
న్యూఢిల్లీ : సీనియర్ మావోయిస్ట్ నేత, సీపీఐ(మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడు అరవింద్ జీ అలియాస్ దేవ్‌కుమార్ సింగ్ బుధవారం గుండెపోటుతో కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు. జార్ఖండ్‌లోని బుద్ధా పహాడ్ అటవీప్రాంతంలో ఆయన చనిపోయినట్లు వెల్లడించారు. జార్ఖండ్‌లో ఇంతకుముందు పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన పలు దాడులకు వ్యూహాలు రచించిన అరవింద్ జీపై రూ.1.50 కోట్ల రివార్డు ఉందన్నారు.
బిహార్‌లోని జెహెనాబాద్‌కు చెందిన అరవింద్ జీ.. భద్రతా బలగాలపై దాడులు నిర్వహించడంలో నిపుణుడిగా పేరుపొందారు. ఆపరేషన్ల నిర్వహణలో సలహాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి మావోయిస్టులు ఆయన్ను ఆశ్రయించేవారు. గుర్రంపై తిరిగే ఆయన గతంలో పలుమార్లు ఎన్‌కౌంటర్ల నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. అరవింద్ జీ మృతి జార్ఖండ్‌లో మావోయిస్టులకు ఎదురు దెబ్బేనని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment