
సాక్షి, విశాఖ : దీపావళి పండుగ సందర్భంగా మందుగుండు సామాగ్రి తయారీలో అపశ్రుతి చోటుచేసుకుంది. మందుగుండు తయారు చేస్తూ నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చోడవరం పట్టణం అన్నవరం కాలనీలోని అంబేద్కర్ వీధికి చెందిన మహేష్(20) నిఖిల్(13) జ్యోసిత(13) దివ్య శనివారం బాణసంచా సామాగ్రి తయారు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ముగ్గురికి కాళ్లు, చేతులు కాలడంతో చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జ్యోసిత తీవ్రంగా గాయపడటంతో ఆమెను అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.