మందుగుండు చేరవేస్తున్న ముగ్గురి అరెస్టు
కరీంనగర్: మావోయిస్టులకు మందుగుండు సామగ్రి చేరవేస్తున్న ముగ్గురు వ్యక్తులను కరీం నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 700 బుల్లెట్లు, రూ.16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ డీఎస్పీ రామారావు కథనం ప్రకారం... జిల్లాలోని బెజ్జంకి మండలం చీలాపూర్ గ్రామానికి చెందిన బోల్ల రాజేంద్రకుమార్(48) హైదరాబాద్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. మావోయిస్టు సానుభూతిపరుడైన ఇతడిని నాలుగు నెలల క్రితం మావోయిస్టు పార్టీ నేత హరిభూషణ్ వరంగల్ జిల్లా ములుగు ప్రాంతానికి పిలి పించారు. ఉత్తరప్రదేశ్ నుంచి మందుగుండు సామగ్రి తీసుకువచ్చే పనిని అప్పగించాడు.
తర్వాత మావోయిస్టు నేతలు పూల్లూరి ప్రసాద్‌రావు, రాజిరెడ్డి, హరిభూషణ్‌లు రాజేంద్రకుమా ర్‌ను ఛత్తీస్‌గఢ్‌కు పిలిపించి మందుగుండు కొనుగోలు కోసం రూ.16లక్షలు ఇచ్చారు. ఆ డబ్బులను తీసుకొచ్చిన రాజేంద్రకుమార్ బె జ్జంకిలోని తన ఇంట్లో దాచి ఉంచాడు. మావోయిస్టుల సూచన మేరకు యూపీలోని ఖాన్‌పూర్‌కు చెందిన ఆయుధాల వ్యాపారి సునీల్‌కుమార్(53)ను కలిసి మందుగుండు సామగ్రి సరఫరాకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ మేర కు సునీల్‌కుమార్ తన సహాయకుడు వికాస్‌కుమార్‌తో కలిసి మందుగుండును తీసుకుని యూపీ నుంచి రైల్లో రామగుండానికి చేరుకున్నాడు. కరీంనగర్ రేల్వేస్టేషన్ వద్ద మార్పిడి చేయాలని ప్రయత్నించారు. సమాచారం అం దుకున్న పోలీసులు వీరిని పట్టుకున్నారు.