగిపోతాడన్న వార్తల్లో వాస్తవమెంత?) తల్లిదండ్రులు చనిపోయినా.. 64 ఏళ్లున్న సుదర్శన్ ఎన్నోసార్లు ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విప్లవోద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన ఆయన.. అతడి తండ్రి మల్లయ్య 2017లో, తల్లి వెంకటమ్మ 2018లో మృతిచెందినప్పటికీ ఇంటిముఖం చూడలేదు. పోలీసుల సూచనతో జనజీవన స్రవంతిలో కలవాలని తల్లిదండ్రులు కోరినప్పటికీ సుదర్శన్ మాత్రం ముందుకు రాలేదు. సహచరులు కొంతమంది లొంగిపోయినా.. ఎంతోమంది ఎన్కౌంటర్లో మృతిచెందినా.. ఆయన అజ్ఞాతం వదిలి రాలేదు. సుదర్శన్ లొంగిపోతున్నట్లు సాగుతున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. లొంగిపోతారనే ప్రచారంలో వాస్తవమెంత? నిజంగానే సుదర్శన్ పోరుబాట వదులుతాడా..? అందుకు గల కారణాలు ఏమై ఉంటాయి..? ప్రచారంలో వాస్తవం ఎంత..? అనే కోణాల్లో పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి ఆరోగ్యం క్షీణించి జనజీవన స్రవంతిలో కలవబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న క్రమంలోనే సుదర్శన్ కూడా లొంగిపోతున్నాడనే వార్తలు వస్తుండటంతో స్థానికంగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన డీజీపీ మహేందర్ రెడ్డి హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించడం.. పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశమైంది. -
లొంగిపోతాడన్న వార్తల్లో వాస్తవమెంత?
-
గణపతి ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు ఆచూకీపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, త్వరలో లొంగిపోతాడని వస్తున్న వార్తలపై ఏపీ– తెలంగాణతోపాటు జాతీయ మీడియాలోనూ వరుస కథనాలు వస్తున్నాయి. తెలంగాణ పోలీసుల సహకారం మేరకు గణపతి లొంగుబాటుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, లొంగుబాటులోని సాధ్యాసాధ్యాలపై అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. కేవలం తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంగీకరించినంత మాత్రాన ఈ వ్యవహారానికి తెరపడుతుందా అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. 13 రాష్ట్రాలు, 2 జాతీయ దర్యాప్తు సంస్థలు గణపతి నేతృత్వంలోనే దేశంలో మావోయిస్టు పార్టీ బాగా విస్తరించిందనే అభిప్రాయం ఉంది. దేశ విదేశాల నుంచి నిధులను సమీకరించడంలో, పార్టీ కేడర్‌కు ఆధునిక టెక్నాలజీ, నవీన ఆయుధాలు సమకూర్చడంలో, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీ విధానాలు మార్చుకోవడంలో ఆయన వ్యూహాలు చాలా ముందుచూపుతో ఉంటాయి. అనవసర హింసాచర్యలకు ఈయన వ్యతిరేకం. పీపుల్స్ వార్ గ్రూపు (పీడబ్ల్యూజీ), మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా(ఎంసీసీఐ) విలీనంలో గణపతి కీలక పాత్ర పోషించారు. 13 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీని నడిపించిన గణపతిపై వేలాది కేసులున్నాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కోసం జాతీయ దర్యాప్త సంస్థ(ఎన్.ఐ.ఏ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్(రా) వంటి జాతీయదర్యాప్తు సంస్థలు వెదుకుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం.. గణపతి లొంగిపోవడానికి అంగీకరించాడునుకున్నా.. ఒక్క తెలంగాణ పోలీసులు పాత కేసులు మాఫీ చేసినా.. మిగిలిన 12 రాష్ట్రాల పోలీసులు కేసుల ఎత్తివేతకు సుముఖంగా ఉంటారా? ఎన్,ఐ.ఏ, రా వంటి సంస్థల విచారించకుండా ఉంటాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులన్నీ ఎత్తేయాలంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంగీకారం తెలపాల్సి ఉంటుంది. అదేవిధంగా 43 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పతిప్పలు పెట్టి, దండకారణ్యంలో సమాంతర ప్రభుత్వాలు నడిపిన గణపతి తన లొంగుబాటుకు షరతులకు విధించకుండా ఉంటారా? వాటిని కేంద్రం ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తారా? అన్నది అనుమానమే. ఖండించని మావోయిస్టు పార్టీ.. ఈ మొత్తం వ్యవహారంలో ఇటు పోలీసులు, అటు మావోయిస్టులు మౌనం వహించడం అనేక సందేహాలకు, అనుమానాలకు తావిస్తోంది. ఓవైపు గణపతి ఇప్పటికే లొంగిపోవడానికి అంగీకరించాడని, మరికొన్ని రోజుల్లో లొంగుబాటు చూపుతారంటూ సాగుతున్న ప్రచారంపై పోలీసులు పెదవి విప్పడంలేదు. ఆయన లొంగిపోతే మాత్రం స్వాగతిస్తామని, ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని భరోసా ఇస్తున్నారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారం పోలీసులు వేసిన ఎత్తగడ అన్న ప్రచారమూ ఉంది. మావోయిస్టు కేడర్‌ను గందరగోళంలో నెట్టేయడానికి, అగ్రనేతల ఫోన్ సంభాషణలను విని, గణపతి ఉనికి కనుక్కునేందుకు బిగించిన ఉచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గణపతి లొంగిపోనున్నారనే ప్రచారాన్ని ఖండిస్తూ ఇంతవరకూ మావోయిస్టు పార్టీ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. లొంగిపోతాడని అనుకోవడం లేదు: జంపన్న సాక్షి, హైదరాబాద్: గణపతి లొంగుబాటుపై మాజీ మావోయిస్టు, కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న స్పందించారు. గణపతి వంటి అగ్రనేత లొంగిపోతాడని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ వస్తున్న వార్తల విశ్వసనీయతపై కూడా అనుమానాలు వ్యక్తంచేశారు. గత 40 ఏళ్లుగా గణపతి తన కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలూ కలిగి లేడని, ఈ నేపథ్యంలో ఆయన లొంగుబాటుకు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. -
చిక్కిన శ్రీమది
సాక్షి, చెన్నై : కేరళలో తప్పించుకున్న మావోయిస్టు శ్రీమది తమిళనాట చిక్కింది. అనైకట్ట అటవీ గ్రామంలో తలదాచుకుని ఉన్న ఆమెను కోయంబత్తూరు రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అలాగే తిరునల్వేలిలో మావోయిస్టులకు మద్దతుగా వ్యవహరిస్తూ వచ్చిన సానుభూతిపరుడు ప్రేమ్‌కుమార్‌ను కూడా అరెస్టు చేశారు. కేరళ–తమిళనాడు–కర్ణాటకల్లో విస్తరించి ఉన్న పశ్చిమ పర్వతశ్రేణుల్ని కేంద్రంగా చేసుకుని మళ్లీ మావోయిస్టులు తమ కార్యకలాపాల్ని మొదలెట్టారు. వీరిని అణచి వేయడం కోసం మూడు రాష్ట్రాల పోలీసులు జల్లెడ పట్టి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది కేరళ రాష్ట్ర అట్టపాడి అడవులలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మరి కొందరు గాయాలతో తప్పించుకున్నారు. అప్పటి నుంచి మూడు రాష్ట్రాల పోలీసులు మరింత అప్రమత్తంగా సరిహద్దుల్లో నిఘాతో వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో తరచూ నీలగిరి– వయనాడు మార్గంలో ఉన్న కొన్ని గెస్ట్ హౌస్‌ల మీద మావోయిస్టులు దాడి చేయడం వంటి ఘటనలు ఉత్కంఠను రేపుతూ వచ్చాయి. తప్పించుకున్న మావోయిస్టులు పశ్చిమ పర్వత శ్రేణుల్లోనే తలదాచుకుని ఉండ వచ్చని నిర్ధారణకు వచ్చిన క్యూబ్రాంచ్ వర్గాలు గాలింపు ముమ్మరం చేసి ఉన్నారు. ఆరు నెలలుగా అనైకట్టులో.. మంగళవారం అర్ధరాత్రి కోయంబత్తూరు రూరల్ పోలీసులకు ఓ రహస్య సమాచారం వచ్చింది. ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. అనైకట్టు అటవీ గ్రామంలోని ఓ ఇంట్లో ఆ బృందం చుట్టుముట్టింది. ఆ ఇంట్లో ఉన్న ఓ మహిళలను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ ఇంట్లో నుంచి ఓ తుపాకీ సైతం బయట పడడంతో, అక్కడున్న వాళ్లు ఆందోళనకు లోనయ్యారు. ఆతదుపరి పట్టుబడ్డ మహిళ శ్రీమదిగా తేలింది. కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూరుకు చెందిన శ్రీమది కేరళ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుంది. ఈ ఘటన తదుపరి అక్టోబర్‌లో ఆమె అనైకట్టుకు చేరుకుని, అక్కడి స్థానికులకు తానో పేద మహిళగా పరిచయం చేసుకుంది. అక్కడే ఓ ఇంట్లో ఉంటూ ఆరు నెలలుగా జీవనం సాగిస్తూ వస్తోంది. పోలీసులకు రహస్య సమాచారం రావడంతో శ్రీమదిని అరెస్టు చేశారు. ఆమెను రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. మిగిలిన మావోయిస్టుల సమాచారం శ్రీమదికి తెలిసి ఉండే అవకాశాలు ఎక్కువే కావడంతో వారి జాడ కోసం ఆరా తీస్తున్నారు. సానుభూతి పరుడు.. తిరునల్వేలి జిల్లా మున్నీరు పల్లంకు చెందిన ప్రేమ్‌కుమార్ కొంతకాలంగా మావోయిస్టులకు మద్దతుగా, కేంద్రానికి, ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ట్విట్లు పెడుతూ వస్తున్నారు. రోజురోజుకీ అతడి ట్విట్లు మరీ రెచ్చగొట్టే రీతిలో ఉండడంతో నిఘా వేశారు. స్థానిక పోలీసులు హెచ్చరించినా, అతడు ఖాతరు చేయలేదు. అదే సమయంలో తరచూ మావోయిస్టుల పేరిట ట్విట్లు పెట్టడం, వేదికలు ఎక్కి వీరావేశంతో వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా పెట్టుకున్నాడు. ఇతను మావోయిస్టుల సానుభూతి పరుడు అని తేలడంతో బుధవారం తిరునల్వేలి పోలీసులు అరెస్టు చేశారు. -
లొంగు‘బాట’లో దళ కమాండర్
ఛత్తీస్‌గఢ్: దండకారణ్యంలో మన్పూరు ప్రాంతానికి చెందిన మావోయిస్టు నేత గాండ్ సింగ్ కొవాసి.. తన భాగస్వామితో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ నెల 8 నుంచి నక్సలైట్ సంస్థకు దూరంగా ఉన్నారని.. వారి కోసం మావోయిస్టులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా గాండ్ సింగ్ జన జీవన స్రవంతిలోకి రావాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఛత్తీస్‌గఢ్ ఇంటలిజెన్స్ విభాగం విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం గాండ్ సింగ్ ఇప్పుడు ప్రధాన జీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నట్లు సమాచారం. -
మావోయిస్టుల లేఖలు... ఏజెన్సీలో అలజడి
సాక్షి, కొత్తగూడెం: గోదావరి పరీవాహక ప్రాంతం ఆవరించి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో మావోయిస్టులు తమ కార్యకలాపాలను తిరిగి ముమ్మరం చేయాలనే లక్ష్యంతో.. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దాటి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. కాగా, హరిభూషణ్ ఆధ్వర్యంలో మావోయిస్టుల యాక్షన్ టీమ్‌లు భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో రిక్రూట్మెంట్లకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు మావోయిస్టులు గత కొన్ని నెలలుగా వరుసగా లేఖలు విడుదల చేస్తుండడంతో ఏజెన్సీ ప్రాంతంలో అలజడి నెలకొంటోంది. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో చర్ల, సత్యనారాయణపురం సొసైటీల్లో కొన్ని వర్గాల వారిని ఓడించాలంటూ చర్ల–శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో ఓ లేఖ వెలువడింది. అయితే ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చాయి. దీనిపై అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లేఖలు అసలువేనా..? ఇటీవల చందాల కోసం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లోని పలువురు వ్యాపారులు, కాంట్రాక్టర్లకు మావోయిస్టు నాయకులు లేఖలు పంపినట్లు వార్తలు వచ్చాయి. 15 రోజుల క్రితం పినపాక నియోజకవర్గం మణుగూరు పట్టణంలోని పలువురు కాంట్రాక్టర్లు, వ్యాపారులకు సైతం చందాల కోసం అదే మండలం విజయనగరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లేఖలు పంపినట్లు సమాచారం. మావోయిస్టు నేత రాసిన లేఖ.. అయితే వసూళ్ల కోసం పంపిన ఆ లేఖలు అసలువా.. నకిలీవా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోల పేరిట నకిలీలు లేఖలు పంపిస్తున్నారా లేక మావోయిస్టు నాయకులే వ్యక్తిగతంగా వసూళ్లకు పాల్పడుతున్నారా అనే సందేహాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇటీవల ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్‌ను హెచ్చరిస్తూ మావోయిస్టులు ఓ లేఖను విడుదల చేశారు. దీనికి ప్రతిగా జగదీష్ సైతం మరో లేఖ విడుదల చేయడం గమనార్హం. ‘ఏటూరునాగారం ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం రండ’ని జగదీష్ పేర్కొనడం విశేషం. తరువాత వెంకటాపురం–వాజేడు ఏరియా కార్యదర్శి సుధాకర్ పేరుతో పలువురు నాయకులను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖలు రాశారు. ఆ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్, వెంకటాపూర్ కమిటీ సుధాకర్, ఏటూరునాగారం కమిటీ సబిత పేరుతో వరుసగా లేఖలు వచ్చాయి. ఇక ఇటీవల జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి పేరిట విడుదలైన లేఖపై సైతం పలువురు వివిధ రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరుస లేఖలతో గోదావరి పరీవాహక ప్రాంతంలో కలకలం నెలకొంది. -
మావోయిస్టు నంబర్–2గా రంజిత్ బోస్
న్యూఢిల్లీ: సీపీఐ(మావోయిస్టు) పార్టీ అగ్రనాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. పార్టీ రెండో స్థానంలోకి బెంగాల్‌లోని హౌరా ప్రాంతానికి చెందిన రంజిత్ బోస్(63) అలియాస్ కబీర్‌ను ఎంపిక చేసుకుంది. గెరిల్లా యుద్ధతంత్రంతోపాటు భద్రతా బలగాలకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలను ఏకం చేయడంలో ఈయన దిట్ట. రంజిత్ తలపై బెంగాల్, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించిన రివార్డు మొత్తం రూ.కోటి వరకు ఉంది. బిహార్, జార్ఖండ్‌లతోపాటు తూర్పు భారతంలో పార్టీ పట్టు పెంచడం, సంచలన ఘటనలకు కార్యరూపం ఇచ్చేందుకే పార్టీ ఈ మార్పు చేపట్టిందని భావిస్తున్నారు. పార్టీలో రెండో స్థానంలో ఉన్న బెంగాల్‌లోని మిడ్నపూర్‌కు చెందిన ప్రశాంత్ బోస్(74)స్థానంలో రంజిత్ నియమితులయ్యారు. అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ సహా కీలక నేతలంతా ఇటీవల పశ్చిమబెంగాల్ అడవుల్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగం పొలిట్‌బ్యూరోలో ప్రస్తుతం నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, రంజిత్ బోస్, మాజీ అధిపతి గణపతి, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మిసిర్ బిస్రా అలియాస్ సాగర్ ఉన్నారు. బెంగాల్లో 2007లో నందిగ్రామ్‌లో నానో కార్ల ఫ్యాక్టరీని స్థాపించడంతో నాడు జరిగిన వ్యతిరేకోద్యమాన్ని రంజిత్ వెనక ఉండి నడిపించారు. దీంతోపాటు 44 గ్రామాలతో కూడిన లాల్‌గఢ్‌ను విముక్త ప్రాంతంగా ప్రకటించిన వ్యక్తిగా రంజిత్ బోస్‌కు పేరుంది. (చదవండి: షహీన్‌బాగ్ షూటర్ ఆప్ సభ్యుడే) -
‘పోలీసు ఏజెంట్లకు ప్రజలే శిక్ష వేస్తారు’
సాక్షి, విశాఖపట్నం: ఒరిస్సా రాష్ట్ర మల్కన్‌గిరి జిల్లా జంతురాయి ఘటనపై మావోయిస్టులు స్పందించారు. ఏవోబీ ఎస్‌జడ్‌సీ ఆధికార ప్రతినిధి గణేష్ పేరుతో బుధవారం ఆడియో టేపులు విడుదల అయ్యాయి. జంతురాయి ఘటనపై పోలీసులు అసత్య ప్రచారం చేశారు. పోలీసు ఏజెంట్లు అదమ, జిప్రోను పట్టకొని కొట్టారు. నిరాయుధులు అయిన దళ సభ్యుల్ని చిత్ర హింసలకు గురిచేశారని గణేష్ ఆరోపించారు. అదమను హత్య చేసి.. జిప్రోను పోలీసులకు అప్పగించారన్నారు. పార్టీ ప్రజల పక్షానే ఉంది.. కటాఫ్‌లో పార్టీ సహకారంతో ప్రజలే 50 కిలోమీటర్ల రోడ్డును వేసుకున్నారని అయన తెలిపారు. దీన్ని ఓర్వలేక ప్రజలను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని గణేష్ మండిపడ్డారు. చుట్టు పక్కల గ్రామస్తులు వ్యతిరేకించినా చిత్రహింసలకు గురిచేశారు. ప్రతిగా పోలీసు ఏజెంట్ల ఇళ్లను ప్రజలే తగలబెట్టారు. చేసిన తప్పును జొడంబో గ్రామస్తులు ఒప్పుకున్నారని.. వారిని ప్రజా జీవితంలో జీవించేందుకు పార్టీ ఒప్పుకుందని ఆయన తెలిపారు. పోలీసు ఏజెంట్లకు ప్రజలే శిక్షవేస్తారు. ప్రజలపై పోలీస్ దాడులు ఆపకపోతే ప్రతిఘటన తప్పదు అని ఆ ఆడియో టేపుల్లో గణేష్ హెచ్చరించారు. -
ఆపరేషన్ ఆర్కే పేరుతో గాలింపు చర్యలు
సాక్షి, మల్కన్‌గిరి: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పరిసరాల్లో ఉన్నట్లు సమాచారం అందడంతో ఒడిశా పోలీస్ యంత్రాంగం కూంబింగ్ ముమ్మరం చేసింది. ఆర్కేతోపాటు మరో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు ఉదయ్, చలపతి కూడా ఇదే ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆపరేషన్ ఆర్కే పేరుతో గాలింపు మొదలుపెట్టారు. ఎస్‌వోజీ, డీబీఎఫ్‌లతో పాటు ఆంధ్ర గ్రేహౌండ్స్, తూర్పు గోదావరి జిల్లా పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఉనికి కోసం మావోయిస్టుల యత్నాలు గతంలో చిత్రకొండ కటాఫ్ ఏరియా మావోయిస్టులకు అడ్డాగా ఉండేది. కానీ ఇప్పుడు కటాఫ్ ఏరియాలో రహదారుల నిర్మాణం జరగడం, అలాగే ఎక్కడికక్కడ బీఎస్ఎఫ్ క్యాంపులు ఏర్పాటై జవాన్లు నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తుండటంతో మావోయిస్టుల అలజడి తగ్గుముఖం పట్టింది. ఈ ప్రాంతంపై తిరిగి పట్టు సాధించేందుకు మావోయిస్టులు ఇక్కడ జరుగుతున్న రోడ్ల నిర్మాణాలను అడ్డుకోవడం, కాంట్రాక్టర్ల వాహనాలు కాల్చివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఈ ఏరియాలోనే ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈ నెల 15వ తేదీన చిత్రకొండ కటాఫ్ ఏరియాలో కూంబింగ్ చేపట్టగా ఎదురు కాల్పులు జరిగాయి. ఆ సమయంలో అగ్రనేతలు తప్పించుకున్నారు. అనంతరం మావోయిస్టు శిబిరం నుంచి పోలీసులు మావోల సామగ్రితో పాటు ఒక పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పెన్‌డ్రైవ్‌లో ఉన్న వివరాలను మాత్రం బయటకు పొక్కనివ్వలేదు. -
మావోయిస్టు అగ్రనేత రామన్న మృతి
మల్కన్‌గిరి: జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టు అగ్రనేత రామన్న గుండెపోటుతో సోమవారం సాయంత్రం మృతిచెందారు. 2003 నుంచి 2007 వరకు మల్కన్‌గిరి జిల్లాలోని కలిమెల, చిత్రకొండ, కటాఫ్ ఏరియాలో అగ్రనేతగా పనిచేసిన రామన్న పలు హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయా ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఇప్పటివరకు అతడి ఆచూకీ పోలీసులకు లభ్యం కాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో అతడిని అప్పగించిన వారికి రూ.1.40 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన కూడా జారీ చేసింది. అయినా అతడు పోలీసుల కంట పడకుండా తన కార్యకలాపాలను కొనసాగించడం గమనార్హం. ఇదిలా ఉండగా, సుకుమా జిల్లాలోనే రామన్న అంత్యక్రియలను మావోయిస్టు దళ సభ్యులు మంగళవారం నిర్వహించారు. అతడి మృతదేహంపై విప్లవ సూచికలైన ఎర్రటి వస్త్రాలను కప్పి, విప్లవగీతాలు ఆలపిస్తూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామన్న సేవలను పలువురు దళం సభ్యులు కొనియాడారు. సుమారు 60 ఏళ్ల వయసు కలిగిన రామన్న దళంలో చాలా చురుకుగా ఉండేవారని, అతడి సహచరులు చెబుతున్నారు. దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు చనిపోవడం చాలా బాధాకరంగా ఉందని, అతడి మృతి మావోయిస్టుల ఉద్యమానికి తీరని లోటు అని మావోయిస్టు దళ సభ్యులు పేర్కొన్నారు. -
ప్రభుత్వమే బాధ్యత వహించాలి
సాక్షి, కొత్తగూడెం: ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మె విరమించవద్దని పిలుపునిచ్చారు. కార్మికుల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఖాళీగా ఉన్న డ్రైవర్, కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణం విడుదల చేయాలని, మోటారు వాహన పన్ను మినహాయించాలని కోరారు. సంస్థకు పూర్తి స్థాయి మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమించాలని, సంస్థను అభివృద్ధి పథంలో నడపాలని కార్మికులు కోరుకుంటుంటే.. ప్రభుత్వం వారిని బెదిరింపులకు గురి చేయడం తగదని హితవు పలికారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని విమర్శిం చారు. కొత్త వాహనాల కొనుగోలు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, ఖాళీ పోస్టుల భర్తీ వంటివి చేపట్టకుండా కార్మికులనే బదనాం చేస్తూ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవాలని ప్రయత్నిస్తోందని జగన్ పేర్కొన్నారు. -
‘ఆర్టీసీ కార్మికులు మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్లే నష్టాల్లో ఉందని లేఖలో పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం కోసమే ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని ఆయన విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మె విరమించొద్దని జగన్ సూచించారు. డిమాండ్ల సాధనకు కార్మికులు మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని, ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. కార్మికులపై సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు సరైనదికాదని ఆయన మండిపడ్డారు. -
అగ్రనేత అరుణ ఎక్కడ?
సాక్షి, సీలేరు (పాడేరు): ఏవోబీలోని మహిళా మావోయిస్టుల విభాగంలో అరుణ పేరు తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు అరుణ ఎవరు, ఉద్యమంలో ఆమె బాధ్యత ఏమిటీ, అరుణ కోసం ఏడాదిగా పోలీసు బలగాలు ఎందుకు గాలింపు చేపడుతున్నాయి అన్న ప్రశ్నలు ఏవోబీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు ఎన్కౌంటర్లో ఆమె ఉందని ప్రచారం కూడా సాగింది. అయితే ఎదురుకాల్పుల్లో ఆమె లేకపోవడంతో పోలీసు బలగాలు అరుణకోసం జల్లెడపడుతున్నాయి. పెందుర్తి మండలం సుజాతనగర్‌కు చెందిన అరుణ, ఆమె కుటుంబం కూడా మావోయిస్టుల ఉద్యమం నుంచి ఉన్నారు. అరుణ చిన్న వయసులోనే ఉద్యమానికి ఆకర్షితురాలైంది. ఏడాది క్రితం గూడెం మండలం మర్రిపాకల ఎన్కౌంటర్లో మృతి చెందిన అగ్రనేత ఆజాద్ సొంత చెల్లెలు ఈమె. అరుణ ఫొటో రాంగుడ ఎన్కౌంటర్లో లభ్యమైన ల్యాబ్‌ట్యాప్‌లో కనిపించింది. ఆమె పేరు తప్ప ఆమె ఎలా ఉంటుందనేది అప్పుడే వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ ఏవోబీ మిలటరి కమిషన్ చీఫ్ అయిన చలపతి భార్య అరుణ. ప్రస్తుతం అరుణ పార్టీలో కీలక పదవిలో ఉంది. చలపతి భార్య కావడం, తూర్పు మల్కన్‌గిరి డివిజన్ కమిటీ కార్యదర్శిగా ప్రస్తుతం ఏకే47 తుపాకీ వాడుతున్నట్లు మాజీ మావోయిస్టుల ద్వారా తెలిసింది. అలాగే ఆమెకు ఆరుగురు అంగరక్షకులు కూడా ఉన్నట్లు సమాచారం. కిడారి, సోమ హత్యల ఘటన నుంచి.. రాంగుడ ఎదురుకాల్పుల నుంచి అరుణ బయట ప్రపంచానికి తెలిసింది. అక్కడి నుంచి అందరి మావోయిస్టుల్లాగే పోలీసులు చూసే వారు. కానీ ఏడాది కిందట అప్పటి అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, అదే ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యలో ఆమె కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. అప్పటి నుంచి ఏవోబీ, విశాఖ, తూర్పుగోదావరి పోలీసులు ఆమెను ఎలాగైనా పట్టుకోవాలన్న లక్ష్యంతో గాలిస్తున్నారు. ఆమె ఆచూకీ కోసం ఏడాదిగా.. మాజీ ఎమ్మెల్యేల హత్య సంఘటనల నుంచి అరుణ కోసం బలగాలు అడవిలో తిరగని రోజు లేదు. ఎప్పుడు దొరుకుతుందా అని తుపాకీలు ఎక్కుపెట్టి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో జీకేవీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మహిళా మావోయిస్టుల్లో తొలుత ఆమె ఉందని ప్రచారం జరిగింది. ఆమె లేకపోవడాన్ని గుర్తించిన పోలీసు బలగాలు జల్లెడపడుతున్నాయి. గాలికొండ ఏరియా కార్యదర్శి హరి గూడెం మండలం గునుకురాయి ప్రాంతానికి చెందిన వాడు. అయితే ఇటీవల అరుణ ఆడియో టేపు రిలీజ్ చేసినపుడు అగ్రనేత నవీన్‌తో పాటు హరి కూడా లొంగిపోయాడని, తిరిగి ఉద్యమంలోకి ఎలా వచ్చాడని చెప్పింది. కానీ మొన్న జరిగిన ఎదురుకాల్పుల్లో హరి కూడా ఉన్నట్లు ప్రచారం సాగింది. ప్రస్తుతం హరి పార్టీలో ఉన్నాడా?.. బయట ఉన్నాడా? అనేది ప్రశ్నగానే మిగిలింది. పత్రికలకు అబద్ధం చెప్పను ప్రస్తుతం జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకుని పోలీసుల అదుపులో ఉందని, అమరుల బంధు మిత్రుల సంఘం ఆరోపించింది. దీనిపై చింతపల్లి ఏఎస్పీ సతీష్ కుమార్‌ను వివరణ కోరగా ప్రతికలకు అవాస్తవాలు చెప్పడం లేదని, అరుణ మా దగ్గర లేదని, ఎదురుకాల్పుల్లో 15 మంది ఉన్నారని, వీరిలో ఐదుగురు చనిపోయారని మిగిలిన వారు తప్పించుకున్నారన్నారు. అందులో అరుణ ఉందో లేదో బలగాలు కూడా చూడలేదని వివరణ ఇచ్చారు. తమకు ఎవరైనా దొరికితే అప్పుడు అరుణ ఉందో లేదో తెలుస్తుందన్నారు. ఆరోపణల్లో వాస్తవం లేదని ఏఎస్పీ చెప్పారు. – సతీష్‌కుమార్, చింతపల్లి ఏఎస్పీ -
మావోయిస్టు దంపతుల లొంగుబాటు
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్‌దత్ సమక్షంలో మావోయిస్టు పార్టీకి చెందిన దంపతులు మంగళవారం లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. మావోయిస్టు పార్టీ ఇంద్రవెల్లి–ఖానాపూర్–మంగి (పాత ఆదిలాబాద్ జిల్లా) ఏరియా కమిటీ సెక్రటరీ సోడె నర్సింహారావు అలియాస్ మనోజ్, ఆయన భార్య, ఖానాపూర్ – మంగీ ఏరియా కమిటీ మెంబర్ పొడియం సన్నీ అలియాస్ రనిత లొంగిపోయారని తెలిపారు. చర్ల సీఐ సత్యనారాయణ, ఎస్సై ఆలెం రాజు వర్మల నేతృత్వంలో లొంగిపోయినట్లు చెప్పారు. నర్సింహారావు 2007లో వెంకటాపురం ఏరియా కమిటీ సభ్యుడిగా, 2009లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌కు గార్డుగా పనిచేశాడని తెలిపారు. 2017లో ఖానాపూర్–మంగి ఏరియా కమిటీ సెక్రటరీగా నియమితుడయ్యాడని చెప్పారు. 2013లో పువ్వర్తిలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పులు, ఛత్తీస్‌గఢ్‌లోని వింపా సీఆర్పీఎఫ్ క్యాంపుపై జరిగిన దాడి, ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్ జిల్లాలోని లంకపల్లిలో జరిగిన ఎదురుకాల్పులు, 2015లో వరంగల్ జిల్లా రంగాపూర్‌లో, 2016లో ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా బోటేటోంగ్‌లో, 2018 మార్వాడ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పాల్గొన్నాడని వివరించారు. చర్ల మండలం కొరకటపాడు గ్రామానికి చెందిన పొడియం సన్నీ 2013లో లచ్చన్న ఆధ్వర్యంలోని ఎల్‌జీఎస్‌లో చేరారని ఎస్పీ తెలిపారు. 2014లో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ దళంలోకి బదిలీ చేశారని, 2017 డిసెంబర్లో ఖానాపూర్ – మంగీ ఏరియా కమిటీ మెంబర్‌గా ప్రమోట్ చేశారని చెప్పారు. 2016లో ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా బోటేటోంగ్ వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో, అదే సంవత్సరం పామిడి పోలీస్ పార్టీపై జరిగిన దాడిలో, 2018లో మహారాష్ట్ర మార్వాడలో జరిగిన ఎదురు కాల్పుల్లో పాల్గొందని తెలిపారు. మావోయిస్టు పార్టీ అనుసరిస్తున్న సిద్ధాంతాలు నచ్చక, మంచి జీవితాన్ని గడపాలని జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు లొంగిపోయారని ఎస్పీ వివరించారు. వీరి ఇరువురిపై రూ.4 లక్షల చొప్పున రివార్డు ఉందని, అంతేకాకుండా ప్రభుత్వ పరంగా అందే సహాయ సహకారాలన్నింటినీ వారి పునరావాసం కోసం అందజేస్తామని చెప్పారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, భద్రాచలం ఏసీపీ రాజేష్‌చంద్ర, చర్ల సీఐ సత్యనారాయణ, ఎస్ఐ రాజువర్మ ఉన్నారు. -
ఎన్డీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపన్న అరెస్ట్
సాక్షి, ఖమ్మం (కొత్తగూడెం) : వ్యాపారులు, స్థానికంగా పని చేస్తున్న కాంట్రాక్టర్లను చందాల నిమిత్తం తుపాకులతో బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దనసరి సమ్మయ్య అలియాస్ గోపన్నను అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ వెల్లడించారు. మంగళవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం పోలీసులపై కాల్పులు జరిపి పారి పోయిన అజ్ఞాత సాయుధ దళ సభ్యుల కొరకు వెతుకుతుండగా కొత్తగూడ మండలం మహబూబాబాద్ జిల్లాకు చెందిన గోపన్న గుండాలలోని రాయగూడెం అటవీ ప్రాంతంలో, కేసు పరిశోధన అధికారి, మహబూబాబాద్ డీఎస్పీ, గుండాల సీఐ సిబ్బందితో కలిసి గోపన్నను అరెస్టు చేసి, ఆయన వద్ద ఉన్న 303 బోల్ట్ యాక్షన్ తుపాకీ, తూటాలు స్వాధీన పరుచుకున్నట్లు వివరించారు. గోపన్నపై మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో 13 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. గోపి అమాయక గిరిజనులను, ప్రజలను రెచ్చగొడుతూ పోడుభూముల పేరుతో అడవులను నరికిస్తున్నాడు. న్యూడెమోక్రసీ పార్టీకి ఓపెన్ క్యాడర్ ఉన్నప్పటికీ వారి మాట వినని ప్రజలను, నాయకులను, ప్రభుత్వ అధికారులను అజ్ఞాత సాయుధ దళాలచే బెదిరిస్తూ వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని వివరించారు. అజ్ఞాత సాయుధ దళాల కార్యకలపాలు పెచ్చుమీరిపోయి సాధారణ ప్రజానీకానికి అభివృద్ధి కార్యకలాపాలకు అడ్డంకిగా మారారు. వీరిని అదుపు చేసే క్రమంలో గతంలో చాలాసార్లు అజ్ఞాత సాయుధ దళాలు పోలీసుల మీద కాల్పులకు దిగగా వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అయినప్పటికీ వారి పద్ధతి మార్చుకోకుండా అజ్ఞాత సాయుధ దళాల నాయకుడు లింగన్న ఆధ్వర్యంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. చందాల కోసం ఇటీవల తునికాకు కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడిన న్యూడెమోక్రసీ పార్టీ ఇల్లెందు టౌన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావును పట్టుకొని ఇల్లెందు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి రూ.6 లక్షలు స్వాధీన పరుచుకున్నట్లు వివరించారు. గతంలో వారిపై అనేక కేసు లు నమోదు అయినప్పటికీ వారి పద్ధతి మా ర్చుకోకుండా అజ్ఞాత సాయుధ దళం కొద్ది రోజుల క్రితం గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాం తంలో మకాం వేసి చందాల కొరకు కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులను, పోడు భూముల పేరుతో అమాయక ప్రజలను రెచ్చగొడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు జూలై 31న గాలింపు చర్యలు చేపట్టి అజ్ఞాత సాయుధ దళాన్ని అదుపులోకి తీసుకొనే క్రమంలో లింగన్న సాయుధ దళం పోలీసులపై కాల్పులు జరుపగా, ఇరువైపులా జరిగిన కాల్పుల్లో దళ నాయకుడైన లింగన్న మరణించాడని, ఇతర దళ సభ్యులు తుపాకులతో తప్పించుకున్నారని వివరించారు. పారిపోయిన అజ్ఞాత సాయుధ దళ సభ్యుల కొరకు వెతుకుతుండగా గోపన్న దొరకడంతో అరెస్టు చేశామని, అతడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, మహబూబాబాద్ డీఎస్పీ నరేష్కుమార్, సీఐ శ్రీనివాస్, ఎస్సై సురేష్, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో మావోయిస్టు గోపి..?
సాక్షి, ఖమ్మం(ఇల్లెందు) : న్యూడెమోక్రసీ వరంగల్ జిల్లా నాయకుడు ధనసరి సమ్మయ్య అలియాస్ గోపిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 31న గుండాల మండలం రోళ్లగడ్డ సమీపంలోని పందిగుట్ట మీద జరిగిన ఎన్కౌంటర్లో లింగన్న మృతి చెందగా గోపి తప్పించుకున్నాడు. ఐదు రోజుల పాటు వివిధ ప్రదేశాల్లో తలదాచుకున్న గోపిని వరంగల్ సమీపంలోని ఆరెపల్లి వద్ద ఆదివారం అరెస్ట్ చేసినట్లు న్యూడెమోక్రసీ వర్గాలు తెలిపాయి. గోపి పోలీసులకు చిక్కడం ఇదో రెండోసారి. మహబూబాబాద్ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న ధనసరి సమ్మయ్య(గోపి) 2018 నవంబర్ 30న మహబూబాబాద్‌లో ఓ ఇంట్లో ఉండగా పోలీసులు వలపన్నారు. తప్పించుకుని ఆటోలో వెళ్తుండగా అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. విడుదలయ్యాక కొంతకాలం సాధారణ జీవితం గడిపి నాలుగు నెలల క్రితమే మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. గోపిని వెంటనే మీడియా ముందు హాజరుపర్చాలని ఎన్డీ జిల్లా నాయకులు చండ్ర అరుణ, జడ సీతారామయ్య, తుపాకుల నాగేశ్వరరావు తదితరులు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎన్.నారాయణరావు విడుదల చేసిన ప్రకటనలో గోపిని వెంటనే కోర్టులో హాజరుపర్చాలని కోరారు. -
‘మహా’ పోలీసుల అదుపులో మావో అగ్రనేతలు
సాక్షి, హైదరాబాద్ : ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీలో పనిచేస్తున్న కిరణ్ కుమార్ (63), అతని భార్య నర్మద (60)ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీరిద్దరూ ఏప్రిల్ 9న ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవిపై జరిగిన బాంబు దాడి అమలు వ్యూహంలో నిందితులుగా ఉన్నారు. అలాగే గడ్చిరోలిలో 16 మంది మృతికి వీరు కారణమయ్యారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు వీరి కోసం గాలిస్తూ ఎట్టకేలకు పట్టుకున్నారు. కిరణ్ అలియాస్ కిరణ్ దాదా మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్నారు. అతనిపై రూ. 20 లక్షలకు పైగా రివార్డు ఉంది. కిరణ్‌తో పాటు అతని భార్య విజయవాడకు చెందిన మహిళగా గుర్తించారు. 2019 మే 1వ తేదీన గడ్చిరోలిలో పోలీసులపై మావోయిస్టులు దాడి చేయగా 16 మంది పోలీసులు దుర్మరణం చెందారు. ఈ దాడికి మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ కిరణ్ వ్యూహం అమలు పరిచినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. -
ఆ ముగ్గురే టార్గెట్
విశాఖపట్నం, సీలేరు: మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు అగ్ర నేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. ఈ విషయం విశాఖ ఏజెన్సీ ఆంధ్రా, ఒడిశా, చత్తీస్‌గఢ్ మా వోయిస్టు పార్టీలో ఇపుడు పెద్ద చర్చాంశనీయమైంది. మావోయిస్టు పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తూ ఎక్కడికక్కడ వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్ను తూ ఏవోబీలో మావోయిస్టు పార్టీని ముందుకు నడిపిస్తున్న ఆ పార్టీ అగ్రనేతలుగా పేరుగాంచిన చలపతి, అరుణ, నవీన్ పోలీసుశాఖకు ప్రస్తుతం కీలకమయ్యారు. వారిని ఎలాగైనా పట్టుకోవాలనే లక్ష్యంతో మూడు రాష్ట్రాల పోలీసుశాఖ ఉన్నతాధికారులు, వందలాది మంది బలగాలు ఏవోబీ కటాఫ్ ఏరియాలో జల్లెడ పడుతున్నారు. కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. వారి జాడ కోసం అణువణువూ గాలింపు చర్యలు చేపడుతున్నారు. మావోయిస్టు అగ్రనేత కుడుముల రవి ఏడాదిన్నర కిందట మృతి చెందిన నాటి నుంచి నిన్నటి వరకు అగ్రనేతలను ఎన్కౌంటర్ చేసి హతమార్చాయి. రాంగుడ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ ఉద్యమం కాస్త సన్నగిల్లిందని పోలీసులు భావించారు. అయితే అక్కడికి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపారు. ఆ సంఘటన తీరని మచ్చగా పోలీసుశాఖ మీద పడింది. ఆ సంఘటనలో పైముగ్గురు కీలకపాత్ర పోషించారని, పక్కా వ్యూహం పన్ని ఇద్దరు ప్రజా ప్రతినిధులను హతమార్చారని ఇంటెలిజెన్స్ ద్వారా పోలీసుశాఖకు సమాచారం ఉంది. అప్పటి నుంచి ఆ ముగ్గురిపైనే బలగాలు దృష్టిసారించాయి. ఎలాగైనా వారిని పట్టుకోవాలని రేయింబవళ్లు అడవుల్లో జల్లెడ పడుతున్నారు. ఇదిలా ఉండగా గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి ఘటనలు జరగకుండా నిరంతరం కూంబింగ్ నిర్వహించారు. అప్పటి నుంచి కటాఫ్ ఏరియాలో కూంబింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఆంధ్రా నుంచి గ్రేహౌండ్స్, స్పెçషల్ పార్టీ, సీఆర్పీఎఫ్, ఒడిశా నుంచి ప్రత్యేక బలగాలతో ముగ్గురు అగ్రనేతల కోసం గాలించని ప్రదేశం, తిరగని అడవి లేదు. అయితే ఈ మధ్య కాలంలో ఆ ముగ్గురు మావోయిస్టులు ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో దగ్గరి గ్రామాల్లో సంచరిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే మొన్నటిìకి మొన్న కొయ్యూరు సరిహద్దు ఒడిశా ప్రాంతమైన పాడువాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో కిడారిని చంపిన మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారని ఒడి శా పోలీసుశాఖ ప్రకటించింది. పోలీసుశాఖకు తలనొప్పిగా మారిన చలపతి, అరుణ, నవీన్‌లను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసుశాఖ కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే ఏవోబీలో కొద్ది రోజులుగా ప్రత్యేక పోలీసు బలగాలు పక్కా వ్యూహంతో కూంబింగ్ చేపడుతున్నాయి. -
మంగ్లీ అరెస్ట్
సాక్షి, వరంగల్ : కరుడు గట్టిన మహిళా మావోయిస్టు కోసి అలియాస్ మంగ్లీని అరెస్ట్ చేశామని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ వెల్లడించారు. మల్కన్‌గిరి మావోయిస్టు సభ్యురాలైన మంగ్లీపై రూ. 5లక్షల రివార్డు ఉంది. 2011 నుంచి మవోయిస్టుల్లో పనిచేస్తున్న మంగ్లీ.. భద్రతా దళాలు, గ్రామస్థులపై దాడి చేసిన కేసుల్లో నిందితురాలిగా ఉందని ఎస్పీ పేర్కొన్నారు. 2011 నుంచి మంగ్లీపై 10 కేసులు ఉన్నాయని చెప్పారు. 2016లో సీఆర్ పీఎఫ్ బలగాలను చంపిన కేసు, చోలనర్ లో మందుపాతర పేల్చి ఐదుగురు పోలీసులను చంపిన కేసులో మంగ్లీ నిందితురాలని ఎస్పీ పేర్కొన్నారు. దంతెవాడ స్థానిక పోలీసులు, జిల్లా రిజర్వు గార్డులు కలిసి గాలింపు జరిపి మహిళా మావోయిస్టు మంగ్లీని అరెస్టు చేశారని ఎస్పీ వివరించారు. -
చంద్రమౌళి విడుదలకు రంగం సిద్ధం
భీమదేవరపల్లి: మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉగ్గె చంద్రమౌళి అలియాస్ మదన్‌లాల్ శిక్షను రద్దు చేస్తూ బాల్గఢ్ కోర్టు రెండ్రోజుల క్రితం తీర్పు ఇచ్చింది. దీంతో చంద్రమౌళి విడుదలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన 14 ఏళ్లుగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర జైళ్లలో శిక్ష అనుభవి స్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్కి చెందిన ఉగ్గె కనకయ్య–సూరమ్మ దంపతుల పెద్ద కుమారుడు చంద్రమౌళి ఏడో తరగతి వరకు స్వగ్రామంలో చదివి పైచదువులకు హుజురాబాద్‌కు వెళ్లాడు. పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే పీపుల్స్‌వార్ గ్రూప్ నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితుడై సానుభూతిపరుడిగా పనిచేశారు. విప్లవోద్యమానికి ఆకర్షితుడై 1981లో అడవిబాట పట్టాడు. దళ సభ్యుడిగా పనిచేస్తూ అనతికాలంలోనే హుస్నాబాద్, హుజురాబాద్ సీవోగా పనిచేశారు. రాష్ట్ర,కేంద్ర కమిటీల సభ్యుడిగా నియమితులయ్యారు. 2005 ఆగస్టు 6న మహారాష్ట్రలోని నాగపూర్‌లో అరెస్టు అయ్యాడు. చంద్రమౌళిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలలో సుమారు 40 కేసులు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని అప్పటి రవాణశాఖ మంత్రి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితునిగా చంద్రమౌళిని పేర్కొంటూ 2015 ఆగస్టు 14న జీవిత ఖైదు విధిస్తూ బాలగఢ్ కోర్టు తీర్పు ఇచ్చింది. -
సాయుధ పోరులో అగ్గిబరాటై
సాక్షి, భీమదేవరపల్లి(హుస్నాబాద్): బూర్జువా పాలకులపై తుపాకీ ఎక్కుపెట్టి రాజీలేని పోరుసల్పిన ధీరత్వం...గోండు బిడ్డల ధీనత్వాన్ని ఆర్తిగా కవితల్లో ఆవిష్కరించే భావోద్వేగం... అయన జీవితమనే నాణానికి బొమ్మాబొరుసులు. తూటాలకు ఎదురొడ్డి సాయుధ పోరులో అగ్గిబరాటై కదం తొక్కి, అన్నార్తుల అక్రందనలకు అక్షర రూపమిచ్చిన ఆ శైలి స్ఫూర్తిమంతం. ఏక కాలంలో రచయిత, ఉద్యమకారుడిగా విశేష గుర్తింపు పొందిన సవ్యసాచి మాణిక్యాపూర్ ముద్దు బిడ్డ సాహు శనిగరం వెంకటేశ్వర్లు వర్ధంతి నేడు(శనివారం). వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌లో 1955 అక్టోబర్ 2న శనిగరం స్వామి–అయోధ్యలకు వెంకటేశ్వర్లు( సాహూ) జన్మించాడు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలో అభ్యసించిన ఆయన ఉన్నత విద్య కోసం హుజురాబాద్‌కు, డిగ్రీ కోసం జమ్మికుంటకు వెళ్లాడు. హుజురాబాద్‌లో చదువుకున్న రోజుల్లో 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. గో టు విలేజ్ క్యాంపస్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లోనే గ్రామాల్లో భూస్వాములు చేస్తున్న ఆగడాలు, పేదలు పడుతున్న కష్టాలు అతనిని విప్లవోద్యమం వైపు అడుగులేసేలా చేశాయి. ఆ క్రమంలోనే ‘గో టు విలేజ్ క్యాంపస్’ పేరిటా మాణిక్యాపూర్‌లో 20 రోజులపాటు దాదాపుగా వందలాది మందికి ఉద్యమ శిక్షణ తరగతులను నిర్వహించాడు సాహూ. మావోయిస్ట్ కీలక నేత గణపతితో పాటు నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్ లాంటి మావోయిస్ట్ అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.. - సాహూ, అతని భార్య శోభ అతని కలం పేరును సాహూగా పెట్టుకున్నాడు. ఉద్యమంలో క్రియశీలక పాత్ర పోషిస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ స్థాయి వరకు వెళ్లి అదిలాబాద్ అడువుల్లో అరెస్ట్ అయ్యాడు. అనేక ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన సాహూ జైలు నుంచి విడుదలయ్యాడు. అకస్మాత్తుగా మార్చి 16, 1993న గుండె పోటుతో మృతి చెందాడు సాహూ రచనలు... కన్నీటి కథ–నీటి కథ, పెండ్లి కావాలి, ఖాయిదా, ఐదు రూపాయాల కథ, భూమి కోసం, జెండా కథ, ఆకలి నిర్ణయం, కిసింగార్ వెంతా, అమరుల రక్తం వృథా కాదు, రక్తపింజెర, మరట్ తుడుం పాయానా, మనుషుల్ని తినే వాళ్లం కోసం, ఒక తల్లి, పిల్ల రక్కసులు, రగల్ జెండా, విహంగ వీక్షణం, జాగీరిగాల్లు తదితర కథలు, కవితలు రాశాడు. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి... మరుగున పడిన కొమురం భీం జీవిత చరిత్రను బాహ్య ప్రపంచానికి అందిచడంతోపాటుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి అమరుడైన ఆయన ఆశయాలను ప్రభుత్వం నెరవేర్చాల్సిన అవసరంఉంది. ఆయన విగ్రహాన్ని కరీంనగర్లోగాని, వరంగల్‌లో గాని ప్రతిష్ఠించాలని ఆయన స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. -
‘అప్పుడేమో విరక్తితో.. ఇప్పుడు వేధింపులతో..’
సాక్షి, హైదరాబాద్ : నిర్మల్ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత సట్వాజి అలియాస్ సుధాకర్, అతని భార్య వైదుగుల అరుణ అలియాస్ నీలిమ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... 1983 నుంచి 1985 వరకు సుధాకర్ ఆదిలాబాద్‌లో కొరియర్‌గా పనిచేసినట్లు తెలిపారు. అనంతరం డీసీఎస్ కనకం సుదర్శన్ సహకారంతో మావోయిస్టుల్లో చేరినట్లు పేర్కొన్నారు. ‘బెంగళూరు కేంద్రంగా సుధాకర్ ఆయుధాలు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో ఒకసారి జైలుకు వెళ్లాడు. అక్కడే సుధాకర్‌కు వరవరరావు పరిచయం అయ్యారు. 1990 నుంచి సుధాకర్ అఙ్ఞాతంలోకి వెళ్లి 1992-94 మధ్య మావోయిస్టు దళ సభ్యుడిగా పనిచేశాడు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి అనేక పదవుల్లో పనిచేశాడు. 2003 నుంచి 2013 వరకు స్టేట్ మిలటరీ కమిషన్ సభ్యుడిగా... 2014 నుంచి 2019 వరకు కేంద్ర కమిటీ సభ్యుడిగా... మిలటరీ కమిషన్ సభ్యుడిగా బిహార్, జార్ఖండ్ కేంద్రంగా పనిచేశాడు’ అని సుధాకర్‌కు సంబంధించిన విషయాలు డీజీపీ వెల్లడించారు. (చదవండి : కొరియర్ నుంచి కేంద్ర కమిటీ దాకా) బాల్య వివాహం కారణంగా విరక్తితో.. సుధాకర్ భార్య అరుణ(43) వరంగల్ జిల్లాకు దుగ్గొండి చెందిన వారని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. బాల్య వివాహం కారణంగా విరక్తి చెందిన ఆమె.. దళ సభ్యుల పాటలకు ఆకర్షితురాలై దళంలో చేరినట్లు పేర్కొన్నారు. ‘మావోయిస్టులైన అనేక మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడి వేధింపుల కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్లు ఆమె చెప్పారు. సట్వాజీ మీద పేరు మీద రూ. 25 లక్షల రివార్డు ఉంది. అతడి భార్య పేరు మీద రూ. 10 లక్షల రివార్డు ఉంది. వారిద్దరి పేరుతో ఉన్న ఈ రివార్డును వారికి అందజేస్తాము’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని.. కాబట్టి మావోయిస్టులు అందరూ జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవనం గడపాలని డీజీపీ పిలుపునిచ్చారు. (చదండి : లొంగుబాటలో) కాగా నిర్మల్‌లోని సారంగాపూర్ మండలానికి చెందిన సుధాకర్ ఇంటర్‌లోనే రాడికల్ స్టూడెంట్స్ నాయకుల ప్రభావంతో మావోయిస్టు కొరియర్‌గా చేరారు. పలు హింసాత్మక ఘటనల్లో కీలక పాత్ర పోషించి కీలక నేతగా ఎదిగారు. 2013 నుంచి మావోయిస్టు కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ, సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్- జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరించిన సుధాకర్‌పై కోటి రూపాయల రివార్డు(జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది) కూడా ఉంది. దళంలోనే పరిచయమైన నీలిమ అలియాస్ మాధవిని ఆయన పెళ్లిచేసుకున్నారు. కాగా తన తమ్ముడు నారాయణ రాంచీలో పోలీసులకు పట్టుబడటం, నిర్మల్ జిల్లా పోలీసులు తన తల్లి ద్వారా ఒత్తిడి పెంచడం, మావోయిస్టు పార్టీలో అంతర్గత సంక్షోభం కారణంగా భార్యతో సహా ఆయన పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. -
మరికాసేపట్లో మీడియా ముందుకు సుధాకర్
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సట్వాజీ అలియాస్ సుధాకర్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. జార్ఖండ్ మావోయిస్టు కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్న సుధాకర్ భార్యతో సహా రాంచీ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరికాసేపటల్లో ఆయన మీడియా ముందుకు రానున్నారు. (చదవండి : లొంగు‘బాట’లో..) కాగా నిర్మల్‌లోని సారంగాపూర్ మండలానికి చెందిన సుధాకర్ ఇంటర్‌లోనే రాడికల్ స్టూడెంట్స్ నాయకుల ప్రభావంతో మావోయిస్టు కొరియర్‌గా చేరారు. పలు హింసాత్మక ఘటనల్లో కీలక పాత్ర పోషించి కీలక నేతగా ఎదిగారు. 2013 నుంచి మావోయిస్టు కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ, సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్- జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరించిన సుధాకర్‌పై కోటి రూపాయల రివార్డు(జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది) కూడా ఉంది. దళంలోనే పరిచయమైన నీలిమ అలియాస్ మాధవిని ఆయన పెళ్లిచేసుకున్నారు. కాగా తన తమ్ముడు నారాయణ రాంచీలో పోలీసులకు పట్టుబడటం, నిర్మల్ జిల్లా పోలీసులు తన తల్లి ద్వారా ఒత్తిడి పెంచడం, మావోయిస్టు పార్టీలో అంతర్గత సంక్షోభం కారణంగా భార్యతో సహా ఆయన పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇంటర్‌లోనే ఆకర్షితుడై.. సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన దేవుబాయి, కాశీరాం దంపతుల పెద్ద కుమారుడు ఒగ్గు సట్వాజీ పదోతరగతి వరకు స్థానిక పాఠశాలలో చదివారు. 1981–83 మధ్య ఇంటర్మీడియెట్ నిర్మల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్యూ) నాయకులతో సంబంధాలు కొనసాగించారు. వారి మాటలు, పాటలతో పాటు విప్లవ సాహిత్యానికి ఆకర్షితుడయ్యారు. అప్పటి నుంచే ఆర్ఎస్యూ(అండర్‌గ్రౌండ్) కొరియర్‌గా, రాడికల్స్ ఆర్గనైజర్‌గా వ్యవహరించారు. 1984లో పూర్తిస్థాయిలో అడవి బాట పట్టి పీపుల్స్‌వార్‌లో చేరి నక్సలైటుగా మారారు. జనంలోకి వచ్చి..మళ్లీ దళంలోకి.. పీపుల్స్‌వార్‌లో చేరిన రెండేళ్లకే కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో 1986లో కర్ణాటకలోని గుల్బర్గాలో సట్వాజీ పోలీసులకు చిక్కారు. 1989 చివరి వరకు జైలులోనే ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తివేయడంతో బయటకు వచ్చారు. అప్పుడు ఇంటి వద్దే ఉంటూ నిర్మల్‌లో భారీ స్తూపం నిర్మింపజేశారు. మళ్లీ ప్రభుత్వం నక్సల్స్‌పై నిషేధం విధించడంతో 1991నుంచి తిరిగి దళంలోకి వెళ్లారు. ఇక అప్పటి నుంచి ఆయన జనంలోకి రాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ దళాల కమాండర్‌గా, జిల్లా కమాండర్‌గా కొనసాగారు. 2001 నుంచి రాష్ట్ర కమిటీలో చేరి దండకారణ్య మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అక్కడి నుంచి కేంద్ర కమిటీకి, జార్ఖండ్ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతలకు వెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు సింగరేణిలో జరిగిన దాదాపు అన్ని హింసాత్మక ఘటనల్లో సట్వాజీ అలియాస్ సుధాకర్ కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు చెబుతుంటారు. చెన్నూరు, జైపూర్, నీల్వాయి, కోటపల్లి తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఈయనపై కేసు లు ఉన్నాయి. దళంలోనే మూడున్నర దశాబ్దాలు సట్వాజీ దాదాపు మూడున్నర దశాబ్దాల తన జీవితాన్ని అజ్ఞాతంలోనే గడిపారు. 1998లోనే తండ్రి కాశీరాం చనిపోయినా ఇంటికి రాలేదు. తమ్ముళ్లు నారాయణ, రామన్నలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు చెల్లెళ్లు కాల్వ పోసవ్వ, దాసరి పోసవ్వలకు పెళ్లిళ్లయ్యాయి. తల్లి దేవుబాయి ఒక్కరే సారంగపూర్‌లో ఉంటున్నారు. ఇటీవలే అనారోగ్యానికి గురైన ఆమెను నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు, ఏఎస్పీ దక్షిణామూర్తి స్వయంగా ఆమె వద్దకు వెళ్లి పలకరించారు. తన అన్నను కలసి వస్తుండగా సట్వాజీ తమ్ముడు నారాయణ మరో వ్యక్తితో కలసి 2017 ఆగస్టులో రాంచీ రైల్వేస్టేషన్లో పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పటి నుంచి కుటుంబంపై పోలీసుల ఒత్తిడి పెరగడం, పార్టీలో అంతర్గత సంక్షోభాల కారణంగా సుధాకర్ రాంచీలో పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. కేంద్ర కమిటీ దాకా ఎదిగి.. పీపుల్స్‌వార్ (మావోయిస్టు పార్టీ)లో తెలంగాణ నుంచి ఎదిగిన కీలక నేతల్లో సట్వాజీ అలియాస్ సుధాకర్ కూడా ఉన్నారు. రాష్ట్ర కమిటీ కొరియర్‌గా పని ప్రారంభించిన సట్వాజీ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడి దాకా ఎదిగారు. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, అనంతరం జిల్లా కమాండర్ (కార్యదర్శి)గా వ్యవహరించారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జోనల్ కమిటీ సభ్యుడయ్యారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉంటూ దండకారణ్యంలో మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. ప్రస్తుతం 2013 నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కీలకంగా వ్యవహరిస్తూనే సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. -
లొంగు‘బాట’లో..
నిర్మల్: చుట్టూ అడవులు, గుట్టలు, వాగులు, వంకలతో పాటు గోదావరి నది సరిహద్దుగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు నక్సల్స్‌కు ఖిల్లాగా ఉండేది. విప్లవ సాహిత్యం, ఉద్యమ పాటలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లిన అన్నలు ఉమ్మడిజిల్లాలోని నిర్మల్ ప్రాంతంపైనా పట్టు సాధించారు. విద్యావంతులైన యువతను దళంలో చేరేలా ప్రోత్సహించారు. అలా 35ఏళ్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లి.. మావోయిస్టు కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎదిగిన ఆయనే సట్వాజీ అలియాస్ సుధాకర్. ఇలా నిర్మల్ ప్రాంతం నుంచి పలువురు నక్సల్స్ ఉద్యమానికి ఆకర్షితులై తుపాకీ చేతబట్టారు. కాలక్రమంలో వివిధ ఎన్కౌంటర్లలో కొంతమంది హతం కాగా, మరికొందరు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. రెండుమూడేళ్లుగా ఒక్కొక్కరుగా వనం వీడుతూ జనజీవనంలోకి వస్తున్నారు. తాజాగా మావోయిస్టు పార్టీ కీలక నాయకుడు సట్వాజీ జార్ఖండ్‌లో పోలీసులకు లొంగిపోవడం సంచలనంగా మారింది. ఇప్పటికే కనుమరుగవుతున్న మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలినట్టైంది. జిల్లాలో కనుమరుగు.. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్ ప్రాంతంలోనూ నక్సల్స్ తమ ఆధిపత్యాన్ని చెలాయించిన సందర్భాలు ఉన్నాయి. నర్సాపూర్, పెంబి తదితర పోలీసుస్టేషన్లతో పాటు పోలీసుల వాహనాలను పేల్చివేసిన హింసాత్మక ఘటనలు ఉన్నా యి. నిర్మల్‌లో పట్టపగలే డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న రమేశ్‌రెడ్డిని హతమార్చి సంచలనం సృష్టించారు. కానీ..కాలక్రమంలో పోలీసులు పట్టు సాధించడంతో జిల్లాలో దళం తుడిచిపెట్టుకు పోయింది. రెండేళ్ల క్రితం కొత్త జిల్లాల ఏర్పాటుతో పోలీసులకు మరింత పట్టు దొరికింది. గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా పనిచేసిన అనుభవం కలిగిన ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ వచ్చిరాగానే దళ సభ్యుడు కంతి రవిని, ఏడాది అనంతరం పెంద్రం పద్మను సరెండరయ్యేలా చేశారు. ఆ తర్వాత వచ్చిన శశిధర్‌రాజు సైతం నేరుగా సట్వాజీ తల్లి దేవుబాయి వద్దకు వెళ్లి పలకరించడం, ఆమె ద్వారా కొడుకు లొంగిపోవాలని విన్నవించేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. ఓ వైపు పోలీసుల విధానం మారడం, మరోవైపు రిక్రూట్మెంట్లు లేకపోవడంతో జిల్లాలో మావోయిస్టుల ఉనికి లేకుండా పోయింది. జిల్లా ఏర్పడిన కొత్తలోనే కంతి రవి.. జిల్లాకు చెందిన మంగి దళ సభ్యుడు కంతి రవి అలియాస్ సురేష్ 2016 అక్టోబర్ 15న అప్పటి ఎస్పీ విష్ణు వారియర్ సమక్షంలో లొంగిపోయాడు. జిల్లా ఏర్పడిన కొత్తలోనే రవి సరెండర్ కావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కడెం మండలం లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కంతి రవి అలియాస్ సురేష్ సొంత అక్క కంతి లింగవ్వ అలియాస్ అనిత 20 ఏళ్ల క్రితం దళంలో చేరింది. ఆమె మావోయిస్టు ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా ఉన్న మైలారపు అడెల్లును వివాహం చేసుకున్నారు. తన సోదరి ద్వారా తరచుగా దళంతో పరిచయమైన కంతిరవి 2014లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఉమ్మడి జిల్లాలో మావోయిస్టు కార్యదర్శిగా ఉన్న మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌కు గన్‌మెన్‌గా పనిచేశాడు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని తూర్పు ప్రాంతం, చత్తీస్‌గఢ్‌లలో ఇన్ఫార్మర్ల హత్య, వాహనాల దగ్ధం ఘటనల్లో పాల్గొన్నాడు. పలుమార్లు ఎన్కౌంటర్ల నుంచి తృటిలో తప్పించుకున్న కంతి రవి 2016లో అప్పటి ఎస్పీ వారియర్ వద్ద లొంగిపోయాడు. తల్లితో పాటు తన అనారోగ్య కారణాల వల్ల లొంగిపోయినట్లు అప్పట్లో ప్రకటించాడు. 2017లో పెంద్రం పద్మ.. మామడ మండలం కిషన్రావుపేట్ పంచాయతీ పరిధిలోని మొర్రిగూడకు చెందిన పెంద్రం పద్మ అలియాస్ సావిత్రి మూడో తరగతి వరకు చదువుకుని మధ్యలోనే ఆపేసింది. పొచ్చెర గ్రామంలో కూలీ పని చేస్తుండగా ఆమెకు మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఏర్పడ్డాయని పోలీసులు తెలిపారు. 2014 నుంచి ఆమె మహారాష్ట్రలోని సిరోంచ దళ సభ్యురాలిగా పనిచేసింది. 2017 డిసెంబర్ 25న పద్మ అప్పటి ఇన్చార్జి ఎస్పీ వారియర్ సమక్షంలో లొంగిపోయింది. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను జనజీవనంలోకి తీసుకురావడానికి జిల్లా పోలీసులు పలు కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో వ్యూహాత్మకంగా దళ సభ్యుల కుటుంబాలకు చేరువ కావడం చాలా ప్రభావం చూపింది. ఏ కష్టమొచ్చినా తాము అండగా నిలుస్తామని పోలీసులు వారికి భరోసానివ్వడం, ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించడం, దుస్తులను పంపిణీ చేయడంతో పాటు దళ సభ్యుల కుటుంబాలతో కలిసి సహపంక్తి భోజనాలూ చేశారు. పోలీసులకు లొంగిపోతే ప్రశాంతంగా తమతో కలిసి ఉండవచ్చనే సమాచారాన్ని కుటుంబాల ద్వారా సభ్యులకు చేరేలే చేశారు. దీని ఫలితంగానే జిల్లాలో గతంలో 14నెలల వ్యవధిలో ఇద్దరు దళ సభ్యులు జనజీవన స్రవంతిలోకి వచ్చేశారు. ఇప్పుడు సట్వాజీ.. పీపుల్స్‌వార్(మావోయిస్టు)లో జిల్లా నుంచి కేంద్ర కమిటీ దాకా ఎదిగిన మావోయిస్టు నాయకుడు ఒగ్గు సట్వాజీ అలియాస్ సుధాకర్(బురియార్/కిరణ్). సారంగపూర్ మండలకేంద్రానికి చెందిన ఆయన ఇంటర్ చదువుతుండగానే రాడికల్స్ స్డూడెంట్ యూనియన్(ఆర్ఎస్యూ) ద్వారా నక్సల్స్ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. అలా 1984లో టీనేజీలోనే పూర్తిస్థాయిలో పీపుల్స్‌వార్ దళసభ్యుడిగా చేరారు. అనతికాలంలో తన తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపు అన్ని దళాలకు నాయకత్వం వహించారు. జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కమాండర్(కార్యదర్శి)గా, ఉత్తర తెలంగాణ జోనల్ కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, దండకారణ్యంలో మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వివిధ బాధ్యతలు చేపట్టారు. 2013 నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటూనే సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బీహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. నక్సలైట్‌గా మారిన రెండేళ్లకే 1986లో కర్ణాటకలోని గుల్బార్గాలో సట్వాజీ పోలీసులకు చిక్కారు. 1989 చివరి వరకు జైలులోనే ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తివేయడంతో బయటకు వచ్చారు. అప్పుడు ఇంటి వద్దే ఉంటూ నిర్మల్‌లోని బుధవార్‌పేట్‌లో తిరుమల థియేటర్ ఎదురుగా కంకి కొడవలితో గల భారీ పీపుల్స్‌వార్ స్తూపం నిర్మింపజేశారు. సుధాకర్ జనంలోకి వచ్చి కీలకంగా మారుతున్న తరుణంలోనే ప్రభుత్వం మళ్లీ నిషేధం విధించడంతో 1991నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి జనంలోకి రాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన అన్ని ప్రధాన హింసాత్మక ఘటనల్లో ఆయన పాత్ర ఉన్నట్లు పోలీసులు చెబుతుంటారు. ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడి నిర్వహణలోనూ ఈయన పాత్ర ఉన్నట్లు సమాచారం. 2017 ఆగస్టులో తన తమ్ముడు నారాయణ పట్టుబడటం, కుటుంబంపై పోలీసుల ఒత్తిడి పెరగడంతో సట్వాజీ లొంగిపోయినట్లు సమాచారం. తనతో పాటు ఆయన భార్య నీలిమ అలియాస్ మాధవి కూడా లొంగిపోయినట్లు చెబుతున్నా.. కొన్ని వర్గాలు మాత్రం ఆమె లొంగిపోలేదని పేర్కొంటున్నాయి. సట్వాజీపై రూ. కోటి, ఆయన భార్య నీలిమపైన రూ.25లక్షల రివార్డులు ఉన్నాయి. సట్వాజీ లొంగిపోవడంతో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలనట్లు కావడంతో పాటు జిల్లా నుంచి ఉన్న ఏకైన నాయకుడిని కోల్పోయినట్లయింది. మిగిలిన వారి కోసం.. జిల్లా నుంచి దళంలో ఉన్న అతి కొద్ది మంది కూడా ఇటీవల కాలంలో వరుసగా జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులతో పాటు ఉద్యమంలో ఏర్పడుతున్న మార్పులు వారిని ఇంటిబాట పట్టిస్తున్నాయి. కంతి రవి, పెంద్రం పద్మ, ఒగ్గు సట్వాజీ లొంగిపోగా, మరికొందరు దళంలోనే కొనసాగుతున్నారు. వారిలో సోన్ మండలంలోని కూచన్‌పెల్లికి చెందిన ఇర్రి మోహన్‌రెడ్డి అలియాస్ భాస్కర్/ఉమేశ్/మహేశ్/విజయ్, మామడ మం డలం బురదపల్లికి చెందిన పెంద్రం జైతూబాయి అలియాస్ గంగుబాయి/లతక్క, కడెం మండలం లక్ష్మీసాగర్‌కు చెందిన కంతి లింగవ్వ అలియాస్ అనిత, ఇదే మండలంలోని అల్లంపెల్లికి చెందిన గోసిబాయి, పెంబి మండలంలోని బాబాపూర్, రాజూరాకు చెందిన తూము శ్రీనివాస్ అలియాస్ శ్రీను ఇప్పటికీ ఆజ్ఞాతంలోనే ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. వారిని కూడా జనజీవనంలోకి రమ్మని చెబుతున్నామని, వారు కూడా త్వరలోనే వస్తారని ఆశిస్తున్నామని చెబుతున్నాయి. -
మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు..!
