ammunition
-
మందు గుండు సామాగ్రి కంపెనీలో పేలుడు.. ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, విజయనగరం: గుర్ల మండలం దేవుని కనపాక పంచాయతీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గవిపేట సమీపంలోని మందు గుండు సామాగ్రి కంపెనీలో పేలుడు సంభవించింది. కంపెనీలోని ఆరు గోడౌన్లకు నిప్పు అంటుకోవడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మంటల్లో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం.కీలోమీటరు దూరం వరకు మంటలు వ్యాపించినట్లు కనిపిస్తున్నాయి. అగ్నికీలలు, పేలుడు ధాటికి పరిసర గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ ఆయుధాగారాలపై రష్యా ముమ్మర దాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై దాడులను ఆదివారం రష్యా తీవ్రతరం చేసింది. సెంట్రల్ ఉక్రెయిన్‌లో పేలుడు పదార్థాలు, మందుగుండు పౌడర్ తయారీ కంపెనీపై అత్యాధునిక మిసైళ్లు ప్రయోగించినట్టు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ తెలిపారు. ఖర్కీవ్ ప్రాంతంలోని బర్వింకోవ్, నోవా ద్మిత్రివ్కా, ఇవనివ్కా, హుతలరివ్కా, వెల్యికాల్లో పలు ఆయుధాగారాలపైనా భారీగా దాడులు చేసినట్టు వివరించారు. 26 ఉక్రెయిన్ సైనిక లక్ష్యాలను ధ్వంసం చేశామన్నారు. మారియుపోల్‌లోని అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంటుపై గగనతల దాడులకు దిగింది. తూర్పున డోన్బాస్లో లుహాన్స్క్ ప్రాంతంలోని పొపాస్నా, సివెరోడొనెట్స్క్, డొనెట్స్క్ ప్రాంతంలోని కురఖీవ్ నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. పశ్చిమ డోన్బాస్లోని ద్నిప్రోలోనూ బాంబు దాడులు జరిగాయి. చెడుపై అంతిమంగా మంచి గెలిచి తీరుతుందని, ఈ వాస్తవం రష్యాకు త్వరలో తెలిసొస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. మరణాన్ని జీవనం, చీకటిని వెలుతురు అధిగమిస్తాయని దేశ ప్రజలకిచ్చిన ఈస్టర్ సందేశంలో చెప్పారు. అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, ఆంటోనీ బ్లింకెన్‌లతో భేటీ కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. -
మందుగుండు సామాగ్రి తయారీలో అపశ్రుతి
సాక్షి, విశాఖ : దీపావళి పండుగ సందర్భంగా మందుగుండు సామాగ్రి తయారీలో అపశ్రుతి చోటుచేసుకుంది. మందుగుండు తయారు చేస్తూ నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చోడవరం పట్టణం అన్నవరం కాలనీలోని అంబేద్కర్ వీధికి చెందిన మహేష్(20) నిఖిల్(13) జ్యోసిత(13) దివ్య శనివారం బాణసంచా సామాగ్రి తయారు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ముగ్గురికి కాళ్లు, చేతులు కాలడంతో చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జ్యోసిత తీవ్రంగా గాయపడటంతో ఆమెను అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చైనా కుట్రతో పాక్ కుతంత్రం..
జమ్మూ కశ్మీర్: భారత్-చైనా సరిహద్దు ప్రతిష్టంభన కొనసాతున్న నేపథ్యంలో డ్రాగన్ దేశం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. లద్దాఖ్ సరిహద్దు వద్ద భారత వ్యకతిరేక కార్యకాలాపాలు, అశాంతిని రెచ్చగొట్టడానికి పాకిస్తాన్‌తో పన్నాగం పన్నుతున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్లో పెద్ద ఎత్తును ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పెలుడు పదార్థాలను మోహరించాలని చైనా పాకిస్తాన్‌కి ఆదేశించినట్లు తెలిపారు. జమ్మూకు పెద్ద ఎత్తును ఆయుధాలు తరలించాలనే ప్రణాళికను అమలు చేయాలని డ్రాగన్ దేశం పాక్‌కి సూచించిందని భారత ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ వర్గాలు నివేదికలు అందించాయి. ఇటీవల భద్రతా ధళాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాల ద్వారా భారత్‌లో హింస, ఆశాంతిని పెంచడానికి చైనా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఆయుధాలపై చైనా దేశానికి సంబంధించిన గుర్తులు ఉన్నట్లు గుర్తించారు. (దక్షిణ కొరియాకు సారీ చెప్పిన కిమ్) భారత భద్రతా దళాలు ఏర్పాటు చేసిన చొరబాటు నిరోధక గ్రిడ్ కారణంగా కశ్మీర్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఆయుధాల మోహరింపు తగ్గిందని తెలిపారు. ఇంటలిజెన్స్ నివేదికలు వెలువడిన నేపథ్యంలో భారత భద్రతా దళాలు నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు నిరోధక గ్రిడ్‌ను మరింత బలోపేతం చేశాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ రాకేశ్ అస్థానా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ చీఫ్ ఏపీ మహేశ్వరి, భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్లో పర్యటించి గత పది రోజుల నుంచి చోటుచేసున్న పరిస్థితులను సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆర్మీ చీఫ్ ఎంఎం నారావణే ఆదేశించారు. (భారత్‌కు భయపడుతున్న చైనా జవాన్లు!) రెండు రోజుల క్రితం జమ్మూ నుంచి దక్షిణ కాశ్మీర్‌కు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అనుమానితులను భద్రతా దళాలు అరెస్టు చేశారు. వారి వద్ద చైనా గుర్తులు ఉన్న నోరిన్కో / ఈఎంఇఐ టైప్ 97 ఎన్ఎస్ఆర్ రైఫిల్, 190 రౌండ్లతో నాలుగు మ్యాగజైన్స్, 21 ఎ రౌండ్లు, మూడు గ్రెనేడ్లతో నాలుగు మ్యాగజైన్స్ కలిగిన ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత భద్రతా బలగాలు సరిహద్దు వద్ద అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. -
కశ్మీర్‌కు భారీగా ఆయుధాలు పంపించండి!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోకి పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామగ్రిని పంపించాలని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చైనా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఉగ్ర చర్యలకు పాల్పడేందుకు భారత వ్యతిరేక శక్తులకు మరింత సాయమందించాలని సూచించిందని నిఘా సమాచారాన్ని ఉటంకిస్తూ ప్ర భుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల, ఈ ప్రాం తంలో భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాలపై చైనా తయారీ మార్కిం గ్స్ ఉన్నట్లు గుర్తించారు. చొరబాట్లకు వీలు లేకుం డా భారత్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఉగ్రవాదులను కానీ, ఆయుధాలను కానీ కశ్మీర్లోకి పంపించడం పాకిస్తాన్‌కు సాద్యం కావడంలేదు. దాంతో, ఎట్టి పరిస్థితుల్లో శీతాకాలం ప్రారంభమయ్యేలోపు సాధ్యమైనంత భారీ స్థాయిలో ఉగ్రవాదులను, ఆయుధాలను కశ్మీర్‌లోయలోకి పంపించాలని ఐఎస్ఐ భావిస్తోంది. నియంత్రణ రేఖ వెంట చొరబాట్లను అడ్డుకునే ఒక సమర్ధవంతమైన ప్రణాళికను భారత భద్రతాదళాలు రూపొందించాయి. గత 10 రోజుల్లో ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, బీఎస్ఎఫ్ చీఫ్ రాకేశ్ అస్థానా, సీఆర్పీఎఫ్ చీఫ్ ఏపీ మహేశ్వరి కశ్మీర్లో పర్యటించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ‘చొరబాటుదారుల విషయంలో భారత బలగాలు వ్యవహరించే తీరును ఐఎస్ఐ అధ్యయనం చేసింది. సాధారణంగా ఆయుధం లేకుండా, ఎవరైనా చొరబాటుకు ప్రయత్ని స్తే.. భారత బలగాలు కాల్పులు జరపవు. అందువల్ల ఆయుధాలు లేకుండా, చొరబాటుదారులను పంపించడం, ఆ తరువాత డ్రోన్లు, ఇతర మార్గాల ద్వారా ఆయుధాలను పంపించడం.. అనే వ్యూహాన్ని వారు ప్రారంభించారు. దానివల్ల చొరబాటుదారులు నియంత్రణ రేఖ వద్దనే కాల్చివేతకు గురయ్యే పరిస్థితి ఉండదు’ అని పాక్ ఆలోచనను పేరు చెప్పడానికి ఇష్టపడని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. ‘కశ్మీర్ లోయలో భారత వ్యతిరేక రిక్రూట్మెంట్లు పెరిగాయి. అయితే, వారికి ఆయుధాలు సమకూర్చడం సమస్యగా మారింది. అందువల్ల డ్రోన్లు, క్వాడ్కాప్టర్ల ద్వారా ఆయుధాలు పంపించేందుకు పాక్ ప్రయత్నిస్తోంది’ అని పేర్కొన్నారు. -
డ్రోన్లతో భారత్‌లోకి పాక్ ఆయుధాలు
చండీగఢ్: పాకిస్థాన్‌లోని ఖలిస్థాన్ ఉగ్రమూకలు సెప్టెంబర్ 9 నుంచి 16 వరకు డ్రోన్ల ద్వారా 80 కేజీల బరువుగల ఆయుధాలూ, మందుగుండు సామాగ్రిని సరిహద్దులగుండా భారత్‌లోనికి జారవిడిచినట్టు భారత భద్రతాదళాలూ, పంజాబ్ పోలీసులు ధృవీకరించారు. కశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలను ప్రేరేపించడం కోసం పాకిస్తాన్ గూఢచారి వ్యవస్థ మద్దతుతో ఖలిస్థాన్ తీవ్రవాద శక్తులు ఈ చర్యకు పాల్పడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన అమృత్‌సర్‌లోని తరన్ తరన్ జిల్లాలో డ్రోన్ల ద్వారా జారవిడిచిన ఆయుధసామగ్రిపై విచారణ జరపడంతో విషయంవెలుగులోకి వచ్చింది. పంజాబ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేయడం కోసం పాకిస్తాన్, జర్మనీ మద్దతుతో ఖలిస్తాన్ జిందాబాద్ ఉగ్రమూకలు కుట్రపన్నుతున్నట్టు భారత భద్రతాదళాలు వెల్లడించాయి. పాకిస్థాన్ సరిహద్దుల్లో 2 కిలోమీటర్ల దూరం నుంచి ఈ డ్రోన్లను పంపించారు. అయితే ఇవి 2000 అడుగుల ఎత్తులో ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి, 1200 అడుగుల కిందకి దిగి ఆయుధాలను జారవిడిచినట్టు వెల్లడయ్యింది. డ్రోన్ల ద్వారా జారవిడిచిన వాటిలో ఐదు ఏకే – 47 తుపాకులు, 16 మ్యాగజైన్స్, 472 రౌండ్లకు సరిపడా మందుగుండ్లు, చైనాలో తయారైన నాలుగు 30 బోర్ పిస్టల్స్ తదితర సామాగ్రితో పాటు ఐదు సాటిలైట్ ఫోన్లు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు వైర్లెస్ సెట్లు, 10 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. డ్రోన్లు వస్తే పేల్చేస్తాం హిసార్: ఇతర దేశాల సరిహద్దుల నుంచి భారత్‌లోకి ఎలాంటి డ్రోన్లు, అనుమానిత పరికరాలు ప్రవేశించినా వెంటనే పసిగట్టే సత్తా మన సైనిక దళాలకు ఉందని సౌత్ వెస్ట్రన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అలోక్‌సింగ్ క్లేర్ చెప్పారు. భారత్–పాక్ సరిహద్దు వెంట ఉగ్రవాదులు డ్రోన్ల సాయంతో ఆయుధాలను జార విడుస్తున్నా రంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. పాకిస్తాన్ భూభాగం నుంచి భారత్‌లోకి వైపు డ్రోన్లు ప్రవేశిస్తే వెంటనే పేల్చేస్తామని స్పష్టం చేశారు. డ్రోన్ల గురించి ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న డ్రోన్ల సామర్థ్యం పరిమితమేనన్నారు. -
జార్ఖండ్‌లో నలుగురు మావోయిస్టులు అరెస్టు
-
10 డిటోనేటర్లు, 400 జిలిటెన్ స్టిక్స్..
హుజూరాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పోలీసుల సాధారణ తనిఖీల్లో భాగంగా శనివారం భారీ ఎత్తున డిటోనేటర్లు, జిలిటెన్ స్టిక్స్ బయటపడ్డాయి. ఈ విషయాన్ని హుజూరాబాద్ సీఐ శనివారం మీడియాకు వెల్లడించారు. ఎలాంటి అనుమతీ లేకుండా ఆటోలో 10 డిటోనేటర్లు, 400 జిలిటెన్ స్టిక్స్ తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మందుగుండు చేరవేస్తున్న ముగ్గురి అరెస్టు
కరీంనగర్: మావోయిస్టులకు మందుగుండు సామగ్రి చేరవేస్తున్న ముగ్గురు వ్యక్తులను కరీం నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 700 బుల్లెట్లు, రూ.16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ డీఎస్పీ రామారావు కథనం ప్రకారం... జిల్లాలోని బెజ్జంకి మండలం చీలాపూర్ గ్రామానికి చెందిన బోల్ల రాజేంద్రకుమార్(48) హైదరాబాద్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. మావోయిస్టు సానుభూతిపరుడైన ఇతడిని నాలుగు నెలల క్రితం మావోయిస్టు పార్టీ నేత హరిభూషణ్ వరంగల్ జిల్లా ములుగు ప్రాంతానికి పిలి పించారు. ఉత్తరప్రదేశ్ నుంచి మందుగుండు సామగ్రి తీసుకువచ్చే పనిని అప్పగించాడు. తర్వాత మావోయిస్టు నేతలు పూల్లూరి ప్రసాద్‌రావు, రాజిరెడ్డి, హరిభూషణ్‌లు రాజేంద్రకుమా ర్ను ఛత్తీస్‌గఢ్‌కు పిలిపించి మందుగుండు కొనుగోలు కోసం రూ.16లక్షలు ఇచ్చారు. ఆ డబ్బులను తీసుకొచ్చిన రాజేంద్రకుమార్ బె జ్జంకిలోని తన ఇంట్లో దాచి ఉంచాడు. మావోయిస్టుల సూచన మేరకు యూపీలోని ఖాన్పూర్కు చెందిన ఆయుధాల వ్యాపారి సునీల్‌కుమార్(53)ను కలిసి మందుగుండు సామగ్రి సరఫరాకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ మేర కు సునీల్‌కుమార్ తన సహాయకుడు వికాస్‌కుమార్‌తో కలిసి మందుగుండును తీసుకుని యూపీ నుంచి రైల్లో రామగుండానికి చేరుకున్నాడు. కరీంనగర్ రేల్వేస్టేషన్ వద్ద మార్పిడి చేయాలని ప్రయత్నించారు. సమాచారం అం దుకున్న పోలీసులు వీరిని పట్టుకున్నారు. -
ఆశ్రమం కాదు.. ఆయుధాగారం!