నిర్మల్: తెలంగాణకు చెందిన మరో మావోయిస్టు అగ్రనేత పోలీసులకు లొంగిపోయాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన ఒగ్గు సట్వాజీ అలియాస్ (సుధాకర్/బుర్యార్/ కిరణ్) దళంలోనే పరిచయమైన తన భార్య నీలిమ అలియాస్ మాధవితో కలసి రాంచీలో పోలీసులకు లొంగిపోయారు. 2013 నుంచి మావోయిస్టు కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జార్ఖండ్‌లో మావోయిస్టు కార్యకలాపాల విస్తరణ, అమలు లో క్రియాశీలకంగా వ్యవహరించారు. తన తమ్ముడు నారాయణ రాంచీలో పోలీసులకు పట్టుబడటం, నిర్మల్ జిల్లా పోలీసులు తన తల్లి ద్వారా ఒత్తిడి పెంచడం, మావోయిస్టు పార్టీలో అంతర్గత సంక్షోభం కారణంగా భార్యతో సహా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఇంటర్‌లోనే ఆకర్షితుడై.. సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన దేవుబాయి, కాశీరాం దంపతుల పెద్ద కుమారుడు ఒగ్గు సట్వాజీ పదోతరగతి వరకు స్థానిక పాఠశాలలో చదివారు. 1981–83 మధ్య ఇంటర్మీడియెట్ నిర్మల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్యూ) నాయకులతో సంబంధాలు కొనసాగించారు. వారి మాటలు, పాటలతో పాటు విప్లవ సాహిత్యానికి ఆకర్షితుడయ్యారు. అప్పటి నుంచే ఆర్ఎస్యూ(అండర్‌గ్రౌండ్) కొరియర్‌గా, రాడికల్స్ ఆర్గనైజర్‌గా వ్యవహరించారు. 1984లో పూర్తిస్థాయిలో అడవి బాట పట్టి పీపుల్స్‌వార్‌లో చేరి నక్సలైటుగా మారారు. ఈయనపై దాదాపు రూ.కోటి రివార్డ్ ఉన్నట్లు తెలిసింది. జనంలోకి వచ్చి..మళ్లీ దళంలోకి.. పీపుల్స్‌వార్‌లో చేరిన రెండేళ్లకే కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో 1986లో కర్ణాటకలోని గుల్బర్గాలో సట్వాజీ పోలీసులకు చిక్కారు. 1989 చివరి వరకు జైలులోనే ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తివేయడంతో బయటకు వచ్చారు. అప్పుడు ఇంటి వద్దే ఉంటూ నిర్మల్‌లో భారీ స్తూపం నిర్మింపజేశారు. మళ్లీ ప్రభుత్వం నక్సల్స్‌పై నిషేధం విధించడంతో 1991నుంచి తిరిగి దళంలోకి వెళ్లారు. ఇక అప్పటి నుంచి ఆయన జనంలోకి రాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ దళాల కమాండర్‌గా, జిల్లా కమాండర్‌గా కొనసాగారు. 2001 నుంచి రాష్ట్ర కమిటీలో చేరి దండకారణ్య మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అక్కడి నుంచి కేంద్ర కమిటీకి, జార్ఖండ్ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతలకు వెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు సింగరేణిలో జరిగిన దాదాపు అన్ని హింసాత్మక ఘటనల్లో సట్వాజీ అలియాస్ సుధాకర్ కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు చెబుతుంటారు. చెన్నూరు, జైపూర్, నీల్వాయి, కోటపల్లి తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఈయనపై కేసు లు ఉన్నాయి. సట్వాజీపై జార్ఖండ్ ప్రభుత్వం రూ. కోటి రివార్డు కూడా ప్రకటించింది. దళంలోనే మూడున్నర దశాబ్దాలు సట్వాజీ దాదాపు మూడున్నర దశాబ్దాల తన జీవితాన్ని అజ్ఞాతంలోనే గడిపారు. 1998లోనే తండ్రి కాశీరాం చనిపోయినా ఇంటికి రాలేదు. తమ్ముళ్లు నారాయణ, రామన్నలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు చెల్లెళ్లు కాల్వ పోసవ్వ, దాసరి పోసవ్వలకు పెళ్లిళ్లయ్యాయి. తల్లి దేవుబాయి ఒక్కరే సారంగపూర్‌లో ఉంటున్నారు. ఇటీవలే అనారోగ్యానికి గురైన ఆమెను నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు, ఏఎస్పీ దక్షిణామూర్తి స్వయంగా ఆమె వద్దకు వెళ్లి పలకరించారు. తన అన్నను కలసి వస్తుండగా సట్వాజీ తమ్ముడు నారాయణ మరో వ్యక్తితో కలసి 2017 ఆగస్టులో రాంచీ రైల్వేస్టేషన్లో పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పటి నుంచి కుటుంబంపై పోలీసుల ఒత్తిడి పెరగడం, పార్టీలో అంతర్గత సంక్షోభాల కారణంగా తన భార్య మాధవి అలియాస్ నీలిమతో పాటు సట్వాజీ అలియాస్ సుధాకర్ రాంచీలో పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. జార్ఖండ్‌లో సుధాకర్ లొంగిపోయినట్లు తమకు అధికారిక సమాచారం రాలేదని నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు పేర్కొన్నారు. కేంద్ర కమిటీ దాకా ఎదిగి.. పీపుల్స్‌వార్ (మావోయిస్టు పార్టీ)లో తెలంగాణ నుంచి ఎదిగిన కీలక నేతల్లో సట్వాజీ అలియాస్ సుధాకర్ కూడా ఉన్నారు. రాష్ట్ర కమిటీ కొరియర్‌గా పని ప్రారంభించిన సట్వాజీ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడి దాకా ఎదిగారు. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, అనంతరం జిల్లా కమాండర్ (కార్యదర్శి)గా వ్యవహరించారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జోనల్ కమిటీ సభ్యుడయ్యారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉంటూ దండకారణ్యంలో మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. ప్రస్తుతం 2013 నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కీలకంగా వ్యవహరిస్తూనే సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. -
‘ఆపరేషన్ సమాధాన్’పై మావ్చోల పోరు
సాక్షి, కొత్తగూడెం: మావోయిస్టులకు, బలగాలకు మధ్య సుదీర్ఘకాలంగా పోరు జరుగుతోంది. కొన్ని నెలలుగా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సమాధాన్’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. ఆంగ్ల అక్షరమాలలోని ‘ఎస్ ఏ ఎం ఏ డీ హెచ్ ఏ ఎన్’ (ఎస్–స్మార్ట్ లీడర్షిప్), (ఏ–అగ్రెసివ్ స్ట్రాటజీ), (ఎం–మోటివేషన్ అండ్ ట్రైనింగ్), (ఏ–యాక్షనబుల్ ఇంటెలిజెన్సీ), (డి–డాష్‌బోర్డ్ బేస్డ్ కీ), (హెచ్–హార్నెసింగ్ టెక్నాలజీ), (ఏ–యాక్షన్ ప్లాన్), (ఎన్–నో యాక్సెస్ టు ఫైనాన్సింగ్) లక్ష్యంతో ఈ ఆపరేషన్‌ను చేపడుతోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీసులను సమన్వయపర్చుకుంటూ కేంద్ర బలగాలను దండకారణ్యంలోకి కేంద్ర ప్రభుత్వం ముందుకు నడిపిస్తోంది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, సుక్మా, బీజాపూర్, బస్తర్, కాంకేర్, నారాయణపూర్ జిల్లాల్లో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా, మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. మొన్నటి శాసనసభ ఎన్నికలకు ముందు నుంచే ‘ఆపరేషన్ సమాధాన్’కు కేంద్రం పదును పెట్టింది. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలున్నాయి. వీటి నిర్వహణకు మావోయిస్టుల నుంచి ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా చూసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలను పోలీసులు గట్టిగానే నియంత్రించగలిగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. సభలు–సమావేశాలు, బంద్... పై పరిణామాలన్నింటి నేపథ్యంలో, ‘ఆపరేషన్ సమాధాన్’కు వ్యతిరేకంగా మావోయిస్టులు ఈ నెల 25 నుంచి 30 వరకు సభలు–సమావేశాలకు, 31న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. వీటి ప్రచా రంలో భాగంగా శుక్రవారం భద్రాచలం బస్టాండులో కరపత్రాలు, అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు–నెల్లిపాక బంజర గ్రామాల మధ్యలో బ్యానర్లు, చర్ల మండలంలోని ఆర్.కొత్తగూడెం–కుదునూరు మధ్య ప్రధాన రహదారిపై కనిపించాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలంలోని సూరవీడు వద్ద బ్యానర్లు, ఆంధ్రప్రదేశ్‌లోని చింతపల్లి మండలం అంతర్లా గ్రామ వద్ద కరపత్రాలు, భద్రాచలం నుంచి అశ్వారావుపేట వెళ్లే ప్రధాన రహదారి పక్కన పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం మారేడుబాక, ఉప్పేరు, వెంకటాపురం గ్రామాల వద్ద బ్యానర్లు, పోస్టర్లు కనిపించాయి. జయశంకర్ జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు వద్ద కామినిచెరువు పనులు చేస్తున్న జేసీబీని ఈ నెల 24న మావోయిస్టులు తగులబెట్టారు. ‘సమాధాన్’కు వ్యతిరేకంగా బ్యానర్లు, కరపత్రా లు వదిలారు. పాక్షిక మైదాన ప్రాంతంగా పేరుపడిన అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు–నెల్లిపాక బంజర ప్రాంతంలోనూ మావోయిస్టుల బ్యానర్లు కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. రెచ్చిపోతున్న మావోయిస్టులు... మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. బాంబులు పెడుతున్నారు, పేలుస్తున్నారు. ఈ నెల 22న చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో ప్రెషర్ బాంబు పేలడంతో నలుగురు ఆర్ అండ్ బీ ఉద్యోగులు గాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఎల్‌డబ్ల్యూఈ నిధులతో పెదమిడిసీలేరు నుంచి చెన్నాపురం వరకు గతంలో రోడ్డు నిర్మాణం పూర్తియింది. దీని పక్కన కిలోమీటర్ రాళ్లను పాతేందుకు ఆర్ అండ్ బీ ఉద్యోగులు మార్కింగ్ చేస్తుండగా ప్రెషర్ బాంబు పేలింది. 2018 డిసెంబర్ 31న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ సమీపంలోని తిప్పాపురం రోడ్డులో మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. 2018 డిసెంబర్ 11న చర్ల మండలంలోని బోదనెల్లి సమీపంలో ప్రధాన రహదారిపై మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పోలీసులు గుర్తించారు. బయటకు తీస్తుండగా అది పేలింది. ఒక జావానుకు తీవ్ర గాయాలయ్యాయి. 2018 డిసెంబర్ 7న చర్ల మండలం పెదమిడిసిలేరు సమీపంలోని తిప్పాపురం మార్గంలోగల పగిడివాగు చప్టాను మందుపాతరతో మావోయిస్టులు పేల్చివేశారు. 2017 జూలైలో చర్ల మండలంలోని లెనిన్ కాలనీకి వెళ్లే మార్గంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. 2018 మే 5న చర్ల మండలంలోని సత్యనారాయణపురం ప్రధాన రహదారిలోగల ప్రధాన కల్వర్టును మావోయిస్టులు మందుపాతరలతో పేల్చివేశారు. 2018 మే నెలలో చర్ల బస్టాండ్ అవుట్ గేట్ వద్ద మావోయిస్టులు బ్యాగులో ఉంచిన ప్రెషర్ బాంబును పోలీసులు గుర్తించారు. దానిని స్వాధీనపర్చుకుని, సమీపంలోని చెరువు వద్ద నిర్వీర్యం చేశారు. ‘సమాధాన్‘మిస్తున్న బలగాలు దాడులు, బాంబులతో రెచ్చిపోతున్న మావోయిస్టులకు ‘ఆపరేషన్ సమాధాన్’ పేరుతో బలగాలు గట్టిగానే సమాధానమిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దండకారణ్యం నుంచి తెలంగాణలోని సరిహద్దు జిల్లాల్లోకి చొచ్చుకొచ్చేందుకు మావోయిస్టులు సాగించిన ప్రయత్నాలను మన పోలీసులు గట్టిగానే తిప్పికొట్టారు. దీనికి ప్రతీకారంగా, మావోయిస్టులు దాడులకు, విధ్వంసానికి దిగుతున్నారు. పోలీసు బలగాలే లక్ష్యంగా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దాటి వస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం మండలాల్లో అనేకచోట్ల మందుపాతరలు, ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేశారు. వీటి నుంచి బలగాలు చాకచక్యంగా తప్పించుకుని దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాడులకు మావోయిస్టు పార్టీ యాక్షన్ టీములు రంగంలోకి దిగినట్టు పోలీసులు గుర్తించారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాక్షన్ టీం ఏర్పాటైనట్టు, ఇన్చార్జిగా దామోదర్ నియమితులైనట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు, పకడ్బందీగా వ్యవహరించారు. గత నవంబర్ 28న మావోయిస్టు పార్టీ మణుగూరు–పాల్వంచ ఏరియా కార్యదర్శి సుజాతక్కను అరెస్ట్ చేశారు. మావోయిస్టు పార్టీ ఈమె తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం–తూర్పుగోదావరి జిల్లాల కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ భార్యనే ఈ సుజాతక్క. యాక్షన్ టీం వివరాలను ఈమె నుంచి పోలీసులు సేకరించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత ఒకవైపు, మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. మరోవైపు, బలగాలు–పోలీసులు గట్టిగానే ‘సమాధాన్’మిస్తున్నారు. ఇంకోవైపు, మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో... ‘ఆపరేషన్ సమాధాన్’ను ఓడించాలంటూ మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ పేరుతో వారు తీవ్ర హింసకు దిగే ప్రమాదముంది. ‘సమాధాన్’ పేరుతో బలగాలు–పోలీసులు కూడా అప్రమత్తంగా, సర్వసన్నద్ధంగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే... సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం, తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
మావోల లేఖల్లో దిగ్విజయ్ నంబర్
పుణె: ఎల్గార్ పరిషత్ కేసు విచారణలో భాగంగా తమకు లభించిన లేఖల్లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌దిగా భావిస్తున్న ఫోన్ నంబర్ ఉందని పుణె పోలీసులు వెల్లడించారు. దాంతో చార్జిషీట్లో దానిని చేర్చామన్నారు. సెప్టెంబర్ 25, 2017న సురేంద్ర గాడ్లింగ్ అనే మానవహక్కుల కార్యకర్తకు మావోయిస్టు నేత నుంచి వచ్చిన ఒక లేఖలో దిగ్విజయ్ సింగ్‌దిగా భావిస్తున్న ఫోన్ నెంబర్ ఉందని తెలిపారు. ‘విద్యార్థుల సహకారంతో దేశవ్యాప్త నిరసనలను మనం మరింత తీవ్రతరం చేయాలి. సాధారణంగా పోలీసులు విద్యార్థులతో కఠినంగా వ్యవహరించలేరు. అది మనకు అనుకూలత. మన ఉద్యమాలకు సహకరించేందుకు కాంగ్రెస్ నేతలు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెంబర్లో మన మిత్రుడిని సంప్రదించగలరు’ అని ఆ లేఖలో ఉందన్నారు. ఆ నెంబర్ దిగ్విజయ్ సింగ్‌దేనని పోలీసులు భావిస్తున్నారన్నారు. ఆ నంబర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లోనూ ఉందని ఒక పోలీసు అధికారి చెప్పారు. దిగ్విజయ్ స్పందిస్తూ.. ధైర్యముంటే తనపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌లకు సవాల్ విసిరారు. -
మావోయిస్టు పార్టీలో కీలక మార్పులు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీలో కీలకమార్పులు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి పదవీ బాధ్యతలు నిర్వహించిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతిని ఆ పదవి నుంచి తొలగాలని పోలిట్ బ్యూరో సభ్యులు అడిగినట్లు సమాచారం అందింది. ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంపై బాధ్యత వహిస్తున్నానని, తన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు కూడా గణపతి ప్రకటించినట్లు వెల్లడైంది. గణపతి స్థానంలో నంబాలా కేశవరావు అలియాస్ బస్వరాజ్ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిసింది. నంబాలా కేశరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియోనిపేట. వరంగల్ ఆర్ఈసీలో కేశవరావు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 28 సంవత్సరాలుగా కేశవరావు అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1980 జనవరి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. 2005లోనే కేశవరావుపై రూ.50 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. వయోభారంతోనే పార్టీ బాధ్యతలను, తన వద్ద ఉన్న ఏకే-47 తుపాకీని కూడా గణపతి, పార్టీకి అప్పగించినట్లు సమాచారం. -
చంద్రబాబును హెచ్చరిస్తూ మావోయిస్ట్ లేఖ
పాడేరు రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నక్క జిత్తులను ప్రజలు నమ్మరని ఏవోబీ ఎస్జెడ్సీ మావోయిస్టు అధికార ప్రతినిధి జగబంధు పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీలో ప్రస్తుతం కొనసాగుతున్న గిరిజనుల అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధకాండకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పాడేరులో మరో 5 పేజీల లేఖ విడుదల చేశారు. లేఖలోని సారాంశం... ‘ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న నిర్బంధ పద్ధతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వస్తి పలికాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతానని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు నక్క జిత్తులను ప్రజలు నమ్మరు. ఏజెన్సీలో కూంబింగ్ల పేరుతో గ్రామాల మీద ప్రభుత్వం దాడులు చేయిస్తోంది. యువకులను బెదిరించి ఎత్తుకెళ్లి తప్పుడు కేసులు బనాయించి హింసిస్తున్నారు. ఇళ్లలోకి ప్రవేశించి తిండి గింజలను ధ్వంసం చేస్తున్నారు. అడవిని నమ్ముకున్న అడవి బిడ్డలు అదే అడవికి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు తెచ్చారు. జి.మాడుగుల మండలం రాసరాయి గ్రామంలో అక్టోబర్ 26న అర్ధరాత్రి దాడి చేసి నలుగురు గిరిజనులను పట్టుకెళ్లిపోయారు. అడ్డుపడిన మహిళలను చితకబాదారు. మరో ఘటనలో అక్టోబర్ 15న బూతం అన్నపూర్ణ, మరో గిరిజనుడు సింహాచలంను అరెస్టు చేశారు. అన్నపూర్ణ గతంలో ఉద్యమంలో పనిచేసి అరెస్టు అయి బెయిల్‌పై వచ్చి ఇంటి నుంచే కోర్టుకు హాజరవుతున్నారు. వారు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నారని గత ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ అబద్ధాలు చెప్పారు. పోలీసు అధికారులు గంజాయి వ్యాపారుల నుంచి లంచాలు తీసుకుంటూ మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గంజాయి లంచాల గొడవల కారణంగానే 2016లో ఏఎస్పీ ఆత్మహత్య చేసుకున్న విషయం ప్రజలు మరువలేదు. చంద్రబాబు ఏజెంట్లుగా మారిన పోలీసులు నిజాన్ని ఒప్పుకునే నిజాయితీ, ధైర్యం ఏనాడో కోల్పోయారు. హుకుంపేట, అనంతగిరి మండలాలు మినహా ఏజెన్సీలోని అన్ని మండలాల్లో అమాయక గిరిజనులకు అరెస్టు చేశారు. ఏ మండలంలో గిరిజనులపై నిర్బంధకాండ జరుగుతుందో ఆ మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు మూల్యం చెల్లించుకోక తప్పదు. కుంభకోణాలు ఏమయ్యాయి? విశాఖలో భూముల కుంభకోణం, కాల్‌మనీ కుంభకోణం వంటి అంశాలు ఏమయ్యాయి? నీరు చెట్టు పేరుతో దళితుల భూములను ఆక్రమించుకున్నారు. చట్టాలను ఉల్లంఘించి లేటరైట్, గ్రానైట్, చైనా క్లే, రంగురాళ్ల తవ్వకాలు జరిపి దోచుకుంటున్నారు. ఈ మొత్తం చర్యలు, పాలసీలను కిడారి సర్వేశ్వరరావు, సీవేరి సోమ అమలు జరిపారు. ప్రజల మీద జరిగిన అణచివేత చర్యలను వారు వ్యతిరేకించలేదు. ఒకరు ప్రభుత్వ విప్‌గా, మరొకరు ఎస్టీ కమిషన్ సభ్యుడిగా అన్ని సౌకర్యాలూ అనుభవిస్తూ ప్రజా వ్యతిరేకులుగా మారిపోయారు. అక్రమ మైనింగ్ ద్వారా వందల కోట్లు సంపాదించుకునేందుకే పార్టీ మారారు. కిడారి అమాయకుడు, సొంత ఇల్లుకూడా లేని పేదవాడని ఒకవైపు డీజీపీ మెచ్చుకుంటున్నారు. వీరు ప్రజాసేవకులు కాదు.. దళారులకు, రాజకీయ ఊసరవెల్లులకు రోజూ సెల్యూట్ కొట్టి వారి అభిమానాన్ని పొందడానికి తహతహలాడేవారు. మాఫియాగాళ్లకు రక్షణగా ఉంటారా? అక్టోబర్ 8న పెదబయలు మండలం జమున, చిట్టంగరువు గ్రామాల మధ్య జరిగిన ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? బ్యాంకులకు వందల కోట్లు ఎగనామం పెట్టిన సుజనాచౌదరి వంటి నేరస్తులను చంద్రబాబు, డీజీపీ కాపాడుతున్నారు. ఇసుక, భూ దొంగలు, మద్యం మాఫియాగాళ్లకు రక్షణగా ఉంటున్నారు. ప్రత్యేకహోదా కోసం ఉద్యమం చేస్తున్న వారిని జైలుకు పంపించి ఇప్పుడు హోదా, ధర్మపోరాట దీక్షలంటూ నాటకమాడుతున్నారు. ఏజెన్సీలో జరుగుతున్న నిర్బంధకాండపై అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు నోరు విప్పాలి. తెలుగుదేశం పార్టీని ఒంటరి చేసి దాని ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి. అక్టోబర్ 29న సీకుపనస గ్రామంలో ప్రజలు వేలాది మంది తమ నిరసనను తెలిపేందుకు సిద్ధమవుతుండగా చంద్రబాబు, పోలీసులు వాటిని జరగనివ్వకుండా చేశారు. ఇటువంటి చర్యల వల్ల ప్రజాగ్రహం చవిచూస్తారు’ అని లేఖలో హెచ్చరించారు. -
ఆమెను ముందే అదుపులోకి తీసుకున్నారా?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర– ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఆండ్రపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న పోలీసులు–మావోల ఎదురుకాల్పుల ఘటనపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు నేత మీనా అలియాస్ జిలానీ మృతి చెందగా మరో ముగ్గురు మహిళా మావోయిస్టులతోపాటు మిలీషియా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. చాలామంది కీలక నేతలు తప్పించుకున్నారని చెబుతున్న పోలీసుల వాదనలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ విప్ కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చిచంపాక పోలీసులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. రెండేళ్ల కిందట రామగుడ ఎన్కౌంటర్ తర్వాత ఏవోబీలో మావోలను చావు దెబ్బతీశామని భావిస్తున్న పోలీసులకు లివిటిపుట్టు ఘటన కోలుకోలేని షాక్‌నిచ్చింది. ఆ రోజు నుంచి పోలీసులు ఏవోబీని జల్లెడ పడుతూ వస్తున్నారు. (చదవండి: ఎదురుకాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ) మావోయిస్టులు పోలీసుల కూంబింగ్‌ను లెక్కచేయకుండా ఏవోబీలోనే ఇటీవల రెండుసార్లు సమావేశమయ్యారు. ఒడిశాలోని జన్‌బై వద్ద నిర్మిస్తున్న గురుప్రియ వంతెనను వ్యతిరేకిస్తూ ఈనెల 2న ఏవోబీలోనే భారీ సభ నిర్వహించారు. ఆ తర్వాత 7న సుంకి అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేతలు, దళ సభ్యులు సమావేశం కాగా పోలీసులు కాల్పులు జరిపారు. కూంబింగ్‌ను కూడా లెక్క చేయకుండా మావోలు ఏవోబీలోనే మకాం వేయడం, కటాఫ్ ఏరియాలోని మారుమూల ప్రాంతాలకు ఇప్పటికీ పోలీసులు వెళ్లలేకపోవడం, లివిటిపుట్టు ఘటన జరిగి దాదాపు మూడు వారాలవుతున్నా పోలీసుల అదుపులోకి పరిస్థితులు రాకపోవడం వెరసి వ్యూహాత్మకంగానే పోలీసులు ఎదురుకాల్పుల ఘటనను సృష్టించారనే వాదనలు వినిపిస్తున్నాయి. మీనాను ముందే అదుపులోకి తీసుకున్నారా? ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యాచరణ కమిటీ సభ్యుడు గాజర్ల రవి భార్య మీనా అలియాస్ జిలానీ కొన్నాళ్లుగా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఉద్యమానికి దూరంగానే ఉన్నారని చెబుతున్నారు. లివిటిపుట్టు ఆపరేషన్‌లో ఆమె పాల్గొన్నారా.. లేరా అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ పోలీసులు ఆమెను కిడారి, సివేరిల హత్య కేసులో 21వ నిందితురాలిగా చూపిస్తున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో కొన్నాళ్లుగా మీనా మల్కన్‌గిరి జిల్లాలోని ఆండ్రపల్లిలో తలదాచుకున్నట్టు చెబుతున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి ఆండ్రపల్లిని గురువారం రాత్రే ముట్టడించారని తెలుస్తోంది. గ్రామంలోని ప్రతి ఇంటినీ శోధించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. మీనాను అదుపులోకి తీసుకున్నారని, అనారోగ్యంతో ఉన్న తాను లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె చెప్పినా.. ఎన్కౌంటర్ చేసి ఎదురుకాల్పుల కథ సృష్టించారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులు జయంతి అలియాస్ అంజనా, రాధిక గొల్లూరి, సుమలా అలియాస్ గీతలతోపాటు మిలీషియా సభ్యుడు రాజశేఖర్ కర్మ నెల రోజులుగా ఇదే గ్రామంలో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నెన్నో అనుమానాలు? ఎదురుకాల్పుల ఘటనలో మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్న మీనా మృతదేహాన్ని మీడియాకు, గ్రామస్తులకు పోలీసులు చూపించలేదు. గ్రామస్తులు చుట్టుముట్టినా మృతదేహాన్ని చూపించేందుకు పోలీసులు నిరాకరించారు. శుక్రవారం తెల్లవారుజామున మొత్తం ఏడుసార్లు మాత్రమే కాల్పుల శబ్దం వినపడిందని, ఎదురుకాల్పుల ఘటనల్లో లెక్కకు మించి కాల్పుల శబ్దాలు వస్తాయని గ్రామస్తులు వాదిస్తున్నారు. ఘటన జరిగిన ఆండ్రపల్లి ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోనిది కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ఎమ్మెల్యే కిడారి హత్య దరిమిలా మూడు వారాలుగా మావోయిస్టులకు సవాల్ విసరాలని భావిస్తున్న పోలీసులు చివరికి.. అనారోగ్యంతో లొంగిపోవాలని చూస్తున్న ఓ మహిళా మావోయిస్టు నేతను ఎదురుకాల్పుల పేరిట మట్టుబెట్టి కలకలం సృష్టించేందుకు యత్నించారన్న వాదనలకే బలం చేకూరుతోంది. -
గుండెపోటుతో సీనియర్ మావోయిస్ట్ నేత మృతి
-
సీనియర్ మావోయిస్ట్ నేత అరవింద్ జీ మృతి
న్యూఢిల్లీ : సీనియర్ మావోయిస్ట్ నేత, సీపీఐ(మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడు అరవింద్ జీ అలియాస్ దేవ్‌కుమార్ సింగ్ బుధవారం గుండెపోటుతో కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు. జార్ఖండ్‌లోని బుద్ధా పహాడ్ అటవీప్రాంతంలో ఆయన చనిపోయినట్లు వెల్లడించారు. జార్ఖండ్‌లో ఇంతకుముందు పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన పలు దాడులకు వ్యూహాలు రచించిన అరవింద్ జీపై రూ.1.50 కోట్ల రివార్డు ఉందన్నారు. బిహార్‌లోని జెహెనాబాద్‌కు చెందిన అరవింద్ జీ.. భద్రతా బలగాలపై దాడులు నిర్వహించడంలో నిపుణుడిగా పేరుపొందారు. ఆపరేషన్ల నిర్వహణలో సలహాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి మావోయిస్టులు ఆయన్ను ఆశ్రయించేవారు. గుర్రంపై తిరిగే ఆయన గతంలో పలుమార్లు ఎన్కౌంటర్ల నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. అరవింద్ జీ మృతి జార్ఖండ్‌లో మావోయిస్టులకు ఎదురు దెబ్బేనని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. -
పోలీసులపై న్యాయ విచారణ
సాక్షి, ఆదిలాబాద్ : మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్‌కుమార్ ఎన్కౌంటర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఆజాద్ ఎన్‌కౌం టర్‌పై పునర్విచారణ చేపట్టాలని ఆదిలా బాద్ జిల్లా అదనపు సెషన్స్ కోర్టు (ఎస్సీ/ఎస్టీ కోర్టు) దిగువ కోర్టును ఆదేశించింది. ఈ కేసుతో సం బంధమున్న 29 మంది పోలీసులపై హత్యా నేరం కింద విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి భారతిలక్ష్మి గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆజాద్ ఎన్కౌంటర్ బూటకమని, ఆ కేసులో పునర్వి చారణ జరపాలని, పోలీసులపై హత్యానేరం కింద విచారణ చేపట్టాలని ఆజాద్ భార్య గతం లోనే ఆదిలాబాద్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు 2015 మార్చి 24న ఈ పిటిషన్‌ను తిరస్కరిం చింది. దాంతో ఆమె జిల్లా కోర్టును ఆశ్రయిం చగా.. తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. గురువారం కోర్టుకు హాజరైన ఆజాద్ భార్య పద్మ, ఆమె తరఫు న్యాయవాది సురేశ్ కుమార్, ఆ ఎన్కౌంటర్లో మృతి చెందిన జర్నలిస్టు హేమచంద్ర పాండే భార్య బబిత తరఫు న్యాయవాది, పౌర హక్కుల నేత రఘునాథ్ పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యా నేరం కింద విచారణకు ఆదేశించడం దేశంలోనే ఇది తొలిసారి అని వారు పేర్కొన్నారు. తిరస్కరించిన ఫస్ట్‌క్లాస్ కోర్టు.. సీబీఐ నివేదికలోని అంశాల ఆధారంగా ఆజాద్ భార్య పద్మ, ఆమె తరఫు న్యాయవాది సురేశ్ 2013 జూలైలో ఆదిలాబాద్ ఫస్ట్‌క్లాస్ కోర్టులో ప్రొటెక్ట్ పిటిషన్ వేశారు. ఆజాద్ ఎన్కౌంటర్ బూటకమని, బాధ్యులైన పోలీసులను అరెస్టు చేయాలని, హత్యానేరం కింద విచారించాలని కోరారు. స్వామి అగ్నివేశ్ సైతం 2014 ఫిబ్ర వరి 17న కోర్టుకు హాజరై తన వాదనలు విని పించారు. రెండేళ్ల పాటు వాదనలు విన్న కోర్టు.. పిటిషన్‌ను తిరస్కరిస్తూ 2015 మార్చి 24న ఉత్తర్వులిచ్చింది. దీంతో పద్మ ఈ కేసును పున ర్విచారణ చేయాలని, ఎన్‌కౌంటర్‌తో సంబం« దమున్న పోలీసులపై న్యాయ విచారణ చేపట్టా లని కోరుతూ గతేడాది అక్టోబర్‌లో ఆదిలాబా ద్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి పలుమార్లు వాదనలు జరిగాయి. సీబీఐ తర ఫున న్యాయవాది అలెగ్జాండర్ వాదనలు విని పించారు.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయ మూర్తి తాజాగా పునర్విచారణకు ఆదేశించారు. నమ్మకం పెరిగింది: పద్మ ఆదిలాబాద్ జిల్లా కోర్టు తీర్పు సంతోషాన్నిచ్చిందని ఆజాద్ భార్య పద్మ పేర్కొన్నారు. దీనితో న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగిందని చెప్పారు. బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడిన పోలీసులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. 8 ఏళ్ల కిందట ఎన్కౌంటర్ 2010 జూలై 2న ఆదిలాబాద్ జిల్లా సర్కేపల్లి–జోగాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్‌కుమార్, జర్నలిస్టు హేమచంద్ర పాండేలు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టు అగ్రనేతలకు మధ్య చర్చల కోసం స్వామి అగ్నివేశ్ మధ్యవర్తిత్వం జరుపుతున్న సమయంలో ఈ ఘటన జరగడం సంచలనం సృష్టించింది. అయితే ఈ ఎన్కౌంటర్ బూటకమంటూ స్వామి అగ్నివేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆజాద్‌ను పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారని పేర్కొంటూ.. పలు ఆధారాలు, పోస్టుమార్టం నివేదికలను కోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించిన సుప్రీంకోర్టు 2011 జనవరి 14న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ వాదనలు విన్న అనంతరం ఈ కేసును 2011 ఏప్రిల్ 15న సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఎన్కౌంటర్ స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేశారు. ఆ ఎన్కౌంటర్ నిజమైనదేనంటూ సీబీఐ 2012లో 192 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. అయితే ఎన్కౌంటర్లో భాగస్వాములైన పోలీసుల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉండటంతో.. ఆ నివేదిక ప్రతులను బాధిత కుటుంబాలకు అందజేయవద్దని అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు సుమారు ఏడాది తర్వాత ఆజాద్ భార్య పద్మకు సీబీఐ నివేదిక ప్రతులు అందాయి. -
జంపన్న సహచరిణి సుల్తానాబాద్ హేమలతే!
పెద్దపల్లి: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, సీనియర్ నేత జంపన్నకు ఉమ్మడి జిల్లాలోని పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీ కార్యకలాపాలతో విడదీయరాని అనుబంధం ఉంది. 1994లో సుల్తానాబాద్‌కు చెందిన హేమలత అనే ప్రైవేటు పాఠశాల టీచర్ పీపుల్స్‌వార్ పార్టీలో చేరారు. ఆ సమయంలో జంపన్న మహదేవపూర్, ఏటూరు నాగారం ప్రాంతాలకు జిల్లా కమిటీ సభ్యునిగా ఉన్నారు. ఆ సమయంలో పెద్దపల్లి, మంథని దళాలకు శిక్షణ ఇచ్చేందుకు జంపన్న ఈ ప్రాంతంలో పర్యటించేవారు. జంపన్నకు సహచరిణిగా పని చేసిన హేమలత ఆయననే పార్టీ వివాహం చేసుకొని భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి ప్రాంత దళ కమాండర్‌గా పని చేశారు. 2001లో జరిగిన ఎన్కౌంటర్లో సమ్మక్క, సారలమ్మ జాతర ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో స్వర్ణక్కతోపాటు 8 మంది హతమయ్యారు. సహచరిణి కోల్పోయిన జంపన్న ఆ తర్వాత పార్టీలో రెండో వివాహం చేసుకున్నారు. ఆమెతో కలిసి ప్రస్తుతం ప్రభుత్వానికి జంపన్న లొంగిపోయారు. -
మాపై ఎటువంటి ఒత్తిడి లేదు
-
మాపై ఎటువంటి ఒత్తిడి లేదు
సాక్షి, హైదరాబాద్: తాము లొంగిపోవడానికి సైద్ధాంతిక విభేదాలే కారణమని మావోయిస్టు నేత జంపన్న తెలిపారు. తమ లొంగుబాటు వెనుక ఎటువంటి ఒత్తిడి లేదన్నారు. ఉద్యమంలో ఉన్నప్పుడు మావోయిస్టు పార్టీ లైన్ ప్రకారం నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశామని చెప్పారు. పీపుల్స్‌వార్, మావోయిస్టుల లైన్ ఆ పరిస్థితుల్లో సరైందేనని.. గత 15 ఏళ్లలో దేశంలో అనేక సామాజిక మార్పులు జరిగాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో అర్ధ భూస్వామ్య పద్ధతి సరికాదని.. ఇప్పుడు భూస్వాములు లేరు, ఇప్పుడా భూస్వామ్య వ్యవస్థ కూడా లేదన్నారు. ప్రజలతో కలిసి పనిచేయడంలో మావోయిస్టు పార్టీ అనేక సమస్యలు ఎదుర్కొంటోందని, కాలానికి అనుగుణంగా మారలేకపోయిందని అభిప్రాయపడ్డారు. తనకున్న అభిప్రాయాలపై కమిటీతో నిర్దిష్టంగా చర్చించలేకపోయానని, అందుకే కేంద్ర కమిటీకి లేఖ రాసి బయటకు వచ్చానని వెల్లడించారు. తన ఆలోచనకు అనుగుణంగా పార్టీని మార్చడం సాధ్యం కాదని తెలుసుకుని, సాధారణ జీవితం గడపటానికి బయటకు వచ్చానని చెప్పారు. జంపన్న భార్య రజిత వరంగల్ గ్రామీణం జిల్లా వాసి అని, 2009లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెలిపారు. జంపన్నపై రూ. 25 లక్షలు, రజితపై రూ.5 లక్షలు రివార్డు ఉందని.. ఈ మొత్తాన్ని వీరిద్దరికీ ఇచ్చేస్తామన్నారు. జంపన్న, రజిత జనజీవన సవ్రంతిలో కలిసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. మాపై ఎటువంటి ఒత్తిడి లేదు -
సైద్ధాంతికంగా విభేదించి లొంగిపోయారు
సాక్షి, హైదరాబాద్: జంపన్న లాగే మిగతా మావోయిస్టు నేతలు కూడా లొంగిపోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తమ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న, ఆయన భార్య రజితను సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మావోయిస్టులతో సైద్ధాంతికంగా విభేదించి జంపన్న దంపతులు లొంగిపోయారని చెప్పారు. జంపన్న అసలు పేరు జినుగు నరసింహారెడ్డి అని, మహబూబ్‌నగర్ జిల్లా తొర్రూర్ మండలం చర్లపాలెం ఆయన స్వస్థలమని డీజీపీ వెల్లడించారు. 1984లో మల్లేపల్లిలో ఐటీఐ చదివేటప్పుడు మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఉద్యమంలోకి వెళ్లారని చెప్పారు. 33 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారని, అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడయ్యారని వివరించారు. జంపన్నపై 100 కేసులు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణలోనే 51 కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మారుతున్న సామాజిక మార్పులకు అనుగుణంగా మావోయిస్టు పార్టీ మారడం లేదు కాబట్టి ఉద్యమం నుంచి జంపన్న బయటకు వచ్చారన్నారు. జంపన్న భార్య రజిత వరంగల్ గ్రామీణం జిల్లా వాసి అని, 2009లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెలిపారు. జంపన్నపై రూ. 25 లక్షలు, రజితపై రూ.5 లక్షలు రివార్డు ఉందని.. ఈ మొత్తాన్ని వీరిద్దరికీ ఇస్తేస్తామన్నారు. జంపన్న, రజిత జనజీవన సవ్రంతిలో కలిసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. సైద్ధాంతికంగా విభేదించి లొంగిపోయారు -
మావోయిస్టు నేత కోబడ్ గాంధీకి బెయిల్
ఆరిలోవ (విశాఖ తూర్పు): మావో యిస్టు నేత కోబడ్ గాంధీ మంగళవారం విశాఖ కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తూ మారణాయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉన్నట్లు విశాఖ పోలీసులు గతంలో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి విశాఖపట్నం జైలులో ఉన్నారు. ఆయనపై ఉన్న కేసులన్నీ మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించినవే. ఇంగ్లండ్‌లో సీఏ చదివి.. కోబడ్ గాంధీ ముంబైలో ధనిక పార్సీ కుటుంబంలో జన్మించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీతో కలిసి డెహ్రాడూన్ యూనివర్సిటీలో పీజీ చదివారు. ఇంగ్లండ్‌లో సీఏ అభ్యసించారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్య మరణించడంతో కుటుంబాన్ని వదిలేసి మావో యిస్టు ఉద్యమంలోకి వచ్చారు. కాగా, తనపై ఎనిమిది కేసు లున్నాయని, ఎనిమిదేళ్లపాటు వివిధ కారాగారాల్లో శిక్ష అనుభవించానని కోబడ్ గాంధీ తెలిపారు. తీహార్ జైల్లో ఏడేళ్లు, చర్లపల్లి జైల్లో్ల నాలుగు నెలలు, విశాఖ జైల్లో్ల తొమ్మిది నెలలు ఉన్నట్లు చెప్పారు. వీటి న్నింటికంటే విశాఖ జైల్ బాగుందని కితాబిచ్చారు. ఇక్కడ స్నేహపూర్వక వాతావరణం ఉందన్నారు. -
ఎన్ఐఏ విచారణ.. సంచలన నిజాలు
సాక్షి : మావోయిస్ట్ కొమాండర్ కుందన్ పహన్ ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులో ఉన్న విషయం తెలిసిందే. జనతా దళ్ యునైటెడ్ నేత, జార్ఖండ్ మాజీ మంత్రి రమేష్ సింగ్ ముండా హత్య కేసులో కుందన్ అరెస్టై జైల్లో ఉన్నాడు. ఈ మేరకు ఎన్ఐఏ చేపట్టిన విచారణలో సంచలన వాస్తవాలను వెల్లడించాడు. రమేష్ సింగ్ హత్య కోసం మాజీ మంత్రి రాజా పీటర్ వద్ద నుంచి రూ.5 కోట్లకు సుపారీ తీసుకున్నట్లు కుందన్ వెల్లడించాడు. ఈ హత్యకు గాను పీటర్ తొలుత రూ.3 కోట్లు కుందన్‌కు అడ్వాన్స్‌గా చెల్లించాడు. మిగతా రూ. రెండు కోట్లను హత్య అనంతరం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఆ డబ్బు మావోయిస్ట్ పొలిట్‌బ్యూరోకు చేరకముందే.. మావోయిస్ట్ కమాండర్ బలరామ్ సాహు వాటిని తీసుకుని పరారయ్యాడు. చివరకు బలరామ్ పోలీసులకు చిక్కటంతో వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. మరో మాజీ అయిన గోపాల కృష్ణ పటార్ అలియాస్ రాజా పీటర్‌ను నాలుగు రోజుల క్రితం ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. రాజా పీటర్‌కు అంత పెద్దమొత్తంలో డబ్బులు ఎలా వచ్చాయి? వాటిని ఎవరు సమకూర్చారు? అన్న విషయంపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు జైల్లో ఉన్న మాజీ మావోయిస్టులను కూడా విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2008 జూలై లో రాంచిలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతుండగా.. మావోయిస్ట్ గెరిల్లా దళం దాడి చేసి రమేష్ ను కాల్చి చంపింది. బాడీ గార్డు శేష్‌నాథ్ సింగే మావోలకు సమాచారం ఇచ్చాడన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు కూడా. ఇక ప్రస్తుతం ఎన్ఐఏ రిమాండ్ లో ఉన్న రాజా పీటర్ అలియాస్ గోపాల కృష్ణ పటార్ 2009 తమర్ నియోజవర్గ ఉప ఎన్నికలో సంచలనం సృష్టించారు. అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం చీఫ్ శిబు సోరెన్‌ను రాజా పీటర్ ఓడించి చరిత్ర సృష్టించాడు. సీఎం ఓడిపోవటంతోనే అప్పుడు జార్ఖండ్‌లో రాష్టపతి పాలన విధించాల్సి వచ్చింది కూడా. -
లొంగుబాటలో మావోయిస్టు నేత ప్రకాశ్?
కొన్నాళ్లుగా ఆస్తమాతో ఇబ్బంది.. సాక్షి, ఖమ్మం: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కత్తి మోహన్‌రావు అలియాస్ ప్రకాశ్ అలియాస్ రాజన్న పోలీసులకు లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన కొన్నేళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నట్లు తెలిసింది. కత్తి మోహన్రావుది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గార్ల మండల కేంద్రం. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివారు. 1977లో ఉస్మానియా వర్సిటీలో ఎంఏ చదువుతూ ఆర్ఎస్యూలో పనిచేశారు. అప్పటి పీపుల్స్‌వార్ కార్యకలాపాలకు ఆకర్షితులై అజ్ఞాతబాట పట్టారు. 40 ఏళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన ఐదేళ్ల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో లొంగిపోవాలని భావించినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆయనపై పలు కేసులు ఉన్నాయి. -
గొర్రెలమెట్ట అడవిలో ఎన్కౌంటర్
మావోయిస్టు నేత జాంబ్రితో పాటు మరొకరు మృతి గూడెంకొత్తవీధి/కొయ్యూరు (పాడేరు): విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని గొర్రెలమెట్ట అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత జాంబ్రి (గెమ్మిలి నారాయణరావు), దళ సభ్యుడు చిట్టిబాబు అలియాస్ కిషోర్ మరణించారు. మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీలో జాంబ్రి డివిజినల్ మెంబర్‌గా ఉన్నాడు. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంలో పోలీసులు తమ ప్రణాళికను అమలు పరిచారు. జాంబ్రి స్వగ్రామం జీకేవీధి మండలం మెట్టిగూడ. ఇతనిపై ప్రభుత్వ ం రూ. 4 లక్షల రివార్డు ప్రకటిం చింది. 2008లో జరిగిన బలిమెల ఘటనలో జాంబ్రి కీలక పాత్ర పోషించాడు. కాగా గొర్రెలమెట్ట గ్రామానికి చెందిన గోపాలరావునూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఒక థాంప్సన్ సబ్‌మెషీన్ గన్‌తో పాటు ఒక షాట్ గన్, డిటోనేటర్లు, స్వాధీనం చేసుకు న్నట్లు ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ వెల్లడించారు. -
'ఆర్కే కాళ్లకు గాయాలు.. లొంగిపోతే మంచిది'
-
'ఆర్కే కాళ్లకు గాయాలు.. లొంగిపోతే మంచిది'
మల్కన్‌గిరి: ఇప్పటికైనా మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే లొంగిపోయి సరైన వైద్యం చేయించుకోవాలని ఒడిశా పోలీసులు కోరారు. వైద్య సేవలు అందించేందుకు ఒడిశా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. అక్టోబర్ 24న జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఆర్కే గాయపడ్డారని, ఆయన కాళ్లకు గాయాలయ్యాయని, ఇప్పటికైనా లొంగిపోయి శస్త్ర చికిత్సలాంటివి చేయించుకోవచ్చని మల్కన్ గిరి ఎస్పీ మిత్రభాను మహాపాత్ర చెప్పారు. ప్రస్తుతం ఆయన ఒడిశా -ఆంధ్ర సరిహద్దులోని ఏదో గుర్తు తెలియన వైద్య శిబిరంలో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిసిందని అన్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని ఆస్పత్రులన్నింటిలో అప్రమత్తత ప్రకటించినట్లు సమాచారం. ఏక్షణమైనా వైద్యం కోసం ఆర్కే వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అలా రాకుంటే ఆయనకు మెరుగైన వైద్యం అందే అవకాశం లేదని కూడా చెబుతున్నారు. కీలక సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఆయన ప్రస్తుతం నాటు వైద్యం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఆర్కే తన కుమారుడు మున్నా, ఇతర బృందం మధ్యలో ఉన్నాడని, చాలా చాకచక్యంగా తప్పించుకున్నారని మహాపాత్ర తెలిపారు. -
ఆపరేషన్ ఆర్కేలో మైండ్‌గేమ్ ఎవరిది?
అభిప్రాయం ప్రజల మధ్యన ఉన్న మావోయిస్టులపై ‘ఆపరేషన్ ఆర్కే’ పేరుతో పెద్ద ఎత్తున దాడికి పూనుకుంటారు. ఆ ఘటనలో మృతుల గురించిన ప్రకటనల విషయంలో తొలి రోజునుంచి తామే మైండ్ గేమ్ ఆడుతూ ఎదుటివారిది మైండ్ గేమ్ అంటారు. మనుషుల స్వభావాలు, ఉద్దే శాల గురించి ప్రస్తావించడానికి జంతువుల పోలిక తీసుకురావడం చిరకాలంగా ఉన్నదే. ప్రపంచ సాహిత్యం నిండా ఇది కని పిస్తుంది. మన పంచతంత్రం కథలు అందుకు మంచి ఉదా హరణ. వర్గ సమాజంలో మను షుల స్వభావాలు వాళ్ల ప్రయోజ నాల వల్ల, వాళ్ల స్వార్థం వల్ల మారిపోతూ ఉంటాయి. కానీ జంతువుల సహజాతాలు మనుషుల సంపర్కంలోకి వస్తే తప్ప మారిపోయే అవకాశం లేదు. తొండ ముదిరి ఊసర వెల్లి కావడం, రంగులు మార్చడం, గొంగడి పురుగు సీతా కోక చిలుకగా మారటం ప్రకృతి సిద్ధ్ధమైన పరిణామాలు, సహజాతాలు. ఇందులో మంచి, చెడు అని అనేది ఏమీ లేదు. ఇది ఒక పరిణామం. వర్గసమాజంలోని మానవు లకు ఇటువంటి పోలిక తేవడానికి వీల్లేదు. ఏజెన్సీలో ‘ఊసరవెల్లి’ పేరుతో వెలసిన ఈ పోస్టర్ల సందర్భమే చూద్దాం. ప్రచురించినది ప్రగతిశీల ఆదివాసీ యువత - ఏ తొండ ఊసరవెల్లిగా మారిన రూపానికి ఇది మారుపేరు? ఇది ఆంధ్ర ఎస్ఐబీ తొండ ముదిరిన ఊస రవెల్లి రూపమా? లేక చంద్రబాబు రాజ్యాంగ యంత్ర ఊసరవెల్లి రూపమా? పదహారేళ్లుగా జల్-జంగల్-జమీన్ కోసం, ప్రాదేశిక హక్కుల కోసం గ్రామ విప్లవ అధికారాలు ఏర్పాటు చేసుకుంటున్న ప్రజలపై, వాళ్ల మధ్యన ఉన్న మావోయిస్టులపై ‘ఆపరేషన్ ఆర్కే’ పేరుతో పెద్ద ఎత్తున దాడికి పూనుకుంటారు. ఆ ఘటనలో మృతుల గురించిన ప్రకటనలపై తొలి రోజునుంచి తామే మైండ్ గేమ్ ఆడుతూ ఎదుటివారిది మైండ్ గేమ్ అంటారు. ఈ రంగులు మార్చడం పాలక వర్గాలకు సహజమే. రామ్‌ఘడ్ ఎన్కౌంటర్ గురించి నేను అక్టోబర్ 24 నుంచి ఇస్తూ వస్తున్న ప్రకటనలే నిర్దిష్టంగా చూద్దాం. అక్టో బర్ 24వ తేదీ అంతా ఆంధ్రా డీజీపీ దాన్ని ‘ఆపరేషన్ ఆర్కే’ అన్నాడు. ఆర్కే గాయపడి పోలీసుల అదుపులోనే ఉండే అవకాశం ఉందని, సీఆర్బి, తెలంగాణ పార్టీ భావిం చినందువల్ల తెలుసుకునే ప్రయత్నం చేశాను. తమ అదు పులో లేడని పోలీసు అధికారులు ప్రొ. హరగోపాల్‌కు, బాధ్యత గల వారికి చెప్పినప్పుడు అదుపులో లేకపోవచ్చు గానీ, వాళ్ల నిఘాలో ఉండే అవకాశం ఉందని చెప్పాను. నేను వాడిన మాట ‘పోలీసుల నిఘా’, ‘విసినిటి’, అంటే వాళ్ల కనుసన్నల్లో ఉండే ప్రాంతం అనే అర్థంలో. వదంతులు, ప్రచారాలు చాలా జరిగాయి. విషాహారం పెట్టారని, ఆహారంలో మత్తు మందు చల్లారని వంటివి. ఆర్కే గాయపడడమే కాదు అట్లా పోలీసుల చేతుల్లో పడ్డా డని కూడా. అప్పటికే తన కొడుకు పృథ్వీ (మున్నా)ను ఈ ఎన్కౌంటర్లో కోల్పోయి, మృతదేహాన్ని తీసుకువెళ్లిన కన్న తల్లి శిరీష ఈ ప్రచారాలతో, ఈ ప్రకటనతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. ఆర్కే తమ అదుపులో ఉంటే కోర్టులో హాజరు పరచాలని కోరింది. పోలీసుల నిఘావరణలో, వాళ్ల నిఘా కనుసన్నల్లో ఉండే అవకాశం ఉందనే మాట వాడాను తప్ప, వాళ్ల అదుపులో ఉన్నాడని గానీ, వాళ్లు చిత్రహింసలు పెడుతున్నారని గానీ నేను ఏ సందర్భంలో కూడా ఆరోపించలేదు. అదు పులో ఉండటం అంటే ఎన్కౌంటర్ చేయడమే అని నాకు తెలుసు. ఇంత పెద్ద సంఘటనలో ఆర్కే అదుపులో ఉన్నా డని అనుమానించడానికి, ఆందోళన చెందడానికి ఆస్కారం ఉంది గనుక కోర్టు ఈ ఆరోపణను విచారించడానికి ఏదైనా చట్టబద్ధమైన ఆధారాన్ని చూపండని హైకోర్టులో న్యాయ మూర్తులు కూడా అన్నప్పుడు మాత్రమే శిరీష తరఫు న్యాయవాది రఘునాథ్ నన్ను సంప్రదించి అందుకు రెండు వారాల సమయం తీసుకున్నారు. ఆ రాత్రే ఆర్కే క్షేమం అని తెలియడం వల్ల ఇంక ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తొల గించాలని వెంటనే మీడియాకు ‘ఆర్కే క్షేమం’ అని తెలి పాను. పోలీసు దిగ్బంధంలో చిక్కుకుపోయిన మేం ప్రజ లకు చెప్పడంలో కొంత ఆలస్యం జరిగింది అంటూ ఏఓబీ కార్యదర్శి జగబంధు చేసిన ప్రకటనబట్టి కూడా.. పోలీసు దిగ్బంధం అంటే పోలీసుల అదుపులో అన్నట్లే కదా. మనుషులు పోలీసు యంత్రాంగంగా, ప్రభుత్వంగా మారినప్పుడు వాస్తవాలను చెప్పే బాధ్యత నిర్వహించడం లేదన్నదే నేను ఈ మైండ్ గేమ్ ఆడుతున్న రాజ్యంపై 1969 నుంచి కూడా చేస్తున్న ఆరోపణ. ఈ సందర్భంగా ఏ పాపం ఎరుగని ఊసరవెల్లి లాంటి ప్రాణుల పోలిక తేవడం మరొక నేరమని నేను ఆరోపించదల్చుకున్నాను. నాకు ఊసరవెల్లి పోలిక తీసుకువచ్చారు గానీ ఈ ఆరో పణ చేస్తున్న వాళ్లకు (వాళ్లెవరైనా సరే అది రాజ్య ప్రాయోజి తమైందని నేను భావిస్తున్నాను) నేను మ్యాకవెల్లి పోలిక చెప్పదల్చుకున్నాను. మన దేశంలో విశ్వవిద్యాలయాలను నెలకొల్పిన రోజులలో, అంటే 19వ శతాబ్దం ఉత్తరార్ధంలో ఈ పేరు చాలా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు తనను మెకాలే అంటున్నాం. వర్శిటీల ఏర్పాటుకు ఈ దేశ బుద్ధిజీవుల భావాలను వలసీకరించాలనే ప్రయత్నాలకూ ఈయననే వ్యూహకర్త అని చెపుతారు. మన దేశంలో గిరీశం వంటి ఆషాడభూతులు తయారు కావడానికి ఇటువంటి మ్యాకవెల్లిల ఆలోచనలే మూలం. ప్రపంచ బ్యాంక్ సీఈఓలు.. ప్రజలు ఎన్నుకుంటున్న ముఖ్యమంత్రులుగా ఉన్నంత కాలం మనకు మ్యాకవెల్లి, గిరీశాల పోలికలు రోజూ తటస్థిస్తూనే ఉంటాయి. కనుక ఇకనైనా మనుషుల భాషలో మాట్లాడుకుందాం. మనకు అర్థం కాని భాష మాట్లాడి, మన భాష అర్థం కాని ప్రాణు లను వాటి మానాన వాటిని వదిలేద్దాం. తాను పొత్తు పెట్టు కున్న బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జంతు ప్రేమికు రాలు మేనకా గాంధీ గురించైనా ఈ సూచనను చంద్రబాబు నాయుడు పాటిస్తాడని ఆశిస్తాను. వరవరరావు వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు -
ఆర్కే పోలీసుల వద్దనే ఉన్నాడనడానికి ఆధారాలేవి?