చండీగఢ్: హర్యానాలోని హిస్సార్ జిల్లా, బల్వారాలో ఉన్న వివాదాస్పద స్వామీజీ రాంపాల్ ఆశ్రమం ఆధ్యాత్మతకు కాకుండా ఆయుధాలకు నిలయంగా కనిపిస్తోంది. రాంపాల్ అరెస్ట్ అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) జరుపుతున్న సోదాల్లో భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి బయటపడింది. వాటితో పాటు పెట్రోల్ బాంబులు, యాసిడ్ సిరంజీలు, చిల్లీ గ్రెనేడ్లు కుప్పలుగా కనిపించాయి. రాంపాల్ గది పక్కనే ఉన్న మరో గదిలో గర్భ నిర్ధారణ పరికరం కూడా కనిపించింది. ఆశ్రమంలో మూడు .32 బోర్ రివాల్వర్లు, 19 ఎయిర్ గన్లు, 4 రైఫిళ్లు, వివిధ తుపాకులకు వినియోగించే 100కు పైగా క్యాట్రిడ్జ్‌లు లభించాయి. చాలావరకు ఆయుధాలను రెండు ప్రత్యేక గదుల్లోని బీరువాల్లో దాచారు. మందుగుండు సామగ్రిని మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా ఆశ్రమం మధ్యలో ఒక వేదికలాంటి దాన్ని నిర్మించి దానిలోపల దాచిపెట్టారు. ఆ వేదికపై స్వామీజీ ఆసనం ఉండటం వల్ల ఎవరి దృష్టి దానిపై పడదని వారు భావించి ఉంటారని పోలీసులు తెలిపారు. ఆశయం చుట్లూ 50 అడుగుల ఎత్తై ప్రహారీ గోడ, ఆ ప్రహారీ మధ్యలో అక్కడక్కడా వాచ్ టవర్లు, లోపలికి వచ్చేవారిని పరీక్షించేందుకు మెటల్ డిటెక్టర్లు, ఆశ్రమం అంతటా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆశ్రమంలో భారీ స్విమింగ్‌పూల్, 24 ఏసీ గదులు, అందులో స్వామీజీ కోసం ప్రత్యేకంగా మసాజ్ రూం కూడా ఉంది. 800 లీటర్ల డీజిల్, భారీ సంఖ్యలో కర్రలు, హెల్మెట్లు, నల్లరంగు దుస్తులు కూడా లభించాయి. లక్షమందికి నెల రోజుల పాటు భోజనం సమకూర్చగల స్థాయిలో ఆహార నిల్వలు కూడా ఉన్నాయి. 1000 బ్రెడ్లను ఒకేసారి తయారుచేయగల మెషీన్ కూడా ఉంది. మొత్తం ఆశ్రమాన్ని సోదా చేసేందుకు మరో రెండు, మూడు రోజులు పడుతుందని సిట్ ప్రతినిధి తెలిపారు. 50 వేల మంది కూర్చోగల ప్రార్థనామందిరంలో ప్రవచనాలు ఇచ్చేందుకు స్వామీజీ కోసం ప్రత్యేకంగా హైడ్రాలిక్ కుర్చీ, దాని చుట్టూ బుల్లెట్‌ప్రూఫ్ ఎన్‌క్లోజర్ ఉంది. తనిఖీల సందర్భంగా.. స్నానాల గదిలో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను రక్షించి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆశ్రమంలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.