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత ఆర్కే తమ అదుపులో లేడని ఆంద్రప్రదేశ్ పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపి పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఆర్కే ఆచూకీని తెలపాలని కోరుతూ ఆయన భార్య శిరీష దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ మేరకు ఏపీ పోలీసులు ఆర్కే తమ వద్ద లేడని కౌంటర్లో పేర్కొన్నారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది ఆర్కే పోలీసుల వద్దే ఉన్నాడని విన్నవించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆధారలుంటే కోర్టు ముందు ఉంచాలని పిటిషన్ తరపు లాయర్ కు సూచించారు. ఆధారాలు సమర్పించేందుకు పిటిషనర్ 10 రోజుల గడువును కోరారు. దీనిపై విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు. ఆర్కే పోలీసులు అదుపులో ఉన్నాడనడంలో వాస్తవం లేదని విశాఖ ఎస్పీ తెలిపారు. ఆర్కే పై 40 కేసులు ఉన్నాయని, 22 కేసుల్లో ఆయన కోర్టుకు హాజరు కావడంలేదని తెలిపారు. ఏఓబిలో జరిగిన ఎన్ కౌంటర్ సమయం నుండి మావో అగ్రనేత రామకృష్ణ ,గాజర్ల రవి, చలపతిల ఆచూకీ లేదు. ఇప్పటివరకు వారి సమాచారం గురించి పార్టీ వర్గాలకు సమాచారం చేరలేదు. దీంతో పోలీసుల అదుపులోనే మావో అగ్రనేతలు ఉన్నారని రామకృష్ణ కుటుంబసభ్యులు , ప్రజాసంఘాలు, హాక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు. రామకృష్ణ ఆచూకీ కోసం ఆయన సతీమణి రెండు రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఆర్కేను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
లెఫ్ట్ పార్టీల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: మావోయిస్ట్ నేత రామకృష్ణను వెంటనే కోర్టులో హజరుపరచాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. గత నెల 24న జరిగిన ఎన్కౌంటర్, ఆ తర్వాత జరిగిన కాల్పులపై న్యాయవిచారణకు ఆదేశించాలని మంగళవారం జరిగిన ఎనిమిది వామపక్ష పార్టీల సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్, ఆ తర్వాతి ఘటనలపై పోలీసు అధికారుల విరుద్ధ ప్రకటనల వల్ల ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమ వుతున్నందున వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఆర్కేను పట్టుకుని పోలీస్ కస్టడీలో ఉంచుకోవడంతో ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆర్కే బంధువులు ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. ఈ మేరకు చాడ వెంకటరెడ్డి (సీపీఐ), చెరుపల్లి సీతారాములు (సీపీఎం), సాధినేని వెంకటేశ్వరరావు (న్యూడెమోక్రసీ-చంద్రన్న), జె.జానకిరాములు (ఆర్ఎస్పీ), తాండ్రకుమార్ (ఎంసీపీఐ-యూ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ), బండా సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), భూతం వీరన్న (సీపీఐ-ఎంఎల్) సంయుక్త ప్రకటన విడుదల చేశారు. -
ఆర్కే ఎక్కడ?
► అతను మీ వద్ద ఉన్నారా.. లేరా.. చెప్పండి ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ► గురువారానికల్లా కౌంటర్ దాఖలు చేయండి ► ఆర్కే సతీమణి శిరీష పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం ► మావోయిస్టులు కూడా మనుషులే ► ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది ► ప్రాణాలు, విలువలే అన్నింటికన్నా ముఖ్యమైనవి ► ఏ వ్యక్తి ప్రాణమైనా న్యాయస్థానానికి ఒక్కటే ► ప్రభుత్వం ఎప్పుడూ చట్టబద్ధంగానే వ్యవహరించాలి ► సజీవంగా పట్టుకుని ఉంటే హాని చేయరనే విశ్వసిస్తున్నాం ► హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు ఇటువంటి ఎన్కౌంటర్ విషయంలో వచ్చిన ఆరోపణలన్నింటినీ పూర్తిగా ఖండిస్తూపోవడం సమస్యకు పరిష్కారం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో మూడింటికి ఆస్కారం ఉంది. ఒకటి.. ఎన్కౌంటర్లో ఆర్కే మరణించి ఉండాలి. రెండవది.. అతను ఘటనా స్థలం నుంచి తప్పించుకుని వెళ్లి ఉండాలి. మూడోది.. పోలీసులు అతన్ని నిర్బంధించి ఉండాలి. అయితే రెండోది జరిగే దానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఒకవేళ అతను తప్పించుకుని ఉంటే కచ్చితంగా తన క్షేమ సమాచారాన్ని ఏదో ఒక రకంగా తన వారికి తెలియచేసి ఉండేవారు. అదే జరిగి ఉంటే ఈ కోర్టు ముందు ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలై ఉండేది కాదు.’ – ధర్మాసనం సాక్షి, హైదరాబాద్ మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే)ని కోర్టు ముందు హాజరుపరిచేటట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆర్కే సతీమణి కందుల శిరీష దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు స్పందిస్తూ... రామకృష్ణ ఆచూకీకి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఉదయం కోర్టు వేళలు ప్రారంభం కాగానే శిరీష తరఫు న్యాయవాది రఘునాథ్ తమ వ్యాజ్యం గురించి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యవసరంగా ఈ వ్యాజ్యంపై లంచ్‌మోషన్ రూపంలో విచారించాలని కోరారు. ఇందుకు జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. అందులో భాగంగా మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టింది. ఆర్.కెను పోలీసులే అక్రమంగా నిర్భంధించారు... ఈ సందర్భంగా రఘునాథ్ వాదనలు వినిపిస్తూ, అక్టోబర్ 23న ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా సరిహద్దుల్లో (ఏవోబీ) భారీ ఎన్కౌంటర్ జరిగిందన్నారు. ఇందులో మొత్తం 14 మంది చనిపోయారని తేలగా, చివరికి ఆ సంఖ్య 32కి చేరిందని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో ఆర్.కె.గన్మెన్లు కూడా చనిపోయారన్నారు. అంతేకాక ఆర్.కె కుమారుడు మున్నా మరణించగా, ఆర్.కె. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని, వీరి ఆచూకీ ఎంత మాత్రం తెలియడం లేదని రఘునాథ్ వివరించారు. కనిపించకుండా పోయిన వారిని ఏపీ పోలీసులే అక్రమంగా నిర్బంధించి, చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. రామకృష్ణను పోలీసులు ఏపీకి కాకుండా మరో రాష్ట్రానికి తరలించారన్నారు. ఆర్.కెతో సహా మిగిలిన వారి ప్రాణాలకు ముప్పు ఉందని, అందువల్ల వారిని కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ‘ఆర్.కె, తదితరులు పోలీసుల అదుపులో ఉన్నారని ఎలా చెబుతున్నారు? అందుకు మీ వద్ద ఉన్న ఆధారాలేమిటి?’ అని ప్రశ్నించింది. దీనికి రఘునాథ్ సమాధానమిస్తూ, ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిలో ఆర్.కె కుమారుడు, గన్మెన్లు ఉన్నారని, ఈ విషయాన్ని పోలీసులు కూడా నిర్ధారించారని తెలిపారు. ఆర్.కెతో సహా మరికొంత మందిని పోలీసులు అక్రమంగా నిర్భంధించినట్లు మావోయిస్టు పార్టీ నేతలు ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారన్నారు. అలా అయితే.. ఈ పిటిషన్ దాఖలయ్యేదే కాదు... దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అంత మంది ప్రాణాలు పోగొట్టుకున్న సుదీర్ఘ ఎన్కౌంటర్ గురించి తాము గతంలో ఎన్నడూ వినలేదంది. ‘ఇటువంటి ఎన్కౌంటర్ విషయంలో వచ్చిన ఆరోపణలన్నింటినీ పూర్తిగా ఖండిస్తూపోవడం సమస్యకు పరిష్కారం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో మూడింటికి ఆస్కారం ఉంది. ఒకటి.. ఎన్కౌంటర్లో ఆర్.కె మరణించి ఉండాలి. రెండవది.. అతను ఘటనా స్థలం నుంచి తప్పించుకుని వెళ్లి ఉండాలి. మూడోది.. పోలీసులు అతన్ని నిర్బంధించి ఉండాలి. అయితే రెండోది జరిగే దానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఒకవేళ అతను తప్పించుకుని ఉంటే ఖచ్చితంగా తన క్షేమ సమాచారాన్ని ఏదో ఒక రకంగా తన వారికి తెలియచేసి ఉండేవారు. అదే జరిగి ఉంటే ఈ కోర్టు ముందు ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలై ఉండేది కాదు.’ అని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్ స్పందిస్తూ, ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి రామకృష్ణ తప్పించుకుని ఉంటారని, ఆ ప్రాంతంలో ఫోన్ నెట్వర్క్ సరిగా లేకపోవడం వల్లే క్షేమ సమాచారం వెల్లడి అయి ఉండకపోవచ్చునని తెలిపారు. ఎన్కౌంటర్ కూడా ఆంధ్రప్రదేశ్ పరిధిలో జరగలేదన్నారు. మావోయిస్టులూ మనుషులే... దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ‘ కావాల్సిన వారిని సంప్రదించేందుకు వారికి ఉండే మార్గాలు వారికి ఉంటాయి. వారిని తక్కువగా అంచనా వేయవద్దు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పి తీరాలి. ఆర్.కె. మీ వద్ద ఉన్నారా?లేదా? ఈ గురువారం నాటికి చెప్పండి. ప్రతీ వ్యక్తి ప్రాణం ఈ కోర్టుకు అత్యంత ముఖ్యం. ప్రభుత్వ ఫిలాసఫీ కూడా ఇదే అయి ఉండాలి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మావోయిస్టులు కూడా మనుషులే. మాకు కావాల్సింది అతను ఎక్కడున్నారని? ఒకవేళ సజీవంగా పట్టుకుని ఉంటే అతనికి ఏ హానీ తలపెట్టరని ఈ కోర్టు విశ్వసిస్తోంది.’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అది మావోయిస్టులైనప్పటికీ కూడా. అన్నింటికన్నా ముఖ్యమైనవి ప్రాణాలు, విలువలు. జరిగింది నిజమైన ఎన్కౌంటర్ అయితే తప్పుపట్టేందుకు ఏమీ ఉండదు. కాని ప్రభుత్వం ఎప్పుడూ చట్టబద్ధంగానే వ్యవహరించాలి. ఈ న్యాయస్థానానికి ఏ వ్యక్తి ప్రాణామైనా ఒక్కటే. ఈ కేసులో మాకు కావాల్సింది ఒక్కటే.. అతను (ఆర్.కె) ఎక్కడ..? ఈ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందనే భావిస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారంలో మేమేమీ ప్రభుత్వాన్ని శంకించడంలేదు. పరిస్థితి చాలా సున్నితంగా కనిపిస్తోంది. ఒకవేళ ఆయన్ను సజీవంగా పట్టుకుని ఉంటే, ఆయనకు ఎలాంటి హానీ కలిగించరనే విశ్వసిస్తున్నాం.’’ – జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం -
‘గ్రీన్ హంట్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్’
హైదరాబాద్ : మల్టీ నేషనల్ కంపెనీల కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ హంట్ పేరుతో బూటకపు ఎన్ కౌంటర్ చేసిందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల పోరాటానికి అండగా ఉన్న మావోయిస్టులను హత్య చేశారన్నారు. ఎన్ కౌంటర్ నిజమయితే న్యాయబద్ధంగా విచారణ జరిపించాలని హరగోపాల్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం అదుపులో ఉన్న ఆర్కేను వెంటనే కోర్టులో హాజరుపరచాలని, ఏవోబీలో గ్రేహౌండ్స్ కూంబింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని, బూటకపు ఎన్ కౌంటర్లో 32మందిని చంపిన అధికారులపై హత్యానేరం మోపి కఠినంగా శిక్షించాలని తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం (టీడీఎఫ్) డిమాండ్ చేసింది. -
ఆర్కే చనిపోయారా? పోలీసుల కస్టడీలో ఉన్నారా?
హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, సాధారణ పౌరుడైనా, మావోయిస్టు అయినా మనిషే అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్ కౌంటర్ పేరుతో మనుషులను చంపటం సరికాదని అభిప్రాయపడింది. ఆర్కే చనిపోయారా?...లేక పోలీసుల కస్టడీలో ఉన్నారో తెలపాలని హైకోర్టు ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఒకవేళ పోలీసుల కస్టడీలో ఉంటే ఆర్కేకు ఎలాంటి ప్రాణహానీ తలపెట్టవద్దని ఆదేశించింది. ఎన్ కౌంటర్ జరిగి ఇన్నిరోజులు అయినా వివరాలు తెలిపేందుకు ఇంత సమయం ఎందుకు పడుతుందని న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. ఆర్కే ఎక్కడున్నారన్న దానిపై తక్షణమే ప్రభుత్వం సమగ్ర సమాచారంతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా ఆర్కే భార్య శిరీష మాట్లాడుతూ తన భర్త పోలీస్ కస్టడీలోనే ఉన్నారని, ఆర్కేను వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్‌పై చాలా అనుమానాలు ఉన్నాయని, ఎన్ కౌంటర్ తర్వాత మరుసటి రోజుకు మృతుల సంఖ్య పెరగడం, కొన్ని మృతదేహాలను గుర్తించకుండా ఖననం చేయడం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని శిరీష తరఫు న్యాయవాది అన్నారు. కాగా తన భర్త ఆర్కేను తక్షణమే కోర్టులో హాజరు పరచాలని ఆయన భార్య హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ నెల 24 ఏవోబీ ఎన్ కౌంటర్ అనంతరం ఆర్కే ఆచూకీ లేదు. -
హైకోర్టులో ఆర్కే భార్య పిటిషన్
హైదరాబాద్: ఏవోబీలో ఎన్కౌంటర్ తర్వాత కనిపించకుండా పోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే భార్య శిరీష హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే బూటకపు ఎన్కౌంటర్లో మావోయిస్టులను చంపారన్నారు. మరికొందరు పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. తప్పించుకుపోయిన వారిలో అగ్రనేత ఆర్కే కూడా ఉండవచ్చునని పోలీసులు చెబుతున్నారన్నారు. అయితే, ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నాడని ఆయన భార్య అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై పోలీసులు వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని, ఆయన్ను విడుదల చేయాలని కోరారు. దీనిపై హైకోర్టు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాగా ఈ నెల 24న జరిగిన ఏవోబీ ఎన్కౌంటర్లో ఆర్కే తనయుడు పృథ్వీ అలియాస్ మున్నా మృతి చెందిన విషయం తెలిసిందే. -
కూంబింగ్ నిలిపివేశాం: ఏపీ డీజీపీ
-
ఆర్కే ఏమయ్యాడు?
పోలీసుల కస్టడీలోనే..: విరసం నేత వరవరరావు ప్రజలే రక్షించుకున్నారు: ఆర్కే భార్య పద్మక్క మా అదుపులో లేరు: ఏపీ డీజీపీ సాంబశివరావు ఆర్కేను చంపేశారు: మల్కన్‌గిరి డివిజన్ కార్యదర్శి వేణు ఆర్కే సురక్షితంగానే ఉన్నారు: పౌరహక్కుల సంఘం భిన్న ప్రకటనలు, వాదనలతో గందరగోళం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఆర్కే ఏమయ్యాడు? అసలు ఉన్నాడా? లేడా.. ఉంటే ఎక్కడున్నాడు? ఏమైపోయాడు? మావోయిస్టు పార్టీలోనే కాదు వామపక్షాలు, ప్రజా సంఘాల్లోనూ ఒకటే ఉత్కంఠ. రాష్ట్రమంతా ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఆర్కే విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో స్పందిçస్తున్న తీరుపై గందరగోళం కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) ఆచూకీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.‘ఆపరేషన్ ఆర్కే’పేరుతోనే మల్కన్‌గిరి ఎన్కౌంటర్ జరిగినట్టుగా ఏపీ పోలీసు వర్గాలు సైతం అంగీకరిస్తున్నప్పటికీ ఆర్కే ఏమయ్యాడో అంతు చిక్కని ప్రశ్నగా తయారైంది. సంఘటనా ప్రాంతంలో రెండు శిబిరాల్లో సుమారు 40 మంది మావోలుంటే ఒక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకొని పోలీసులు కాల్పులు జరిపారని, రెండో శిబిరంలో ఆర్కే ఉన్నారనే వాదన వినిపించింది. ఎదురుకాల్పుల సమయంలో ఆర్కేతో సహా చలపతి, గాజర్ల రవి, అరుణ వంటి అగ్రనేతలు తప్పించుకుని ఉంటారని పోలీసులు సంకేతాలిచ్చారు. కానీ ఈ ఘటనలో ఆర్కేతో సహా అగ్రనేతలంతా పోలీసులకు చిక్కారని.. వారిని అక్కడ నుంచి విచారణ పేరుతో వేరే ప్రాంతానికి తరలించుకుపోయారని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ఏవోబీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారని లేఖ విడుదల చేశారు. ఏపీసీఎల్సీ నాయకుడు కల్యాణ రావు సైతం ఆర్కే పోలీసుల కస్టడీలోనే ఉన్నారని.. పోలీసులు వాస్తవాలను తొక్కిపెట్టారని ఆరోపించారు. మరోవైపు కుమారుడు పృధ్వీ అలియాస్ మున్నాను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న పద్మక్క మాత్రం తన భర్త ఆర్కే సురక్షితంగానే ఉన్నారని, ప్రజలే రక్షించి ఉంటారని భావిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే ఆర్కే తమ అదుపులో లేరని, అసలు ఆ రోజు సంఘటనా స్థలంలోనే లేరని డీజీపీ సాంబశివరావు చెప్పుకొస్తున్నారు. డీజీపీ వాదనే సరైందని అనుకుంటే... వేరేచోట ఉన్న ఆర్కే ఇప్పటివరకు ఎన్‌కౌంటర్‌పై ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోనీ తప్పించుకున్న ఆర్కే తాను సురక్షితంగానే ఉన్నానని ఎందుకు ప్రకటన చేయడం లేదన్న వాదనలూ ఉన్నాయి. ఆర్కే లాంటి అగ్రనేత మా అదుపులో ఉంటే ఎందుకు మా దగ్గర ఉంచుకుంటామని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ పేర్కొన్నారు. వేణు ప్రకటనతో అలజడి గత ఐదు రోజులుగా వస్తున్న పొంతన లేని వాదనలకు భిన్నంగా శుక్రవారం మల్కన్‌గిరి డివిజన్ కార్యదర్శి ప్రతాప్ అలియాస్ వేణు పేరిట వెలువడిన ప్రకటన ఆందోళన రేకెత్తిస్తోంది. 24న జరిగిన ఎన్కౌంటర్లో ఆర్కేని దారుణంగా చంపేశారని ఆయన శుక్రవారం ముంచంగిపుట్టు మండల విలేకరులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. చలపతి, అరుణ మాత్రం తప్పించుకున్నా ఆర్కే మాత్రం పోలీసుల తూటాలకు బలయ్యాడని ఆయన చెప్పుకొచ్చారు. పోలీసులు ఆర్కే మృతదేహాన్ని దాచి కుటుంబసభ్యులను, ప్రజా సంఘాల నాయకులను తప్పుదోవ పట్టించారని ఆరోపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మరోవైపు వేణు పేరిట వచ్చిన ఫోన్‌కాల్ అంతా డ్రామా అని, అదంతా పోలీసుల నాటకంలో భాగమని పొరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్కే ఎక్కడున్నాడో తెలియదు కానీ సురక్షితంగానే ఉండి ఉంటారన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన వారిలో 18మంది మాత్రమే మావోయిస్టులని, మిగిలిన వారంతా మిలీషియా సభ్యులు, వాళ్లకు ఆహారం తీసుకువెళ్లిన అమాయక గిరిజనులేనని ఆయన ఆరోపించారు. ఆ నలుగురు ఎక్కడున్నట్టు..? కాల్పుల ఘటన నుంచి ఆర్కే తప్పించుకున్నప్పటికీ ఇంకా సురక్షిత ప్రదేశానికి వెళ్లలేదని, అందుకే ఆయన్నుంచి సంకేతాలు రావడం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఏవోబీ అడవుల నుంచి తప్పించుకున్న ఆర్కే మైదాన ప్రాంతానికి చేరుకోవడానికి సమయం పడుతుందని, అందుకే ఆయన ఆచూకీ విషయంలో జాప్యం జరుగుందన్న వాదనలూ ఉన్నాయి. ఆర్కే కాకున్నా గాజర్ల రవి, చలపతి, అరుణల్లో ఎవరో ఒకరి నుంచి స్పష్టమైన సంకేతం వస్తేనే ఆ నలుగురి ఆచూకీపై నెలకొన్న గందరగోళానికి తెరపడుతుంది. -
కూంబింగ్ నిలిపివేశాం: ఏపీ డీజీపీ
విజయవాడ: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ పోలీసుల అదుపులో లేరని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు చెప్పారు. ఏవోబీ ఎన్కౌంటర్ ఆర్కే లక్ష్యంగా జరగలేదని స్పష్టం చేశారు. ఏవోబీలో భారీ ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసు బలగాలు కూంబింగ్‌కు వెళ్లాయని, మావోయిస్టులు ఎదురుకావడం వల్లే ఎదురుకాల్పులు జరిగాయని డీజీపీ వివరించారు. భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలు లభించాయని, దీన్నిబట్టి అక్కడ మావోయిస్టు అగ్రనేతలు ఉండే అవకాశముందని డీజీపీ చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కూంబింగ్ నిలిపివేశామని తెలిపారు. ఆర్కే నుంచి మావోయిస్టులకు సమాచారం లేకపోవడం వల్లే పోలీసుల అదుపులో ఉన్నాడని ఆరోపిస్తున్నారని డీజీపీ సాంబశివరావు చెప్పారు. -
'మావోయిస్టు ఆర్కే.. మా దగ్గర లేరు'
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే) తమ అదుపులో లేరని విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చెప్పారు. ఈ విషయంలో ప్రజాసంఘాల ఆరోపణలు అవాస్తవమని ఆయన అన్నారు. కేవలం ప్రచారం కోసమే వరవరరావు లాంటి వాళ్లు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు. ఆర్కే సహా మావోయిస్టు నేతలు ఎవరూ తమ అదుపులో లేరని ఆయన తెలిపారు. ఎన్కౌంటర్లో మొత్తం 30 మంది మరణించారని, వారిలో 16 మందిని మాత్రమే గుర్తించామని, మరో 14 మందిని ఇంకా గుర్తించలేదని అన్నారు. బంధువులు ఎవరైనా వారిని గుర్తిస్తే వారికి అప్పగిస్తామని, లేనిపక్షంలో తామే ఖననం చేస్తామని వివరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇందుకు 72 గంటలు వేచి చూస్తామన్నారు. అలాగే.. మహిళా మావోయిస్టుల మీద అత్యాచారాలు జరిగాయన్నవి కూడా తప్పుడు కథనాలేనని ఆయన స్పష్టం చేశారు. పోస్టు మార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో కెమెరాలతో చిత్రీకరించామని, ఇందులో ఎలాంటి ఆరోపణలకు తావు లేదని రాహుల్ దేవ్ శర్మ చెప్పారు. -
పోలీసుల అదుపులో ఆర్కే?
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఆంధ్రా ఒడిషా సరిహద్దులలోని మల్కన్‌గిరి జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ సందర్భంగానే ఆర్కే సహా పలువురు అగ్రనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విరసం నాయకుడు వరవరరావు ఆరోపించారు. వాళ్లందరినీ వెంటనే కోర్టులో హాజరు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్కేకు ఏం జరిగినా తెలుగుదేశం ప్రభుత్వానిదే బాధ్యత అవుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ డెమొక్రాటిక్ ఫోరం కన్వీనర్లు ప్రొఫెసర్ హరగోపాల్, పీఎపల్ విశ్వేశ్వరరావు, జైని మాలయ్య, జస్టిస్ చంద్రకుమార్, చిక్కుడు ప్రభాకర్, బండి దుర్గాప్రసాద్, బళ్ల రవీందర్, కోట శ్రీనివాస్ తదితరులు కూడా ఆర్కేను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అయితే.. ఆర్కే తమ అదుపులో లేరని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు ఇంతకుముందు చెప్పారు. ఎన్కౌంటర్ నుంచి ఆర్కే, గాజర్ల రవి తదితరులు తప్పించుకున్నారని తొలుత కథనాలు వచ్చాయి. ప్రధానంగా ఆర్కేనే టార్గెట్ చేసి ఈ ఎన్కౌంటర్ ప్లాన్ చేసినా, చివరి నిమిషంలో ఆయన అక్కడినుంచి సురక్షితంగా వెళ్లిపోయారని అన్నారు. కానీ ఇప్పుడు ఆర్కే ఆచూకీ తెలియకపోవడం.. మృతదేహాల్లో కూడా అగ్రనాయకులు ఎవరివీ లేకపోవడంతో.. ఆర్కే తదితరులు పోలీసుల అదుపులోనే ఉన్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో ప్రభుత్వం జరిపిన చర్చలకు మావోయిస్టుల ప్రతినిధిగా కూడా ఆర్కే హాజరైన విషయం తెలిసిందే. ఏఓబీ ప్రాంతంలోనే ఆర్కే తిరుగుతున్నారన్న పక్కా సమాచారం ఉండటం వల్లే ఈ ఎన్కౌంటర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆర్కే ఆచూకీ తెలియకపోవడంతో విప్లవ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్కే బెదిరింపులకు లొంగడు: శిరీష
ఒంగోలు : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మోహరించిన పోలీసు బలగాలను తక్షణమే వెనక్కి రప్పించాలని మావోయిస్టు అగ్రనేత ఆర్కే (అక్కిరాజు హరగోపాల్) సతీమణి శిరీష డిమాండ్ చేశారు. ఆమె గురువారమిక్కడ మాట్లాడుతూ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లతో బెదిరించినంతమాత్రాన ఆర్కే లొంగిపోడని అన్నారు. మల్కన్‌గిరిలో జరిగింది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని శిరీష ఆరోపించారు. ఇది ప్రభుత్వం చేసిన అతి పెద్ద ఘోరమని, రాత్రి నిద్రిస్తున్న వారిపై దొంగదెబ్బ తీసి పొట్టన పెట్టుకున్నారన్నారు. పోలీసులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే బూటకపు ఎన్కౌంటర్లో అందరిని చంపారని ఆమె అన్నారు. కాగా ఈ నెల 24న జరిగిన ఏవోబీ ఎన్కౌంటర్లో ఆర్కే తనయుడు పృథ్వీ అలియాస్ మున్నా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన కుమారుడు మృతి బాధ కలిగించినా, పీడిత ప్రజల కోసం ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందన్నారు. మున్నా ప్రజల కోసం ప్రాణం సైతం ఇచ్చేందుకు వెనుకాడనని తనకు ఎప్పుడో చెప్పాడని శిరీష అన్నారు. కాగా ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకూ మొత్తం 30మంది మావోయిస్టులు మృతి చెందారు. -
లొంగిపోయిన మావోయిస్టు నేత
రాంచీ: మావోయిస్ట్ నేత బలేశ్వర్ ఓరాన్ జార్ఖండ్ డీజీపీ డీకే పాండే ఎదుట లొంగిపోయాడు. ఓరాన్ పై ఐదు లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన మావోలకు ప్రభుత్వం ఇచ్చే అన్ని సదుపాయాలను అయనకు ఇవ్వనున్నట్టు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టునేత బిహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో సభ్యులు. గతంలో సబ్ జోనల్ కమాండర్‌గా కూడా వ్యవహరించారు. -
మల్కన్‌గిరి అడవుల్లో ఆర్కే కదలికలు?
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్.. అలియాస్ ఆర్కే చాలా కాలం తర్వాత మళ్లీ ఏఓబీలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లాలోగల జంత్రి అనే ప్రాంతంలో జరిగిన ఓ సమావేశంలో ఆర్కే కనిపించినట్లు చెబుతున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కూడా అయిన ఆర్కే.. అంత సాధారణంగా బయటకు కనిపించరు. సరిగ్గా జంత్రి ప్రాంతంలోనే 2011లో అప్పటి మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మళ్లీ ఇప్పుడు అదే ప్రాంతంలో ఆర్కే కదలికలు కనిపించాయంటే ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది. మల్కన్‌గిరి - కోరాపుట్ - విశౄఖ సరిహద్దు డివిజన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు సలీం, బెంగాల్ నాయకులు సుధీర్, అనిల్, నవీన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారని, దీనికి దాదాపు వెయ్యి నుంచి 1500 మంది వరకు గ్రామస్థులు హాజరయ్యారని అంటున్నారు. 2010లో కోరాపుట్ ప్రాంతంలో తన భార్య అరెస్టయినప్పటి నుంచి ఆర్కేకు సంబంధించిన విషయాలు ఏవీ పెద్దగా బయటకు రావడం లేదు. ఆయన గత ఏడేళ్లుగా స్పాండిలైటిస్ తదితర ఇబ్బందులతో బాదపడుతున్నట్లు తెలిసింది. అందుకే భద్రత కోసం ఆయనను ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం ప్రాంతానికి పంపినట్లు కూడా చెబుతున్నారు. మల్కన్‌గిరి ప్రాంతం ఎప్పటినుంచో మావోయిస్టులకు కంచుకోట. దాని భౌగోళిక పరిస్థితుల కారణంగా అక్కడకు సులభంగా చేరుకోవడం, అక్కడి నుంచి అంతే సులభంగా తప్పించుకోవడం వాళ్లకు బాగా అలవాటని, అక్కడకు మావోయిస్టు అగ్రనేతలు వచ్చినట్లు తమకు కూడా సమాచారం ఉందని యాంటీ నక్సల్ విభాగం అధికారులు అంటున్నారు. -
నేపాల్ పీఠంపై ప్రచండ!
-
నేపాల్ పీఠంపై ప్రచండ!
కఠ్మాండు: నేపాల్ మావోయిస్టు పార్టీ చీఫ్ ప్రచండ రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నారు. నేడు ప్రధాని పదవికి ఎన్నిక జరగనుండగా చివరి నిమిషంలో సీపీఎన్-యూఎంఎల్ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో ప్రచండ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మధేసి ప్రాంత పార్టీల నుంచి కీలక మద్దతు లభించడంతో మంగళవారం ఆయన నామినేషన్ వేశారు. ప్రచండ అభ్యర్థిత్వాన్ని నేపాలీ కాంగ్రెస్ (ఎన్సీ) నేత దేవ్బా ప్రతిపాదించగా మావోయిస్టు నేత మహరా బలపరిచారు. కొత్త ప్రభుత్వానికి మధేసి పార్టీలు మద్దతిచ్చేలా, మావోయిస్టు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయి. 595 మంది సభ్యులున్న పార్లమెంట్లో మధేసీ పార్టీల బలం 42 మంది. ప్రభుత్వంలోనూ చేరతామని ఇవి సంకేతాలిచ్చాయి. మావోయిస్టు పార్టీ మద్దతు వాపసుతో యూఎంఎల్ నేత ఓలి ప్రధాని పదవికి గతవారం రాజీనామా చేశారు. -
నారాయణపేట కోర్టుకు కోబడ్‌గాంధీ
మహబూబ్‌నగర్: మావోయిస్టుల కాల్పుల్లో మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే నర్సిరెడ్డితోపాటు 10 మంది మృతి చెందిన కేసులో వ్యూహకర్తగా ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కోబడ్ గాంధీని ఢిల్లీ పోలీసులు మంగళవారం నారాయణపేట కోర్టులో హాజరుపరిచారు. 2005 ఆగస్టులో ఎమ్మెల్యే నర్సిరెడ్డి ఆయన తనయుడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు మరో 8 మంది.. మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో పోలీసుశాఖ 19 మందిపై కేసులు నమోదు చేసింది. కేసు విచారణలో భాగంగా కోబడ్గాంధీని మొదటిసారి 2010, ఏప్రిల్ 27న జడ్జి ఎదుట హాజరుపరిచారు. అప్పటి నుంచి పీటీ వారెంట్ ఉండడంతో ఇంతవరకు కోర్టుకు హాజరుకాలేదని సమాచారం. అయితే మంగళవారం కోర్టుకు హాజరుపర్చాల్సి ఉండడంతో ఆయనను ఢిల్లీ పోలీసులు మహబూబ్‌నగర్‌కు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి ప్రత్యేక బలగాల భద్రత మధ్య నారాయణపేట కోర్టుకు హాజరుపరిచారు. కేసును జడ్జి ఈనెల 21కి వాయిదా వేశారు. అనంతరం ఆయన్ను మళ్లీ ఢిల్లీలోని తీహార్ జైలుకు తీసుకెళ్లారు. కాగా, ఆయనపై ఉన్న కేసును జిల్లా సెషన్ కోర్టుకు బదీలి చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. -
దద్దరిల్లుతోంది... దండకారణ్యం
‘‘అభివృద్ధి పేరుతో ఆదివాసీలకు రాజ్యాంగం క ల్పించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం నాశనం చేసి, అక్కడి సంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తోంది. అందమైన ప్రకృతికి నిలయమైన దండకారణ్యాలు దద్దరిల్లుతున్నాయి. భవిష్యత్తులోనైనా ఈ పరిస్థితి మారాలన్న కథాంశంతో రూపొందిన చిత్రం ఇది’’ అని ఆర్.నారాయణమూర్తి అన్నారు. స్వీయదర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ‘దండకారణ్యం’ చిత్రం ఈ మార్చి 4న విడుదల కానుంది. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ- ‘‘మావోయిస్టు నాయకుడు కిషన్‌జీ పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తాను. అడవి తల్లి కోసం పోరాడుతున్న వారు, ప్రభుత్వం తరపున ఉద్యోగాలు చేస్తున్న పోలీసులు యుద్ధం చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఇద్దరూ తమ కన్నతల్లులకు కడుపుకోత మిగులుస్తున్నారు. ఇకనైనా కాల్పుల విరమణ పాటించి, అడవిని ప్రశాంతంగా ఉంచాలనే అంశాన్ని మా చిత్రం ద్వారా చెబుతున్నాం. ఈ నెల 20న పాటలను విడుదల చేయనున్నాం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్, ఎడిటింగ్-సంగీతం: ఆర్.నారాయణమూర్తి. -
పోలీసుల అదుపులో మావోయిస్టు నేత!!
చర్ల: మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు సున్నం బొజ్జి అలియాస్ అంజన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లేందుకు దండకారణ్యం నుంచి సరిహద్దు ప్రాంతంలోని గిరిజన గ్రామానికి చేరుకున్న అంజన్న పోలీసులకు చిక్కినట్లు సమాచారం. సున్నం బొజ్జి అలియాస్ అంజన్న స్వగ్రామం ఖమ్మం జిల్లా చర్ల మండలం బత్తినిపల్లి గ్రామం. ఆరేళ్ల నుంచి మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నాడు. ప్రస్తుతం కొత్తగూడెం ఓఎస్డీ కార్యాలయానికి తరలించి రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయిరమణను సంప్రదించగా, తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. -
మావోయిస్టునేత లొంగుబాటు
వరంగల్: మావోయిస్టు నేత గాజర్ల అశోక్ మంగళవారం వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి సమక్షంలో లొంగిపోయాడు. సీపీఐ మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌గా, దక్షిణ బాస్తర్ డివిజనల్ కమిటీలో పనిచేశాడు. అశోక్ పై 25 కేసులు ఉన్నాయి. మావోయిస్టు పార్టీ నాయకత్వంలో అంతర్గత విభేదాలు, నాయకత్వ లోపాలు, మావోయిస్టు పార్టీకి ప్రజలలో వ్యతిరేకత పెరగడంతో అశోక్ లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు. -
మావోయిస్టు అగ్రనేత అశోక్ లొంగుబాటు
-
భారత 'మలాలా'ను చంపేశారు
జార్ఖండ్: చదువుల తల్లిగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆ యువతి కలల్ని చిదిమేశారు. తీవ్రవాద ఉద్యమాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసి బాగా చదువుకోవాలని ఆరాటపడింది. హింసను వదిలిబడిబాట పట్టిన 20 ఏళ్ల యువతి చివరికి తుపాకీ గుళ్లకు బలైపోయింది. ఉగ్రవాదులను ఎదిరించి చదువుల రాణిగా ఎదిగి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న నోబెల్ బహుమతి గ్రహీత మలాలా కథను మరిపిస్తుంది.. సంగీత కుమారి అలియాస్ గుడ్డి కథ. జార్ఖండ్‌లోని గుమ్లాకు చెందిన సంగీత కుమారి బాల్యదశలోనే మావోయిస్టు పార్టీలోకి వెళ్లింది. ఇంటి పక్కనే ఉండే మావోయిస్టు నేత సవిత ద్వారా ఆమె పార్టీలో చేరింది. వంట చేయడంతో మొదలుపెట్టి, తర్వాత షార్ప్ షూటర్‌గా ఎదిగింది. మావోయిస్టుగా ఆమె చాలాకష్టాలను అనుభవించింది. ఒకసారి లాతేహార్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందామనేలోపు అదడు ఎన్కౌంటర్లో చనిపోయాడు. దాంతో బయటకు వచ్చి చదువుకుని మంచి జీవితాన్ని కొనసాగించాలని ఆశపడింది. దానికోసం నాలుగు రోజులు అవిశ్రాంతంగా నడిచింది. చివరికి గత ఏప్రిల్ నెలలో గుల్మాకు చేరుకుని అక్కడ రహస్యంగా తలదాచుకుంది. చంపేస్తామన్న బెదిరింపులను లెక్కచేయకుండా స్కూల్లో చేరింది. కాగా గత మంగళవారం తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు ఆమె స్వగ్రామం సిబిల్ చేరింది. కానీ అప్పటికే మావోయిస్టు నేతలు ఆమె కుటుంబసభ్యులను కిడ్నాప్ చేశారు. సంగీతనూ చంపేస్తామని బెదిరిస్తూ లేఖ వదిలిపోయారు. గురువారం ఉదయానికి ఆమె కూడా శవమై తేలింది. రక్తపు మడుగులో ఉన్న ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. గతంలో సంగీత మీడియాతో తన అనుభవాలను పంచుకుంది. దళాల్లో మహిళలపై అత్యాచారాలు, లైంగిక దోపిడీ, బలవంతపు అబార్షన్లు చాలా సర్వసాధారణమని తెలిపింది. అందుకే తనకు నచ్చలేదని.. మళ్లీ హింసాత్మక ఉద్యమాల వైపు వెళ్లనని చెప్పింది. అదే సందర్భంగా తమ బాస్‌లు తనను బతకనివ్వరనే భయాన్ని కూడా వ్యక్తం చేసింది. చివరికి ఆమె భయమే నిజమైంది. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఆమెను కాల్చి చంపినట్టు సమాచారం. అలా బలికాకుండా ఉండి ఉంటే బహుశా భారతదేశ మలాలా అయి ఉండేదేమో! -
మావోయిస్టు నేత సవ్యసాచి పండాపై కేసు కొట్టివేత
ప్రముఖ మావోయిస్టు నాయకుడు సవ్యసాచి పండాపై పోలీసులు పెట్టిన కేసును ఒడిషాలోని ఓ స్థానిక కోర్టు కొట్టేసింది. ఈ కేసులో పండాను నిర్దోషిగా విడుదల చేసింది. నాలుగేళ్ల క్రితం గోషానినుగావ్ పోలీసు స్టేషన్లో ఆయుధాల చట్టం కింద పండాపై కేసు నమోదైంది. అయితే, పండాపై ఈ కేసులో ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని సబ్ డివిజనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రదీప్ కుమార్ బెహరా కేసును కొట్టేశారు. ఒడిషాలోని వివిధ కోర్టుల్లో పండాపై వందకు పైగా కేసులు ఉండగా.. ఈ ఒక్క కేసులోనే ఇప్పటివరకు ఆయనకు సానుకూలంగా తీర్పు వచ్చిందని పండా తరఫు న్యాయవాది దీపక్ పట్నాయక్ తెలిపారు. ఇదే కేసులో మరో ఇద్దరిని కూడా నిర్దోషులుగా విడిచిపెట్టిన కోర్టు.. మరో వ్యక్తి మాత్రం కోర్టుకు హాజరు కాకపోవడంతో అతడిపై నాన్ బెయిలబుల్ వారంటు జారీచేసింది. -
ప్రొద్దుటూరులో మావోయిస్టు కీలక నేత అరెస్ట్
కడప : మావోయిస్టు పార్టీ సీనియర్ నేత, టెక్ రామకృష్ణను అరెస్ట్ చేసినట్లు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ ఆదివారం కడపలో వెల్లడించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మావోయిస్టు టెక్నికల్ విభాగంగా రామకృష్ణ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసేందుకు... యువతను పార్టీ వైపు తిప్పేందుకు రామకృష్ణ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారని ఎస్పీ వివరించారు. 1997 నుంచి రామకృష్ణ అజ్ఞాతంలో ఉన్నాడని ఎస్పీ పేర్కొన్నారు. -
జల్లెడ పడుతున్న బలగాలు
- ఏజెన్సీలో మావో అగ్రనేతలు చలపతి, రవి - వరుసగా రెండు రోజులు ఎదురు కాల్పులు - పక్కా సమాచారంతో కదులుతున్న పోలీసులు సాక్షి,విశాఖపట్నం: మావోయిస్టు అగ్రనేతలు లక్ష్యంగా మన్యంలో పోలీసు బలగాలు ఉధృతంగా కూంబింగ్ జరుపుతున్నాయి. వరుసగా రెండు రోజులు దళసభ్యులు, గ్రేహౌండ్స్‌కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కేంద్రకమిటీ సభ్యుల కదలికలపై పక్కా సమాచారంతో పోలీసులు వ్యూహాత్మకంగా కదులుతున్నారు. ప్రత్యేక బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఉద్యమ కమిటీల ఏర్పాటును ఎలాగైనా అడ్డుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని నెలల విరామం తర్వాత మన్యం మరోసారి వేడెక్కింది. ఇటీవల మావోయిస్టుల ఉద్యమానికి ఎదురు దెబ్బలు, బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం యత్నాలతో మన్యంలోకి మావోయిస్టు అగ్రనేతలు అడుగుపెట్టారు. గ్రామాల్లో సభల ద్వారా బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి జీవం పోయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పక్కాసమాచారంతో ప్రత్యేక బలగాలు మన్యాన్ని చుట్టుముట్టాయి. బ్యాంకుల వద్ద, సంతల్లో డేగ కళ్లతో పరిశీలిస్తున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుని రహస్యంగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వారిచ్చే సమాచారంతో దళసభ్యులకు అతి సమీపంగా పోలీసు బలగాలు వెళుతున్నాయి. ఇందులో భాగంగానే ఇరువర్గాలకు మధ్య బుధ, గురు వారాల్లో ఎరుదు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు చెబుతున్నారు. అగ్ర నేతలే లక్ష్యం? ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఇన్చార్జ్ చలపతి, మావోయిస్టు మొదటి కేంద్ర ప్రాంతీయ (సీఆర్సీ) కమాండర్ కుడుముల వెంకట్రావు అలియాస్ రవి, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నంబళ్లకేశవరావు అలియాస్ గంగన్నలతో పాటు దళం ముఖ్య సభ్యులు సరిత, ఆజాద్, ఆనంద్‌లు మన్యంలో సంచరిస్తున్నట్లు పోలీసులు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఎలాగైనా అగ్ర నేతలను పట్టుకోవడమో లేక మట్టుబెట్టడమో చేయాలని వ్యూహాత్మకంగా కూంబింగ్ చేపడుతున్నారు. బుధవారం కొయ్యూరు మండలం కునుకూరులో కాల్పుల అనంతరం దళసభ్యులు వెళ్లి ఉంటారనే అంచనాతో గురువారం ఆ దిశగా బలగాలను కదిలించారు. వారి వ్యూహం ఫలించి దళం ఆచూకీ లభించింది. ఆపై చకచకా కాల్పులు జరిగిపోయాయి. -
దాడులు తప్పవు
పట్టుబడిన మావో రూపేష్ వెల్లడి కొండ ప్రాంతాల్లో అలర్ట్ కోవైలో మావోల కుమార్తెలు కోయంబత్తూరులో రెండురోజుల క్రితం పట్టుబడిన ఐదుగురు మావోల్లో ఒకరైన రూపేష్ పోలీసులనుద్దేశించి పలు హెచ్చరికలు చేయడం కలకలం సృష్టించింది. తమను అరెస్ట్ చేసినంత మాత్రాన తమిళనాడులో దాడులను ఆపలేరని రూపేష్ చేసిన వ్యాఖ్యలతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో దాడులు చేసేందుకు సిద్ధం అవుతున్న రూపేష్, ఆయన భార్య సైనా, అనూప్, కన్నన్, వీరమణి అనే ఐదుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌చేసిన సంగతి పాఠకులకు విదితమే. తమిళనాడు, కేరళ సరిహద్దు రాష్ట్రాల్లో శిక్షణ పొందుతున్న 40 మంది మావోయిస్టుల వల్ల దాడుల తథ్యమని పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో రూపేష్ పేర్కొన్నట్లు తెలిసింది. శిక్షణ పొందుతున్న వారిలో పది మంది తమిళనాడుకు చెందిన వారని రూపేష్ వెల్లడించాడు. పడమర కొండల్లో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను తమ వారు సాధించి తీరుతారనే నమ్మకం తనకు ఉందని అతను పేర్కొన్నాడు. ఈ మావోలకు ధర్మపురి జిల్లాకు చెందిన కాళిదాస్ అనే వ్యక్తి శిక్షణ నిస్తున్నట్లు భావిస్తున్నారు. ఆయుధ శిక్షణ ఇవ్వడంలో సిద్ధహస్తుడైన కాళిదాస్ కోసం పదేళ్లుగా పోలీసులు గాలిస్తున్నా పట్టుబడలేదు. గతంలో తమిళనాడు పోలీసులకు కొందరు మావోలు పట్టుబడగా వీరికి సైతం కాళిదాస్ శిక్షణ నిచ్చినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు అతని కోసం గాలింపు తీవ్రం చేశారు. మావోలు ప్రతిదాడులకు పాల్పడే అవకాశం ఉందన్న అనుమానంతో నీలగిరి జిల్లా కొండప్రాంత సరిహద్దులోని సేరంబుడి, ఏరుమాడు, కేళనాడుకని, దేవాల, మసినకుట్టి, మీంజూరు, సొల్లూరు మఠం తదితర పోలీస్స్టేషన్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టుబడిన ఐదుగురు మావోలకు కోవై కోర్టు జూన్ 3 వరకు రిమాండ్ విధించింది. దక్షిణాది మావోదళాధిపతైన రూపేష్తోపాటూ మరో నలుగురిని కోవై సెంట్రల్ జైలులో ఉంచారు. అగ్రనేతలు పట్టుబడిన కారణంగా కోవై జైలుకు మూడండెల అదనపు భద్రత ఏర్పాటు చేశారు. మావోలందరినీ పోలీస్ క స్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని కుట్రలు వెలుగుచూస్తాయని భావిస్తున్న పోలీసులు గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. కోవై జైలు వద్ద రూపేష్,సైనా కుమార్తెలు ఇదిలా ఉండగా, తమ తల్లిదండ్రులు పోలీసులకు పట్టుబడిన సమాచారం తెలుసుకున్న రూపేష్, సైనాల కుమార్తెలు ఆమీ (18),తాజు (13) బుధవారం కోవై జైలు వద్దకు చేరుకున్నారు. వారితోపాటూ ఒక బంధువును తోడుగా తెచ్చుకున్నారు. తల్లిదండ్రులను చూసేందుకు అనుమతించాలని పోలీసులను లిఖితపూర్వకంగా కోరారు. కేవలం పది నిమిషాలకు పోలీసులు అనుమతించారు. వారి వద్ద కెమెరా ఉండడంతో దానిని స్వాధీనం చేసుకుని తిరిగి వెళ్లే ముందు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆమీ మీడియాతో మాట్లాడుతూ, తమ తల్లిదండ్రులు ఏమీ నేరం చేయలేదు, ఇతర ఆస్తులను దోచుకోలేదు, కేవలం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్యమించారని అన్నారు. చట్టపరంగా తమ తల్లిదండ్రులను కాపాడుకుంటానని చెప్పారు. అతివలపై మోజు, ఆధిపత్య పోరు గతంలో మావో దళాల్లో ఉండే క్రమశిక్షణ, మహిళపట్ల గౌరవం అంతరించిపోవడం, అధిపత్యపోరు, అతివల పట్ల ఆసక్తి పెరిగిపోయిందని తెలుస్తోంది. దళం సభ్యుల్లోని స్త్రీల పట్ల సమభావం ప్రదర్శిస్తూ ఉండేవారని, కానీ నేడు ఇందుకు విరుద్దంగా మారిందని చెబుతున్నారు. అలాగే మావోల్లో జాతీయభావం అడుగంటిపోయి భాషాప్రభావం పెచ్చుమీరిపోయిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఒక భాషకు చెందిన మావో చెప్పిన అంశాన్ని మరో భాషకు చెందిన మావో కేవలం ప్రాంతీయ భావంతో దిక్కరించడం, తమ భాషదే ఆధిపత్యమని ప్రదర్శించడంతో వారి గుట్టురట్టయి పోలీసులకు పట్టుబడుతున్న భావన. ఒక మావో పట్టుబడితే అంత సులభంగా ఇతర మావోల ఆచూకీ చెప్పరని, అయితే ఏపీలో పట్టుబడిన మావో రాజిరెడ్డి కోవైకి స్వయంగా వచ్చి ఐదు మందిని పట్టించడం వెనుక ముఠాతగాదాలే కారణమని భావిస్తున్నారు. -
ఆజాద్ ఎన్కౌంటర్ కేసును తిరస్కరించిన కోర్టు
ఆదిలాబాద్ క్రైం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అజాద్, జర్నలిస్టు హేమచంద్ర పాండేల ఎన్కౌంటర్ కేసులో పోలీసులను విచారించాలని ఆజాద్ భార్య పద్మ వేసిన ప్రొటెక్టు పిటిషన్‌ను ఆదిలాబాద్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు (ప్రథమ శ్రేణి న్యాయమస్థానం) తిరస్కరించింది. మంగళవారం పద్మ, ఆమె తరపు న్యాయవాది సురేష్‌కుమార్‌లు ఆజాద్ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరయ్యారు. ఆజాద్‌ది బూటకపు ఎన్కౌంటర్ అని, ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసులపై విచారణ చేపట్టాలని పద్మ 2013 జూలై 2న కోర్టులో ప్రొటెక్ట్ పిటిషన్‌ను వేశారు. రెండేళ్ల అనంతరం పోలీసులను విచారించడం వీలుకాదంటూ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. -
మందుగుండు చేరవేస్తున్న ముగ్గురి అరెస్టు
కరీంనగర్: మావోయిస్టులకు మందుగుండు సామగ్రి చేరవేస్తున్న ముగ్గురు వ్యక్తులను కరీం నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 700 బుల్లెట్లు, రూ.16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ డీఎస్పీ రామారావు కథనం ప్రకారం... జిల్లాలోని బెజ్జంకి మండలం చీలాపూర్ గ్రామానికి చెందిన బోల్ల రాజేంద్రకుమార్(48) హైదరాబాద్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. మావోయిస్టు సానుభూతిపరుడైన ఇతడిని నాలుగు నెలల క్రితం మావోయిస్టు పార్టీ నేత హరిభూషణ్ వరంగల్ జిల్లా ములుగు ప్రాంతానికి పిలి పించారు. ఉత్తరప్రదేశ్ నుంచి మందుగుండు సామగ్రి తీసుకువచ్చే పనిని అప్పగించాడు. తర్వాత మావోయిస్టు నేతలు పూల్లూరి ప్రసాద్‌రావు, రాజిరెడ్డి, హరిభూషణ్‌లు రాజేంద్రకుమా ర్ను ఛత్తీస్‌గఢ్‌కు పిలిపించి మందుగుండు కొనుగోలు కోసం రూ.16లక్షలు ఇచ్చారు. ఆ డబ్బులను తీసుకొచ్చిన రాజేంద్రకుమార్ బె జ్జంకిలోని తన ఇంట్లో దాచి ఉంచాడు. మావోయిస్టుల సూచన మేరకు యూపీలోని ఖాన్పూర్కు చెందిన ఆయుధాల వ్యాపారి సునీల్‌కుమార్(53)ను కలిసి మందుగుండు సామగ్రి సరఫరాకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ మేర కు సునీల్‌కుమార్ తన సహాయకుడు వికాస్‌కుమార్‌తో కలిసి మందుగుండును తీసుకుని యూపీ నుంచి రైల్లో రామగుండానికి చేరుకున్నాడు. కరీంనగర్ రేల్వేస్టేషన్ వద్ద మార్పిడి చేయాలని ప్రయత్నించారు. సమాచారం అం దుకున్న పోలీసులు వీరిని పట్టుకున్నారు. -
మావో అగ్రనేత గణపతి ఆస్తులపై ఎన్ఐఏ విచారణ
కరీంనగర్: మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ఉరఫ్ గణపతి ఆస్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ) మంగళవారం విచారణ నిర్వహించింది. గణపతి స్వగ్రామమైన కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం బీర్పూర్లో శిథిలమైన ఇంటిని అధికారులు పరిశీలించారు. మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి గణపతిపై బిలాస్పూర్ కోర్టులో పలు కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో కోర్టుకు హాజరు కావడం లేదని గత ఏప్రిల్‌లో లక్ష్మణ్‌రావు ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. అయినా హాజరుకాకపోవడంతో బిలాస్పూర్ ప్రత్యేక కోర్టు తీవ్రంగా పరిగణించి లక్ష్మణ్‌రావుకు చెందిన ఆస్తుల జప్తుకోసం వివరాలు సేకరించాలని ఎన్ఐఏను ఆదేశించింది. ఇందులో భాగంగా మంగళవారం ఎన్ఐఏ అధికారి బీర్‌పూర్‌లోని లక్ష్మణ్‌రావు ఇంటిని పరిశీలించారు. ఆయనకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా అనే విషయంపై గ్రామంలో విచారణ జరిపారు. శిథిలమైన ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తులు లేవని గ్రామస్తులు అధికారికి తెలిపారు. అనంతరం సారంగాపూర్‌లో రెవెన్యూ అధికారులను కలిసి లక్ష్మణ్‌రావుకు చెందిన ఆస్తులపైనా ఆరా తీశారు. -
గణపతిని పట్టిస్తే రూ.2.52 కోట్లు....
-
నానమ్మకు మేమున్నాం..: జంపన్న అన్న కొడుకు నవీన్‌రెడ్డి
బూర్గంపాడు: ‘రారా నాయ నా దండం పెడతా..’ అంటూ మావోయిస్టు నేత జంపన్న తల్లి యశోదమ్మ చేసుకున్న వేడుకోలుకు ఆమె మనవడు స్పందించాడు. సోమవారం సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని చూసి సారపాకకు చెం దిన జినుగ నవీన్‌రెడ్డి (జంపన్న అన్న వెంకటరెడ్డి కుమారుడు) స్పందించారు. సోమవారం రాత్రి తన తల్లి కళావతితో కలసి ‘సాక్షి’తో మాట్లాడాడు. ‘వృద్ధాప్యంలో ఉన్న మా నానమ్మను చూసుకునేందుకు నేనున్నా. సారపాకలోని ఐటీసీలో క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తున్నాను. మానాన్న కొంతకాలం క్రితం చనిపోయారు.ఏడాది క్రితం మా నానమ్మ నా పెళ్లికి వచ్చింది. ఇక్కడ ఉండమని ఎంత బతిమాలినా వినలేదు. ఆ తర్వాత కనిపించలేదు. ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనాన్ని చూశాక మా నానమ్మ ఆచూకీ తెలిసింది. మా నానమ్మ మంచి చెడులు చూసుకునేందుకు నేను, మా అమ్మ ఉన్నాం.’ అని అన్నాడు. -
అలిపిరి దాడి కేసు నిందితుడి అరెస్ట్
చెన్నై: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై 2003లో అలిపిరి సమీపంలో జరిగిన దాడితో సంబంధం ఉన్న మావోయిస్టు నేత దీపక్ అలియాస్ వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని కోల్‌కతాలో అదుపులోకి తీసుకుని చెన్నై మీదుగా నెల్లూరు తరలించారు. అయితే మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్థన్‌రెడ్డిపై దాడి కేసులో అతడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారని సమాచారం. మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ అనుచరుడైన దీపక్ పై పలు కేసులున్నాయి. -
గణపతిని పట్టిస్తే రూ. కోటి
మహారాష్ట్ర ప్రభుత్వం రివార్డు ప్రకటన న్యూఢిల్లీ/ముంబై: మావోయిస్టు అధినేత ముప్పాళ లక్ష్మణరావు అలియాస్ గణపతిపై మహారాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని భారీస్థాయిలో రివార్డును ప్రకటించింది. గణపతి అరెస్ట్‌కు దోహదపడే సమాచారం అందించే వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది. మావోయిస్టు గ్రూపు సెంట్రల్ కమిటీ సభ్యుడు లేదా పోలిట్ బ్యూరో సభ్యుడి అరెస్టుకు ఉపకరించే సమాచారం అందిస్తే రూ. 60 లక్షల రివార్డు ఇస్తామని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గణపతితోపాటు దాదాపు డజన్ మంది మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులకోసం పోలీసులు చాలాకాలంగా గాలింపు కొనసాగిస్తూ వస్తున్నారు. -
'పండా అరెస్ట్ పెద్ద నాటకం'
భువనేశ్వర్: మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పండా అరెస్ట్ పెద్ద నాటకమని నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ప్రకటించింది. ఒడిశా ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో పండా అరెస్ట్ ఓ భాగమని ఆ పార్టీ అభివర్ణించింది. మావోయిస్టులపై తమ ప్రభుత్వం పోరాడుతుందని చెప్పుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ఆ ప్రకటన చేసిందని విమర్శించింది. ఆంధ్ర - ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అజయ్ ఈ మేరకు ఓ లేఖను బుధవారం ఇక్కడ విడుదల చేశారు. పార్టీ నుంచి పండాను రెండేళ్ల క్రితమే బహిష్కరించినట్లు తెలిపారు. మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులు, ప్రభుత్వానికి చేరవేస్తున్నారనే అభియోగాలు వెల్లువెత్తిన నేపథ్యంలో పండాను బహిష్కరించిన సంగతిని అజయ్ ఈ సందర్భంగా లేఖలో వివరించారు. ఈ నెల 18వ తేదీన బరంపురం పట్టణంలో పండాను అరెస్ట్ చేసినట్లు ఒడిశా పోలీసులు ప్రకటించారు. అనంతరం ఆయన్ని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు పండాకు 10 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. పండాపై నయాగఢ్, ఆర్ ఉదయ్గిరిలో ఆయుధాలు లూటీ, స్వామి లక్ష్మణానంద సరస్వతి, ఇటాలియన్ జాతీయులు కిడ్నాప్ కేసులతోపాటు పలు కేసులలో పండా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. పండాను పోలీసులు అరెస్ట్ చేసిన ప్రకటనపై మావోయిస్టు పార్టీపై విధంగా స్పందించింది. -
మావోయిస్టు అగ్రనేత పండా అరెస్టు
బరంపురంలో ఆయన తలదాచుకున్న ఇంటిపై అర్ధరాత్రి పోలీసుల దాడి పెద్ద ఎత్తున బంగారం, నగదు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు స్వాధీనం వీహెచ్‌పీ నేత లక్ష్మణానంద హత్య కేసుతో పాటు పండాపై 61 కేసులు బరంపురం: మావోయిస్టు అగ్రనేత, ఒడిశా మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకుడు సవ్యసాచి పండా అలియాస్ శరత్ అలియాస్ సుమన్ అలియాస్ సునీల్‌ను గురువారం అర్ధరాత్రి ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురంలో తలదాచుకుంటున్న పండాను గంజాం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. పండావద్ద బంగారం, నగదు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. సవ్యసాచి పండా అరెస్టయినట్టు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. పండా అరెస్ట్ ఒడిశా పోలీసులు సాధించిన విజయమని ఆయన అభినందించారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో బరంపురంలోని ఒక ఇంటిలో పోలీసులు పండాను అరెస్టు చేశారన్నారు. విశ్వ హిందూ పరిషత్ నేత స్వామి లక్ష్మణానంద సరస్వతి హత్య, నయాగడ్ ఠాణా, ఆయుధాగారంపై దాడి, ఆయుధ దోపిడీ, ఆర్. ఉదయగిరి ఠాణాపై దాడి, ఇద్దరు ఇటాలియన్ల అపహరణ తదితర కేసుల్లో సవ్యసాచికి ప్రమేయం ఉంది. 25 మంది పోలీసులు, 34 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలతోనూ ప్రత్యక్ష ప్రమేయం ఉంది. మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పండా 1995 నుంచి చురుకుగా పాల్గొంటున్నారు. ఒడిశాలోని రాయగడ, గజపతి, కొంథమాల్, నయాగడ్ జిల్లాల్లో మావోయిస్ట్ కార్యకలాపాలలో కీలకంగా పనిచేశారు. ఈ జిల్లాల్లో ఆయనపై 61 కేసులు నమోదయ్యాయి. మోస్టు వాంటెడ్ జాబితాలో ఉన్న సవ్యసాచిని పట్టించే వారికి రూ. 5 లక్షల నగదు పురస్కారాన్ని ఒడిశా ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. బంగారం, నగదు స్వాధీనం పండా వద్ద పెద్దమొత్తంలో బంగారం, నగదు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు లభించాయని ఒడిశా డీజీపీ సంజీవ్ మారిక్ తెలిపారు. పండా వద్ద ఆటోమేటిక్ పిస్టల్, తూటాలు, *2 లక్షల నగదు, అర కిలో బంగారం, 10 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, 2 కంప్యూటర్ హార్డ్ డిస్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పండా అరెస్ట్‌పై పోలీసు కుటుంబాల హర్షం పండా అరెస్ట్‌తో పలు పోలీసు కుటుంబాలు హ ర్షం వ్యక్తం చేశాయి. ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల భార్యలు సంతోషం వ్యక్తంచేశారు. పండాకు మరణశిక్ష విధిస్తే తాను ఎంతో సంతోషిస్తానని వారిలో ఒకరు అన్నారు.పండాకు ఉరిశిక్ష వేయాలి.. లక్ష్మణానంద సరస్వతి, ఆయన నలుగురు సహచరుల హత్యకేసులో ప్రధాన నిందితుడైన పండాకు మరణశిక్ష వేయాల్సిందేనని సంఘ్‌పరివార్ సంస్థ అయిన స్వామి లక్ష్మణానంద సరస్వతి సమితి (ఎస్ఎల్ఎస్ఎస్) డిమాండ్ చేసింది. ఈ హత్యలు తానే చేసినట్టు పండా స్వయంగా ప్రకటనల ద్వారా, వీడియో టేపులద్వారా ప్రకటించుకున్నారని సమితి కార్యదర్శి లక్మికాంత్ దాస్ చెప్పారు. లక్ష్మణానంద సర స్వతి హత్యకు నిరసనగా ఒడిశాలోని కొంథమాల్ జిల్లాలోను ఇతర ప్రాంతాల్లోను జరిగిన అల్లర్లలో 38మంది మరణించారు.కాగా, తన భర్త విప్లవకారుడని, ఒడిశా పోలీసులు చెబుతున్నట్టుగా హంతకుడు కానేకాదని పండా భార్య శుభశ్రీ పండా అలియాస్ మిలీ పండా అన్నారు. -
మావోయిస్ట్ నేత ఉసెండి లొంగుబాటు
వరంగల్ : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ అధికార ప్రతినిధి గుమ్మడవెల్లి వెంకటకృష్ణ ప్రసాద్ అలియాస్ గూడ్సా ఉసెండి లొంగిపోయాడు. భార్య రాజీతో పాటు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) పోలీసులకు నిన్న రాత్రే లొంగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఉసెండి హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. అతనిపై రూ.15 లక్షల రివార్డు ఉంది. ఉసెండి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యుడుగా ఉన్నాడు. ఉసెండి స్వగ్రామం వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడివెండి. మావోయిస్టు పార్టీలో సుఖ్‌దేవ్ పేరుతో ఎక్కువగా కొనసాగాడు. రెండేళ్ల క్రితం జరిగిన మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ ఎన్కౌంటర్ తర్వాత ఉసెండి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. కాగా ఉసెండి లొంగుబాటును పోలీసులు నిర్థారించారు. -
మావోయిస్ట్ నేత కిషన్ జీ వ్యక్తిగత వైద్యుడు అరెస్ట్
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ వ్యక్తిగత వైద్యుడు సమీర్ బిశ్వాస్‌ను అరెస్ట్ చేసినట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు శుక్రవారం వెల్లడించారు. బుర్ద్వాన్ జిల్లా అసన్సోల్ పట్టణంలోని సమీర్ని అతడి సోదరుని నివాసంలో నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనంతరం అతడిని స్థానిక కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. సమీర్ గత మూడు ఏళ్లుగా అజ్ఞాత జీవితం గడుపుతున్నారని పేర్కొన్నారు. మావోయిస్టు అగ్రనేతలు కిషన్ జీతోపాటు పలువురికి సమీర్ తరచు వైద్య సేవలు అందించేవాడని తమ వద్ద పూర్తి సమాచారం ఉందని తెలిపారు. మావోయిస్టు నేతల కీలక సమాచారాన్ని రాబట్టేందుకు సమీర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అటు కేంద్రప్రభుత్వానికి ఇటు బెంగాల్‌లోని మమత ప్రభుత్వాని కొరకరాని కొయ్యలా మావోయిస్టు అగ్రనేత కిషన్ తయారయ్యారు. ఈ నేపథ్యంలో 2011, నవంబర్‌లో కిషన్ జీని పశ్చిమ మిడ్నాపూర్‌లోని బురిశోల్ అడువుల్లో కేంద్ర బలగాలు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. -
సీకే నారాయణ మృతికి రాఘవులు సంతాపం
మావోయిస్ట్ అగ్రనేతల్లో ఒకరైన చారుముజుందార్ ముఖ్య అనుచరుడు,మావోయిస్ట్ నాయకుడు సీకే నారాయణ మృతి పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు,మల్లేపల్లి లక్ష్మయ్యలు శుక్రవారం ఇక్కడ తీవ్ర సంతాపం తెలిపారు.గత రాత్రి ఆయన హైదరాబాద్ నగరంలోని స్వగృహంలో మరణించారు. సీకే నారాయణ్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి అప్పగించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఉస్మానియా యూనివర్శిటీలో దారుణ హత్యకు గురైన జార్జీరెడ్డికి సీకే నారాయణ స్వయాన పిన తండ్రి. -
మావో నేత మాధవ్ ఎన్కౌంటర్
మల్కనగిరి (ఒడిశా)/సీలేరు (విశాఖ): మావోయిస్టు పార్టీ కీలక నేత మాధవ్ అలియాస్ గొల్ల రాములు శుక్రవారం ఉదయం ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు. మల్కనగిరి జిల్లా లమతాపుట్ సమితి ప్రాంతంలో వారం రోజులుగా మాధవ్ సంచరిస్తున్నట్లు రహస్య సమాచారం అందడంతో మల్కనగిరి, కొరాపుట్ జిల్లాల ఎస్ఓజీ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. లమతాపుట్ సమితి చిలిబా గ్రామ సమీపంలోని కొండలపై శుక్రవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మాధవ్ మృతి చెందినట్లు మల్కనగిరి జిల్లా ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ వెల్లడించారు. అతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా అని తెలిపారు. మరో నలుగురు మావోయిస్టులు తప్పించుకుని పరారైనట్లు ఆయన చెప్పారు. సంఘటనా స్థలం నుంచి మృతదేహంతో పాటు ఒక హ్యాండ్ గ్రెనేడ్‌ను, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కొరాపుట్ తరలించినట్లు చెప్పారు. మల్కనగిరి జిల్లా కలెక్టర్ వినీల్‌కృష్ణ కిడ్నాప్, అల్లంపాక వద్ద జరిగిన దాడిలో 38 మంది ఆంధ్రప్రదేశ్ పోలీసుల మృతి, మల్కనగిరి నుంచి చిత్రకొండ తరలిస్తున్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కోటి రూపాయల నగదు దోపిడీ, చిత్రకొండ వద్ద బీఎస్ఎఫ్ కమాండెంట్లపై దాడి తదితర భారీ సంఘటనలతో మాధవ్ ప్రమేయం ఉందని ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ చెప్పారు. మాధవ్‌పై పది హత్య కేసులతో పాటు కాంట్రాక్టర్ల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడినందుకు కూడా పలు కేసులు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ మల్కనగిరి డివిజన్ కమిటీలో చిత్రకొండ ఏరియా కమాండెంట్‌గా కీలక సభ్యుడైన మాధవ్ తలపై ఆంధ్రప్రదేశ్‌లో రూ.4 లక్షల రివార్డు ఉందని చెప్పారు. చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న మాధవ్ ఎన్‌కౌంటర్‌ను పోలీసులు సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. గత ఏడాది మల్కనగిరి జిల్లాలోనే మావోయిస్టు మిలీషియా కమాండెంట్ వంతల రాజారావు పోలీసులకు లొంగిపోగా, తాజా సంఘటనలో మాధవ్ మృతిచెందడం మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బేనని భావిస్తున్నారు. కీలకమైన నేతను కోల్పోవడంతో మావోయిస్టు పార్టీ ప్రతీకార చర్యలకు తెగబడే ప్రమాదం ఉండటంతో ఆంధ్రా-ఒడిశా బోర్డర్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పాలమూరు నుంచి మాధవ్ ప్రస్థానం... సాక్షి, హైదరాబాద్/మహబూబ్‌నగర్: ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో శుక్రవారం ఎన్‌కౌంటర్‌కు గురైన మాధవ్ అలియాస్ గొల్ల రాములు (35) మహబూబ్‌నగర్ జిల్లా వాసి. మహబూబ్‌నగర్ జిల్లా గోప్లాపూర్ గ్రామానికి చెందిన గొల్ల గౌరమ్మ, పెంటయ్య దంపతుల కుమారుడైన రాములు, ఐదో తరగతి వరకు స్వగ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాన్‌గల్‌లోని ప్రభుత్వ పాఠశాలలోను, తొమ్మిది, పదో తరగతులు వనపర్తిలోను పూర్తి చేశాడు. వనపర్తి ప్రభుత్వ కళాశాలలో 1996-97లో ఇంటర్లో చేరిన రాములు ఎస్ఎఫ్ఐ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అదేకాలంలో జననాట్య మండలిలో చేరి, నక్సల్ ఉద్యమం పట్ల ఆకర్షితుడై, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నల్లమల సరిహద్దు జిల్లాల్లో జననాట్య మండలి నేతగా సుపరిచితుడైన రాములు, మావోయిస్టు పార్టీలో దళ కమాండర్ స్థాయికి ఎదిగాడు. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తిన తర్వాత ఏవోబీకి వెళ్లిన దళాల్లో రాములు కూడా ఉన్నాడు.